Tuesday, May 7, 2019

కృష్ణార్పణం

May 6, 2019
అలనాడు బృందావనం లో కృష్ణయ్య తన స్నేహితులతో ఆడుతూ పాడుతూ ఉండగా,, ఒకరోజున మధ్యాహ్నం ఎండకు అలసి పోయి గోవులు దూడలు అలమందలతో బాటు , వారంతా చెట్ల క్రింద, నీడలో, విశ్రాంతి కోసం పడుకున్నారు,,, అక్కడికి దగ్గర్లో నే  ,, ఒక మామిడి తోట పండిన పండ్లతో, వారికి కనపడుతోంది ... కమ్మని రసాల పండ్లను చూస్తుంటే, గోపాలురకు నోటిలో నీళ్ళు ఊరుతున్నాయి,,! ఆపుకోలేక పోతున్నారు తినాలి అనే కోరికను, కళ్ళు మూసినా తెరిచినా పండ్లే కనపడుతున్నాయి. వారికి! కృష్ణయ్య కాస్త కళ్ళు మూసి నిదుర నటించగానే, అందరూ తోటకేసి చప్పుడు చేయకండా వెళ్లారు,! ఎక్కడా, తోటమాలి కనపడటం లేదు వారికి! అడగకుండా పళ్ళు కోయడం దొంగతనం, అవుతుందని వారికి తెలుసు. ! పండ్లను చూసే కళ్ళ కు అది తప్పు అని తెలుసు, !కాని కావాలి, వాటిని తినాలి! "" అన్న జిహ్వ చాపల్యం ఎక్కువగా ఉంది.., కాని కళ్ళు పండ్లను కోయాలేవు! తినలేవు.! కదిలాయి కాళ్ళు, చెట్ల్ల వద్దకు,! కాని కాళ్ళు పండ్లను తెంపలేవు తీనలేవు కదా,! అప్పుడు చేతులు కదిలాయ,,ి పండ్లను తెంపాయి. కూడా !కాని అవి కూడా తినలేవు, కదా,,! అందించాయి పండ్లను నాలికకు!", ఆహా !ఏం రుచి.?, ఏం మాధుర్యం,? అంటూ లొట్టలు వేసుకుటూ మామిడి పండ్లను తిన్నారు, రసాలు జుర్రుకోసాగారు. !ఇంతలో రానే వచ్చాడు బెత్తం తో తోటమాలి,! చూశాడు పిల్లలను!, తనను అడగకుండా తోటలో జొరబడి దొంగతనంగా పండ్లను తెంపి తింటున్నందుకు  వాడికి పట్టరాని కోపం వచ్చింది,! తలా ఒక దెబ్బ వేశాడు వారి వీపులపై,!", అమ్మా! అబ్బా ! అయ్యో,! వామ్మో!"" అంటూ బాధతో పరుగో పరుగు!.... దొంగనిద్ర నటిస్తున్న.కృష్ణయ్య లేచాడు ,చూశాడు. , ఏమయింది అన్నాడు ఏది తెలియనట్టుగా !. గోపాల కులు అడిగారు, ఏడుస్తూ,, కళ్ళల్లో నీళ్ళు కారుతు ఉండగా,!, కృష్ణా! ఆ, మామిడి పండ్లను చూసినవి ఈ కళ్ళు కదా!, మరి ఏ పాపం ఎరుగని ఈ వీపు ఎందుకు దెబ్బలు తిన్నది? అంటూ... అమాయకంగా.. అంటుంటే,, గోవిందుడు నవ్వుతూ నవ్విస్తూ, వారి వీపులు నిమురుతూ, అకు పసరు రాస్తూ, సము దాయిస్తు  చెప్పాడు,! "" దెబ్బలు వీపుపై పడినా, ఏడ్చే ది ఈ కన్నులేగా! మీ కళ్ళనుండి వచ్చే ఆశృ ధారలు, బాధతో పాటు, పశ్చాత్తాపాన్ని కూడా సూచిస్తున్నాయి కదా, ఈ మీ కళ్ళ లోని చూపులు! తప్పు జరిగింది, పండ్లను చూసిన ఈ కళ్ళ వలన కదా,! అందుకే శిక్షతో కూడిన బాధను అనుభవించేది కూడా అవే కళ్ళు,,! అందుకే  ఎవరు చేసిన కర్మను వారు అనుభవించక తప్పదు ,! ఎన్ని ఎత్తులు వేసినా, తప్పును ఎవరితో చేయించినా, ఫలితం కర్తకు, అనగా ప్రణాళిక సిద్దం చేసిన వారికి తప్పక అంటి తీరుతుంది, !అది దేవుడి కైన, నరుడి కైన, ఏ జీవి కైన కర్మ ఫలం అనుభవించక తప్పదు,! ప్రక్కన కృష్ణయ్య ఉన్నా కూడా,!"" అంటూ, పరిహాసం చేస్తూ, చెప్పాడు.." ఇకముందు, మీరు ఈ కళ్ళు చెప్పినట్టు వినకండి,! కళ్ళతో చూసినదం తా నిజం కాదు,! ఏ పనీ అయినా చేసే ముందు, మీ బుద్దిని ప్రభావితం చేసే, ఆత్మ విచారం చేయండి,! అయినా కూడా తోచకపోతే పెద్దవారిని అడగండి,! జ్ఞానం అంటే ఇదే,! ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోడ మే,, !అయినా నాకు పెట్టకుండా, నాకు తెలియకుండా, నన్ను ఏమార్చి చేయాలని అనుకుంటే, ఇదిగో ఇలాగే అవుతుంది, మరి,,! కనీసం తినేటప్పుడు అయినా నన్ను తలచుకున్నారా.,? లేదే,,!' కృష్ణార్పణం!" అన్నారా? లేదే,,! దేవుడికి సమర్పిం ఛని "" తిండి"" దొంగతిండి అవుతుంది, తెలుసా,! మీరు అనుకుంటారు ,, కదా మిమ్మల్ని ఎవరూ చూడటం లేదని! కాని దేవుడు అంతర్యామి,! సర్వాంతర్యామి ! మీలోనే, మీతోనే, మీ ముందే, మీ చుట్టూ ఉండి, మీరు చేసే ప్రతీ పనీ చూస్తూ లెక్క గడుతుంటాడు సుమా!!,ఇకముందు, ఏది తిన్నా",కృష్ణా !నీకు అర్పణం!!"" అనాలి సుమా!, జ్ఞాపకం పెట్టుకోండి,, ఇది ! మీరే కాదు ఎవరైనా కూడా ! ఎందుకంటే ఆ పండ్లు దేవు నీ ప్రసాదం ; ఆ భావన ఉండాలి మీలో !! ఎప్పుడూ నాకు తెలియకుండా, చాటుగా ఏ సాహసం చేయకండి,! ఇది అడవి,! భయంకర మృగాలు, రాక్షసులు,, సర్పాలు ఉంటాయి, కూడా ! మనం అందరం కలిసి ఉండాలి,! ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి, !ఏది చేసినా కలిసి చేయాలి,!", అంటూ, గోపాల కృష్ణుడు,నందనందనుడు, మురళీ మోహ నుడు,, నవనీత చో రూడు,, రాధామాధవుడు, నటనాగ్రేసర. చక్రవర్తి,, నటన సూత్రధారి, లీలా మానుష దేహుడు, నీల మేఘ శ్యామ సుందరుడు,, యశోద ముద్దుల తనయుడు, అన్నమయ్య ఆరాధ్య దైవం,, భక్త పోతన హృదయ మందారం,, మీరాబాయి హృదయ విహారి, సూర దాసు కీర్తన లాలసుడు,, సక్కుబాయి హృదయ అంతరంగుడు,, చైతన్య మహా ప్రభు కృష్ణ చైతన్య భక్తి తరంగం,, త్రిజగన్మోహ నుడు,,భక్త చింతామణి,, కరుణాసాగరుడు,గోపాలబాలుడు,, అలా , తన విష్ణుమాయ జాల ప్రభావంతో, తన సురుచిర సుందర దివ్య మంగళ విగ్రహ దర్శనం తో, ఎన్నో లీలలను, మహర్షులకు కూడా అర్థం కాని, తన రచనా నటనా, చతుర వైభవాలని శ్రీకృష్ణ లీలామృత రసధా రల ద్వారా భక్తలోకానికి అనుగ్రహించాడు!  ",, శ్రీ కృష్ణా, నీకు అర్పణం!, జై శ్రీకృష్ణ!  జై జై శ్రీకృష్ణ !స్వస్తి!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...