Saturday, June 1, 2019

సూర్యభగవానుడు

May 30, 2019
సూర్యభగవానుడు యుగ యుగాల నుండి ప్రతీ దినం , ప్రతీ క్షణం తన అనంత హస్తాలతో జగతిని సంరక్షిస్తూనే ఉన్నాడు. సూర్యుడు తిరుగుతూ తన చుట్టూ మన భూమితో బాటు నవగ్రహాలను తింపుతూ, కాలాలు ఋతువులు, రాత్రీ పగలు మారుస్తూ సమస్త ప్రాణికోటి జీవనానికి మూల కారకుడు, ఆధార భూతుడు అవుతున్నాడు.! అంతా ఆయన ఇచ్చా ప్రకారం తిరుగుతూ, కాలానుగుణంగా మారుతూ, ప్రాణికోటి జీవించాలి. సూర్యుడు ఉంటేనే ప్రాణుల కు మనుగడ! అతడు లేని జగతి లేదు, ప్రగతి లేదు !. పుట్టడం, బ్రతకడం, చావడం అంతా ఆయన అధీనం.! ఇక్కడ ఈ భూమి మీద జీవించడానికి, మనం అనుభవించే ధనం, సంపద ఆహారం విజ్ఞానం, కీర్తి ప్రతిష్టలు,సుఖదుఃఖాలు , ఆవేదన, ఆరాటం, బ్రతుకు పోరాటం, ఇలా సకల పదార్థాలు, యదార్థ ము లు, సకలం, అన్నీ ఆ కర్మసాక్షి నుండి గ్రహిస్తూ, జీవన యాత్ర ముగిశాక తిరిగి, తన సొమ్మును తనకే సమర్పించి వెళ్తాము. ఉపయోగించు!, అనుభ వించు! ఆనందించు,!, తిరిగి అప్పజెప్పి పోవాలి,! అనగా  కిరాయి ఇంటిలో బ్రతుకు గడుపుతూ  ఉన్నట్టుగా భావించాలి, మన వెంట ఏది రాదు,, అని తెలుసు! ఎందుకంటే ఎది కూడా మనం తేలేదు, తయారు చేయలేదు,, చేయలేము కూడా ! వెంట వచ్చేది పాప పుణ్యాల మూటలు మాత్రమే!,. కనుక  ఈ కర్మభూమిలోదేనిపై కూడా నాది అన్న హక్కు ఎవరికి లేదు..! మరి ఇంత దివ్యమైన అనుగ్రహంతో మనల యోగక్షేమాలు చూస్తున్న ఆదిత్యుని కి రోజుకు ఎన్ని సార్లు సాష్టాంగ ప్రణామాలు సమర్పించాలి చెప్పండి,! ఆయన దయ మీద సంపూర్ణంగా ఆధార పడుతూ ఉన్న మనం కృతజ్ఞత తో చేతులెత్తి రోజుకు ఒకసారి అయినా నమస్కారం చేయాలా, వద్దా,? మీరే చెప్పండి.! అలుపు ఎరగకుం డా, ఒక క్రమపద్ధతిలో, ఒకే కక్ష్యలో సూర్యభగవానుడు అలా భ్రమణం చేస్తూ, తన అద్భుతమైన ప్రకాశంతో, వేడిమి తో, జ్ఞాన విజ్ఞాన వైభవాలతో, వెలుగును, ధరణి పై ప్రసరింప జేస్తూ, జీవులలో శక్తినీ, చైతన్యాన్ని,  ఇంకా వాయువు సరఫరా, వర్షాలను ప్రసాదిస్తూ ఉన్నాడు,24 గంటలు ఎండ ఉండకుండా, ప్రాణికోటి మాడిపోకుండా రాత్రిని, ఇస్తూ జీవులకు నిద్ర అనే విశ్రాంతిని కరునిస్తూ ఉన్నాడు,!విష్ణుభగవానుని చేతి  "సుదర్శన చక్రం ""లా జగతిని, ఉద్దరిస్తు, ఒక క్రమపద్ధతిలో కాల చక్ర భ్రమనాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇక జ్ఞానాన్ని, ఉత్తేజాన్ని, సత్యము ,ధర్మము, ప్రశాంతత, ఆనందము అనబడే బ్రహ్మానందాన్ని, జీవులకు ప్రసాదించే వన్ని, ""పాంచజన్యం ""అనబడే విష్ణు మూర్తి శంఖం నుండి, ఓంకార నాదం నినదిస్తూ వస్తున్నట్టుగా మనకు సూర్యనారాయణ మూర్తి నుండి తరగని అమృత ధారల వలె అనవరతము వస్తున్నాయి..! శ్రీమన్నారాయణుని మూడవ అస్త్రం ,, "కౌమోదకి "అని పిలువబడేి గద ! ఇది సమస్త ప్రాణులకు సంభవించే విపరీత పరిస్తితులకు తట్టుకునే , శారీరిక,మనో దైర్యం, నరాలు, కండరాల , ఎముకల దారుఢ్యం, మరియు పుష్టిని కలుగజేస్తుంది! వైకుంఠ వాసునీ నాలుగవ ఆయుధం "నందకం "అనే ఖడ్గం,! ఇది జీవుల్లో ఆశను, తరగని ఉత్సాహాన్ని,, అత్మ బలాన్ని,, చురుకు దనం తో ఉరుకులు పరుగులు జననం నుండి మరణం వరకు బ్రతుకు పై తీపిని పుట్టిస్తోంది.!. ఇక శ్రీహరి చివరి అస్త్రం, ఐదవది ""శారంగం, "అంటే ఎక్కుపెట్ట బడిన ధనుస్సు. బాణాలు, !ఇవి ధరణి పై గల అన్నీ చోట్లా కోట్లాది సూర్య కిరణాల రూపంలో జీవరాశి పై పడుతూ , చైతన్యాన్ని ప్రసాదించి, జీవులకు గమన శక్తిని ఇస్తుంది.! నదులు ప్రవహిస్తుంటాయి , వాయువు ప్రసరిస్తూ, ఉంటుంది.. అగ్ని భగభగ మంటూ మండే సూర్యు గుండం లా  తలపిస్తూ ఉంటుంది. ,ఇలా శ్రీ మహావిష్ణువు తన ఐదు ఆయుధాలను, , తన ప్రతిరూపం అయిన , ఈసూర్య నారాయణుడు ద్వారా ఉపయోగించి, జగత్ కళ్యాణానికి , ప్రకృతి సంపదలకు,, సృష్టి స్థితి సంహార క్రియలకు మూలాధారము  అవుతున్నాడు., రవి కాంచని రోజున బ్రతుకు దుర్భరం అవుతుంది, చచ్చిన శవాలను తన తేజస్సుతో శిథిలం చేస్తూ ఉండక పోతే, ఈపాటికి భూమి పై కాలు మోపకుండా అంతా శవ మయ మై ఉండేది.. కదా! సముద్రాలు, నదులు,,తమ హద్దులు తెంచుకొని ధరణి నీ మ్రింగి ప్రళయాన్ని పుట్టించేవి,.! ఇలా ఊహించనలవి కాని విష్ణు మాయా జాలం లో, మానవుని చేత చేదింపబడని సృష్టి రహస్యాలు ఎన్నో ఉన్నాయి,,! సూర్య నారాయణ స్వామి దయ వలన పుష్పాలు లతలు ఆకులు, చెట్లూ, నదీ నదాలు , నీలికొండలు కోనలు, ఇలా పచ్చని పైరు లతో,,, అందాల ఆనందాల మధురానుభూతి కలిగిస్తూ ఉన్నాయి. ఒకవేళ, ఈ పంచభూతాలను కట్టడి చేయక పోతే, సృష్టి సమస్తం నాశనం అవుతుంది ,సముద్రాల ఉప్పెన వస్తె, సముద్రాల లోన ఉండే బడబాగ్ని బ్రద్దలైతెట్,, ప్రచండ మైన వాయు ప్రభంజనం విజృంభిస్తు ఉంటే, భూకంపాలు అగ్నిపర్వతాలు బద్దలై పోతే, ఆకాశం లో కారు మబ్బులు కమ్మి, కుండ పోత వర్షాలు కురిస్తే, అల్ప ప్రాణులు, జంతువులు మనుషులు  తట్టుకోలేవు, కదా,! ఇంత బీభత్సాన్ని కలుగకుండా తన కనుసన్నల్లో ఉంచి, మనల్ని రక్షించే సూర్యనారాయణ స్వామి కరుణ అపారం ,!అందుకే సృష్టిలో ఉన్న జ్ఞాన భాండా రాన్ని గ్రహించడం, తెలియడం, వేల ఏళ్ళు తపస్సులు చేసిన అలనాటి తపోధనులు, ఋషి పుంగవులు కూడా చేతకా లేదు ! విధాత సృష్టి కళా చతురతకు, అబ్బురపడక తప్పదు ! సర్వాంతర్యామి గా తాను అన్నీ అయి ఉంటూ కూడా, కేవలం సాక్షి లా గమనిస్తూ, జీవుల్లో అంతర్యామిగా సంచరిస్తూ ఉంటున్న శ్రీహరి నటన లీలా మానుష విగ్రహ స్వరూప కేళీ విలాస ప్రభావానికి మనం సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉండాలి , ఎదుట నిత్యం కనబడుతున్న   మార్తాండుని సూర్య నారాయణ స్వామిని ఎందరో భక్తులు, ఉపాసకులు, నిరంతరం ఆరాధించి సేవించి తరించారు, సత్యం ధర్మం, ఆచార సంప్రదాయాలు పాటిస్తూ, అనుదినం, ప్రాతః కాల వేళలో , సూర్యునికి అర్ఘ్యం ,భక్తిశ్రద్ధలతో , అర్పించారు,,! దేవుడు గాలిలొ, భూమిలో, అగ్నిలో, నీటిలో, ఆకాశం లో అనంత రూపాల్లో, అంతటా నిండి ఉన్నాడు ., ఈ పంచభూతాలను తన పర్యవేక్షణ లో ఉంచి, జగత్తును శాసిస్తూ, పాలిస్తున్న దివాకరునికి,, రోజూ క్రమం తప్పకుండా ఉదయిస్తూ, అస్తమిస్తూ, తన జగన్మోహన రూపంలో, మన దైనందిన చర్యలను గమనిస్తూ, నియమిస్తూ, కనిపించే  సాక్షాత్తు ప్రత్యక్ష దైవానికి భక్తితో అనునిత్యం ప్రణామం చేద్దాం.! మన జీవన దాత, జ్ఞాన దాత, ఐశ్వర్య ప్రదాత, ముందు., , తెలిసీ తెలియక రోజూ మనం చేస్తున్న అపరాధాలను ఒప్పుకుంటూ క్షమించమని ప్రార్థించుదాం ! మనం చేసిన, చేస్తున్న పాపాలు,, హింసలు, అన్యాయాలు, ఆధర్మాలు , అసత్యాలు,, ఎవరికీ తెలియకుండా ఎంత దాచినా మన కర్మలకు ప్రత్యక్ష సాక్షి గా నిలుస్తూ చూస్తూ, పాపాల చిట్టా లో లెక్కలు రాస్తూ , సకల ప్రాణుల కర్మఫలం అందిస్తూ ఉన్న ఈ సూర్యనారాయణ స్వామి చూపునుండి మాత్రం ఎవరము తప్పించు కోలేము,!, అందుకే ఇతడే బ్రహ్మ విష్ణు ఈశ్వర రూపంగా భావిస్తూ, లక్ష్మీ గౌరీ సరస్వతీ దర్శన భాగ్యంగా ఆనందిస్తూ , గత జన్మ కృత సుకృత కర్మ భవ బంధాల నుండి, రోగాల నుండి , ఘోర సంసార దావాగ్ని నుండి దయతో కాపాడమని కోరుకుందాం,! స్వామీ,!సూర్యనారాయణ ,! నిన్ను అనుదినం పూజించి సేవించడానికి తగిన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, స్ఫూర్తిని అనుగ్రహించు తండ్రి, !పరమేశ్వరా,! నీవే తల్లివి, తండ్రివి,, గురువు, దైవానికి కూడా నీవే,! పరమాత్మా,! పరందామా, శరణు! శరణు !శరణు !  హరే కృష్ణ హరే కృష్ణా స్వస్తి !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...