Thursday, May 9, 2019

విష్ణుమాయ

May 9,2019
దినకరుని ఉదయ అస్తమయ, పర్యటనలో, జగతిలో, అనుక్షణం మార్పులు, చేర్పులు, తీసివేతలు,, మారుతున్న ప్రకృతి సౌందర్యం తో బాటు,,దినచక్రం, పగలు రాత్రులు, మాసాలు, సంవత్సరాలు, ఒక క్రమ పద్దతిలో  మారుతూ నే ఉన్నాయి,,, ప్రాణుల జననం మరణం, అనవర తం  జరుగు తూ ఉన్నాయి. అలాగే, ప్రాణులలో,, తల్లీ దండ్రులు,భార్యా భర్త, బందువులు, ఇవన్నీ అనుకోని విధంగా సంక్రమి స్తున్నాయి, ఇప్పుడు చూసిన మనిషి మరో నిముషంలో ఉండటం లేదు. గతం ఎలాగో, భవిష్యత్తు కూడా చేతిలో లేనిది. ఏ సంతోషం, సౌఖ్యం అయినా వర్తమానం లోనే అనుభవించాలి,, ఈ ఊరిలో, ఈ నగరంలో పుట్టాలని కోరుకోని ఎవరూ జన్మ ఎత్తలేదు. అలాగే, ప్రవహించే నదిలో కలుసుకునే కట్టెల వలె, ఎవరు ఎంతకాలం,దగ్గర అవుతారో, తెలీదు,! పుట్టిన ప్రతిదీ, చెట్టైన, పుట్టైన, చావడం ఖాయం, ! తిరిగి వెళ్ళేటపుడు, పిరికెడు మట్టిని తీసుకెళ్ళ ము ,అని తెలిసీ కూడా, మనిషి ఇంతగా రాగద్వేషాలు ఎందుకు పెంచుకుంటా డో, కదా! ఏ విష్ణుమాయ, ఈ సత్యాన్ని మరిపిస్తుందో అర్థం కాదు!". నాకంటే పెద్ద వారు, పిల్లలు, బందువులు అందరూ పోతారు ,,కాని నేను మాత్రం ఉంటాను,!" అనే బ్రతుకు పై దురాశ, చావదు, కష్టాలు, బాధలు, బరువులు, ఎన్నైనా ఎత్తడం చేస్తాడు కానీ, తన అదుపు, ఆజ్ఞ, జ్ఞానం, సత్తా తెలివి ముందు,, విది విధానాలను, జరిగే విపరీత పరిణామాల ను, ప్రకృతి వైపరీత్యాలను అపలే డు,Heart attack,cancer,accidents,, అనాధ ఆశ్రమాలు, నరకాన్ని తలపించే రోగాల తో నిండిన హాస్పిట ల్స్, ఇలా ఎన్నో హృదయ విదారక ఘట్టాలు సినిమా, టీవీ, నిజజీవితం లో చూస్తూ కూడా, ఆత్మజ్ఞానం, కలగడం లేదు, ప్రవర్తనలో పరివర్తన రావడం అసలే లేదు, అదీ, తనదాక వస్తె తప్ప,!!,, ఏది మన చేతిలో లేదు, అనడమే కానీ, ఆ "ఏది" అనబడే మూలాన్ని గుర్తిం చే ప్రయత్నం చేయడం లేదు, అందుకే ఇన్ని కోపాలు ,తాపాలు, ఈర్ష్యా,, పగ,! ఇదంతా ఎందుకో, దీనికి మొదలు తుది, ఎవరికి తెలియదు, కాని, మనకు అర్థం కానిది ఏదో ఉంది, ! అది ఇందర్ని ఆడిస్తోంది, !ఏడిపి స్తూ ఉంది. !ఎగిరిస్తు, కింద పడేస్తూ, నాటకాలు ఆడిస్తోంది,!, అది దేవుడో దెయ్యమో, మనకు తెలియదు ..కాని దాని చేతిలో మనం కీలు బొమ్మల ము,, అని మాత్రం తెలుసు .. ఇన్ని తెలిసి కూడా తప్పులు చేస్తూ పోతూ ఉండడం, మనిషి చిత్రమైన అర్థం కానీ, విపరీత తత్వం, జంతువును అర్థం చేసుకోవచ్చు కానీ,, మనిషి తత్వం ఆ దేవుడికైనా అంచనా వేయలే డెమో. రోజుకు ఎన్నో మార్పులు ఈ శరీరం లో,!, పెరుగుదల, తరుగుదల, చావు పుట్టుకలు, దేనిని ఆపలేం,! కాలం ఆగదు,! పనులు చేయడం ఆగదు,! కర్మ ఫలితాలు ఆగవు, ఏది కూడా ఆగవు,,! తిండి నిద్ర,, భోగం, దుఖం, సుఖం, అన్నీ ఉన్నాయి అనుకుంటే ఉంటాయి,! లేదు అంటే లేదు. !కళ్ళు మూసుకుంటే అంతా శూన్యం!, నిద్ర పడితే, అంతా మిథ్య,,! దేహం లోని అవయవాలు, నరాలు, రక్త నాళాలు ఎముకలు, కండరాలు ఎన్నో, అసంఖ్యాకంగా మనలో ఉన్నాయి, అవన్నీ సక్రమంగా ఒక్క బోల్ట్, స్క్రూ, పట్టి లు లేకుండా, ఎవరూ గట్టిగా బిగించే పని లేకుండా, జారిపోకుండా, ప్రక్కకి జరగకుండా, గట్టిగా పట్టుకొని ఉన్నదెవరు,? నడిచినా పరుగెత్తిన, తలక్రిందులు చేస్తూ ఉన్నా అవయవాలు స్థాన మార్పు చెందవు. కదా!  గుండె పనిచేయడం, ఊపిరి తీయడం, రక్త ప్రసరణ, కిడ్నీ లు, ఇలా వాటి పని అవే చేస్తూ పోవడం విచిత్రం,! తిన్న ఆహారం జీర్ణం కావడం, మల మూత్ర ములు, వెళ్లిపోవడం, ఇంద్రియాలు బలవత్తర ప్రభావం తో, బుద్దిి చేడు దారి పట్టుతూ ఉండటం, బొమ్మల్లా చూస్తూ, తప్పు అని తెలిసినా ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉండడం శోచనీయం,! ఇదంతా మనకు తెలీకుండా, మనలో ఉంటూ, మనకోసం శ్రమించే అంతర్యామి కి ఎన్నిసార్లు కృతజ్ఞత లు సమర్పించిన కూడా సరిపోదు కదా. ! ముఖ్యంగా ,, నేటి ఆధునీకరణ వ్యామోహంలో, మనచేత దుర్వినియోగం చేయబడే ఫోన్లు, టీవీ లు, కంప్యూటర్ ల ధర్మమా అని "బంధాలు" దూరమవుతూ ఉన్నాయి, అనుబంధాలు, అనురాగాలు, మాటల్లోనే కనిపిస్తూ, పిల్లలను తలిదండ్రలకు దూరం చేస్తూ, వారిని అనాధ ఆశ్రమాల పాలు చేస్తూ  ఉన్నాయి, చదువూ ఉద్యోగం, వ్యాపారం, విదేశీ యానం పేరు తో మానవతా విలువలు అడుగంటి పోతున్నాయి, "మమ్మీ ,డాడీ "ల విదేశీ సంస్కృతి, ఆంగ్ల భాషావ్యామోహం తో, సనాతన ధర్మాన్ని, ఆచారము సంప్రదాయము , పురాణ వాంగ్మయం, భగవద్గీత లాంటి సద్గ్రందాలను చదవడం లాంటి సదాచారాన్ని , వాని విలువలను,పాటించడం లేదు,, నేటి విద్యార్థులు, యువతరం, ఫోన్, లకు బానిసలై, కన్నవారికి, ఉన్న ఇంటిలోనే పరాయి వారవు తున్నారు,,, అలా వ్యక్తిత్వం లేకుండా యాంత్రిక జీవనం గడప కుండా, మనిషి తనలో నిద్రాణంగా ఉన్న దైవిక శక్తిని జాగృతం చేయాలి. !, భౌతిక ప్రపంచం లో, వ్యాయామం, యోగా, కరాటే, జిమ్నాస్టిక్స్, లాంటి అద్భుతమైన విన్యాసాలకు తన శక్తినీ బయటకు బహిర్గతం చేస్తూ ధార పోస్తున్నాడు,, అదే శక్తిని అంతరంగం లో అన్వేషించి చూస్తే,అసాధారణమైన ప్రజ్ఞా పాటవాలు లభిస్తాయి కదా, ! ఇదే శక్తి నీ అత్మ పరిశీలన కు ఉపయోగిస్తే, మనిషి సంకల్ప బలం తో, సాధనా పటిమ తో, తాను పరిమితి గల దేహాన్ని విడిచి, అపరిమిత ము, అద్వితీయం, అపురూపం అయిన దైవిక శక్తితో, అత్మ బలం తో, జ్ఞాననేత్రం లాంటి మూడవ కన్నుతో ప్రపంచాన్ని మరో కోణంలో చూస్తాడు. !దేహాన్ని ఆయుధంగా మార్చి కరాటే లాంటి అద్భుతమైన యోగ ప్రక్రియ ద్వారా, శక్తిని కేంద్రీకరించ డం ద్వారా ప్రదర్శించి విధంగానే,, అంతరంగంలో ఆత్మలో మనసుని బుద్దిని నిలిపి ధ్యాన యోగం తో, ఆధ్యాత్మిక జ్ఞానంతో, మానవాతీత శక్తుల ను,సాధించవచ్చును .. స్వామి వివకానందుని వలె, రమణ మహర్షి వలె, రామకృష్ణ పరమహంస వలె, షిర్డీ సాయిబాబా వలె, పుట్టపర్తి సత్యసాయి వలె ప్రకాశవంతం, జ్ఞానవంతము, ప్రతిభా మహిమా వంతము, అయిన దివ్యమైన శక్తులను సాధించి, దానిని మానవ, సేవ కోసమే కాకుండా మాధవ సేవగా వినియోగించ వచ్చును.! వేదకాలం లో మహర్షులు, సిద్దులు, యోగులు, అలాంటి యోగ సాధన తోనే దివ్యజ్ఞాన ము పొందారు, ఎక్కడ ఏం జరిగేది ఆ సిద్దితో గ్రహించారు, ఎక్కడికైనా తమ ఆత్మబలం తో, నేటి అఘోరా ల వలె వాయువేగ, మనోవే గంతో వెళ్లగలిగారు, గాంధీ జీ లాంటి మహాత్ములు, భక్త పోతన లాంటి మహా కవులు, త్యాగరాజు లాంటి సంగీత కారులు, సుబ్బులక్ష్మి లాంటి గాయకులు, అన్నమయ్య లాంటి సంకీర్తనా చార్యులు, మీరాబాయి లాంటి అపర శ్రీకృష్ణుని భక్తురాలు,, ఇంకా ఎందరో మహానుభావులు ,, తమ అంతర్మథనం ద్వారా సిద్ధులను పొందారు.  రాముడు, కృష్ణుడు లాంటి అవతార మూర్తుల చరణ కమలాల స్పర్శతో పునీతమైన,, గంగ కృష్ణా, యమునా, గోదావరి లాంటి స్వా దు జలాల ప్రవాహంతో" సుజలాం, సుఫలాం "అంటూ ఆసేతు సీతాచ లం సస్యశ్యామలం చేస్తూ, కమ్మని తీయని త్రాగు నీటిని అందిస్తూ ప్రవహిస్తూ ఉన్న, మన పరమ పవిత్రమైన, పుణ్యభూమి, భారతావని లోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉండడం, మనం భారతీయులుగా గర్వింప దగిన విషయం,,! ప్రాణులలో  అంతర్యామిగా మన శరీరంలో సాక్షిగా  ఉంటూ, జీవితంలో మానసికంగా శారీరికంగా ఆనందంగా అన్నీ అనుభవించడానికి కావల్సిన శక్తి నీ, చైతన్యాన్ని మనకు అనుగ్రహి స్తున్న ఆ పరమాత్ముని, ఈ జీవాత్మ తో అనుసంధానం చేస్తూ, ప్రాపంచిక ప్రయోజనాలతో బాటు, పారమార్థిక భావ సంపదను సముపార్జించి , సంసార సాగరం లో ఎదురయ్యే కష్ట సుఖాలు, లాభ నస్టాలు, జనన మరణాలు వంటి ఈతి బాధలకు అతీతంగా ఎదుగు దామ్,,!, భగవద్ భక్తిని, దైవం పై విశ్వాసాన్ని పెంచుకుందాం,! మౌనంగా, తదేక ధ్యాన చిత్తం తో, శక్తిని అంతా కూడగట్టుకొని, ఆత్మలో పరమాత్ముని దర్శించే ప్రయత్నం చేద్దాం,,! మారుతున్న సమాజం, సంస్కృతి, నాగరికత లోని,దుష్పరిణామాల ను కేవలం మన ఆత్మబలం తో, మనోనిబ్బరం,, దైవం పై అచంచమైన నమ్మకం తోనే సరిచేయ వచ్చును,,!" కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు, మహా పురుషులు ఔతారు,!" అన్న మాట సత్యం.! మనిషి,మహోన్నతమైన వ్యక్తిత్వంతో ఎదగాలంటే యోగాధ్యయనం అవసరం, !జీవుడు బుద్ధితో ఆత్మలో లీనమై అంతర్యామినీ దర్శించే భాగ్యం కలగాలంటే, అంతః కరణ శుద్ది, ఆత్మశుద్ధి,, చిత్తశుద్ది  అవసరం ! దానికి తోడు దైవకృప, గురు కటాక్షం లభించాలి..! అప్పుడు మాత్రమే, పరమాత్మ వైభవం అనుభవం లోకి వస్తుంది,! మనిషి నిజమైన శక్తి శాలి అవుతాడు,, అనుకున్నది సాధిస్తాడు కూడా. ! కావున, అందరం భగవద్గీత ను చదువుదాం, , సాక్షాత్తు శ్రీకృష్ణ భగవనుడే స్వయంగా తానే మానవాళి ఉద్దరణ కోసం అందించిన పరమ యోగ సాధన సంపత్తి నీ గ్రహిం చుదాం. ! భక్తి ధ్యాన, యోగా ద్యాయాలు, ఆత్మానుభూతి పొందుతూ ఆకళింపు చేసుకుందాం,,! దేహ భ్రాంతిని వదలు దాం.! దేవుడిచ్చిన ఈ మనిషి జన్మ ఎంత మహిమాన్విత వరమో,తెలుసుకుందాం !, మూడవ నేత్రంతో, పరమాత్మ వైభవాన్ని, ఆత్మలో దర్శిస్తూ రమిస్తూ,పరమానందాన్ని పొందుదాం,!" అహం బ్రహ్మో స్మి,!" అన్న "తత్వమసి ""జ్ఞాన ప్రకాశంతో జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా, సంతృప్తి కరంగా , సంతోషంగా, సకల జనుల హితంగా, గడుపు దాము,,! "హే పరమేశ్వరా;!, మాకు నీ దర్శన భాగ్యం సద్బుద్ధి నీ, సన్మార్గాన్ని, సత్సంగ భాగ్యాన్ని, నీ పై తరగని నిశ్చలమైన బుద్దిని కరుణిం చు తండ్రీ, దయానిధి,,సర్వాంతర్యామి , దేవాది దేవా,, శరణు, స్వామీ, నారాయణా శరణు, జగదీశ్వర, శరణు.  హరే కృష్ణ హరే కృష్ణ ! స్వస్తి!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...