April 6, 2019
ఇండియా విడిచి దూర దేశం వెళితే అనుకోకుండా, కొన్ని వార్తలు మనకి తెలుస్తాయి , దూరం కనుక రాలేము, కాని మనసంతా గందరగోళంగా ఉంటుంది. ఇది ఒక పరీక్ష లాంటిది, మనసుకు.. తపస్సు కోసం, అడవికి వెళ్ళి, మనసంతా సంసారం పైకి వెళ్తుంది అలా ఈ పిచ్చి మనసు, ఆక్కడుంటే , ఇక్కడికి,, ఇక్కడుంటే, అక్కడికి. పరుగులు పెడుతుంది,,, మనిషికి మనసే తీరని శిక్ష,, దేవుడిలా తీర్చుకున్నాడు మనిషి పై కక్ష .,, భక్తులందరూ మనసుని బ్రతిమాలు కొన్నారు, ఓ మనసా, దయచేసి నా చిత్తాన్ని వేరే వైపు కు మల్లించకుండ , కేవలం రామునిపై గురి కుదిరే లా కరునించవే ,, నీకు పుణ్యం ఉంటుంది. ,, అంటూ. ఇంకా మనసును ఇలా బుజ్జగించి,, మెల్లగా తమ ఆయుధంగా చేసుకుని,తరించారు , ఇదే వారి సాధన సంపత్తి. అది అంత సామాన్యమైన విషయం కాదు, ఊపిరిని రెండు నిముషాలు ఆపవచ్చు ను,, కాని రెండు సెకన్లు మనసును అపలేము,,,, ఇంకా ఇలా మనసును స్నేహితుడిగా చేస్తూ, తమ ఆవేదన వ్యక్తంచేశారు ఇలా...,, మనసా, రాముని సేవ చేతమా. ఆ మహిమా కన్నుల నిండా చూత మా... అంటూ ప్రార్థిస్తాడు,, మనసు అంటే నేను అనే అహంకారం,, బాల్య దశలో దీని ప్రభావం ఉండదు, జ్ఞానం వికసించ దు కాబట్టి. అప్పుడు ఆత్మ చైతన్యం పరిజ్ఞానం తో ఆనందంగా ఉంటుంది బాల్యావస్త. ఎప్పుడైతే మనిషి లో జ్ఞానం వికసిస్తుం దొ.., అంటే క్రమేణా వయసు పెరుగుతూ వస్తుంటే,, అప్పుడు"" నేనే, నేను, నాది, నా వాళ్ళు. నాకే.!"" ఇలా మనసు అహం తో బుసలు కొడుతుం ది. ఆ దశ నుండి మనసు ను నియంత్రిస్తూ, విచ్చలవిడిగా పోనీకుండ, చక్కని శిక్షణ ఇవ్వడం ద్వారా,, అద్భుతమైన వ్యక్తిత్వంతో, పిల్లలను, ఉత్తమ సంతానంగా దిద్దుకోవచ్చు ను.. అందుకే భగవంతుడు తలిదండ్రులు వారి పిల్లలకు మొదటి గురువులుగా అందించాడు, ఆ గౌరవం, ధర్మబద్ధంగా వేదాలు, చాటి చెబుతున్నాయి కూడా మాతృ దేవో భవ, పితృ దేవో భవ,, అంటూ. పది సంవత్సరాల లోపు పిల్లలకు జిజ్ఞాస, జ్ఞాపకశక్తి, ధారణా పటిమ, అనుకరణ,, పరిశీలన,, పట్టుదల,, అవధాన ప్రక్రియ లు అమోఘంగా ఉంటాయి, ఆ దశలో పిల్లలు దైవ స్వరూపులు. కల్లా కపటం ఎరుగని అజ్ఞాన అమాయక ఆనంద నిలయం, వారి హృదయం,, ఇప్పుడే కన్నవారు, తమ కన్నవారికి, దైవభక్తి నీ పెంపొందించాలి ,, భగవద్గీత శ్లోకాలు, గణేశ విష్ణు, కృష్ణా, శివ, గురు ప్రార్థనలు తాము నేర్చుకుంటూ , అంటూ, పిల్లలకు నేర్పాలి . వారి ముందు, పోట్లాట, చెడ్డ మాటలు, తిట్లు, కోపం,, లాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండాలి, లేదా అవే నేర్చుకుని, తిరిగి వాటినే బాణాలు గా మనవైపే సందించే ప్రమాదం రావచ్చును. అందుకే, పిల్లలున్న ఇల్లు, అనందం, ఆటలు, భజనలు, భక్తి గీతాలు, నీతి కథలు రామాయణ భాగవత కథలు చెప్పడం , వారితో అడుకొడం వారి మనసులో నీ మాటలు ఓపికగా వినడం, వారి సందేహాలకు చక్కని సమాధానాలు ఇస్తు, వారిని సంతృప్తి పరచడం, ఎది చేస్తే మంచిది, ఎది చెడు, అని చెప్పడం, ఆరోగ్యకరమైన ఆహారం, అలవాట్లు,, ఆటలు, పాటలు, సంగీతం,, చిత్రలేఖనం నృత్యం,chess, క్యారమ్, షటిల్, లాంటి games,, ఇలా వారి అభిరుచికి తగిన విధంగా ఏర్పాటుచేయడం , తలిదండ్రుల కనీస ధర్మం, బాధ్యత కూడా,, పిల్లలను కనగానే సరిపోదు కదా, నేటి ఆధునిక జీవన విధానం కు , పోటీ ప్రపంచానికి దీటుగా ఉండేలా వారి వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయా లి కదా. చివరగా మళ్లీ అదే మనసు గొప్పదనాన్ని మహిమను, గుర్తుంచుకోవాలి, దేనికైనా, ఎంత క్లిష్టమైన సమస్య కైన, పరిష్కారం ఇదే మనసు చేయాలి, అది చేతికి దొరికే ది కాదు., అలా అని అది లేకుండా ఏమీ చేయలేము, అందుకే మెల్లిగా దాన్ని తోడు చేసుకుంటూ ముందుకు వెళ్లాలి, మనసుంటే మార్గం ఉంటుంది అని మనందరికీ తెలుసు కదా. అందుకు పిల్లలకు పెద్దలకు ఒక క్రమశిక్షణా యుత దినచర్య అత్యవసరం, కాలం విలువ పిల్లలకు తెలియజేయాలి,,, ఈ రోజు మనం ఏం చేశాం, ఏం నేర్చుకున్నాం ,, ఇలాంటి ప్రశ్నలు వారిని, మనల్ని విజయ పథం లో నడిపిస్తాయి,,, శ్రీరాము డు సీత వంటి చక్కని పాత్రల గురించి, చెప్పే మాటలు, కథలు, స్తోత్రాలు, భక్తి గీతాలు, పురాణ శ్రవణం,, బాల్యదశలో అంకురార్పణ చేయాలి,, టీవీ లు, సెల్ ఫోన్ ల ను వారికి సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. మానసిక శారీరక బలాన్ని చేకూర్చి, వారిని ఉత్తమ పౌరునిగా తీర్చి దిద్దడం, మాతృ దేశానికి మనం సమర్పించే మహా భాగ్యం అనుకోవాలి,, సర్వే జనాః సుఖినోభవంతు, సమస్త సన్మంగలాని భవంతు ! హరే కృష్ణ హరే కృష్ణా !"" స్వస్తి. !"
Sunday, April 7, 2019
పరిగెత్తే మనసు
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment