అందమే ఆనందం అంటారు, కానీ, ఆనందమే అందం, అందం మనసుకి, అంటే చూసే కళ్ళకి, కానీ అనందం హృదయానికి హత్తుకునేలా , మరవలెని మధురానుభూతి గా మిగుల్తుంది,, అందుకే అనం దొ బ్రహ్మ అన్నారు, కళ్ళు తెరిస్తే కనిపించేది అందం, కళ్ళు మూసుకుంటే కూడా పరవశింప జేసేది అనందం, చక్కని సంగీతం, శరీరంలో నీ సమస్త నాడులను మీటుతూ, దానికి అనుగుణంగా, హృదయాన్ని స్పందింపజేస్తుంది ,, పరమాత్మ వైభవం నిలయం అనందం,, తనవారిని చూస్తే, డబ్బు వస్టే, అనుకున్నది అయితే,, సుష్టుగా తింటే, అందరూ పొగిడితే ఆనందమే,, కాని అది తాత్కాలికం, ఆ ఆనందం అంతవరకే, తర్వాత అంతగా ఉండదు,, క్రమేణా అది మామూలు విషయ ము అవుతుంది , కాని పరందాము నీ అనుగ్రహము, సన్నిధానం, అనుభవం , శాశ్వత ము, అమరము, అపురూపం, అద్భుతం,, అది జీవాత్మ పరమాత్మతో అనుసంధానం చేసే అద్భుత యోగం, ఎంతో సాధన, సాధు పురుషుల సాంగత్యం,దైవానుగ్రహం , లభిస్తే తప్ప, దొరకునా అటువంటి సేవ ! హరే కృష్ణ హరే కృష్ణా. !"
Friday, April 19, 2019
దైవాన్ని ఎలా గుర్తించడం
దైవాన్ని ఎలా గుర్తించడం,,? అన్నది మనల్ని నిరంతరం వేదించే పరి ప్రశ్న !! మన చుట్టూరా ఉంటూ మనలో శక్తినీ, చైతన్యాన్ని అనునిత్యం నింపుతూ, సకల ప్రాణికోటి మనుగడకు ఆధారం అవుతూ, వాని జీవన చర్యలను నిర్వహిస్తూ, నియంత్రిస్తూ, మనలో అంతర్యామిగా వెలుగుతూ, తాను మాత్రం సాక్షిగా, ఏమీ కానట్టుగా, ఏమీ చేయనట్టుగా జగన్నాటకం సాగిస్తున్న పరమాత్మను మనం ఎలా గుర్తించాలి? ఉన్నాడు అన్నది నిజం ! కాని , ఎలా ఉంటాడో,ఎక్కడెక్కడ ఏ రూపంలో, ఉంటాడో తెలియదు,! ఇలా ఉంటాడని వేదాలు కానీ, వేయిపడగల ఆదిశేషువు గానీ బ్రహ్మాది దేవతలు చెప్పలేక పోయారు,! ఉన్నాడు అంటే ఉంటాడు,! ఆయన అనంతుడు,! విశ్వరూపుడు,, !నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన స్వరూపుడు,, !అలాంటి దేవా దిదేవుని రూప గుణ వైభవా లు మహా కవులకు మహా గాయకులకు, ఋషులకు,బ్రహ్మజ్ఞా నులకు కూడా ఎన్నతరంగాని పరాందాముని సామాన్యు లు పట్టగలరా , ?కనిపెట్ట గలరా!? కాని, పరమాత్మ ఉనికిని మాత్రం మనం జాగ్రత్తగా ఆత్మావలోకనం చేస్తూ పసిగట్టగలం,,! ఉదయం లేచామంటే, అర్థం, దైవం కరుణించి మన అయువుకు ఒక రోజును పొడిగించింది అన్నమాట, !ఆరోగ్యంగా సంతోషంగా ఉత్సాహంగా దైనందిన కార్యక్రమాలు చేస్తున్నామని అనుకుంటే,, అదంతా పరమేశ్వరుని దయ, అని అర్థం కదా ! ప్రభాత వేళ లో వీచే చల్లని పిల్లగాలులు, ఆ గోవిందుని దయ .! బంగారు రంగుల సూర్యభగవానుని అరుణ కిరణాలు మనల్ని దీవిస్తు న్న భగవంతుని అపార కృపామృత ధార గాక,మరేముంటుంది ! పైన నీలాకాశం, పరిసరాలు పచ్చగా, పూలతో, చెట్లతో, గలగలా పారే సెలయేటి జలదారాలతో పునీతం అవుతూ పులకించి, పరవశించే ప్రకృతి సోయగాలు, ఇదంతా ఆ సర్వాంతర్యామి చలువ వల్లనే కదా,!, సూర్యోదయం తో జగతికి నవొదయమ్, !ప్రాణులకు శుభోదయం,,! ఎవరీ జగత్తును ఇంత గొప్ప వైభవంగా క్షణ క్షణం మారుతున్న రంగు రంగుల వినూత్న చిత్రకళా రచనా ప్రతిభా పటిమతో అద్భుత కళా నైపుణ్యం తో,నడిపించగల రు,,, ఆ జగదీశ్వ రుడు తప్ప,?? ఇ తరులకు అది సాధ్యమా,,,? అందంగా లేత లేటచివురుతాకులను ,, గులాబీ, మల్లె, బంతి చేమంతి, లాంటి సువాసనా భరిత పరిమళ సుగంధ సువాసనల వెదజల్లు పుష్పాల సౌరభం ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని అనుగ్రహం కాకపోతే, జగతి లో ఈ తరగని, అందాలు ఎలా వస్తున్నా యో మనలాంటి అల్పులకు సామాన్యులకు ఊహించ తరమా,? , అందుకే ""చూడగలిగే కన్నులు ""ఉంటే, దర్శించే తపన, ఆర్ద్రత, భక్తి శ్రద్ధలు అంతరంగంలో కదలాడుతూ ఉంటే, నారాయణుని అంతటా, మనలో కూడా భావిస్తూ, అనుభవించ వచ్చును.!! ఆ బ్రహ్మాండనాయకుని గుర్తించాలని అనుకుంటే,, అతని నామ రూప గుణ గణాలు, స్మరిస్తే, భజిస్తే, పూజిస్తే, సేవిస్తే, భావిస్తే, ఆరాధిస్తే, చాలు, స్వామి నీ అంతరంగంలో కొలువై ఉంటాడు, !ఇన్ని మాటలెందుకు,? ,నారాయణుడు మనలో ఉంటే నే ప్రాణం ఉన్న శరీర దారులం!, లేదా శవాలమే కదా,, !అనుక్షణం లోన ఉండి ,వెంట ఉండి ,జననం నుండి మరణం వరకు తోడు ఉండి,మనల్ని నడిపించేది ఆ అచ్యుతుడే .. కదా! అందుచేత,పరమాత్మను అంతర్యామి గా గుర్తించే యోగ్యతను , స్ఫూర్తిని,కరునించమని కోరుకుందాం ! ఎంత విశ్వాస మో , అంత ఫలితం కదా,,, అందువల్ల చేసే ప్రతీ పనీ, స్వామి దయవల్ల జరుగుతోంది,, కర్తవ్యం మనవంతు,, కాపాడుట అతనివంతు ! నమ్ము చెడ్డవాడు లేడు, అందుకే నమ్ము తూ పరిపూర్ణ విశ్వాసంతో విడవకుండా మరవకుండ భావిస్తూ జన్మను తరింపజేసు కొందాం,,, పుణ్యాత్ములు, పురాణ పురుషులు నడిచిన త్రోవలో నడుద్దాం,, మాటలో మనసులో, మమతల లో శ్రీకృష్ణా భగవానుని చరణారవిందాల ఆశ్రయం కోరుకుందాం,! ఎదలో, హృదీలో, మదిలో,, బ్రహ్మానందాన్ని కలిగించే భక్తవత్సలుడు,నందనందనుని,, యశోదా కృష్ణుని మనసారా,కొలుచుకుందాం ,, జన్మను పావనం చేసుకుందాం,, హరే కృష్ణ! హరే కృష్ణా !!!స్వస్తి!
ఆత్మ జ్ఞానం
April 2019
""ఆత్మజ్ఞానం,, !!"" అంటే ఆత్మను గురించిన జ్ఞానం,,! గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవాను డు భగవద్గీత లో సూచించిన ప్రకారం, ఆత్మకు చావు లేదు,,!పంచభూతాలు , ప్రకృతి శక్తులు ఏవి కూడా ఆత్మను ప్రభావితం చేయలేవు .! అది శాశ్వతం,!, ఏ వాసనలు, కర్మలు దానినం టవు ,! అవన్నీ జీవుని లక్షణాలు!", అంటూ జీవిలో ఉండే అద్భుతంగా "ఆత్మ మహాత్మ్యం" వివరించాడు , !అలా మనలో ఉండి మన జీవితాన్ని నడిపిస్తూ, దానికి కావాల్సిన శక్తి యుక్తులను, చైతన్యాన్ని సమ కూరుస్తూ , జీవిని వదలకుండా ఉండే రక్షణ కవచం, ఈ ఆత్మ !!, ఇక అనాత్మ అంటే ఆత్మ కాని ఈ దేహం. ను అనాత్మ గా చెప్పుకోవచ్చు !. నేను ఎవరిని, ? ఆ నే పరి ప్రశ్నకు సమాధానం, ఖచ్చితంగా ఇది అని చెప్పలేము, కాని ఆత్మ పరిశీలన ,అత్మ విచారణ చేసుకోవడం ప్రతీ జీవునికి అత్యావశ్యకం,! ఇలా జీవించడం ఎవరికోసం?,, జీవితం అంటే ఏమిటి,? ఈ జీవి ఎవ్వరువాడు,? ఎక్కడినుండి ఎక్కడికి అతడి ప్రయాణం?, ఇలాంట వేదాంతి ప్రశ్నల కు జవాబులు ఎవరికీ వారే, ఆత్మ శోధన చేస్తూ తెలుసు కో వాల్సి ఉంటుంది..,! జీవుడు అంటే మనసు,! అందులో " నేను "అనే అహం ఉంటుంది,! ఇక పరమాత్మ అంశ ఆత్మ! దాని లో చిత్తశుద్ది కలిగిన బుద్ధి,, ఉంటుంది ,! అలా అని జీవాత్మను వేరుగా చూడలేము,, శరీరమంతా వ్యాపించి ఉంటాడు జీవుడు,, దానితో శరీరం చేసే పనుల కు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది కూడా !!జీవుడు ఆత్మ లేకుండా మనుగడ సాధించలే డు ,, నిజమే , కాని, జీవుడు గతజన్మ కర్మ ఫలాలను అనుభవించే విధంగా దానికి అనుగుణంగా , ఈ ఆత్మ బుద్దిని ప్రేరేపి స్తు , ప్రబో దిస్తూ ఉంటుంది . ఇక ఈ శరీరంలో ఉన్న జీవుడు బందీ యై, తన కోరికలను తీర్చే ప్రయత్నంలో ప్రాకులాడుతూ , కూడా కర్మ జ్ఞాన ఇంద్రియాలను ఉపయోగిస్తూ తాను ఒక ""సర్వ స్వతంత్ర,, స్వేచ్చా జీవిని!" అని భావిస్తాడు,, కాని అది అజ్ఞానం,! అవివేకం ! అవిద్య,! అమాయకం!, అహంకారం కూడా,,! ఇలాంటి శరీరాలు ఎన్నో ధరించి, అందులో బందీయై, కర్మఫలం పూర్తి గాకుండా బయటపడే మార్గం కానరాక,, విధి చేత లలో చిక్కి,,, కుక్క నక్క పాము, పురుగు క్రిమి కీటకాల ఉపాధి తో దుర్భర జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. జీవికి ఈ శరీరం ఒక సాధనం మాత్రమే, ! దానిని ఒక కర్మాగారం లా చూస్తూ అనుక్షణం జాగ్రత్తగా వాడుకోవాలి ..! అలా కాక,, నిర్లక్ష్యం తో ఇది నా ఇల్లు! నా ఇష్టం !" అనే అజ్ఞాన భావనతో, సక్రమంగా ఉపయోగించు కోకుండా ఉంటే మాత్రం అది ఏ మాత్రం పని చేయ కుండా పోతుంది,, !అంటే చనిపోతుంది!, అంటే ప్రాణం,, పోతుంది,,! అప్పుడు, లోన బందీ గా ఉన్న జీవుడు , గత్యంతరం లేక,,ఆత్మ సహాయం తో వాయు రూపాన దేహాన్ని విడిచి ఎగిరి పోతాడు,,! ఎక్కడికి అనేది మాత్రం ఎవరికీ తెలియదు, ! దీనినే మరణం అంటాము,! అది దేహానికి మాత్రమే మరణం,! అలా ఒక ఉపాధి కోల్పోతాడు జీవుడు,,! అలాగే జననం కూడా ! జీవుడు ఒక వాయు రూపంలో మాతృ గర్భంలో ఉన్న పిండంలో ప్రవేశిస్తాడు,!, స్త్రీ లోని అండం, పురుషుని శుక్ల కణం, రెండూ సంయోగం చెంది పిండంగా మారడం, , ఆ ఉపాధిని వెతుక్కుంటూ జీవుడు అందులో కి రావడం ,9 నెలల వ్యవధిలో ,ఈ బయట ప్రపంచం లోకి అడుగు పెట్టడం, ఇదంతా వింతైన విష్ణు మాయ.!. జగన్మా తల్లీ కడుపులో ఎలా అజ్ఞానం , తో, దైవాన్ని తెలుసుకోకుండా ఉంటాడో, అలాగే బహ్యప్రపంచం లో కూడా అదే మాయ,,! అదే మూర్ఖత్వం,! అదే అజ్ఞానం! ఎవరికీ ఎన్నటికీ, ఎంతకు అంతు చిక్కని సృష్టి రహస్యం, , ఈ జీవన వలయం, సృష్టి స్థితి లయ,,ఈ విధంగా జీవుడు, ఉపాధిని వెతుక్కుంటూ రావడం పోవడం.! ఎవరు కూడా ఊహింపలేని యుగ యుగాలుగా నిరంతరం సాగుతున్న జగన్నాటకం,! ఈ జీవులను పావులుగా చేసి, సంసారమనే చదరంగం లో వింతగా చిత్రంగా భగవంతుడు ఆడుతున్న ఆటల పరమార్థం ,, మాత్రం ,,వేదాలకు, శాస్త్రాలకు, మహా ఋషులకు అర్థం కా నీ, మహ మహా విన్యాసం, అద్భుత లీల, గా విచిత్రంగా మిగిలిపోయింది. !జీవు డు ఆనందంగా బ్రతుక డానికి, అందుబాటులో పంచేంద్రియాలు, ఉంటున్నాయి, చాలామంది చక్కని క్రమ శిక్షణ తో శరీరాన్ని మనసుని నియంత్రిస్తూ, ఆరోగ్యంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అంటే, తమ శరీరాన్ని ఒక అందమైన గృహం లా తీర్చి దిద్దుతారు, అలా రోగాలు, నొప్పుల బాధలు లేకుండా ఎక్కువకాలం బ్రతకవచ్చును. ఇది మనసు చెప్పినట్టు శరీరాన్ని నియంత్రిస్తూ జీవుడు విజ్ఞాన దిశలో కొనసాగించే ఒక జీవనవిధానం! , ఇక మరో కొత్త మలుపు మార్గం కూడా జీవునికి విదించ బడి ఉంది, !!అది జీవుడు తన శరీరాన్ని దేవాలయంగా భావించే దివ్యమైన భావ సంపద..! గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా, "నీ మనసే నీకు శత్రువు!, మిత్రువు కూడా, !""అంటే మనం భావించే విధానాన్ని బట్టి పరిస్తితి మారుతుంది, ప్రతీ రోజూ దైవభక్తి కలవారు 24 గంటల్లో కనీసం ఒక పావుగంట అయినా తమ ఇష్టదైవాన్ని పూజించు కుంటు తమ భక్తిశ్రద్ధలు కనబరుస్తూ కుంటారు,,! తమ కున్న అంత పెద్ద ఇంటిలో దేవుని కోసం ఒక చిన్న గది,shelf, లేదా ఒక గూడును" పూజా గది""గా మార్చి, గోవిందుని కి , నిత్యం అర్చన, నివేదన చేస్తున్నట్టు గా , తమ రోజువారీ కార్యక్రమాల్లో కొంత సమయాన్ని,, దైవారాధన కు ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి అది యాంత్రికంగా చేసే పని, !ఒక సినిమా, ఒక షాపింగ్, ఒక ఆఫీస్, ఒక బంధువు ఇంటిని దర్శించడం ఎలాగో , ఆలయానికి వెల్లడం కూడా అంతే అవుతోంది,! అంటే భావంలో తేడా లేదు, భగవంతునితో అనుబంధం లేదు..! హాస్పిటల్ కు వందల సార్లు వెళ్తాం ,,కాని, ఆలయానికి వెళ్ళడానికి మాత్రం సమయం దొరకదు,, ! పాప క్షాళన చేసుకోడానికి !! దేవుడు జీవునికి రెండు మార్గాలు అనుసరణ కు అనుగ్రహించాడు .. మనసుతో శరీరాన్ని ఇల్లుగా మార్చుకుంటా వో. లేక, చిత్తశుద్దితో శరీరాన్ని నడిచే దేవాలయంగా భావిస్తూ, బ్రతుకును పునీతం చేసుకుంటావా, అది జీవుని కి వదిలేశాడు పరందాముడు! , అన్నీ ఇచ్చాడు,,! అలాగే వాటిని వాడుకునే అవకాశం బుద్దిని కూడా ఇచ్చాడు,! ఇక జీవుని కర్తవ్యం తనకు ఏది యుక్తమో, జీవన్ముక్తి దాయకమో,నిర్ణయించుకోవడం ,! శరీర సౌఖ్యం, అస్తి, బందువులు , ఇలా దేవుడిచ్చిన ప్రసాదం ఉపయోగిస్తూ , అతడిని మరచి, కృతజ్ఞత చూపకుండా, మోహం చాటేస్తు ఉంటాం ,! ఏదో మొక్కుబడిగా రోజూ గంట పూజలు చేస్తున్నానని,,, పూలు పండ్లు పాలు, భోజనాలు నైవేద్యాలు గా సమర్పిస్తూ ఉన్నానని భావిస్తూ ఉంటాం ,, కాని అద మాన ఆలోచనలోి పొరబాటే అవుతుంది,,! నీవు స్వామికి ఇచ్చేదంతా, నీవు అనుభవించే దంతా, అతడి సొమ్మే కదా,,! పరమాత్మకు కావల్సింది నీ మనసు,, నీ ద్రవ్యం కాదు,, త్రికరణ శుద్ధిగా భావించి తపించి , చిత్తశుద్ది తో సేవించే నిర్మలమైన భావం , దైవా నికి ప్రీతికరం అని భక్తియోగం లో స్వామి చెప్పాడు కదా,, కృష్ణయ్య !! మనం ఒక బంధువు ఇంటికి వెళ్తే అక్కడ పరిచయాలు, బంధుత్వం, స్వాగత సత్కారాలు విందులు వినోదాలు ఉంటాయి. కాని ఆలయంలో దైవం తో అలాంటి ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం, వ్యాపారం ఉండవు కదా, అందుకే ఆలయం లో, యాత్రలో, వ్రతాల లో నిత్య పూజా విధానంలో కూడా సంసార విషయాలు జ్ఞాపకం వస్తుంటాయి,, ! నిజానికి దైవం ముందు నిలబడి నీవు చేయాల్సింది అత్మ సమర్పణ మాత్రమే, అంటే నీవు హృదయ పూర్వకంగా శతకోటి వందనాలు సమర్పించు కుంటే చాలు,,, చేసిన తప్పులు, పొరబాట్లు, అపరాధాలు పశ్చాత్తాపంతో ఒప్పు కుంటే చాలు. ! , ఇక ముందు అలాంటి తప్పులు చేయనని , మాట ఇస్తూ,,దైవం ముందు నీ బలహీనత లను చెప్పుకోవడం చేయాలి,! దేవుడు నీకు ఇది ఇవ్వాలని కోరకుండా, నీవు దైవానికి ఏమివ్వగల వో,, చెప్పుకో !! వివేకంతో, బుద్ధికుశలత తో శిరసు వంచి, చేతులు జోడించి ఆర్ద్రత తో, అనందం తో, గోపాల కృష్ణుని సుందర విగ్రహ దర్శనం భాగ్యం అనే అమృతపానం ఆస్వాదిస్తూ ఆనందభాష్పాలు రాలిస్తే చాలు, అది నిజమైన నిష్కళంక నిస్వార్థ ము గా విన్న వించే పూజ అవుతుంది, !!లోనున్న జీవాత్మ కు ఎదురుగా నిలిచిన పరమాత్మకు అనుసంధానం మనకున్న ఈ ఆత్మజ్ఞానం, వల్ల మాత్రమే సాధ్యం అవుతున్నది,!, అందుచేత, కేవలం పూజా మందిరంలో నే గాకుండా, అన్ని చోట్లా, అన్నివేళలా, అంతటా, ఆ కరుణామయుని అనందనిలయంగా భావించడం ఉత్కృష్టమైన మానవజన్మ ను సార్థకం చేసుకోవడం అవుతుంది !! అదే మన పరమార్ధం ,,!"అర్థం కూడా !!!!"" స్వస్తి !?! కృష్ణ హరే కృష్ణా. !"".
హరే కృష్ణా హరే కృష్ణా
"హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే !,,హరే రామ హరే రామ రామ రామ హరే హరే !!" ఇది ద్వి ద్వాదశ అక్షర మంత్రం,! కలియుగ భవ తారక మంత్రం! మానవ కళ్యాణం కొరకై ,,గీతాచార్యుడు ,సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చైతన్య మహ ప్రభువు గా అవత రించి, శ్రీకృష్ణ భక్తి చైతన్య ఉద్యమాన్ని , ఖండాంతరాలు వ్యాప్తి చెందించాడు!.. ఇది అద్భుతమైన రాధాకృష్ణా ప్రేమానురాగాల తరంగిణి !"" హరే కృష్ణా! హరే కృష్ణ !" అంటే చాలు , యమునాతీర విహారి, యొక్క చందమామను బోలు నందగోప బాలుని దివ్య ముఖారవిందం , మన అంతరంగంలో ప్రత్యక్షం అవుతుంది,! అతడి వేణు గాన మాధుర్యం లో తన్మయులై , పరవశిస్తూ నృత్యం చేస్తున్న ,జీవమున్న సజీవ సుందర శిల్ప సుందరీమణులు, ఆ గోపికాస్త్రీల బృందం హృదయాల్లో గోచరిస్తుంది,!, దేవ దుందుభుల శ్రావ్య గీత వాద్య మధుర సంగీత డోలికల్లో "హరే కృష్ణా హరే కృష్ణా !"అంటూ శ్రావ్యంగా సాగే మధుర బృందగాన అద్భుత దృశ్య మాలిక, అంతరంగం లో భావిస్తెనే ఇంత మధురంగా, మనోహరంగా, హృద్యంగా, రమణీయ, కమనీయ కావ్య నాటక అపురూప ప్రదర్శన లా ఉంటే, ఇక ఆనాడు, వెండి వెన్నెల కాంతులు వెదజల్లే బృందావన పుష్ప సుగంధ పరిమళ భరిత లతా నికుంజ ములలో, , యమునా సైకత విహార ములో,, సామూహికంగా, అందాల భామల ఆనందాల భాగ్యమే అన్నట్లుగా "హరే కృష్ణా, హరే కృష్ణా " అంటూ ఉచ్చరిం ప బడే సులలిత, సుందర, సుమధుర శ్రీ కృష్ణ మంత్రం వీనులవిందు గా, జీవాత్మ పరమాత్మల అనుసంధానం చేసే భక్తియోగ ప్రక్రియ ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుం దొ కదా ! బృందావన సీమల్లో ఆ సవ్వ డి ధ్వనిస్టూనే ఉంది,,,! పాండురంగ మహాత్మ్యం చిత్రంలో మధుర గాయకుడు ఘంటసాల గారి గళం నుండి జాలువారిన భక్తిరసామృత శ్రీకృష్ణ గీతం ఆలాపన తో దివి నుండి భువికి గోప కాంతలతో,దిగివచ్చిన గోపాలకృష్ణ భగవానుని రాసలీల వైభవం ఎదలో మదిలో హృది లో, నయన మనోహరంగా నాట్యమాడుతుంటే ,, పులకించిన పాండురంగడు ,"" జయకృష్ణా !ముకుందా! మురారీ !"అని పిలుస్తూ ఉన్నట్టుగా నే అనిపిస్తుంది,!, ఇది కేవలం భావన యే కావచ్చును,,! కాని అది బ్రహ్మాత్మకము ,! అంటే, జీవులలో నిద్రాణంగా ఉంటున్న దైవిక శక్తిని మేల్కొలిపి, పరమాత్ముని సన్నిధిలో నిలిపి, జీవన్ముక్తి నీ అనుగ్రహించే భావ సంపద కు మించిన భాగ్యం మరొకటి ఉంటుందా!?? "మనసే అందాల బృందావనం, అనుకుంటే,, వేణు మాధవుని పేరే మధురా మృతం, గా భావిస్తే,, కృష్ణయ్య, కమ్మని నగుమోము, చూడటం, మనం నోచుకున్న నోముల పంట,, జన్మ పావ నం కావడానికి కన్నయ్య కడగంటి చూపొక్కటి చాలు కదా ! నిజంగా isckon క్రిష్ణ చైతన్య సంస్థ సభ్యులంతా ధన్యులు, !వారు చక్కగా తెల్లని షర్ట్ ధోవతి, కండువా, నుదుట, దిద్దిన నామము తో, చేతిలో తులసీ పూసల మాల ధరించి, అహర్ని శం నిరంతరం, దీక్షగా క్రిష్ణ ధ్యాన చిత్త పరాయనులై "హరే కృష్ణ "మంత్రాన్ని లక్షల సార్లు జపిస్తూ, తాము తరిస్తూ వేలమందిని తమ ధార్మిక చింతనా వృత్తితో, దివ్యమైన భగవద్గీత శ్లోకాల పఠనం, అనుసరణ చేస్తూ చేయిస్తూ ధన్యుల ను చేస్తున్నారు,, !ఇంత ఆకర్షణ, సమ్మోహన శక్తి, బ్రహ్మానందం, హరే కృష్ణ మంత్రం లో నిబిడి ఉంది,! ఈ మంత్రాన్ని స్వయంగా ఉచ్చ రిస్తూ ఆనందించే వారిలో నేనూ ఒకడిని,!, ఆ ఆర్ద్రత అనుభవిస్తేనే తెలుస్తోంది,, కదా !" కృష్ణు డంటే "ప్రశాంతత, ఆనందము, ప్రేమ ల, నిర్గుణ నిరాకార సచ్చిదానంద అనుసంధాన ఘన స్వరూపము !" రేపల్లె వనితల, అపారమైన ప్రేమ తో కృష్ణు డిని తమ అంతరంగంలో నిక్షేపించి తామే కృష్ణులు అయ్యారు ,!" నారీ నారీ నడుమ మురారి,! హరికి హరికి, నడుమ ఒయారి,,!" గా భావిస్తే,, కృష్ణుడు ఒక్కడే, అయినా, ఎంతమంది గోపిక లో అంతమంది కృష్ణులు సాక్షాత్కారం అయ్యారు,,! ప్రతీ గోపిక ఒక నాయిక,, కృష్ణుడు ఆమెకు నాయకుడు! ఇలా కృష్ణుడు నా వాడే అన్న తాదాత్మ్యం ఉంది వారిలో ! ఆ ఆరాధనా భావం తో వారు" అపర శ్రీకృష్ణ ప్రేమైక స్వరూపిణి ,రాధాదేవి " కృపకు పాత్రులై,, అద్భుత రసరమ్య వైభవ రాసలీల క్రీడలో పాల్గొనే మహాభాగ్యం పొందారు తరించారు కూడా !,,, ప్రకృతి, సమస్త జీవులు, చరాచర జగత్తు, అన్నీ కలిపి గోపిక లు అయితే శ్రీ కృష్ణుడు ఒక్కడే, పురుషుడు.! అలాంటి దేవదేవుడు నర్థిస్తూ పద విన్యాసం చేస్తూఉంటే ,, కృష్ణయ్య పాదాల మువ్వల సవ్వడులు క్రిష్ణ భక్తుల హృదయాలలో ప్రతి ధ్వని స్టూ ఉంటే , ప్రకృతి తన విస్తృత సౌందర్యం తో అందాలను వేదజల్లదా ! ఆ మురళీ లోలుని మోహన గీతిికి లోకాలు పరవశించవా ,,! రాధాకృష్ణుల కేళీ నటనకు, సకల ప్రాణుల మనసులు దోచుకో బడ్డాయి,! చూసే వారంతా సంభ్రమం అశ్చర్యాలతో చిత్తరువు లా చేష్టలు దక్కి నిలుచుం డి పోయారు!,, బృందావనం లోని పొన్నలు పోగడలు, మల్లెలు, విరజాజులు, వంటి పుష్పాల సౌరభాల గుబాళింపు తో పరిసరాలు నిండిపో గా మత్తెక్కి, న మలయ మారుతం, చల్లగా మెల్లగా, వేణు గోపాలుని మధుర సంగీత భరిత వేణు నాదాలు సమ్మోహన పరచగా, జగతి అంతా సర్వం "రాధా శ్రీకృష్ణ మయం అవుతోంది,! కాలం స్తంభించింది క్షణ కాలం ఈ కన్నయ్య కమనీయ రాసలీల భావ అమృత తరంగాలను ఆస్వాదించి కాల స్వరూ పుని విశ్వరూపం దర్షిద్దామని !!"హరే కృష్ణ హరే కృష్ణా !"అనే సామూహిక కమనీయ రమణీయ బృంద నాట్యం,,,! దృశ్య కావ్యం అద్భుతం, !అమరం,! అమోఘం,! అద్వితీయం!, అపురూపం,! అనందనిలయ వైకుంఠ స్వర్గ ధామం,! అలాంటి భావ సంపద స్ఫూర్తిని కలిగించే, బృందావన సీమ స్మరణం, దర్శనం, కీర్తనం భవ పాప తరణం!,, జన్మ సార్థకం,,! భుక్తి ముక్తి దాయకం,,!, అలాంటి అద్భుతము అనిర్వచనీయం ,మధురానుభూతి ప్రదాయకం, అయిన "హరే కృష్ణా హరే కృష్ణా , కృష్ణా కృష్ణా హరే హరే! హరే రామ హరే రామ, రామ రామ, హరే హరే!" అనే కలియుగ తారక మంత్రం అనునిత్యం జపించుదాం,! హృదయాన్ని నిర్మ లంగా,, మనసును ప్రశాంతంగా, చిత్తాన్ని ఆనందమయంగా చేసుకుందాం,,!"హరే కృష్ణ హరే కృష్ణా!""స్వస్తి !"
Tuesday, April 16, 2019
సాయి దత్త భగవానుడు
April 16
సాయి దత్త భగవానుడు 24 ప్రాణులను గురువులుగా స్వీకరించడం , మనకు తెలిసిందే, పక్షులు, క్రిమి కీటకాలు, జంతువులు, చెట్లూ, ప్రకృతి, ఇలా ఆయనకి , అవి తమ జీవితాలను సక్రమంగా,నడిపే సహజమైన గుణం ఒక గుణపాఠం బోధిస్తూ ఉంది కానీ ఆ జాబితా లో మనిషికి స్థానం దక్కలేదు, ఎందుకంటే అతడికి ఉన్న అహంకార మమకారాలు జ్ఞాన పిపాస లకు అతడిని దూరం చేస్తున్నాయి, , ఇలాంటి దురభిమానం లేని జంతువు , కుక్క ఒకటి! అందు కే శునకం , దత్త మహాశయులకు ఒక బోధ గురువు, అయ్యింది ,, విచిత్రంగా ! తనకు ఇంత పిరికేడంత అన్నం పెట్టిన యజమాని పట్ల , ఆ కుక్క చూపే విశ్వాసం, తో, అతడికి గురువు అయ్యింది,, ఇతడి సంరక్షణ తన బాధ్యతగా, ప్రాణం పోయినా సరే, ఆ ఇల్లు విడిచి వెల్లకుండా కాపలాదారు లా 24 గంటలు ఆ యజమాని ఇంటికి కావ లి కాస్తు, ఇంటిచుట్టూ , తిరుగుతూ ఉంటుంది. , అలాంటి విశ్వాసం, నమ్మకం , కృతజ్ఞతా, దేవుని పట్ల మానవ జాతికి ఉండటం లేదు,, మనిషికి జన్మతో బాటు, ప్రకృతి సంపదలు,, బందువులు బలగం , అస్తి ఐశ్వర్యం, విజ్ఞానం మేధస్సు, మాట్లాడే శక్తి, ఆలోచించే వివేక జ్ఞానం, మంచి చెడూ, పాపం పుణ్యం, సత్యం ధర్మం, వివేచనా శక్తి,, ఆనందంగా అనుభవంచడానికి వనరులు,, సూర్యునితో శక్తి, చంద్రునితో ఆయువు , ఆరోగ్యము, ఇలా జననం నుండి మరణం వరకు ఉపయోగించి సంతోషకరమైన జీవితం గడపడానికి భగవంతుడు తన అనంతమైన కృపచే అనంతమైన ఆనందాన్ని ఎన్నో సమకూర్చి మనిషికి అందిస్తూనే ఉన్నాడు,, అలా తనకు ఇన్ని చేస్తున్న అన్నదాత, ప్రాణా దాత జీవన దాత, జ్ఞాన దాత, అయిన ఆ సర్వాంతర్యామి కి ఈ మనిషి ఎన్ని సేవలు, పూజలు , భజనలు , యజ్ఞాలు యాగాలు,చేసినా ఆ పరమాత్ముని కృపకు బదులు చెప్పే సామర్ట్యం కలిగినా ? , అతడు ఇచ్చిన వాటితోనే అతడికి మహా ప్రసాదంగా , నైవేద్యంగా ఇవ్వడానికి ఈ మనిషికి చేతులు వచ్చేనా ! మనసు కలుగేనా ! తీరిక , ఓపిక ఉండే నా,, అసలు ఆ మార్గంలో ఆలోచించే ప్రయత్నం చేసేనా ! ప్రతిరోజూ ఉదయం లేవగానే, తనకు విశ్రాంతి అనే నిద్ర ను పరమ ఔషదంగా అనుగ్రహిం చి, తిరిగి నూతన ఉత్సాహంతో పని చేసే శక్తిని, ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ప్రసాదించిన ఆ పరందామునికి కృతజ్ఞతా పూర్వకంగా తన రెండు చేతులూ పైకెత్తి, తూరుపు కొండల్లో ఉదయించే ఆ కర్మసాక్షి,సూర్యభగవానునికి , భక్తి వినయ పూర్వక నమస్కారాలు పెట్టేనా,,? దోసిలి తో నీళ్ళు తీసుకొని,, ప్రత్యక్షంగా రోజూ ఆగుపించే ఆ ఆదిదేవుని కి అర్ఘ్యం సమర్పయామి అని ఇన్ని నీళ్ళు విడిచేనా,, తాను అనుభవించే ఈ మానవ జీవితం అతడి ప్రసాదం, భోగ భాగ్యాలు అతడు ఇచ్చిన వైభవాలు మరి కుక్క తన యజమానికి చూపిస్తున్న విశ్వాసం తన యజమాని పట్ల తాను ప్రదర్శించే ది అతడు ఇచ్చిన సొమ్మును అతడికే ఇవ్వడానికి ఇంత ఏడుపు ఎందుకు,,? తీరేదెప్పుడు, జ్ఞానోదయం కలుగేదెప్పుడు ,,, అందుకే మనిషి కంటే కుక్క నయం,,,! బుద్ధి లేని కుక్కని నమ్మవచ్చు ను,, కాని విజ్ఞానం కలిగిన మనిషిని నమ్మలేము కదా,, ఎక్కడ?, ఎప్పుడు,,?, అలాంటి జంతువులు దత్త భగవానుని కి గురువులై అతడి కృపకు నోచుకున్నాయి ,, నాలుగు వేదాలు, నాలుగు శునకాల రూపంలో, అతడి చుట్టూ పరిభ్రమిస్తూ, సేవిస్తూ, తరిస్తాయి, ఇలా మనిషి దృష్టి లో, చీ చీ పాడుకుక్క అని మనిషిచే చీద రింప బడే, శునకం, భగవంతుని దృష్టిలో, ఉదారమైన ఉన్నత స్థానాన్ని సంపాదించి జాతికి గౌరవాన్ని తెచ్చి పెడుతున్నాయి,, అయినా, పరమాత్మ కరుణించి, మనిషికి అద్భుతమైన రెండు వరాలను సద్వినియోగం చేసుకొని, తరించడానికి ఇచ్చాడు, ఒకటి మాట్లాడే శక్తి, రెండవది, ఆత్మజ్ఞానం,, విశ్వంలో అణువణువు నిండి ఉన్న పరమేశ్వరుని వైభవాన్ని గుర్తిస్తూ,నోటితో , అంటూ, సకల ప్రాణికోటి లో దర్శిస్తూ, లోనున్న ఆత్మ జ్ఞానం తో అంతర్యామిగా శరీరం అంతటా ఉండి వెలుగుతూ, జీవాత్మకు, పరమాత్ముని అనుసంధానం చేస్తూ, బ్రతుకును పండించడు, మహా భాగ్యం గా భావిస్తూ జీవిస్తూ, అనుక్షణం, అనవర తం, అనుదినం, ఆత్మ సాక్షాత్కారము చేసుకునే అవకాశం భగవంతుడు మానవ జాతికి అనుగ్రహించాడు, మనిషి కూడా రెండు కాళ్ళ జంతువే అవుతాడు,, నీళ్లలో చేప వలె అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ,ప్రమాదాలను అరికట్టాలి, వనం లో స్వేచ్చగా సంచరించే జింక మృత్యువు ఏ వైపు నుండి సమీపిస్తున్న దొ అన్న ప్రాణభయం తో, జాగ్రత్తగా ఉంటుంది, చెట్టు నిస్వార్ధంగా తన కర్రతో బాటు, పూలు, కాయలు పండ్లు, అన్నీ తనకోసం ఉంచుకోకుండా, ఇతరులకు పంచివేస్తు ఉదారత ను చాటుతూ ఉంటుంది,, నదీ నదాలు తమ స్వచ్చమైన తీయని జలాలతో పంటలు పండిస్తూ, ప్రాణికోటికి జీవనాధారంగా నిలుస్తోంది.. అలా అన్నింటిలో దైవాన్ని గుర్తించే అవకాశం వినియోగించు కొకపో తే, మనిషికి ఉన్న జ్ఞానం వ్యర్టం అవుతోంది కదా ,! అందుకే మనసున్న మనిషిగా , మూడవ కన్ను,, జ్ఞాననేత్రం తో, ఉన్న అంతటా ఉన్న,సర్వాంతర్యామి నీ దర్శిస్తూ, దైవం పట్ల విశ్వాసాన్ని, శునకం లా ప్రకటించాలి,!, ఏదో ఒకటి ఎప్పుడూ,వదిరే ఈ నరం లేని నాలుకతో, నియంత్రిస్తూ ,మంచిని మాత్రమే మాట్లా డాలి,! తిట్లూ, దుర్భాషలు, కోపం, రాక్షసత్వం లాంటి ఘోరమైన శబ్దాలు రాకుండా, హరినామ సంకీర్తన, లతో, సత్వ గుణ ప్రధానంగా వాడుకోవాలి,,! సృష్టిలోని ""జంతువులు , సకల ప్రాణికోటి సమానం "" అని భావించే దైవీ భావన కలగాలి,!, అన్ని ప్రాణులలో దైవాన్ని చూడ గలగాలి,! నారాయణా,! పరమేశ్వరా,! మాలో ఉన్న అహంకార మమకారాల ను నియంత్రించే శక్తి నీ అనుగ్రహించు, స్వామీ ! నిన్ను గుర్తించే యోగ్యతను మాలో పెంచు,, తండ్రీ! తమ ధర్మాన్ని , జీవన శైలిని తూ చా తప్పకుండా పాటిస్తూ జీవించే జంతువుల వలె, మానవు డు కూడా ఎందుకు బ్రతుకు తున్నాడో, బ్రతుకు పరమార్థం తెలుసుకోకుండా,,, అసలు తాను ఎవరో, ఎక్కడినుండి వచ్చి ఎక్కడికి పోతున్నాడో, ఆత్మ పరిశీలన చేయకుండా యాంత్రికంగా ,, జీవితం గడుపుతూ ఉండటం గమనార్హం . దేవాదిదేవా, అల్పులం అజ్ఞానులం అ మాయకులం తెలిసీ తెలియకండా చేసిన అప రాధాలను దయతో , క్షమించు; స్వామీ !శరణు ,! శరణు! శరణు!""హరే కృష్ణ హరే కృష్ణా. !"
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...