Sunday, April 7, 2019

మంచివాడు మన రామేశ్వర్ రావు

April 2, 2019
మన వాడు , అందరివాడు, అయిన కొత్త కొండరమేష్ ,, కీర్తిశేషు డు అయ్యాడని అనటం బాధగా ఉంది. అతడు, తన తోబుట్టువులు,2, సోదరులు ,4 రిలో రమేష్ అందరికంటే చిన్న వాడు.. గారాల తమ్ముడు, అలాగే, అతడి భార్య వసుందర, సోదరులు ఆరుగురికి ప్రియమైన చెల్లెలు. బాల్యం నుండి రమేష్, తన చురుకుదనం, ఉత్సాహం,, పోరాట పటిమ తో అలుపు ఎరగకుండ,, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, చేసే పనిపై  ప్రతీ పనిపై శ్రద్ధా శక్తులు చూపుతూ, తిరుగులేని యోధుడి లా, కర్తవ్య నిర్వహణలో,, చక్కగా రాణించాడు! అనతికాలంలోనే,, తన నేర్పుకు , తగిన నిపుణత ను, జోడించి,పేరు ప్రతిష్టలను   గడించాడు,! ఎందరో హేమాహేమీల ముందు, పత్రికా రంగంలో, తనదంటూ ఒక విలక్షణమైన శైలిని ప్రదర్శించి,, చక్కని ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తూ, విలేఖరిగా, పలు సమస్య ల పరిష్కార ములకై సాధన కోసం, శ్రమించాడు,! తన జీవితం లో ఎదురయ్యే , ఆటుపోటులను,, అనారోగ్య సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను , తనఉన్నతమైన వ్యక్తిత్వం తో, దీటుగా, నిబ్బరంగా, ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టూ అదిరోహిస్టూ , క్రమంగా పై స్థాయికి ఎదిగాడు,, అందుకు తాను చేపట్టిన  క్రమశిక్షణా యుత ఉపాధ్యాయ వృత్తి కూడా తోడయ్యింది.,, అయితే  తన ఈ విజయ వంతమైన జీవన ప్రయాణంలో కీలకపాత్ర పోషించి ,తన భర్త సాధించిన అన్ని విజయాలకు తాను నీడగా  గర్వకారణం గా  నిలిచింది, అతని శ్రీమతి వసుందర ,,!, అయితే, ఆమె పెద్దన్నయ్య మదన్ మోహన్ రావు గారు,  తన తమ్ములతో , చెల్లెలికి రక్షక కవచం లా నిలిచి, రమేష్ రావు  అనుకున్నది సాధించడానికి తోడ్పడ్డారు. ఇలా ఒక వ్యక్తి ఔన్నత్యానికి, కీర్తి ప్రతిష్టలకు వెనక , వారి కుటుంబం సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి  !అందుకేనేమో,, రమేష్ రావు, వసుందర దంపతులు , చిలకా గోరింకల్లా ,  అందరిలో కలిసిపోయి,, ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, పిల్లలతో పెద్దలలో,, తోబుట్టువులు సోదరులు,, తల్లీ,, కొడుకు కోడలు, కూతురు అల్లుడూ ,, మన వళ్ళ తో,," ఆదర్శ కుటుంబం  "అనిపించారు, అలా మరపురాని అపురూపపు జంట లా, "వసురమేశ్ "లు ప్రతీ రోజూ, ఒక పండుగలా, కుటుంబ సభ్యులందరి తో, సఖ్యంగా, సహకరిస్తూ, తాము నిత్య నూతనంగా, సంతోషంగా, సంబరంగా, సంతృప్తిగా, ప్రశాంతంగా, "చిరునవ్వే తమ ఆయుధంగా "మార్చి,, అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటూ, జీవితాన్ని ఆనందమయంగా చేసుకున్నారు, నిత్యం తాము ,ప్రేమానురాగాలు కలబోసిన దంపతులుగా కలిసి ఉన్నారు,. అలా వారిద్దరూ, ఉన్నత కుటుంబంలో పుట్టి, బాల్యం నుండి, ఉమ్మడి కుటుంబంలో పెరిగి,,, తమవారు అందరితో ఐకమత్యం గా వ్యవహరిస్తూ, కన్నుల పండువుగా , సజావుగా సాగిపోయే,వారి దాంపత్య జీవనం పై  "విధి "కన్ను పడింది,,! ఫలితంగా, సత్వ గుణ సంపన్నుడు, శ్రమైక జీ వి,,, పరోపకారి,, మితస్వభావి,, ప్రేమాస్ప దుడు, అల్ప సంతోషి,, నిరాడంబరుడు,, ఉదారుడు, గా   ఇప్పుడిప్పుడే స్తిరపడుతున్న రమేష్ ను, భగవంతుడు తన లో ఐక్యం చేసుకొని, అతడి సతీమణినీ  వసుంధరను బేలగా నిస్సహాయంగా, ఒంటరిదాన్ని  చేశాడు,! ఇలా ," విధి ఆడుతున్న వింత నాటకం"లో వారే కాదు !  ప్రతీ ఒక్కడు కూడా, పగటి వేష గాడే కదా!,,మనమందరము, కూడా అతడు అడే చదరంగం లో కదిలే  పావులమే,, కదా  !!" చెక్ !" అనగానే ఎంతటి రాజైన, ఈ ప్రపంచం అనే విశాల రంగస్థలం నుండి  నిష్క్రమించ వలసిందే కదా,!", ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఎవ రైనా ఊహించగలరా ? దేవుడు చేసిన బొమ్మలం,! మనం,, ఆయన సొత్తులం,,! అతడి అధీనులం ! కావున అతడికి మనపై సంపూర్ణ అధికారం ఉంది... అందుకే భగవంతుడు ప్రసాదించిన దానితో తృప్తిగా  ఆనందంగా ,ప్రేమానురాగాలతో , పరస్పర సహకార భావనతో, దైవం పై విశ్వాసంతో,జీవించడం మానవుడి కర్తవ్యం. అవుతోంది ! అందువల్ల, "భగవద్గీత లో గీతాచార్యుడు , శ్రీకృష్ణ భగవానుడు  "చెప్పినట్లుగా,, ""కర్మణ్యే వాధికారస్తే,!...", అన్న శ్లోకము ప్రకారం,  "ప్రతిఫలాపేక్ష లేకుండా,మనకు విధింపబడిన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి ! తన భర్త ,తనకు  కనపడనంత దూరంగా వెళ్ళిపోయినా, వసుందర జ్ఞాపకాల్లో, హృదయంలో, అంతరాళం లో, శాశ్వతంగా  ఆమె జీవితాంతం కొలువై ఉంటాడు,,! ఇదే ఆమెకు మానసిక బలాన్ని , అద్భుతమైన ,ఆధ్యాత్మిక, ధార్మిక, విలువలను శక్తిని ఇస్తుంది.!. తానే ఒకటిగా చేసిన ఈ జంటను, బాహ్యంగా విడగొట్ట గల డేేమో ఆ విధాత,, !  కాని ఆమె అంతరంగంలో  నెలకొన్న తన" స్వామి"ని దూరం చేయడం, ఆ దేవుడి తరం కూడా కాదు కదా ,! అందులో స్త్రీ శక్తి,  తలుచుకుంటే, ఆ దైవాన్ని కూడా శాసిస్తుంది,,! గమ్మత్తు ఏమిటంటే ఆ వరం దేవుడు పురుషునికి ప్రసాదించ లేదు.! అందుకే  "మాతృ దేవో భవ !" అని వేద వాక్యం..! రమేష్ శారీరికంగా మనల నుండి వేరైనా, , అతడి ధర్మపత్ని , హృదయంలో నే కాకుండా,అందరి మనసుల్లో, ఒక సజ్జనుడు, "మంచివాడు గా, నిత్య సంతోషి గా,, ప్రేమ స్వభా వి గా , మంచి భర్త, మంచి తండ్రీ, మంచి తమ్ముడు ఇలా తన మంచితనంతో అందరి ప్రేమకు పాత్రుడై, హితుడై, స్నేహితు డై,, ఆత్మీయు డై, అజేయంగా  మదిలో మహిలో ఆత్మ స్వరూపంగా వెలుగుతూ నే ఉంటాడు, కీర్తిని శేష ముగా మిగిల్చుకొన్న  రమేష్ ఆత్మ ప్రశాంతంగా, సంతృప్తిగా, ఉండేలా  కరుణించి, అతడి కుటుంబాన్ని సదా వెన్నంటి కాపాడుతూ, శ్రీరామ రక్ష లా నిలవాలని ఆ సర్వాంతర్యామి , లక్ష్మీ వెంకటరమణు నీ, గౌరీ శంకరుని, షిర్డీ సాయి దత్త భగవానుని,,,పితృదేవతలను ప్రార్తించు దాం ,! "హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే,,,! హరే రామ హరే రామ రామ రామ హరే హరే. !!" స్వస్తి !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...