May 25, 2019
దేవుడు ఎక్కడ ఉన్నాడు,? అనే సందేహం అందరికీ కలుగుతుంది నా ప్రక్కన లేడు, మనల్ని చూడటం లేదు గదా అని అబద్ధాలు, తప్పుడు పనులు, చేస్తుంటాము, ! కాని అతడు మన హృదయం అనే పద్మం లో విరాజిల్లుతూ ఉన్నాడు! ఇది మనం గుర్తించడం లేదు, దానికై ప్రాకులాట లేదు. ఎంతసేపు ప్రాపంచిక మనస్తితి లో బ్రతకడం అలవాటుగా మారింది!"", శ్రీ విష్ణు హృత్ కమల వాసిని, విశ్వ మాత, !""అనే లక్ష్మీ స్తోత్రం లో, మహావిష్ణువు తన హృదయ కమలం లో అనగాతన వక్షస్థలం లో లక్ష్మీ మాత అనగా పరమాత్ముని సన్నిధానం, లో ధరించి ఉన్నాడు. అదే జీవికి అనాహత చక్రం లో ఉండే శాశ్వతఐశ్వర్యం, ముక్తి ధామం,, కూడా!, హృదయం అనేది ఒక భావ సంపద, !అది "లబ్ ,డబ్" అని నిరంతరం కొట్టుకునే గుండె కాదు,! పద్మం లా అత్యంత కోమలము, సుకుమార ము, సుమధుర ము, సుగంధ భరిత ము, పరమాత్ముని పవిత్ర నివాస స్థానము కూడా ! అందుకే హృదయాన్ని కమలం తో పోలుస్తారు,,! ఇది అనుభవైక వేద్యము,! అది చేతికి చిక్కేది కాదు,, చూపుకు కనపడేది కాదు! బాహ్యంగా, పదార్థంగా దొరికేది అంతకంటే కాదు,! అది కేవలం మనలో అంతర్లీనంగా ఉండే అద్భుతమైన దివ్య శక్తి సంపద, ! అన్నమయ్య లాంటి సంకీర్తనా చార్యులు, తాము పలికే కీర్తనలో ప్రతీ పదాల్లో, స్వామి పాదాలను, మూర్తి వైభవాన్ని , తమ హృదయంలో దర్శిస్తూ, రమిస్తూ, కీర్తిస్తూ, బాహ్య స్మృతి లేకుండా, వైకుంఠ లోకంలో, ఉన్న పరంధాముని వైభవాన్ని కూడా, పరమ అద్భుతంగా హృదయ అంతరాళం లో అనుభవించ గలిగారు,,! అలాంటి మహానుభావులు ఎందరో తమ హృదయ కమలాన్ని పరంధాము నీ, పాద పద్మాల ముందు భక్తితో సమర్పించి , జీవన్ముక్తి నీ పొందారు..!మనిషికి ఉన్న మహదై శ్వర్య భావన ఈ హృదయం,!, అది జీవునికి , దేవునికి అనుసంధానంగా పని చేసే భవ్య మైన, దివ్యమైన అలౌకిక బ్రహ్మానంద స్తితి ,,;!! హృదయం ఉన్న ప్రతివాడూ, ప్రేమ అన్న పదానికి అర్థం తెలిసిన వాడు, అయి ఉంటాడు, పరమాత్మతో పెట్టుకున్న అనుబంధమే నిజమైన, వాస్తవమైన ప్రేమను సూచిస్తాయి, జన్మ కర్మ బందనాల నుండి విముక్తి నీ ప్రసాదిస్తుంది కూడా ! ఈ భార్యాపిల్లలు బందువులు, స్నేహితులు, , సంసార లంపటాల యందు మనం చూపేది , "మోహం, లేదా వ్యామోహం, !"అవుతుంది, ..ఎందుకంటే అవి, ఆ బంధాలు ,అనుబంధాలు, శాశ్వతంగా నిలిచేవి కాదు,, జీవుని ఉద్దరణ కు పనికి రావు ! పరమాత్మ ను హృదయం లో ప్రతిష్టించి, పరమానందాన్ని పొందడం , పవిత్ర ప్రేమ యొక్క లక్ష్యం,! ఆ ప్రేమ హృదయంలో నే , దైవానుగ్రహం తోనే చిగురిస్తుంది,! హృదయం అనేది దైవం మనిషికి , అనుగ్రహించిన ప్రసాదం ,! హృదయం ఎక్కడుందో తెలియాలంటే, మనసు పెట్టి్, కళ్ళు మూసుకొని,, ధ్యానించు,! అంటే దైవాన్ని అంతటా భావించు!, ఇప్పుడు నీ దృష్టి ,బాహ్య ప్రపంచం లో నీ వస్తువులు, లేదా మనుష్యుల పై స్మృతి ఉండరాదు, !, నీ శరీరాన్ని తాకే చల్లని గాలిలో, ఉన్నాడు పరమాత్మ! , త్రాగే నీటిలో, నదులు, సముద్రాల్లో,, ఉన్నాడు! లోన ఉండి ఆహారం జీర్ణం చేస్తున్న జఠరాగ్ని లో, ఉన్నాడు!, పచ్చని పైరు పంటలతో జీవకోటి నీ బ్రతికిస్తు న్న ధరణి లో, ఉన్నాడు! సూర్య చంద్రులు, నవగ్రహాలు, నక్షత్రాల పుంతలను అవలీలగా, ఒకదాని నొకటి తాకకుండా సునాయాసంగా, సులభంగా త్రిప్పే వినువీదిలో, ఇలా పంచభూతాల్లో తానై , అన్నీ తానై,, తానే అంతా అయ్యి, ఉన్న భగవంతుని వైభవాన్ని స్మరిస్తూ, పోతూ ఉండు!, అండ పిండ బ్రహ్మాండము అంతటా నిండి ఉన్న స్వామి, నీలో కూడా నెలకొని ఉన్నాడు, అన్న సంపూర్ణ విశ్వాసంతో నిరంతర సాధన కొనసాగించు,! నీ భావన లో పవిత్రత, నీ అంతరంగం లో చిత్తశుద్ది, నీ మదిలో, పరమాత్మ వైభవాన్ని పొందాలన్న తపన,, ఆర్ద్రత, ఆరాటం, ఆవేదన, కృష్ణయ్య దర్శనం కోసం ఆర్తి, గానీ ఉంటే, గోపాల కృష్ణుడు, కరుణా లోలుడు, భక్తజన హృదయ మందారుడు, గోవిందుడు తప్పకుండా నీ హృదయం కమలం లో ప్రత్యక్ష మౌతాడు,! ఆ నవనీత హృదయం గల నవనీత చోర బిరుదాంకితుడు, నీవు ఎప్పుడు పిలుస్తా వో,,! మూసుకొని పోయిన నీ హృదయ పద్మం, తనకోసం ఎప్పుడు తెరుస్తా వో ! తనకోసం అనుకుంటూ , ఎల్లప్పుడూ నీ ఆరాధనా భావం తో పిలిచే నీ ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు!, నీలో ఉన్న తనను నీవు గుర్తించలేని దుస్తితి లో, ఉన్నందుకు జాలి పడుతూ, నిన్ను విడవకుండా,, నిన్ను ప్రేమిస్తు ఉంటాడు, గోపాల కృష్ణుడు, !అందుకే సర్వాంతర్యామి అయిన నందగోపా లుని చరణార విందాలు,, మన హృదయ పద్మం లో విరాజిల్లుతూ ఉండాలని కోరుకుందాం,! ఆ యశోదా తనయుడికి మన హృదయ మందిరంలో కి స్వాగతం, సుస్వాగతం పలుకుదాం,! వేణు గోపాలా,! నీవున్న ఈ శరీరం ధన్యం!, బంగారం,! పరమ అద్భుతం!, పరమానంద కరం,! నీవు లేని ఈ ఇల్లు శవం తో సమానం , నీవుంటే నే సత్యం, శివం, సుందరం ! నీ జగన్మోహన ఆకారంతో, సుందర సుకుమార అపురూప సౌందర్య లావణ్య అందాల ఆనందాల స్వరూపంతో, మౌక్తిక మణి హారంతో, కస్తూరీ తిలకం తో, శిఖీ పించమౌళి గా, వేణు వాద వినోద విశార దునిగా, సర్వాలంకార భూషి తు నిగా మా హృదయం లో నెలకొనవయ్యా గోవిందా,! నేను ఇష్టంగా భుజించే భోజనం, నీకోసమే, సుమా !నేను ఎది చేసినా, అది నీకే "" సమర్పయామి !""అంటూ భావిస్తాను తండ్రీ,! నారాయణా, !వాసుదేవా,! జగదీశ్వర ! భక్త వత్సలా! అర్తశరణ్యా ! శరణు , !నా భారం నీదే,! నన్ను నీ వాడిగా చేసుకో, కృష్ణా! మనసా, వాచా, కర్మణా నిన్ను కొలిచి తరించే స్ఫూర్తిని ,భాగ్యాన్ని నాకు అనుగ్రహించు శ్రీకృష్ణా,,! దేవకీ నందనా శరణు,,! శ్రీనివాసా శరణు,! అనాధ రక్షకా ,, శ్రీ వేంకటేశ్వరా శరణు ,! హరే కృష్ణ హరే కృష్ణా ! స్వస్తి !"
Saturday, May 25, 2019
దేవుడు ఎక్కడ ఉన్నాడు?
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment