"శ్రీమద్భాగవతం " దశమ స్కంధం లో రాధాదేవి ప్రసక్తి లేదు., ! ఎందుకో దక్షణ భారతంలో రాధ ఆరాధన,,, రాధ పేరు అనడం గానీ, వినడం గానీ బహు తక్కువ ,! కాని ఉత్తర భారతం లో విశేషంగా భజనలు, పురాణ శ్రవణం లో నృత్యాలు, గంటల కొలది చేస్తూ, వందల మంది పరవశించడం టీవీ లో, ఆస్తా, సంస్కార ఛానెల్ లో చూస్తున్నాం,!బృందావనంలో , మధురలో రాధే, రాధే ,అంటూ ఒకరినొకరు పలకరిం చుకోడం చూస్తాం,,!, నిజానికి రాధ అంటే, విడి వడన నిరం తర శ్రీకృష్ణ ప్రేమామృత రస ధార! అదే రాధ ! శుక బ్రహ్మ ,"రాధ" అన్న పేరు వింటే చాలు, తనలో తానే అంతః కరణలో రాధాకృష్ణుల ప్రణయ రాస కేళీ విలాసం లో తాదాత్మ్యం చెంది ఆనందం తో రమిస్తూ బాహ్యాస్మృతిని కోల్పోతా డట,, భాగవతం పరీక్షిత్తు కు చెప్పడం మరచి పోతాడు అట!", అని చెబుతారు,!, రాధను గోలోక పరదేవతా స్త్రీ, శ్రీకృష్ణ పట్టపు రాణి అంటారు..! కృష్ణుని పరిణయం కోసం, బరసాన గ్రామం లో, వృష భానుని కూతురిగా జన్మించింది అనీ,, రాధను చూసేంత వరకు, కృష్ణుడు వేణు నాదం చేయలేదని,, అంటారు,!, పిల్లనగ్రోవి శ్రీకృష్ణుడు అయితే, అందులోకి కృష్ణుని గళం లోంచి ఊదబడే అతని ఉచ్వాస నిశ్వా సాల కదలికలు, రాధాదేవి ప్రాణవాయువు గా సూచిస్తారు, రాధకు కృష్ణుని పై గల అపారమైన ప్రేమాభిమానా లు, ఆమె హృదయ స్పందనలు,, వరుసగా, మురళి లో ప్రవహించి, సుమధురంగా, వినిపించే, నవరస సప్త రాగ మధురిమ లుగా చెబుతారు, !అది రాధామాధవుల అద్వితీయ అద్వైత అపురూప సమ్మేళనం,,! అందుకే రేపల్లె లోని సకల గోప గోపికల చిత్తా లు హరించి, "గోపికాచిత్త చోరుడు !గోపిమానస హృదయ విహారుడు !""అని బిరుదు పొందాడు, రాధా వల్లభుడు, శ్రీకృష్ణుడు.!! అతడు మధురకు వెళ్ళాక,, ఒకసారి, తన చెలికాడు ఉద్దవుని బృందావనానికి పంపిస్తాడు, అందర్నీ ఊర డిించమని ,,! యశోదా నందులు ముద్దులకొడుకు, తమని విడిచి, దూరంగా వెళ్ళిపోయాడు కదా !"అన్న బాధతో పరితపిస్తూ ఉంటారు, నందవ్రజ స్త్రీలు క్రిష్ణ విరహ వేదన ను భరించలేక పోతుంటే , భ్రమర గీతాలతో ఏడుస్తూ ఉంటే ,ఉద్దవు డు వారిని అను నయించే ప్రయత్నం చేస్తాడు,,అలాగే అతడు రాధాదేవి నీ కూడా సముదాయించి " ఓ,, రాధా దేవి ,!, నీకు కృష్ణుని పై ఎంత గాఢమైన ప్రేమ ఉందో నాకు కృష్ణయ్య చెప్పాడు,! అయినా నీవు బెంగపడకు అమ్మా,! అతడు దయాలువు,! త్వరలో వస్తాడు ! నిన్ను చేరుతాడు,, ఊరడిల్లు !""అని అతడు అంటుంటే రాధాదేవి అతడిని చూసి నవ్వుతుంది, "" ఓయీ, ఉద్దవ మహాశయా !నాకు ప్రక్కనే ఉండి, నన్ను తన గాఢ పరిష్వంగం లో బంధించిన నా కృష్ణయ్య నీకు కనపడటం లేదా? ఉద్దవా, !నా నుండి కృష్ణుడు దూరంగా ఉండగల డ నీ అనుకుంటున్నావా నీవు ? ,నాప్రేమాభిమానాల ను తప్పించుకొని కృష్ణుడు నా నుండి వేరుగా ఉండగల డా , ఇటు చూసి చెప్పు !" అంటుంటే ఉద్దవునికి మతి పోయింది, !తాను మహా జ్ఞానిని అనీ, అందుకే కృష్ణుడు తనను అజ్ఞానులు, బేల లు,, అమాయకులు, ప్రేమ అంటే తెలియని గోపికలకు, వారికి జ్ఞానబోధ చేయించడానికి తనను వారి కడకు పంపించాడు కదా!" అని గర్వంగా ఉండేది, ఇప్పుడు అతడి మనో పరిస్తితి అయోమయం!, రాధ నేమో "తన ఒడిలో కృష్ణుడు ఉన్నాడు;" అంటుంది, కాని తనకు ఆ నల్లనయ్య కనపడటం లేదు. కదా! ఏమిటీ విచిత్రం?" అనుకుంటూ ఉండగా నే,ప్రత్యక్షమయ్యాడు గోపాల కృష్ణ భగవానుడు,! రాధమ్మ పరిశ్వంగం లో లీనమై, కళ్ళు మూసుకొని బ్రహ్మానందం పొందుతూ, వేణుగానం చేస్తూ ఉన్న బ్రహ్మాండ నాయకుడు,రాధామనోహరుడు , శ్రీకృష్ణుడు, ఉద్దవుడి కళ్ళకు గోచరిం చాడు,! విష్ణు మాయ తొలగింది,,! అజ్ఞానం వీడింది ! యదార్థం తెలిసింది, ! ఈ గోపికల అపార భక్తి శ్రద్ధల ముందు, తనకున్నది "మిడి మిడి జ్ఞానం !"అని గ్రహించి, వారికి పదే పదే సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, బృందావన సీమలోని మట్టి రేణువులను శిరస్సు పై చల్లుతూ, తన అంతరంగంలో రాధాకృష్ణుల అపురూప అద్వైత ఆదర్శ ప్రేమికుల సుందర రూపాలను నిక్షెపించి, తాదాత్మ్యం పొందుతూ,, అక్కడి నుండి నిష్క్రమిస్తాడు ఉద్దవ మహాశయుడు ,! ఇప్పుడు అతడు కృష్ణుని కి మాత్రమే భక్తుడు కాడు, రాధాకృష్ణులు ఇద్దరికీ భక్తుడే ! రాధ యే మాధవుడు,,! మాధవు డే రాధ!" ఇంతకూ , రాధకు కృష్ణుని పై గలప్రేమ గొప్పదా?,, లేక, కృష్ణునికి రాధపై గల ప్రేమ ఘనమా ?" అంటే , రెండూ కాదు ! అనగా,వారు ఇద్దరు కాదు, ఒకరే ,! వారిని విడిగా చూడాలని అనుకోడం అవివేకం! , అజ్ఞానం కూడా ! పైగా, కృష్ణయ్య కరుణా కటాక్షాలు, రాధాదేవి అనుగ్రహం లేనిదే లభ్యం కావు, కూడా! అందుకే, బృందావనం వెళ్ళాలన్నా, శ్రీకృష్ణ దర్శన భాగ్యం, క్రిష్ణ భక్తి,కృష్ణానుగ్రహం , కలగాలన్నా ముందుగా ,రాధాదేవి పాదాలను ఆశ్రయించాలి,! రాధమ్మ ను శరణు వేడుకోవాలి!", తల్లీ ! రాధాదేవి ,,!నీకు పుణ్యం ఉంటుంది ! ఒక్కసారి నీ స్వామిని, శ్రీకృష్ణ చంద్రుని దర్శించుకు నీ తరించే మహా భాగ్యాన్ని అందించవా !!""అంటూ ఆర్తితో, అర్ద్రత తో,,, శ్రీకృష్ణ భక్తి చైతన్య ఉద్వేగంతో శ్రీకృష్ణుని ప్రియసఖిని,, క్రిష్ణ హృదయ అంతరంగిని అయిన రాధాదేవి కృప కోసం వేడుకోవాలి,! అప్పుడే తన వల్లభుని దర్శన భాగ్యాన్ని , శ్రీకృష్ణ భక్తులకు అనుగ్రహిస్తుంది,,! ముఖ్యంగా ,బృందావనం, మధుర లో "హోలీ, అంటే వసంతోత్సవం పండుగ,!"ఆ ఏడు రోజులు చూడాలి! అద్భుతం, ఆ రాసలీల ఉత్సవం,, ఆ అనురాగ దంపతుల అపార కరుణా కటాక్షాల తో జరిపే ఆనంద డోలికల్లో, రంగు రంగుల జల్లులో, వెల్లివిరిసే వేల మంది భక్తుల ఆనంద ఉత్సాహా లు,, ఉత్సవాలు,, ఉవ్వెత్తున ఎగసిన భక్తి తరంగాలు, ఒక్కసారైనా ఈ జన్మలో చూసి తీరాలి! ఎన్ని యాత్రలు చేసి నా కూడా, బృందావన దర్శన భాగ్యం తో మాత్రమే సుసంపన్నం అవుతుంది,! ఇది సకల జనుల మనోరథ ము అభిమతం కావాలి, ఇది సిద్దించాలని మనసారా కోరుకోవాలి !! "హరే కృష్ణ !"అంటే," రాధా కృష్ణ,!", అనగా "హరే "అంటే రాధాదేవి కి ఉన్న 12 పేర్లలో ఒకటి హరి !హరే అన్నది ఆర్ద్రత తో కూడిన పిలుపు! ఇస్కా న్ ఉద్యమ శ్రీ కృష్ణ భక్తు లు, నిరంతరం గానం చేసే కలియుగ తారక మంత్రం, "హరే క్రిష్ణ హరే క్రిష్ణ, క్రిష్ణ క్రిష్ణ హరే హరే,,! హరే రామ హరే రామ, రామ రామ హరే హరే ! "అనబడే అద్భుతమైన మంత్ర రాజమును నిరంతరం మనం కూడా జపిస్తూ,,, సచ్చిదానంద నిర్గుణ నిరాకార ఘన స్వరూపుడైన శ్రీకృష్ణుని , అతడి ప్రాణమైన రాధాదేవి కృపకు పాత్రులం అవుదాం !రాధాకృష్ణుల భక్తి చైతన్య ఉద్యమాన్ని ఉధృతం చేద్దా ము,! గతజన్మ పాపాలను, కర్మ ఫలాలను క్షాళన చేసుకుందాం, ఆనందంగా, ప్రశాంతంగా, శ్రీకృష్ణ భక్తి చైతన్యం తో మానవజన్మ పావనం చేసుకుందాం,! హే రాదే, హే శ్రీకృష్ణా, మా కు మిమ్మల్ని భజించ, సేవించి, తరించే, స్ఫూర్తిని, శక్తిని మహా ప్రసాదంగా అనుగ్రహించు !" జై శ్రీ రాధే,! జై శ్రీకృష్ణ,,! జై శ్రీ రాధే కృష్ణా ! రాధా మయ్యా కీ జై , బృందావన్ లాల్ కీ జై !! స్వస్తి !!"
Thursday, May 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment