Mar 6, 2019
సర్వ ప్రాణులలో ,మానవజన్మ ఉత్కృష్టమైన ది అంటారు !.. నిజమే.!. కానీ దానిని సద్వినియోగం చేసినప్పుడు.కదాజన్మ ఉత్తమం.అయ్యేది ! అంటే. గతజన్మ లోని పాపపుణ్యాలను ఈ జన్మలో ప్రక్షాళన చేసుకోడానికి జీవునికి పరమాత్ముడు ఇచ్చిన చక్కని అవకాశం.ఈ మానవజన్మ .! ఏ ప్రాణి అయినా ఇప్పుడు అనుభవించేది గతజన్మలో చేసిన కర్మల ఫలాలే.! ఏ ఇద్దరి ఆకారాలు, కష్టసుఖాలు, వ్యవహారాలు, ఆలోచన సరళి,, సంతానం ,సంపదలు, ఇలా జీవితంలో సంభవించే ఏవి కూడా సృష్టిలో ఒకేలా ఉండవు..! పనులు వేరు, కాబట్టి ఫలితాలు కూడా వేరే.. !అద్భుతమైన మేధాశక్తి ని వివేకాన్ని ఇచ్చాడు భగవానుడు మనకు ! ,,తాను మాత్రం సాక్షిగా చూస్తూ ఉన్నాడు..! అందుకే కష్టం వచ్చినప్పుడు కుంగడం ,సుఖం వచ్చినప్పుడు పొంగడం ,కూడని పని..! అలాగే ఇతరులను చూసి ఈర్ష్య ,అసూయ ,ద్వేషం, పొందడం కూడా తప్పే..! ఎందుకంటే వారి గత కర్మలకు అనుగుణంగా వారుప్రవర్తిస్తూ ఉంటున్నారు. !అయితే ఇంతటితో ఈ జన్మతో అయిపోయే విషయం కాదు. ! ఇది అవకాశమే,నివారణ ఉపాయము మాత్రమే కానీ, అంతం కాదు.,ఆరంభం .! ఈ జన్మలో చేసిన కర్మల మూట ను, ఇంకా మిగిలిన పాత కర్మల మూటలను వెళ్ళేటప్పుడు మన వెంట తీసుకెళ్తాము.. దానికోసం మళ్ళీ జన్మ ఎత్తాలి, ఆ ఫలితాలు,మంచి అయినా చెడు అయినా. అనుభవించడానికి. 86 లక్షల రకాల జీవకోటిలో ఎదో ఒక రూపంలో.తిరిగి పుట్టాలి . ఇలా జన్మ జన్మల రంగులరాట్నం లో గుండ్రంగా తిరుగుతూనే ఉంటాము. పుడుతూ చస్తూ ,కొత్త శరీరం అనే దుస్తులు ధరిస్తూ,, కర్మఫలం అనుభవిస్తూ.. అందుకే ఈ అపురూపమైన మనిషి జన్మలో సర్వాంతర్యామి,అయిన పరందాముని విడవకుండా మరవకుండా స్మరిస్తూ ఉండాలి.. దేవుడిచ్చిన జన్మలో సంక్రమించే బాధ్యత లను కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చాలి. ప్రకృతి ద్వారా ప్రసాదంగా లభించే భోజనం,పరిసరాలు ,వాతావరణం, భోగభాగ్యాలు, భార్యా పిల్లలు వల్ల కలిగే ఆనందాలు ,హాయిగా అనుభవించవచ్చును. కానీ దానికి కర్తృత్వం నేనే అని భావించి అహంకారం తో జరిగే పాపం తో మనం పొందబోయే సద్గతికి దూరమవుతాం.చేసిన చేస్తున్న పనులకు సాక్షి మనలో ఉన్న ఆత్మయే.. అందుకే ఆత్మసాక్షిగా అంటూ ప్రమాణం చూస్తుంటాము. బాహ్యంలో దైవసాక్షి ,,సూర్యుడు కర్మసాక్షి గా మనల్ని గమణిస్తున్నట్లే ,లోనున్న అంతరాత్మ సాక్షీభూతంగా మనం చేసే కర్మలకు సాక్షిగా నిలుస్తుంది. మనసా వాచా కర్మణా చేసే ఆలోచన,, పనులు, ప్రణాళికలకు ప్రత్యక్ష ప్రమాణంగా ఉంటోంది ఎక్కడ తప్పినా ఆత్మకు తెలీకుండా జీవుడు తాను చేసే తప్పిదాలనుండి తప్పించుకోలేడు .జీవుడు చేస్తున్న పాప పుణ్యాలకు తాను బాద్యుడు కాకుండా సాక్షిగా ఉంటూ వాని ఫలితాలకు అనుగుణంగా బుద్దిని పుట్టిస్తూ కర్మలను అనుభవింపజేస్తాడు అంతర్యామి.. అనగా కర్మఫలితాలను అనుభవింపజేసే శక్తిని చైతన్యాన్ని ఇస్తూ.,తన పని.ఆ దేహంతోపూర్తి అయ్యాక ,జీవుడిని ఆ శరీరం నుండి బయటకు తోసేస్తాడు .అలా ఆత్మ జీవుడిని విడవకుండా ఉంటూ కర్మలు చేయిస్తూ, ఫలితాలను అందిస్తూ ఉంటాడు ,,అందుకే ఆత్మవిచారం చెయ్యాలి, నేనెవరో తెలియాలి, శరీరాన్ని కాదు, పరమాత్ముని అంశాన్ని,,అని గుర్తించాలి, ఇందులో ఉన్న దైవికశక్తిని జాగృతం చేస్తూ,సాధన చేయడం ద్వారా, గతజన్మ, పాపపుణ్యకర్మలనే కాదు ,ఈ జన్మ లో చేసిన గడ్డికుప్ప లాంటి కర్మలను కూడా చిన్న నిప్పురవ్వ తో దగ్ధం అయినట్టుగా, భస్మం అవుతాయి. అలా ఇక,,పునర్జన్మ లేకుండా చేసే శాశ్వత ఆధ్యాత్మిక సంపదను పొందే అదృష్టం ,ఆత్మశోధన వలన లభిస్తోంది. ఇది ఎవరికి వారే సాధన ద్వారా పొందే అలౌకిక బ్రహ్మానంద భరితమైన అనుభవం. అది రమణ మహర్షి లాంటి యోగిపుంగవులకు మాత్రమే సాధ్యం అవుతుంది. ,లేదంటే అదే అంతర్యామి అవశేషంగా మిగిలిన కర్మఫలాల అనుభవానికి పునర్జన్మ ను కల్పిస్తాడు. ,జన్మరాహిత్యమైన మోక్షమార్గం కావాలంటే , కామక్రోద లోభ మద మాత్సర్యాలకు లోబడకుండా మనసును నియంత్రించే సంయమనం సాధించాల్సి ఉంటుంది..!అంటే ధర్మబద్ధంగా ,శాస్త్ర సమ్మతంగా మన నడవడి ఉండాలి.. కానీ అది అంత సులభమైన పని కాదు..! అందుకే ఆత్యంతసులభము, అమూల్యము , ఆచరణీయము,,ఆనందకరమైన విధానము ఒకే ఒకటి ! అది దైవారాదన !అన్ని పురాణాలు శృతులు స్మృతులు హరినామ స్మరణ ను సకల పాప హరణము, భుక్తి ముక్తిదాయకము గా సూచిస్తున్నాయి ! ఈ కలియుగంలో,జీవన్ముక్తికి హరినామాన్ని మించిన ఉపాయం ,సాధనం,మరొకటి లేదు !! అందుకే ఆత్మఉద్దరణకు ప్రయత్నించాలి. అది ఎప్పుడోకాదు ఇప్పుడే ప్రారంభించాలి ,ఎందుకంటే సమయం దాటిపోతోంది.. వయసు పై బడ్డాక కాదు,, వయసులో ఉండగానే చేయాల్సిన ఆత్మావలోకనం,, ఆత్మపరిశోధన,తో విలువైన జన్మను భగవద్ కృపతో ధన్యం చేసుకోవాలి . కాలం విలువ ,మనిషి జన్మ విలువ ,మరణావస్థలో గాని తెలిసి రాదు.. అయ్యో ..ఎందుకు నేను భగవద్ చింతన చేయలేకపోయాను ,కాలం వృధా చేశానే,, అని అంతా అయ్యాక ,ఇప్పుడు బాధపడితే లాభం ఏముంటుంది ? ,, మా దగ్గర బందువు ఒకరు, 86ఏళ్ళు, అంతిమశ్వాసతో మూడు రోజులనుండి చైతన్యం లేకుండా ,బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా కోమాలో ఉంటూ నరకయాతన పడుతున్న జీవుడిని చూస్తున్నాను,ఆ శరీరం ఇపుడు రామా అనలేదు, వినలేదు. కనలేదు.. జీవుడికి శరీరంతో సంబంధం లేదు ! ఇక చాలు ,అనుకుంటూ ఎప్పుడు బయట పడాలా, , ఇన్నాళ్లూ బందీగా ఉన్న ఈ అద్దె కొంపను విడిచి ,స్వేచ్ఛగా,ఎంత త్వరగా విడివడాలి అని పరితపిస్తూ ,జీవాత్మ ,ఊపిరి రూపంలో దేహంలోఅటూ ఇటూ బరువుగా కదులుతూ ఉండటం నా ఎదుట ప్రత్యక్షంగా చూస్తున్నాను. అందుకే ఇన్నాళ్లూ ఈ శరీరం ఒక పనిముట్టు..! ఇప్పుడు ఇది పనికిరాకుండా పోయింది..! శేషంగా ఉన్న కర్మఫలం పూర్తిచేయడానికి ఇక మరో పనిముట్టును,అనగా మరో ఉపాధి, ని ఆశ్రయించాలి.. బ్యాంక్ లో డబ్బులు దాచుకున్నట్టే జీవుడు పాపము ,పుణ్యము అనే రెండు అకౌంట్లు ,సరి చేస్తూ ఉండాలి .nil balance అయ్యేవరకు జన్మల పరంపర లో అలా కొనసాగాలి..అందుకే దీనికి నిష్కృతి కేవలం దైవభజన ,దైవనామం,, పూజనం ,సేవనం, దర్శనం, మాత్రమే ! సచ్చిదానంద స్వరూపుడైన భగవన్తుని మనసా ,వాచా ,కర్మణా భావించి ,ధ్యానించి ,సేవించి ,భజించి తరించడమే మన తక్షణ కర్తవ్యం ! .అందుకు మనకు కావలసిన సంకల్ప సిద్ధిని, సాధనాశక్తిని,, దేవుని యందు నిశ్చలమైన అనురక్తిని,, భక్తిని అనుగ్రహించమని పరమేశ్వరుని కోరుకుందాం! .శివుని ఆజ్ఞలేనిది చీమైనా కుట్టాదు కదా.! అందుకే ఆయన కృపకోసం , అచంచలమైన ఆత్మవిశ్వాసం తో నారాయణుని పాదపద్మాలను ఆశ్రయించుదాం. .! సత్సంగంలో పాల్గొంటూ ఆశయాన్ని సాధిద్దాం ! శరణాగతవత్సలుడు అయిన ఆ శ్రీమన్నారాయణుని అపార కరుణా కటాక్షాలు మనపై వర్షించాలని ,అందుకు తగిన పాత్రత, యోగ్యతలను అందించమని దేవదేవుని ప్రార్తించుదాం!హరే కృష్ణ హరే కృష్ణా !!"
Saturday, March 16, 2019
మానవజన్మ
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment