Sunday, April 7, 2019

సాక్షాత్కారం

April 5, 2019

నిన్నటి రోజు రాత్రి  , నేను చూస్తూ వుండగానే ఆశ్చర్య కరంగా,, అద్భుతంగా , నయనానందకరం గా, శివలింగం లో నుండి లేచి వచ్చి సాక్షాత్తుగా పర బ్రహ్మ , సౌందర్య రూప లావణ్య అందాల రాశి వలె, కన్నుల పండువుగా , కోటి సూర్య ప్రభలతో వెలిగిపోతూ ,,శివుడు , వచ్చి మందహాసం చేస్తూ,చంద్రకాంతి ని మించిన దరహాస వదనం తో ,నా ముందు  కనిపించాడు..మృత్తికా నేను శివలిం గాలు చేస్తూ అందులో ఈశ్వర దర్శనం చేస్తూ, తల్లిని తండ్రిని అందులో చూస్తూ, పొంగిపోతూ ఉంటాను., నా ధర్మ పత్ని పద్మావతి భక్తితో తుమ్మి మల్లె , పూల తో శివార్చన చేస్తూ శివనామ స్మరణతో పూజల ను  చేస్తుంది. ఇదంతా గమనించి, చూస్తూ ఉండలేక  వచ్చాడే మో., గౌరీ మనోహరుడు, శివ మానస పూజ లో మనం  భావించే రత్న సింహాసనం పై ఆసీనుడై నన్ను  చూస్తూ," ఓంకార నాదమే తన శరీరం "  కనుక, కమ్మని స్వరంతో , ఒళ్ళు పులకించెలా చెప్పసాగాడు, " మీరు ఎంత భక్తి శ్రద్ధలతో ,,నన్ను పూజించి నా, స్మరించి నా ,, భజించి నా కూడా నేను  నీకు ఇవ్వగలిగినది నా వద్ద  ఏమీ మిగిలి లేదు,! ఉండదు కూడా ! ఒంటిపై రాసుకున్న ఈ విభూతి తప్ప. !మీరు నాకు అభిషేకం చేస్తున్న పాలు నీరు, పండ్లు పుష్పాలు ఫలాలు రసాలు సుగంధ ద్రవ్యాలు ఏవైనా నేను ఉంచుకోవడం లేదు కదా,! అవన్నీ ప్రానవట్టం రూపంలో ఉన్న గౌరి దేవి స్వీకరిస్తుంది, !నాకై నేను గ్రహించే ది అందులో ఏముంది చెప్పు ! అందుకే , లింగ రూపంలో ఉన్న నన్ను కట్టుకొని గట్టిగా కదలకుండా చుట్టుకొని పట్టుకొన్న  పార్వతీ దేవి భగవతినీ కొలవండి !తలవండి,!, పూజించండి,! తరించండి!  మీకు పూజా ఫలం దక్కుతుంది ! మీకే కాదు, సృష్టికి కూడా శక్తియే, అంటే పార్వతీ దేవియే మూలం ! అంటే, ఆమెనే  మీకు ,నాకు, సర్వ జగత్తుకు ఆధారం,! ఆమె శక్తి  అయితే నేను చైతన్యాన్ని,! మూలం ఆమె , !నాకున్న శక్తి ఆమె.! శక్తి లేనిదే చైతన్యం ఉండదు కదా ! గౌరీదేవి కరుణ లేకపోతే  శివుడు లేడు,! ఆమె దయతో , నేను శివుణ్ణి, అంటే సర్వ శక్తి వంతున్ని అవుతున్నాను ! ఈ  చైతన్యాన్ని , సృష్టి స్థితి లయ కార్యాచరణ లు ప్రణాళికా బద్ధంగా నిర్వహించే సామర్య్యం ఆ అమ్మ దయ తో నే నాకు లభిస్తోంది, ఈ విషయం మా వాడు  , మీ చేత జగద్గురువు గా బిరుదు పొందిన శంకరాచార్యుడు తన ",సౌందర్యలహరి "లో విశదంగా మొదటి శ్లోకంలో నే చెప్పాడు కదా, ! "శివ శక్త్యా యుక్తో, యది భవతి శక్తః ప్రభవితుం..! నచే దేవం దేవో న ఖలు కుశ లః స్పందితు మపి... ! ,,,అంటూ మా గుట్టు రట్టు చేశాడు గదయ్య...! అంతెందుకు ,,! భూమిపై సంసారం చేస్తూ ఉన్న  మీరంతా ఇంతే కదా!, స్త్రీల చేతిలో పురుషుల బ్రతుకు లు,,! జన్మ నిచ్చి పోషించి పాలించేది స్త్రీలు,, !మనం నిమిత్త మాత్రులం ,! వారు చెప్పింది చేయాలి,  అంతే ! ఎప్పుడూ వారికి కోపం రాకుండా చూడాలి.! అదే మన మగవారి పని ! పాపం  ,,మీ భూలోకం లో  కూడా  ఇంతే ! బ్రతికి ఉన్నప్పుడు ఫర్వాలేదు ,, కానీ,భార్యను కోల్పోయిన భర్తల పరిస్తితి ఎంత దయనీయంగా, ఘోరంగా , నిస్సహా యంగా,,.. అనాథ లా, బ్రతికి ఉన్న శవాల వలె, శక్తి లేక చైతన్యానికి నోచుకోక, బ్రతికి చచ్చినవా డితో సమానంగా తయారవుతారు.. చూడలేక పోతున్నాను సుమా! ఇక , నా వద్ద ఉన్న  ఒకే ఒక ఈ మాత్రం జ్ఞానం కూడా ""భిక్షాం దేహి ! కృపావలంబనకరీ ! మాతా ! అన్నపూర్ణ ! ఈశ్వరీ !" అంటూ మా అన్నపూర్ణ రూపంలో ఉండగా మా దేవిని  ప్రార్థిస్తే దయదలచి, ప్రసాదించింది, జ్ఞానభిక్ష  ! ""అని నీకు తెలుసు కదా ! అందుకే అటు వైపు వెళ్ళ వయ్యా  అంటూ , గౌరీ మాత మందిరం వైపు చూపి , తాను ధ్యాన సమాధి లోకి వెళ్ళిపోయాడు, నేను ఇక  గత్యంతరం లేక అయ్య చెప్పినట్టుగా ఆయనకి వామ భాగంలో ఉన్న గౌరీ దేవి భగవతి ముందు వెళ్లి తలవంచి నమస్కరించడం తో నన్ను చూస్తూనే  అమ్మ గ్రహించింది, నా అవస్థ ను.!"" పిచ్చివాడా.. !ఆయన చెప్పడం, నీవు వినడమునా,! అసలు ఆయన, శివ తత్వాన్ని అర్థం  చేసుకునే యోగ్యత , పరిజ్ఞానం, సంస్క జ్ఞ్ారం నీకున్నాయా..? లేవు. !నీకే కాదు, యోగులకు సిద్దులకు, చివరకు ఆయనతో అర్ధభాగం గా ఉంటున్న నాకే  బోధపడ టం లేదు..!నీ బోటి అల్పులకు, పాపాత్ముల కు, అఙ్ఞానులకు "శివుడంటే ఎవరో, ఏమిటో, తెలుసుకొవడం అసాధ్యం,! దుర్లభం కూడా. !ఇక  మా ఆయన నా వద్దకు నిన్ను పంపించాడు ఎందుకు ? అంటావా,, ! అది కేవలం నిన్ను ఆట పట్టించడానికి , మాత్రమే.! తెలుసా ! లేకపోతే గౌరీ శంకరుల మధ్య, రూప గుణ బేధాలు ఉంటాయి అని నీవు అనుకోడం తప్పు, !కాదు కాదు పెద్ద అపరాధం కూడా..! ఒక్క మాట చెప్పు, !నాలో శివుడున్నాడా , శివునిలో నేనున్నానా.?. అని అమ్మ అడిగిందీ మందహాసం చేస్తూ..!  నేనన్నాను "అమ్మా ! జగన్మాత  !",,అర్ధనారీశ్వరుడు" అన్న బిరుదు శివయ్య కే ఉంది, కదా తల్లీ !" అని సిగ్గుతో తల వంచుకుని చెప్పాను.. వెంటనే అమ్మలగన్న యమ్మ , ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ,  , నాకేసి దయగల గురువులా,, ప్రేమ చూపే తల్లిలా  చెపుతూ పోయింది. ""అతడిలో నేనున్నాను.! కాదు కాదు !, ఆయన కు నాపై గల అమితమైన ప్రేమతో నాకు తన  మనసులోనే , భావం లో, హృదయం లో, చేసే ప్రతీ కార్యం లో, ప్రతిస్పందన లోనే కాకుండా, తన శరీరంలో కూడా సగభాగాన్ని నాకు  పంచి ఇచ్చాడు.  ఎవరూ చూపని, చూపలేని ప్రేమని నాకు ఇచ్చాడు , అంటే భార్యపై భర్తకు గల ప్రేమాభిమానాలు , అలా ఉండాలి అన్నమాట,!"" "నిన్ను గుండెల్లో పెట్టుకుని పూజిస్తాము ! "అని మీరు అంటారు కదా మీ భార్యలతో,,! కానీ నా పతిదేవుడు , నా సర్వేశ్వరుడు , నిజంగానే తనగుండెల్లో గుడి కట్టి నన్ను దేవతని చేసి, నేను తనని మరవకుండ విడవకుండా, ఉండే మహాభాగ్యం అనుగ్రహించాడు నా  పరమేశ్వరుడు, !అదయ్యా శివుడంటే,,! ఆదయ్యా ప్రతీ మగవాడు, తనను కట్టుకున్న భార్యపై చూపా ల్సిన గౌరవం అభిమానం,  చూపాల్సిన తీరు అంటే ! చెప్పడమే కాదు చేసి చూపడంలో నా గౌరీ పతికి సాటీఎవరు వస్తారు చెప్పు..!" అంది మహాలలితాత్రిపురసుందరి,,,నా కళ్లనుండి పశ్చాత్తాపం తో జాలువారే అశ్రువులను చూస్తూ, నేను చేసిన, నేను  భావించిన అపరాధ భావన కు సిగ్గుపడి, క్షమించమని  కన్నీళ్ళతో తన  పాద కమలాలను  ను కడుగుతూన్న నా దీనఅవస్థ చూసి,  తల్లీజాలి ప డింది. సకల ప్రాణికోటికి తల్లీ కదా  , బిడ్డల కళ్ళల్లో అశ్రువు లు స్రవి స్తే మాతృహృదయం కరిగి పోదా చెప్పండి!"వెంటనే నన్ను తన అమృత హస్తాలతో  దయతో లేవనెత్తి  తన అక్కున చేర్చుకొని, కరుణా పూరిత పలుకులతో  లాలిస్తూ, తనయుడి పై చూపే వాత్సల్యం కురిపించింది  అమ్మ విశాలాక్షి ,! అలా తన,, దయామృత నయనాల కటాక్ష వీక్షణ తో  నన్ను  ఊరడించి , నాకు అర్థమయ్యే విధంగా, నా విజ్ఞాన పరిణతి కి తగినట్లు గా శివగీతను  శ్రావ్యంగా నాకు  వినిపించింది, సరస్వతీ దేవి వీణా నాదం కూడా సరిపోని తన  మధుర మంజుల మనోహర గాన మాధుర్యం నిండిన పలుకులతో, నా తనువు, మనసూ పులకించి పరవశిస్తూ, తన్మయంతో తరిస్తు ఉండగా, జగదంబ , శివతత్వాన్ని విశదీకరించి నాకు జ్ఞానోదయం కలిగించింది!" శివుడంటే ఎవరనుకున్నావు ? శివలింగం అనే ఆకారం ,రూపం రంగు, లాంటి గుణాలు ఉన్నవాడు కాదు.! ఇది తెలుసుకో ముందు ! మీ మనుషులవలే చేతులూ ,కాళ్ళూ, తల ఉన్నవాడు అసలే కాదు, ! అతడికి ఒక ఆకారం  అంటూ లేదు !ఇలా ఉంటాడు అని కూడా  అనలేము ,! మహా మహా యోగీశ్వరులు కూడా బ్రహ్మ విష్ణు , ఇంద్రాది దేవతలు కూడా శివుని ఆది అంతము తెలుసుకోలేక పోయారు.. నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన స్వరూపం,  శివుడిది ! ఈ బ్రహ్మాండ మంతా తానే,! అందులో అణువణువు తానే,,! శివుడు లేని చోటు లేదు. !ఇక శివలింగ రూపం గురించి చెప్పాలంటే, అది కేవలం , ఉత్కృష్టమైన మానవ జన్మను తరింపజేసే ఉద్దేశ్యం తో పరమేశ్వరుడు దయతో ఇంత చిన్న లింగాకారం లో తనకు తానై  కుదించు కొని ఉన్న అతని అతిసూక్ష్మ రూపం,! మీ  అర్చనకు, ఆరాధనకు, ఒక రూపం అంటూ ఉండాలి కనుక, శివయ్య లింగరూపంలో అలా ఉద్భవించాడు,! అలా అని శివాలయం లో శివలింగం లో మాత్రమే శివుడు ఉంటాడు అంటే అది  ఘోరమైన శివాప రాధం  అవుతుంది , సుమా!, పరిమితులు హద్దులు లేని అనంతుడు శివుడు !  శివలింగం ఒకే భావన మాత్రమే , ! వాస్తవంగా శివ తత్వము బ్రహ్మాత్మకం    ! ఈ పరమార్థాన్ని తెలుసుకొకుండ  శివాలయానికి వెళ్లి ఎన్ని పూజలు చేసినా నిష్ప్రయోజనం, నిరర్థక మే కదా,,  అయినా  ఇంత చక్కగా చెప్పినా కూడా శివుని కి , శివాని కి  బేధం వుంటుంది అనుకోడం పొరబాటు కదా! వేడి నుండి వెలుతురు నూ ,, వెన్నల నుండి  చల్లదనా న్నీ. ,, మాట నుండి  శబ్దా న్నీ , విడ దీయ గలమా  నీవే చెప్పు  !"".. అంటూ శ్రీమాత  చెపుతూ ఉంటే, ""అలనాడు ఆ యశోదా మాత  జోలపాటలు పాడుతూ తన చిన్నారి కొడుకు ,  చిన్ని కృష్ణుని, అల్లరి నల్లనయ్య కు మహదానందంగా హాయిగా  అనిపించి నిద్ర పుచ్చి నట్టుగా  ,,నేను కూడా ఆదమరచి నా జగదంబ విశ్వపాలిని  మాత  ఒడిలో హాయిగా పరమానంద భరితంగా  నిద్రించాను,, అలా  ఎంతసేపూ ?అన్నది బ్రాహ్మీ ముహూర్తంలో లో  నాకు మెలకువ  వచ్చాక తెలిసింది ఇది ఒక కల అని! శ్రీ మాత అనుగ్రహము అని ! నిజానికి ,  ఈ రోజు ఉగాది ! శ్రీ, వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం,, నిన్న శుక్రవారం మహాలక్ష్మి దేవి వారం ! ఈ రోజున  తెలుగువారి కి అపురూపం, అద్భుతం, అయిన  ఉగాదిపండగ, రోజు! , అయినా ఇంకాస్సేపు నిద్రపోతే బాగుండును, అనిపించింది !"లోకాలేలే చల్లని తల్లి,, సర్వమంగళ  "ఒడిలో  సేద దీరే  మహదవకాశం మరి కాస్తా లభించేది కదా  అనుకున్నాను..! తీరా లేచి చూసేసరికి అది ఒక బంగారు స్వప్నం,! మరవరాని మరవలేని మధురానుభూతి ,,! కనీసం స్వప్నము లో నైనా నన్ను కరుణించిన పరమేశ్వరుని మహా ఇల్లాలికి  త్రికరణ శుద్ధిగా సాష్టాంగ ప్రణామాలు  సమర్పించడం తప్ప,, ఇంకేమి చెయ్యలే ము కదా ! అంతటి" మాతృ ఋణం" తీర్చుకునే యోగ్యత నాలాంటి అల్ప జ్ఞులకు ఉంటుందా..?  "అమ్మా !భవానీ మాత ! నీకు కోటి కోటి శతకోటి వందనాలు తల్లీ,,! నా అఖరు శ్వాస వరకు నీ దయ  ఇలా ఈ దీనునిపై ఇలాగే వర్షిస్తు నే ఉండాలని నిన్ను మనసారా వేడుకుంటున్నాను !తల్లీ !శరణు !జగజ్జననీ! శరణు! జగదేక మాతా శరణు  ! శివాయ గురవే నమః ! భవానీ మాతా కి జై !గౌరీ శంకర భగ వాన్ కి జై..!. సర్వే జనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగలాని భవంతు  !ఓం శాంతి శాంతి శాంతిః.  స్వస్తి ;"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...