Thursday, May 16, 2019

దైవానుగ్రహం

"దైవానుగ్రహం !""అంటే , కృష్ణా! నందనందనా! నీ యొక్క అపారమైన  కరుణ, కటాక్షాలు, ప్రేమ, దయ, దీవెన, కలిగి ఉండట మే కదా ! కాని, ఇవన్నీ ఈ నీలమేఘ శ్యామ సుందరుడు, ఈ కృష్ణయ్య తో ఎలాంటి అనుబంధము, సంబంధము పెట్టుకో కుండా, పొందడం మాకు సాధ్యమా!?? కృష్ణా! నీ ప్రసాదంగా భరించే ఈ శరీరము తో సంబంధం కలిగిన భార్యా ,భర్త, పిల్లలు, బందువులు, తోబుట్టువులు, తలిదం డ్రు లు,, అమ్మమ్మలు తాతయ్యలు, స్నేహితులు ఇలా అందరూ రక్తసంబంధం ఉండి, లేదా ఏదో ఒక అనుబంధంతో ప్రేమ లేదా పరిచయాలు పెంచుకొంటూ" సంబంధం బలపడెలా "చూస్తున్నాం,! ఇవన్నీ నిజంగా "బంధాలు" అనబడే" ఇనప సంకెళ్లు,"!! మేము స్వయంగా ఎరి కోరి, విడిపోకుండా గట్టిగా  , చేతులకు కాళ్ళకు, మెడకు, ఊపిరి తీసుకోలేనంతగా బి గిించుకున్నాం స్వార్థంతో,దేహాభిమానముతో.     మాకు మేమే బందీలం అయ్యాం  ! జనార్దనా ! ఇలా ఈ సంసారం అనే "ఊబి" లో చిక్కుకు పోయాం, నగ ధరా! ఏం చేయము ? ఇందులోనే ఉన్న సుఖ దుఃఖాలు "స్వర్గం "అనీ భావిస్తూ, బావిలో కప్పల వలె, అజ్ఞానం అనే చీకటి నూతిలో బ్రతుకు ఈడుస్తున్నా  బ్రతుకుతూ ఉన్నాము,, జననం నుండి మరణం వరకూ! ఎంతకాలం ఈ వలయం లో భ్రమిస్తూ ఉండాలో తెలియదు లక్ష్మీ వల్లభా! ఇక ఏ రూపము, తత్వము, గుణము లేని నీ ఆరాధన చేయడం సామాన్య విషయమా చెప్పు,?? రాధా మనోహరా ! రోజుకు రెండు మూడు గంటలు నిన్ను పూజిస్తే సరిపోతుందా గోవిందా!?? మిగతా,19 గంటలు కూడాసంసార వ్యవహారాలకు , తిండి నిద్ర, లతో , అంతు పొంతూ లేని జీవన పోరాటం లో ప్రశాంతత కరువై,, బ్రతుకే బరువై,, ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ లు ఉన్నా సమయం చాలక, చచ్చే వరకూ బిజీ బిజీ,,!  అంటే, సినిమాలు, టీవీలు, బజార్లు, ఆఫీస్ పనులు, చుట్టాల, రాక పోకలు,, ఎలాగో,, మాకు ఆలయంలో నిన్ను దర్శించడం అలాగే అవుతోంది కృష్ణా ! "మార్కెటింగ్ "అంటారే అలా ! నిన్ను సేవించే అరగంట సమయంలో ఒక్క క్షణం కూడా నీ పై నిలవదు,! నీ సేవలో ఒళ్ళు పులకరించదు,!, సంతోషం కలుగదు,! అనందం తో, గుండెలో నీ పై ప్రేమతో పొంగిపోతూ, ఇంకా ఇంకా పూజ, అర్చన, చేయాలని అనుభూతి కలగదు!, కలిగినా నిలవదు,! నామాలు చదవడం, పూలు, దళాలు వేయడం అంతా యాంత్రికంగా ముగుస్తుంది తండ్రీ,! ఇదంతా, నాటకం అనీ నీకు తెలుసు,! నీ జగన్నాటకం లో ఉంటూ, నటించే పని బాగా ఒంట బట్టింది, మాకు! హనుమంతుని ముందు కుప్పి గంతులు మావి!! నీ పూజ లోనే కాదు, రోజంతా, బ్రతుకంతా నటనే,! ఎన్నో అబద్ధాలు, !కోపాలు! తాపాలు, !అబ్బో !ఎన్నో డ్రామాలు, మోసాలు!, నిన్ను కూడా మోసం చేసే మాయగాళ్ళం అంటే నమ్ము! అనగా  పరమ పాపాత్ములము, పతి తులం కూడా! ఏ కోశానా కూడా, నీచే క్షమింపబడే యోగ్యత లేని వారం మేము ! నీలమోహనా! నా చిట్టి కన్నా,! ఇలాంటి దీనస్థితి మాది,,! ఇదంతా నేను చెప్పుకుంటే కాని నీకు తెలియనిది కాదు,! సర్వజ్ఞుడువి నీవు,! నీ వద్ద ఏం దాచగలము చెప్పు,,!?? అయితే  ఎలా నిన్ను తలవాలి,! ?ఎలా కొలవాలి! ? తెలియదు,!! సనాతనసంప్రదాయాలు పాటించము,!, పెద్దవారు చేస్తుండగా చూస్తున్నా కూడా ," చాదస్తం ,, ""అనో, "టైమ్ లేదు" అనో,, "నీపై బుద్ది అంటే"అనురక్తి " లేకనో నిర్లక్ష్యం చేస్తుంటాం, ! గోపాలా,! అచ్యుతా! అనంత,! శేష శేయనా! వైకుంఠ, ప్రహ్లాద వల్లభా! ముకుందా,! అయినా నీవంటే మాకు ఎంతో ఇష్టం , తెలుసా ? ఇది చెబుదామని ఇంత వేదన పడుతున్నా ! స్వామీ !ఎన్నో వేల పేర్లు నీకు, ఉన్నాయట! కాని,, అందులో" శ్రీకృష్ణ "అనే పేరు గుండెల్లో నిండుగా మెండుగా, దండిగా పేరుకొని పోయింది రా నీరజ నాభా ! యశోదా కృష్ణా!, కాళీయమర్దనా,!, నవనీత చోరగోవిందా,!, రేపల్లె కృష్ణుడు, బృందావన విహరుడు, గోపికా చిత్త చోరుడు, గా శోభించి, అలరించిన  నీ "చిన్ని కృష్ణయ్య "రూప లావణ్య, వైభవం కనులారా చూడాలని,, తనివారా నిన్ను ఎత్తుకొని ముద్దాడా లని మనసులో ఆరాటంగా, ఉందిరా, కన్నా ! అలా నీవు ఆడుతూ పాడుతూ వేణువు ఊదుతూ,", వెన్న దొంగ"గా ప్రసిద్ది పొందిన, అల్లరి పనులు చేస్తూ  ఉన్న ఆ" చిలిపి చేష్టల కొంటె కృష్ణుని " సురుచిర సుందర బాల కృష్ణరూపమే మాకు ఎంతో ఇష్టం,,! మధురా కృష్ణుడెమో, చాలా పెద్దవాడయ్యాడు ,! రాజకీయాలు, యుద్దాలు, పెండ్లిల్లు, చేయడంతో , అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు, ! అతడిని మేము కాదు కదా ముక్కోటి దేవతలు కూడా పట్టలేరు ! మేము కూడా నిన్ను పట్టలేము, !అందుకే, ఆ నంద గోపుని ఇంటిలో పారాడే చిన్నిశిశువు, యమునా తీరవిహారి, బృందావన సంచారి, వేణు గాన విశారదుడు, రాసలీల కోవిదుడు, అయిన ఆ ముగ్ద మోహన కృష్ణ నామం రూపం, మరచిపోలేి ము,, నీకై విరహవేదనను అనుభవించిన గోపికల భక్తి మాకు శిరోధార్యం, అలౌకికమైన నీ వంశీ నాదము, అప్పటి గోకులా న్ని పరవశింప జేసినట్లుగా, ఇప్పటికీ మమ్మల్ని కూడా సమ్మోహన పరుస్తూ, బ్రహ్మానంద స్థితిలో ఓల లాడిస్తు ఉన్నాయి.. కృష్ణా నీ  లీలలు మధురం! మనోహరం,,! ఓ గోకుల తిలకా,!కౌస్తుభాలంకారా,,! కస్తూరీతిలకా!,, స్వర్ణపీతాంబర ధారీ,! కమల దలాక్షా !, శిఖీ పించ మౌళి,,! స్వర్ణ కుండల ధారి,,! శంఖ చక్ర గదా పద్మ ధారి,!  దేవకీ సుతా !, నిన్ను కన లేెని ఈ కనులెందుకు, కృష్ణా ? నిన్ను తలవని దినమెందుకు చెప్పు, గోవిందా ?, మా ఆయువు  నిన్ను భజించిన దినములు ఎన్నో, అన్ని రోజులు మేము జీవించి ఉన్నట్టు లెక్క ! అంతే గాని,90 ఏళ్లు బతికినా ,నిను తలచని జన్మ వృథా!వృథా !కాని, మధుసూదనా,, నేను అల్పుడను,! అధము డను! అజ్ఞానిని,! అహంకారినీ,,! నీ గురించిన తత్వ భావ సంపద నేనెరు గను !! అటువంటి అల్ప ప్రాణిని, నేనెక్కడ!?? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాదిదేవుడైన నీవెక్కడ? నారాయణా,!, నక్క ఎక్కడ,? నాగలోక మెక్కడ? ఎక్కడా పొంతన లేదు కదా, ముకుందా మన ఇద్దరి మధ్య ,అనుబంధాలకు తావేది ? స్వామీ ! నిన్ను తల్లీ, తండ్రీ, కొడుకు కూతురు, బంధువు, స్నేహితుడు ఇలా ఏ అనుబంధము పెట్టుకోకుండా "నిన్ను నా వాడ" వని నేను, గానీ,, "నేను నీవాడవనీ" నీవు గానీ, అనుకోకుండా, ఎలాి,? కృష్ణా ;, ఎలా? ఒకరికొకరం ప్రేమింప బడేది ??  ఈ దుర్భర సంసార సాగరం లో  "కర్మబందా లు" అనబడే మొసళ్ళ చే మ్రింగ బడుతున్న " అహంకార మమకారాలు"" అనబడే ఏనుగు లాంటి మనిషి శరీరంలో చిక్కిన, ఏ దిక్కూ తోచని అయోమయ స్థితిలో కొట్టు మిట్టాడుతు కూడా, చావడానికి సిద్దంగా ఉన్నా కూడా, అలనాటి గజేంద్రుని వలె ఆర్తితో, ఆర్ద్రత తో, ఆరాధన భావంతో నిన్ను తలచలేని మహా పాపిని,! అధమాధముడ ను  నేను!, నా ఈ" పాపపంకిల" జీవితాన్ని నీ చరణ కమలాల ముందు, మనస్ఫూర్తిగా  సమర్పిస్తూ క్షాళన చేయలేని మంద భాగ్యు డను, శ్రీకృష్ణా ; నా అవసరానికి మాత్రమే తలుచుకునే స్వార్ధ పూరిత వ్యర్థ జీవిని నేను.!. నిన్ను స్మరిస్తే నే నేను నిజమైన మనిషిని,,! తలపులో, వలపులో, నెలవులో నిన్ను భావించక పోతే రెండు కాళ్లున్న పశువును, నేను,,! కేశవా,! మాధవా,! ప్రద్యుమ్న, అనిరుద్ద,, నారసింహ,, !నీకు దూరమై మానవత్వ విలువలు కోల్పోతున్న నా సంస్కారం, నా విజ్ఞానం, ఇక నీ కోసం, దైవారాధన కోసం తపించి తరించ గలదా?,, శ్రిధరా,! హృషీ కేశా,! పద్మనాభ,! పురుషోత్తమా,! వాసుదేవా! నా ఈ రెండు చేతులూ పైకెత్తి మనసారా నీకు ధన్యవాదాలు చెబుతూ ఎన్నడూ నమస్కారం చేయడం లేదు! భూమిపై , సాగిలపడి, నీ జగన్మోహన సు దివ్య త్రిభంగి రూప లావణ్య సుందర విగ్రహ మూర్తి ముందు, సాష్టాంగ ప్రణామాలు త్రికరణ శుద్ధి తో నిత్యం సమర్పించడం లేదు,!, నిత్యం  చేసే ప్రతీ పనికి ముందు ,వెనుక,, నీ అనుగ్రహం కోసం ప్రార్థించడం లేదు! తప్పని సరిగా రోజూ చేసే, భోజనం నీ ప్రసాదంగా గ్రహించడం లేదు ,, కృష్ణా! నీవు, అంతర్యామి గా మాలో సంచరిస్తూ, మా జీవనచర్యల కు కారకుడవ నీ తెలిసి కూడా ,,"" కృష్ణా! నీకు ఈ ఆహారం అర్పణ చేస్తూ మనసులో కూడా "నివేదన " చేయకుండా  జంతువుల వలె" ఆబగా"గుడ్డెద్దు చేనులో బడి మేస్తు"న్నట్టుగా గ్రహిస్తూన్నా ము,, ప్రభూ,! ఇదీ మా చంచల, చాపల్యం చిత్త వృత్తి, చిత్తశుద్ది లేని ,, అత్మవిచారం కరువైన దయనీయ మైన బ్రతుకు! జగన్నాటక సూత్రధారి,! హే వేంకటాచల పతే,,! రోజులో ఒక్కసారైనా నీ తలపే రాదు!, ఇక" కోతి" లాంటి మనసు,, నీ అనుగ్రహానికి ప్రాకులాడేది ఎప్పుడు, కరుణానిధి ??! అందుకే నన్ను నేను తెలుసుకోలేను!, నే ను ఏమిటో? ఎవ్వరో,? నా జన్మ కు అర్థం, పరమార్థం ఏమిటో?, నాకు తెలియదు,! తెలుసుకునే పరిజ్ఞానం, సజ్జన సాంగత్యం కూడా లేదు,! జగన్నాథ,,! మురళీ మనోహ రా !, పురాణ పురుషా! నీ లీలలు అద్భుతం,! కాని, నా బ్రతుకు అగమ్య గోచరం,! వేదాలచే కూడా తెలియ బడని సర్వాంతర్యామివి నీవు,!!, అందుచేత, పరమాత్మా, !పరందామా,! దీన జన బాందవా!, అనాథ రక్షక, ఆపద్బాంధవా,,! శరణాగత వత్సలా,! దీన శరణ్యా, !నాకై నేను ఏమీ చేసుకోలేని అనాథ ను నేను! యదార్థ జ్ఞానం కాకుండా పదార్థ జ్ఞానం తో, సంచరించే అమాయక ప్రాణిని నేను,ఆపద్భాందవుడు, అనాథ రక్షకుడు, అర్థ శరణ్యుడు వి నీవని,, నీవే నిజంగా నా మేలుకోరే నిజమైన "అత్మ బంధువు" అని తెలుసుకోలేని అవివేకిని;, గరుడగమనా!, నేను !! , నీ అపురూప, అద్వితీయ ,అపార కృప అమృత ధారలను ,, నీ అనుగ్రహంగా అందుకోలేని దౌర్భాగ్య దుస్తితి నాది,,! దయానిధి! కృష్ణా! నన్ను ఉద్ధరిం చి బ్రోచే భారం, బాధ్యత నీదే,! కృపతో ,నీపై బుద్దిని,మాకు ఇమ్ము కరునన్, నీరేజ పత్రెక్షణా!,, కృష్ణా,! గోపాలకృష్ణ,, !రాధాకృష్ణా,! మురళీ కృష్ణా, !నీ నామం, రూపం భావం, మధురం!, నీ తలపే, నీపై వలపే, మధురాతి మధురం,! శ్రీకృష్ణా!, యదు నందనా,!, నీవే శరణు!, నిన్ను పూజించి, స్మరించి ,భజించు, అర్చించు, నీకోసం తపించి, తరించు మహా భాగ్యాన్ని మహా ప్రసాదంగా మాకు అనుగ్రహించు, తిరుమల వాసా ! శ్రీ శ్రీనివాసా ! శ్రీ వేంకటేశా !, మా పాపాలను అపరాధాలను క్షమించి,, దయతో రక్షించు, తండ్రీ ! నారాయణా,! పరమేశ్వరా, విశ్వ మూర్తి,! విశ్వంభర,! విశ్వేశ్వర,,! లీలామానుష వేష ధారి,! మురారీ,! పాహిమాం,! శ్రీకృష్ణా, !రక్షమాం, గీతాచార్యు డా,! శరణు! శరణు! శరణు! హరే కృష్ణ హరే కృష్ణ, క్రిష్ణ కృష్ణా హరే హరే ! హరే రామ హరే రామ, రామ రామ, హరే హరే !! " స్వస్తి!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...