April1, 2019
ఆహా ! అద్భుతంగా ఉంది కృష్ణ విగ్రహం .హాయిగా చిలిపిగా ,అందంగా ,చూసేవారిని ,ఆత్మలో ఆనందం పొందేవారిని ,వెర్రెక్కించే విధంగా నవ్వుతూ ,శిఖి పించం,తో , ముత్యాల సరాలతో వజ్ర వైడూర్యాలతో పొదగబడిన స్వర్ణ భూషణాలతో అలంకరించి ఉన్న నల్లని ఉంగరాల జుట్టుతో ,నుదుట కస్తూరీ నామం తో ,కంఠం లో మెరిసే నవరత్న మణి హారాలతో చెవులకు కుండలాలతో,, తెల్లని పలువరస తో దగ దగా మెరిసి పోతున్నాడు మన చిన్ని కృష్ణుడు ,, కానీ ఇది స్వప్నం ,ఒక మధురమైన కల,, చూసే కళ్ళు ఉండాలి గానీ, కృష్ణయ్య సృష్టిలో మధురం, మనోహరం, మమతలకు నిలయం కానిదేముంది ? ,, ""కమలాక్షు జూడని కన్నులు కన్నులే ,,తరు కుడ్య జాల రంద్రములు గాక !!"" నీ నామం చాలదా కృష్ణా ! జన్మ ధన్యం కావడానికి .!ఆనందామృత తరంగాలలో తేలిపోవడానికి,,,నీ నిత్యము సత్యము, మోక్షదాయకము అయిన బ్రహ్మానంద స్థితిని పొందడానికి.. !",నీ నామం మధురం ,రూపం, భావం, రాగం, అన్నీ మధురాతి మధురా లే కదా మధురా కృష్ణా... ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు , ఎంతో తపన.. నిన్ను చూడాలని. ఎత్తుకోవాలని, ముద్దు పెట్టాలని,, నీతో ఆ డుకోవాలని, వెన్న ముద్దలు తినిపించాలి అని,, నీతో కలిసి నడవాలని, నీకు ఎదురుగా కూర్చుం డి , నీకు ఇష్టమైన వేణు నాదం వినిపించాలని,, భుజాలపై ఉంచుకొని , హరే కృష్ణ హరే కృష్ణ అంటూ చిరుతలు మ్రోగిస్తు , ఎగురుతూ చిందులు వేయాలని, నీ చిత్రాలు గీయాలని,,,, నీ బాల్య లీలలు , క్రీడలు కథలు గా చెప్పాలని,, నా ప్రక్కలో నిన్ను ఉయ్యాలలో పడుకోబెట్టి,""లాలనుచు ఊచే రు లలన లిరుగడల,, బాలా గండవర గోపాల నిను చాలా !""జో జో జో జో. ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో భావనలు నీవు నాలో ఉంటు కల్పించి , పిచ్చివాడిని చేసేవే.. భాగ్యం అంటే నాదే.. ఇంతటి ఘన సంపదను అనుగ్రహించా వూ... ఈ జన్మకు ఇది చాలు బంగారు కన్నా. నీవు ఎక్కడున్నా నావాడవే గా.. నాలో నిత్యం సత్యమై వెలుగుతూ ఉంటావు గదా హరే కృష్ణా హరే కృష్ణా
అందాల ఆనందాల చిన్ని కృష్ణుని తన ఒడిలో సందించి, తన కున్న కృష్ణ ప్రేమను వ్యక్తం చేస్తూ, సర్వాలంకార భూషితుడైన తన కొడుకు లో కృష్ణుని సౌందర్యాన్ని తనివితీరా చూసుకుంటోంది, , భావన లో ఉంటే తప్ప అలా కృష్ణ సౌందర్య సాధనాలు ఉపయోగం చేయలేము, ధన్యు రాలు ఇలా చేసే ప్రతీ తల్లి !! దానికి తీరిక ఓపిక, ఆరాధన భావం ఉండాలి,, పిల్లలు దైవ స్వరూపాలు,! ఎది నేర్పిన కూడా 8 ఏళ్ల లోపే వీలౌతుంది.. అందుకే మిమ్మల్ని కోరేది, పిల్లలకు" కృష్ణం వందే జగద్గురుం " లాంటి భక్తి గీతాలు శ్లోకాలు చెప్పాలనీ, రోజూ కనీసం ఒక పావుగంట సేపు అనిపిం చాలని. ..!.. కానీ తల్లికి ఉండదు తీరిక, !తండ్రికి ఉండదు కదా ఓపిక,! హరే క్రిష్ణ హరే క్రిష్ణ !""
ఇ అహా పరమానందంగా ఉంది, కృష్ణుని కి చేసిన అలంకరణ, అద్భుతం అపూర్వం, అమోఘం,, ఆభరణాలు, పీతాంబర ధారణ, నడుముకి వల్లేవాటు,, చేతుల కి చెవులకి, మెడలో పాదాలు అన్నీ బాలకృష్ణ సురుచిర రూప లావణ్యం కన్నుల పండువుగా ఉంది. మీరు గత జన్మ లో చేసుకున్న అదృష్టం , కృష్ణయ్య కరుణ ఇలా పొందడం.. ఇదే భావన ఇదే పూజ ఇదే అర్చన, ఇదే కృష్ణ తత్వం నిత్యం అనుభవిస్తూ ఆనందించండి, కృష్ణా ఈ రోజు చేసేది నీకు ! బజారు నుండి కృష్ణుని కి ఏమి తేవాలి,, నైవేద్యం కృష్ణయ్య కు ఎది చేయాలి..., ఎది చేసినా ఎది చూసినా ఎది తెచ్చినా, యశోదా కృష్ణుని కోసం,,, ఏమైనా ఈ రోజున నాకు క్కృష్ణుని కమనీయ రమణీయ, మనోహర మధుర సుందర కృష్ణుని ఎన్ని సార్లు చూసినా కన్నులు తనియవు.. అంటే తనివి తీరదు, అంటే కృష్ణుని దర్శనం లో ఉండే ఆకలి, పిపాస, తృష్ణ, ఆర్తి, తాపత్రయం తీరవు,, నను పాలింపగ నడచి వచ్చితివా , గోపాలా . ఇప్పుడు నిజంగా అనిపిస్తోంది, నాకు ! కన్నయ్య ను నమ్మి చెడిన వారు లేరు ,, ఎంత విశ్వాస మో అంత ఫలితం అని.. ఈ విధంగా నైనా దయ చూస్తున్నావా నంద నందనా,, బాల కృష్ణా,, నీకున్ మ్రొక్కేద దృంపవే భవ లతల్, నిత్యానుకంపానిధి ! నిన్ను పొగడడం ఆ వేయి తలలున్న అది శేషువు వల్లే కాదు . నేనెంత ! నా విజ్ఞాన మెంత !! నీ ఈ తలపుల చిరు జల్లు చాలు . ఆర్ద్రత తో నిన్ను స్మరిస్తూ భజించడానికి !హరే కృష్ణా హరే కృష్ణా .!"
No comments:
Post a Comment