Thursday, May 9, 2019

విశ్వ మూర్తి

శాంతి కపోతం, !స్వేచ్చా విహంగము,, !తెల్ల దనం స్వచ్చత, పవిత్రత,! నీలం రంగు, ప్రశాంతత,,!! కలిసి అనందం, అందం,! జీవాత్మకు పరమాత్మ తో గల  అనుబంధం!!, ఎంత గొప్పవాడు భగవంతుడు,? పక్షుల్లో, ప్రకృతిలో, ప్రపంచం లోని అణువణువునా అందాలు పొదిగిన విశ్వ మూర్తి,! ఎంత చక్కని చిత్ర శిల్ప రచనా కారుడు,, !అందాల ఆనందా లు కుప్పలు కుప్పలుగా వేదజల్లాడు,! ఇంతకీ ఎక్కడ ఉన్నాడు, ఆ సృష్టి కర్త,, ?ఒక్కసారి చూడాలని ఉంది,! ఇన్ని సోయగాలు లావణ్య వైభవాలని వాడని పరిమళ కుసుమాల హారంగా ధరించిన ఆ విశ్వంభర స్వామిని, కనులారా దర్శించాలని కోరికగా ఉంది ! ఆ జగన్మోహన ఆకారుని పాదాల ను తాకాలని, ఈ శిరస్సును ఆ ప్రభువు చరణ కమలాల కు తాకించాలని మనసు ఉవ్విళ్లూరుతోంది,! దయచేసి చెప్పరూ, మా నీల మేఘ శ్యామ సుందరుడు ఎక్కడున్నాడో,! ఎలా ఉంటాడో,,, !అతడిని చూడటానికి, ఏం చెయ్యాలో,,? ఎప్పుడు చూడవచ్చు నో,,,? , అయినా ఆయనకు అంత తీరిక ఉంటుందా,,? జగాల నేలే దొరకిి,,? సకల ప్రాణి కోటి నీ సంరక్షించే ప్రభువుని దర్శించడానికి , ఎక్కడున్నా రెక్కలు కట్టుకుని వెళ్ళడానికి, మనం స్వేచ్చా విహంగాల మా?, కర్మ పాశ బద్దులం,!, అజ్ఞానమే కాని సుజ్ఞానం లేని రెండు కాళ్ళ జంతువుల ము,,! స్వామీ,!,, సముద్ర పు ఇసుకలో ఒక చిన్న ఇసుక రేణువు ను, నేను. ! అనంత కోటి బ్రహ్మాండ నాయకు డి వి నీవు,,! ఊహించ నలవి గానీ, శక్తి చైతన్య మూర్తి వి నీవు,,! నేనో, అల్పు డను!, హీను డను, !అహం భావిని,,! డంబా చారిని,!, అందుచేత, నారాయణా,, నవనీత హృదయా,,! నా దీనస్థితి మీద దయ ఉంచి నన్ను రక్షించు, ! తండ్రీ,! రోజుకు ఎన్ని తప్పులు చేస్తున్నానో నాకు తెలియదు, !క్షమించు, పరమాత్మా,! శరణు, దయానిధి,! శరణు,, !శరణు!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...