Saturday, May 25, 2019

ఓ మనసా!

May 24, 2019

మానస సంచరరే, బ్రహ్మణి,,!""ఓ మనసా,! నా యందు కృప ఉంచి, నీవు, ఆ గోపాలకృష్ణ మూర్తి పరందాముని సన్నిధిలో  బ్రహ్మానందం పొందుతూ, చల్లని పున్నమి  వెన్నెల కాంతుల లో, పరమానంద భరిత డోలికల్లో తన్మయం తో, సంచరించే చకోర పక్షుల్లా, అద్భుత ఆనంద స్థితిలో మైమరచి ఉంటూ, దైవ ప్రసాది త మైన, నా ఈ జన్మను ధన్యం చేయవే మనసా! నిన్ను బ్రతిమాలు కుంటున్నాను, ఆ నండనందనుని. శిఖిపించ మౌలిని, మహనీయ కాంతులను విరజిమ్ముతూ ఉండే, శ్రీకృష్ణుని కపోలాల ను ,కుండలాల వెలుగుల్లో కోటి సూర్య కాంతులతో ప్రకాశించే ఆ రాధామాధవుని తనివార, మనసారా, కాంచి పులకించవే,, ఓ మనసా, నీవు కన్నయ్య పై గురి నిలిపితే, నా హృదయం, బుద్ది, ఆత్మ, కర చరణా దులు, సర్వం ఆ వేణు గాన విశార దుని, పెదాల నుండి జాలువారే, అమృతగాన మాధుర్యాన్ని, ఆస్వాదించే మహా మహా భాగ్యాన్ని, గ్రొలవచ్చునే, తల్లీ, నన్ను బ్రోవవే, జగన్మోహ నా కారుడు, గోపీ జన వల్లభుడు,, యశోదా కృష్ణుడు, కాళీ య మర్దనుడు, చల్లనయ్య మన నల్లనయ్య, చూపుల్లో కృతార్త త పొందే, అదృష్టాన్ని అనుగ్రవించవే   , కృష్ణా గోవిందా, నీపై బుద్దిని కరుణిం చి, నీ కోసం  చకోర పక్షిలా ఎదురుచూసే నన్ను కరునించరా తండ్రీ శరణు శరణు శరణు,, హరే క్రిష్ణ హరే కృష్ణా , స్వస్తి. !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...