40 ఏళ్లు దాటిన వారి నుండి 90 వరకు , అమెరికా ఇండియా అనకుండా జనాలు, ప్రతిరోజూ వాకింగ్ విధిగా చేస్తూన్నారు!, బైక్, కార్, ఆటో ల ధర్మమా, అని నడక కరువై,, శరీరం బరువై,, అడా మగా , గృహిణులు,, రిటైర్మెంట్ తీసుకున్నవారు , పెద్ద వారు,, రోగస్తులు, పిల్లా పెద్దా, వీరు ,వారు అనకుండా, డాక్టర్ సలహా మేరకు, వాకింగ్ షూస్ తో రోడ్లు,, గ్రౌండ్లు, బజార్లు,, బీచ్ లలో, డామ్ లు, ఇలా ఎక్కడ వీలైతే అక్కడ, ఒంటరిగా, గ్రూపు లుగా ఉరుకులు, పరుగులతో , ప్రత్యక్ష మౌతుంటారు, ప్రతీ రోజూ ఉదయం...!!!! తిరిగి ఆఫీస్, College,, వ్యాపారం, ఇంటి పనీ కోసం ,8 లోగా ముగిస్తూ, ఇల్లు చేరాలి, తప్పదు,! ఇలా ఈ వాకింగ్ తప్పనిసరి గా ,నేటి ఆధునిక మానవునికి దినచర్య గా మారింది,! ఉపవాసం ఉన్నా, రోజుకు ఒక పూట, తింటున్నా, సెలవైనా, పండుగ అయినా, పని దినం అయినా ఈ వాకింగ్ అనేది ఎవరికైనా తప్పడం లేదు,!, మంచిదే!, రక్త ప్రసరణ కోసం, కండరాలు గట్టి పడటం కోసం, వేప లాంటి చెట్ల నుండి వెలువడే ఆక్సీజన్, ప్రాణవాయువు పీల్చు కోడానికి, నలుగురి నీ కలవడానికి ఇలా ఎన్నో లాభాలు ఉంటున్నాయి,,! దానితో బాటు మనసు కు ప్రశాంతత అనందం కూడా లభిస్తూ ఉంటాయి,,! కారణం పల్లెల్లో ఉండే వారు పట్నాల పాలయారు,, కల్తీ తిండి,, పరిశుద్ద వాతావరణం లేక, చెట్లు తక్కువై, జనావాసాలు ఎక్కువై,, సహజమైన ప్రకృతి సంపద కరువై,, కృత్రిమ ఆహార అలవాట్ల తో, పొందిన అనారోగ్యం తో, ఈ మార్నింగ్ వాకింగ్ శరణ్యం అయ్యింది,దేవాలయానికి పోనివారు ఉంటారేమో, కాని, హాస్పిటల్ కు, మార్నింగ్ వాక్ కు పొనివారు ఉండరు కదా! గ్రామాల్లో ఉండగా లభించే నిర్మలమైన చెట్ల, గాలి, పొలాల్లో, ఇంటిలో పనీ, వల్ల లభించే ఆరోగ్యం,, వ్యాయామం ఇప్పుడు కరువై, జీవనం బరువై,, మార్నింగ్ వాకింగ్ దిక్కై పోయింది,, ! ఆధునికనాగరికత లో మార్పు,, వల్ల, ఉపాధి కోసం, పల్లెలు విడవడం వల్ల, పెరుగుతున్న జనాభా వల్ల, తరుగుతున్న ఉద్యోగ అవకాశాల వల్ల ఇలా పెను మార్పు వచ్చింది,,వాస్తవమే! కానీ, మనసు హాయిగా, ఉల్లాసంగా, హుషారుగా ఉండాలంటే, వాతావరణం, పరిసరాలు, పచ్చని చెట్లు, పూలు, తోటలు,, స్వచ్చమైన నీటి కొలనులు ఉండాలి. ఇలాంటివి మనిషికి కావాల్సిన ఆహ్లాదకరమైన , ఆరోగ్యకరమైన , మనః స్థితిని కలిగిస్తాయి.! ఏదో యాంత్రికంగా కాకుండా, సహజంగా మానసిక అనుభూతిని పొందు తుండాలి,! సూర్యోదయానికి ముందు పచారు కు వెళ్తే, చుట్టూ ఉన్న ఎత్తైన చెట్ల నుండి చల్లని పిల్లగాలు లు, శరీరాన్ని హాయిగా,మెల్లగా తాకుతుంటాయి.,! ఇరుప్రక్క లా చెట్లకొమ్మల లో నుండి , తల్లి తనఒడి లోనున్న బిడ్డను జోలపాటలు పాడుతూ, నునుపైన చేతుల్లో ఉయ్యాలలో ఊగిస్తూ అడిస్తున్నట్టు గా ఆకు పచ్చని లేత లేత తమలపాకు లాంటి అందమైన నునుపైన లాలిత్య లావణ్య అందాల ఆకులను , పూవులను, లేలేత మొగ్గలను, రంగురంగుల లో చూస్తుంటే, వానిని అలవోకగా తాకుతుంటే పరమాత్ముని అద్భుత రచన చిత్రకళా నైపుణ్య చతురత వైభవాన్ని మనసారా ఆస్వాదిస్తూ ఉంటే,, హృదయంలో అనిర్వచనీయ మైన బ్రహ్మానందాన్ని, ప్రాతః కాల వాకింగ్ సమయంలో ప్రతీ ఒక్కరూ అనుభవించ వచ్చును,,! చూసే కళ్ళు, తపించే మనసు, ఆనందించే సమయము, ఓపిక, కళాపోషణ మనకు ఉండాలి గానీ, ఉదయం చేస్తున్న వాకింగ్ , తో దైవాన్ని పరమాత్మ వైభవాన్ని ,అద్భుతంగా అక్కడి పరిసరాలలో దర్శించ వచ్చును, నిజానికి ఆధ్యాత్మిక చింతనకు, దైవ ఆరాధన కోసం మనం, దైవసన్నిధిలో ఉండాలి,! ఇప్పుడు అదే ఇది ! అంటే ఇదే దేవాలయ ప్రాంగణం అనుకోవాలి, ఏదైనా మన భావన లో ఉంటుంది పెన్నిధి ! ఈ అందమైన ప్రకృతి నిలయం. ఈ శరీరం, ఈ మనసు,, ఈ అవకాశం, పరిసరాల ప్రభావాలకు స్పందించే క్షోభ్యత,,, తదనుగుణంగా ఆనందించే హృదయం జ్ఞానం, దానిని వెలిబుచ్చి ఇతరులతో పంచుకునే ప్రతిభ, ఇదంతా దైవానుగ్రహం ! వాని అస్వాధన, కేవలం మనిషికి మాత్రమే సాధ్యం ,! మిగతా ప్రాణులకు వీలు కాదు కదా ; అందుకు మనకు ఈ వరాన్ని ప్రసాదించిన పరంధామునికి కృతజ్ఞతలు అందజేయాలి కదా !,ఈ అభిరుచి, అనుభూతి, అనుభవం , మనిషికి మాత్రమే సాధ్యం!. పూర్వ కాలంలో బ్రాహ్మీ ముహూర్తం లో లేచి దైవారాధన,, పూజ, ధ్యానం, సద్గ్రందపఠనం , వ్యాయామం, యోగా, ఇత్యాదులు చేసేవారు,, మన పెద్దలు.! . నిజానికి విద్యార్థులకు , యోగాభ్యాసం కోసం,, ధ్యానం కొరకు,, దైవ ప్రార్థన, పూజ, సంధ్యావందనం మొదలగు ఆధ్యాత్మిక చింతన, సాధన కొరకు అతి ఉత్తమము, ఆరోగ్య శ్రేయోదాయకం,, భక్తి ముక్తి తత్వ సాధనకై దైవం అనుగ్రహించిన అమృత ఘడియలు, ఉషోదయానికి పూర్వ ఘడియలు, అవి ;! రైతులు తెల్లవారుజామునే లేచి చేనులు, పొలాల పనులపై , వెళ్ళడం , గేదె, అవు పాలు పితకడం, వారికి వ్యవసాయ పనుల తో దినచర్య మొదలవడం ఇదే ప్రాతః కాల సమయం చక్కగా ఉపయోగ పడుతుంది.. ఉదయం 5 గంటల ముందే మేల్కొనే వారు ఉత్తములు, ఏకాగ్రత, జ్ఞానార్జన, కు అర్హులు. ,5 తర్వాత లేచిన వారు మద్యములు, ఆరోగ్యము, ప్రశాంతత వారికి లభిస్తాయి,,6 అయ్యాక లేచేవారు మామూలు స్థాయి వారు, హుషారుగా, చురుకుగా ఆ రోజు పనులు చేస్తారు ! ఉదయం నడకకు యోగ్యమైన,అనుకూలమైన వాతావరణం ఉదయం 5 గంటలకు లభ్య మౌతుంది. ! కుటుంబ సభ్యులతో కలిసి చేస్తే, ఇంకా మంచిది ! ఇలాంటి సదాచారం మనం మాత్రమే కాకుండా, సామూహికంగా నిర్వహిస్తే, ఫలితాలు అద్భుతం, అందరితో కలిసి పంచుకోవడం వల్ల పెంచుకునేది ఈ .అపురూప అనుబంధం! అందరితో కలిసి ఉదయాత్పుర్వమే మేల్కొని వాకింగ్ వెళ్ళడం, స్నేహబంధం తో మానవతా విలువలు పెంపొందించు కోవడం,నిజంగా ఒక వరం! అదృష్టం! మహా భాగ్యం కూడా! అందరితో కలిసి ముందుకు అడుగు వెయ్యాలి ,,! ఇదే విజయానికి మొదటి సోపానం;!: ఇలాంటి పాజిటివ్ ప్రభావాలు అనుభవైక వెద్యం, ఆచరణీయం, అనుసరణీయం కూడా! మన సనాతన ధర్మం ప్రకారం, సూర్యోదయం అయ్యేలో గా , చేరువ లోని నదీ స్నానం, అర్చన లు ముగిం చి, ,ఆలయానికి వెళుతూ, క్షణ కాలం కూడా వృధా చేయకుండా, దేవతార్చన ముగించి, దైవారాధన కోసం, వినియోగించే వారు,! తదుపరి గృహ వ్యవహార,కార్యక్రమాల తో రోజు వారీ దినచర్యలో నిమగ్నం అయ్యేవారు. ! అందుచేత మనం కూడా ఈ మార్నింగ్ వాక్ నీ ,, దైవ ద్యానం తో, మానసిక ప్రశాంతత కోసం, శారీరిక బలం కోసం, మనస్సును ఏకాగ్రత తో ధ్యానం లో లీనం చేస్తూ,, మనలో నిద్రాణమై ఉన్న దైవిక శక్తులను జాగృతం చేసేందుకు ఉపయోగించాలి,! ఇది ఒక నిరంతర సాధనా ప్రక్రియ,! పాత కాలంలో, ఇలా క్రమం తప్పకుండా, చక్కగా కోడి కూ తకు ముందే, గోరు చుక్క పొడవక ముందే, లేస్తూ ,సమయ పాలన చేసేవారు, మన కర్మ భూమి యందు పుట్టిన ఎందరో ;మహాత్ములు, యోగులు, ఋషులు, మునులు, పండితులు,,! రోజూ వాకింగ్ కోసం మనం ,నడిచే దారిలో గుంటలు,, చెత్త చెదారం, రాళ్ళు రప్పలు, లేకుండా,, ఎగుడు దిగుడు గా ఉండకుండా చూసుకోవాలి,,, ! కంటిచూపు ను భూమికి సమాంతరంగా ప్రసరింప జేయాలి,, నడుంవంగి పోకుండా ,నిటారుగా రెండు చేతులూ చాపి ఊపుతూ, గుండె నిండా ఊపిరి పీలుస్తూ, హుందాగా, స్వేచ్చగా నడవాలి,,! నేలపై చెప్పులు లేకుండా నడవటం ఉత్తమం;! హనుమాన్, అయ్యప్ప, భవానీ దీక్షల వలె అదొక దీక్ష ! ఎన్నో ప్రయోజనాలు !, రక్ష కూడా ! కాళ్ళకు "షూ "లు వేసుకుంటే నడక కాస్తా సులభం అవుతోంది,! మనసూ, ధ్యానం, మన ఉష్వాస నిశ్వాసా లపై కేంద్రీకరిస్తూ ఉండాలి,! ఈ దివ్యమైన, దేవతా ఘడియల్లో, నిశ్శబ్దంగా ఉంటూ, ప్రాణాయామం అరగంట పాటు చేయడం అతి ఉత్తమం, అద్భుతం, కూడా!వివేకానందుడు, పరమహంస, భక్తులు ఇలా ఎందరో మొక్షకాముకులు ఇదే బ్రాహ్మీ ముహూర్త కాలాన్ని, తమ జీవన సాఫల్యత కోసం సద్వినియోగం చేసుకున్నారు !, మనో నిగ్రహం, అత్మ సంయమనం,, దైవ సాక్షాత్కారం, లభిస్తాయి ! ఇలా ఈ క్రమశిక్షణా యుత జీవన విధానాన్ని ఆచరణ లో పెట్టడం , దానితో నిత్యదిన చర్యను భగవద్ అర్పణ భావంతో, చిత్తశుద్దితో, ప్రారంభించడం వలననే , వారు గొప్ప జ్ఞాన వంతులు, మేధావులు, శాస్త్రజ్ఞులు, పండితులు, విద్యావేత్తలు,మహానుభావులు అయ్యారు,! అందుకే,,సాధ్యమైనంత మౌనంగా,భగవన్నామ స్మరణ తో, ప్రాతః కాల సమయంలో, చల్లని గా లుల స్పర్శతో ,, ఎలాంటి సమస్యా పూరిత అలోచనలు చేయకుండా, మనసుని సంతోషంగా ఉంచుతూ, హృదయం లో దైవ భావన నింపుతూ, ఒక దేవాలయం లో నెలకొన్న ఆరాధ్య దైవం చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నట్టుగా, భావిస్తూ, ఉరుకులు పరుగులతో కాకుండా, నిదానంగా, ప్రశాంతంగా నడవాలి! ఎవరితో కలిసి వెళ్తామో, వారి వల్ల మన ఏకాగ్రత, ధ్యానం, భావ సంపద,, దైవ భక్తీ, ఇనుమడించాలే కాని, ప్రక్క త్రోవ పట్టించకుండా, సహకరించే మంచి స్నేహితులను మార్నింగ్ వాకింగ్ లో తోడు చేసుకోవాలి,,! అనవసర రాజకీయాలు, ఎవరి మీదనో విమర్శలు, చెత్త జోకులు, చేయకుండా,, స్వచ్చమైన మన మనసును పాడు చేయకుండా, చూసుకోవాలి, !సత్సంగ సభ్యులతో సంచరిస్తూ ఉన్నట్టుగా ఆ ఒకటి లేదా రెండు గంటలు మనం పరమానందం స్థితినీ అనుభవించడానికి మాత్రమే కేటాయించాలి,;! మార్నింగ్ వాక్ అనేది, మన మానసిక శక్తిని, దేహ దారుఢ్యం, అత్మ సంయమనం,, పెంపొందించుకోడానికి మనం అనుదినం చేస్తున్న సాధనాప్రక్రియ అని గుర్తుంచు కోవాలి.! . ఏదో "టైమ్ పాస్ !"అని కాకుండా,, అమూల్యమైన, అపురూపమైన, దైవ సంబంధమైన ,, అద్వితీయ మైన, బ్రహ్మానంద భరిత మైన, ఈ ప్రాతః కాల నడక ప్రయోజనాన్ని , భగవద్ గీత శ్లోకాలు స్మరిస్తూ, లేదా, హరి నామాన్ని మనసులో ఉచ్చరిస్తు,, సంతోషంగా గడపాలి., మన బ్రతుకు నకు దశా దిశా నిర్ణయించేది ఇదే ! దీనితోనే మన జీవిత దృక్పథం , విశాలభావం, దూరదృష్టి , తో జీవనయాత్ర కు శ్రీకారం చుట్ట బడేది.!. చుట్టూరా వినిపించే పక్షుల కిలకిలా రావాలు, ఉషోదయ కిరణాలతో జగత్తును తేజోవంతం చేస్తూ, ఉదయిస్తు, సకల ప్రాణి కోటికి, ప్రకృతి సోయగాల కు ప్రాణం పోస్తు,, రంగురంగుల వర్ణాలతో, పూవులు ఆకులు చెట్లు,,, చూస్తూ ఆనందించాలి, మనం కూడా ప్రకృతిలో భాగంగా కలిసి పోవాలి కూడా !, జగత్తును, ధరణి పై, పచ్చని పచ్చిక బయల్లను,, నింగిలో అరుణ కిరణాల కాంతుల , రంగుల్లో శోభిల్లే మేఘాలను, భూమాత ఒడిలో,జలజలా పారె నదీ నదాల శక్తి చైతన్య వైభవాలను తన ప్రకాశం తో ప్రభావితం చేస్తూ, మనలో ఆనందాన్ని , మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, ఆహ్లాదాన్ని, తన ప్రసాదంగా అనుగ్రహిస్తు ఉదయిస్తున్న కర్మ సాక్షి ఆ సూర్యభగవానునికి హృదయ పూర్వక సాష్టాంగ ప్రణామాలు భక్తితో సమర్పించు కుంటూ,, నిత్యం ఆదిత్యుని నుండి, అందుకున్న దైవిక శక్తితో, ఆ రోజు దినచర్యను, ఆనందంగా, ప్రారంభించుకోవాలి, అందరం అనుదినం , అనుక్షణం అనవరతం !!! ఇలా ప్రతీ ఉదయం, మనకు దైవం పొడిగించిన ఒక రోజు ఆయువు గా భావిస్తూ, మనలో, ముందు, వెనక, అంతటా నిండి ఉండి, మనల్ని నడిపిస్తున్న ఆ సర్వాంతర్యామికి కృతజ్ఞతాభావం తో, రెండు చేతులూ ఎత్తి నమస్కారము చేద్దాం,! అద్భుతమైన మానవ మేథా సంపత్తిని అనుగ్రహించిన స్వామికి, ఉదయం లేస్తూనే, మనకు వచ్చిన శ్లోకాలు, రామా కృష్ణా, మహేశ్వర, మహాదేవా,, విగ్నేశ్వర, శ్రీ ఆంజనేయ, భగవతి జగన్మాత, ఈశ్వరి,, పాహిమాం, రక్షమాం!" అంటూ అంతః కరణ లో దైవాన్ని నిలుపుకొని, స్మరిస్తూ, భజిస్తు,, కీర్తిస్తూ, పూజిస్తూ, ఆలయ దర్శనం చేస్తూ,, మన ఇష్ట దైవాన్ని సేవిస్తూ, నిత్యం తరించు దాము,, ! హరే కృష్ణ హరే కృష్ణా !""
Tuesday, May 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment