Saturday, March 16, 2019

కృష్ణభక్తులు

Mar 3, 2019
శ్రీకృషుణ్ణి  ప్రత్యక్షంగా ఎదుట చూడలేని కృష్ణభక్తులు ఎందరో  ఉంటారు.. ఉన్నారు కూడా ! అయినా , వారు కృష్ణుడిని విడిచి ,అతని రూపసౌందర్య లావణ్యాలను మరచి క్షణమైనా ఉండలేరు.! కృష్ణుని సేవలో ,ఆరాధనా ,పూజన, అర్చన, కైంకర్యాలు చేస్తూ నిరంతరం కృష్ణ పద చింతనా మృతంతో పరవశ్యాన్ని పొందేవారు నిజంగా  కడుధన్యులు..కదా ! అలనాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అక్రూరుని వెంట మదురకు విచ్చేసిన తర్వాత తిరిగి రేపల్లె కు అతడు వెళ్లనే లేదు ..కానీ  బాల్యంలో కృషునితో స్నేహంగా ఉంటూ  ఆడుకుని పాడుకుంటూ ఆనందంగా ఉన్న గోపబాలురు ,,  ఇప్పుడు కృష్ణయ్య తమవద్ద లేకపోవడంతో ఎంతో కృంగిపోతుంటారు.. గోపికలు ,కృష్ణ రూపాన్ని తనివారా చూస్తూ ,అతడి ముద్దు ముచ్చటలు ,మధురమైన పలుకులు వింటూ తమను తాము మరిచిపోతుంటారు. అలాంటి శ్రీకృష్ణ ఆరాధనా ఆవేదన ,ప్రేమ భావనలనుండి వారు కోలుకునే వీలుంటుందా ? ,యశోధమ్మ తన గారాల ముద్దుల కొడుకు కన్నయ్యపై కురిపించే ప్రేమకు ,ఇప్పుడు కృష్ణయ్య దయమాలి తనను విడిచి అందరానంత దూరానికి వెళ్లిపోవడం తో,, కన్నీళ్లు కాలువలై  పొంగి ప్రవహిస్తూ ఉంటే వాటికి అడ్డుకట్ట వేసే దేవరు..?. ఇక నందుని మానసిక పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది!..కృష్ణయ్య "తమ సంతానం కాదు!" అన్న కఠోర సత్యం ,వారి గుండెలను రంపపు కోతకొస్తోంది...కృష్ణుడు తన పుత్రుడైతే  బావుండేది కదా.! తమను విడిచి వెళ్లి పోయేవాడు కాదుకదా.! విధి ఎంత ఘోరంగా తమతో ఆడుకుంటోంది. ?.ప్రాణానికి ప్రాణంగా అల్లారుముద్దుగా పెంచి పోషించుకున్న  వెన్నదొంగ కృష్ణుడు,,"  ఇప్పుడు మీ పిల్లాడు కాదంటే "హృదయం ముక్కలు కాదా!"" ,, .ఇలా కృష్ణుడంటే వల్లమాలిన అభిమానం, అనురాగం ,ఆప్యాయత, ఆరాధనా తత్వం పెంచుకున్న రేపల్లె పౌరులు, స్త్రీలు పురుషులు ,పిల్లలు వృద్ధులు. మాత్రమే  ఆత్మ క్షోభను అనుభవించడం  కాదు.!. ,అక్కడి ప్రకృతి మాత కూడా తల్లడిల్లుతోంది !,, యమునానది.మాత ప్రవాహంలో ఉన్న అప్పటి  పరవళ్లు ఇప్పుడు  తగ్గిపోయాయి .!ఆమె వేగంలో గమనంలో ఆ  ఉత్సాహం, ఆ ఆనందం , ఇప్పుడు కానరావడం లేదు.!". కృష్ణా!  కృష్ణా!""కృష్ణా !" అంటూ సంతోషంగా పిలిచే కోకిలారావాలు మరుగైనాయి..., భువనైక సమ్మోహన రూపంతో మనసులను వశీకరణం చేస్తున్న, శ్రీకృష్ణ మురళీ గానంతో, శరద్ రుతువులలో చందమామ పున్నమి వెన్నెల కాంతుల్లో, రాసక్రీడ వైభవ సందోహంలో , పులకరించి వివశత తో పురివిప్పి   నృత్యం చేసి నెమళ్లు, ఈనాడు విషన్న వదనంతో ఎదో పోగొట్టుకొన్నట్టుగా భారంగా అడుగులేస్తూ ఎటువైపునుండి "నందగోపాలుడు వస్తాడో !" అని ఎదురుచూస్తున్న ట్టుగా  బృందావనంలో పిచ్చిగా తిరుగుతున్నాయి ! పక్షుల అప్పటి కిలకిలా రావాలు, ఇప్పుడు అందరిలో కలకలం రేపుతున్నాయి! .లేళ్ళు జింకలు, కుందేళ్లు ,గోవులు లేగలు ,కోతులు పిల్లులు ,మొదలైన ప్రాణులు , అన్నీ కృష్ణయ్య ఎక్కడ దాక్కున్నాడో అనుకుంటూ అంతటా ,అతన్ని వెతుక్కుంటున్నాయి..!అపర శ్రీకృష్ణ భక్తురాలు, కృష్ణుని ఆరాధ్యదేవత, ఆ రాదమ్మతల్లి మౌనం ,తో వంశీలోలుని వేణునాదం మూగపోయింది .! రాధ వెంట లేదు కనుక కృష్ణయ్య బృందావనం విడిచివెళ్లాక వేణునాదం చేయలేదు ఆ భాగ్యం కేవలం రేపల్లె వాసులకే లభించింది ...చల్లని యమునా తీర పిల్లవాయువులలో  కూడా ,,ఆ చల్లదనం,, ఆ హాయి ఇప్పుడు లేవు. ! వెచ్చగా  భారంగా నిట్టూర్పులు విడుస్తున్నట్టుగా కృష్ణవిరహ తాపాన్ని ప్రకటిస్తోంది.గాలి !  గోపికలు కృష్ణునితో సరసాలు కురిపిస్తూ వినోదాలు పంచుతూ ,,పొదల మాటున దాగిన లతా నికుంజములతో నిండిన పూల పొదలు   ఇప్పుడు దిగాలు పడి ఉంటున్నాయి,ఇలా శ్రీకృష్ణుడు తన చిలిపితనంతో ,అల్లరిచేష్టలతో ,ముద్దుమురిపాలతో బాల ,లీలావినోదాలతో ,,,రేపల్లె పురజనులను పశుపక్ష్యాది జీవులను సకల చేతనాచేతన ములను చైతన్యవంతం చేస్తూ  ,ఆనందింపజేసి,,ఇప్పుడు అకస్మాత్తుగా చెప్పా చెయ్యకుండా వెళ్లిపోవడంతో ,ఎంతో దుర్భరమైన దుస్థితి ఏర్పడింది . అలాంటి  దయనీయమైన విపరీత వాతావరణంలో  బ్రతకలేక చావలెక ,వారు బ్రతుకులు కృష్ణ స్మరణ ,కృష్ణ ధ్యానంలో గడుపుతూ ,నిరంతరం అతడు తమ చెంత ఉన్నట్టే భావిస్తూ ఉండటం వారి పూర్వజన్మ పుణ్యఫలం.! అలాశ్రీ కృష్ణుని భక్తితత్వాన్ని  అలవర్చుకొని తమ  జీవితాలను  ధన్యం చేసుకొన్న బృందావనంలో ని ఎందరో శ్రీకృష్ణ భక్తులు  ధన్యులు! ,పుణ్యులు! ,చరితార్థులు! ,ప్రాతః స్మరణీయులు.! జై శ్రీకృష్ణ జైజైశ్రీకృష్ణ !"^

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...