June 18, 2022
""ఎక్కడని నిను వెద కేది పరమాత్మా _!?? ___&&&&&&____&&&
"" నిను ఎంతగ పూజించినా_!
శ్రీ వేంకటేశా _!
ఎంతగా క్షేత్రాలు దర్శించినా_!
ఎంతగా గుడులు తిరిగినా_!
ఎంతగా భజనలు చేసినా_!
అంతటా నిను కనలే క పోతే_! అంతటా భావించ కుంటే _!
అంతటా గురి కుదరక పోతే_!
అంతటా ఉన్నా డను కోక పొతే_!
బ్రతికి లాభ మేమి _? జన్మ కర్థ మే మి_?
అంతట నీవు న్నావని తెలుసు _!
గమనిస్తూ ఉన్నావని తెలుసు_!
చేయిస్తూ ఉన్నావని తెలుసు _!
అంతా నీ మయ మని తెలుసు_!
కానీ____! స్వామీ _!
"తెలిసి తెలిసి నిను మరచుటలో_!
తెలివి చూపుట యే తెలుసు _!
ప్రతి దినమూ నీ ప్రసాద మని_!
అనుకోవడం తెలియదు! పాపం _!
పూసిన ప్రతి పూవు లోన _!
మొగ్గ తొడిగిన పండు లోన_!
లేత ఆకుల సొగసు లోన_!
గట్టు నున్న పచ్చిక లోన_! జాలు వారు ఏరు లోన_!
బారు తీరు మేఘాల లోన_!
పసి పాప నవ్వుల లోన_!
తల్లి చూపు ప్రేమ లోన_!
పక్షుల కిల కిలా రావము లోన_!
గంగా జల తీయ దనము లోన_!
ప్రేమించి ప్రతి ప్రాణి లోన_! జాలి తలచు గుండె లోన_!
కసాయి వేటుకు గురి కాబోయే_
మూగ జంతువు అరపు లోన_!
దూరపు కొండ కోన లోనా_!
అరుణోదయ కాంతుల లోన_!
నిండు పున్నమి వెన్నెల లోన_!
సూర్యాస్తమయ నింగి లోన_!
ఇంద్ర ధనుస్సు కాంతి లోన_!
నింగి తారకల మెరపు లోన_!
తారా చంద్రుల ప్రకాశము లోన_! దానం చేయు మనసు లోన_!
దయ చూపు మనిషి లోన_!
సాయం చేయు గొప్ప హృదయం లోన_ !
పరమాత్మా _ నీవుంటావు_!
ఆనందాన్ని కలిగిస్తా వు _!
సంతృప్తి అందిస్తావు_!
ఆత్మలో కొలువై ఉంటావు_!
సద్బుద్ధి నీ దయ చూపుతా వు _!
నీ వాడిగా చేస్తావు _!
అందమైన ప్రకృతి లోన_!
సృష్టి లోని ఆనందం. లోనా_!
తెలిసి తెలియక చేసిన_
తప్పులు మన్నిస్తావు_!
అవరోధాలు తొలగిస్తా వు_!
అపారమైన నీ ప్రేమతో
సంతోషింప జేస్తుంటావు_!
జన్మ ధన్యం చేస్తావు_!
నాలోనే ఉన్న నిన్ను _ బయట కూడ చూడ గలిగితే_!
చేసే పనులన్నీ నీవే _ చేయిస్తూ ఉన్నా వనుకుంటే_!
నీకూ నాకూ బేధముండదు_!
ఎవరితో ఏ తగాదా ఉండదు _!
నిను వెదకే పని లేదు _!
నీ దయ దండిగ ఉంటే _ చాలు_!
నీ రూప భావ మక్కర లేదు_!
అంతట నిను చూస్తే చాలు _! ఇతరము తో పని లేదు _!
ఈ నిజము గ్రహించు శక్తినీ_!
అనునిత్యం అనుగ్రహించు స్వామీ_!
పొరపాటున నిను మరచిన గానీ_!
నను బ్రోచుట మరవకు తండ్రీ _!
ఏడుకొండల వేంకట రమణ_!
శరణు శరణు_! సంకట హరణ_!
ఓమ్ శాంతి శాంతి శాంతిః_!
సర్వే జనాః సుఖినోభవంతు_!
___&&&&&&-&&&___
హరే కృష్ణ హరే కృష్ణా
.
No comments:
Post a Comment