Saturday, June 1, 2019

బుద్ది

May 31, 2019
భగవంతుని కరుణ వల్ల,, పూర్వజన్మ సుకృతం వలన, మనిషిలో మంచి బుద్ది పుడుతుంది.! అయితే, ఆ బుద్దిని చెడగొట్టేది ఈ మనసు,! అంటే జీవుడి కర్మ పరి ఫలం!, గతజన్మ కర్మలను అనుసరించి, బుద్దిని వక్ర మార్గంలో పని చేయిస్తుంది ఈ మనసు!! అందుకే "బుద్ది ,కర్మాను సారిణా  !"అంటారు !అంటే, కర్మను అనుసరించి బుద్ది ప్రభావితం అవుతుంది అన్నమాట !! అందుకే , జ్ఞాని అయిన ఈ బుద్ది అనబడే, రథం, దాన్ని ఇష్టం వచ్చిన దిశలో లాక్కుపోతున్న బలమైన గుర్రం లాంటి మనసును, బ్రతిమి లాడు కుంటోంది,!, "ఓ మనసా!, నిన్ను పట్టడం, గానీ,నియంత్రించడం గానీ,,, చెప్పినట్టు వినేలా చే సుకొడం గానీ, అసలు పది సెకండ్లు అయినా నిన్ను కదలకుండా స్థిరంగా ఉంచడం గానీ,, నా వల్ల అయ్యే పని కాదు సుమా ;!ఆ ఈశ్వరుని దయ లేకుంటే, ఈ జన్మలో ,నిన్ను పట్టతరం  కాదు,! ఎందుకంటే నీవు, ఈ జీవుని గత జన్మ వాసన ల ప్రకారం, చలిస్తూ ఉంటావు,! ఊపిరి నైనా ఆపవచ్చు ను, కాని, ఓ మనసా!  నిన్ను స్వాధీనం చేసుకోవడం అసాధ్యం కదా,! అందుకే త్యాగరాజస్వామి అంతటి  పరమ భక్తులు కూడా మనసును ప్రాధేయ పడ్డారు,  ఓ మనసా !చెడు ఆలోచనలు, అలవాట్లు, సాంగత్యం చెయ్యకుండా, ఆ జగదభిరాముని , ఆ శ్రీరామ చంద్రుని పాద కమలాల సేవలో దృష్టి నీ నిలిపి, ఈ జీవునీ కర్మబందాలను క్షాళన చేసుకోడానికి దయచేసి సహకరించవా!, అని పలు విధాలా వేడుకుంటూ,, పలు కీర్తనలను రచించి, మధురంగా,రాగరంజితంగా , పరమాత్ముని యందు ఆకలంకమైన, నిశ్చలమైన భక్తితో, ఆలపిస్తూ, మనసును మెల్లిగా, సుకుమారంగా బుజ్జగిస్తూ, ఒక స్నేహితుని వలె భావించి దానిపై  ఆప్యాయతను కురిపిస్తూ, తన భక్తి పారవశ్యం తో రాయి లా కరడు గట్టిన మనసును లాలిస్తూ, నిరంతర సాధనతో, తమ మనసును, తమ ధ్యేయం వైపుకు త్రిప్పుకున్నారు ,! మనసును మచ్చిక చేసుకొని , క్రమంగా,భగవంతుని కృపకు పాత్రు లయ్యారు ! ఇందుకోసం వారు తమ జీవితాలను, ప్రాణాలను ఫణంగా పెట్టి, అంకిత భావంతో మనస్సును కట్టి పడేసి, దాసిలా,, పరమాత్ముని సేవలో నిలిపారు.! అలా వారు  తరించారు ! ""మనసా! రాముని సేవ చేతమా!, ఆ మహిమా కన్నుల నిండా చూతమా,,! మానస పూజ గావింతమా,!, దీన శరణ్యుని దివ్యజ పురుషుని, పూని సద్భక్తితో నెగడుచు, పోగడుచు, ప్రేమతో రాముని కనులారా జూచుచు,,. !"" అంటూ, మనసారా అలరిస్తూ, ఆనందిస్తూ, ఆరాధిస్తూ, శ్రావ్యంగా కీర్తించారు, మనసును ఆసరాగా తీసుకుంటూ , ముక్తి సౌధాన్నీ అధిరోహించారు ..! మనిషి ఏదైనా సాధించాలి అంటే ముందుగా మనసును గెలవాలి కదా ;. అంటే దాని ఆధీనం లో ఉన్న పంచేంద్రియాలు  ,,5,, కర్మేంద్రియాలు 5,, మనసుతో కలిపి , మొత్తం 11,, ఒకే త్రాటిపై, ఒకే ధ్యేయంగా, కదలాలి! ఇది సాధనా ప్రక్రియ;, దానినే ఏకాదశి వ్రతం అంటారు,,,! ఏ పరమాత్ముని ప్రసాదం , తింటూ, ఆనందిస్తూ ఉంటున్న మనసు అనబడే ఈ జీవుడు, అదే పరమాత్మ సేవలో ఒక రోజు, మనసా, శిరసా, వచ సా  భక్తితో, కృతజ్ఞతా భావంతో అదే దైవం ముందు ప్రణమిల్లడానికి  ఈ శిరసును వంచదు ! కారణం అహం , అంటే కర్మ బంధం అడ్డు వస్తుంది !. కాని అనామకుల ముందు మాత్రం  వంగి వంగి దండాలు పెడుతుంది,, ఈ జీవుడు ఉద్దరింప బడటానికి ,ఏది చేస్తే బావుంటుంది అన్న విషయం మనసుకి పట్టదు, మనం బుద్ది కౌశలత తో దాని ఆట కట్టించాలి,; అందుకు భగవద్ కృప అవసరం, ;అతడి అనుగ్రహం లేనిదే, ఈ పిచ్చి మనసు, మనం చెప్పినట్టు వినదు,! మహాత్ములు, మహ నాయకులు, మహా భక్తులు, ఋషులు, మునులు, పరమాత్ముని శరణు కోరి,  మనస్సును జయించి, అనుకున్నది సాధించారు. కానీ , అది అంత సులభమైన విషయం కాదు,!, జపాలు తపాలు, పూజలు, యాగాలు, యోగాలు,,, ఇవన్నీ మనసును భగవంతుని మూర్తి యందు లగ్నం చేయడానికి చేసే ప్రయత్నాలు.! మనం స్థిరంగా కూర్చుంటే అది మనకు తెలిసిన ఊరులూ, మనుషులు అన్ని కలియ తిరుగుతుంది, !.లేచి నడక ప్రారంభిస్తే, అది మనం ఎటు పోవాలో చెబుతూ, బుద్దిమంతునీ వలె వింటున్నట్టు నటిస్తుంది.! జీవితం ఒక నాటక రంగం అయ్యేది ఈ మనసు రోజూ ధరించే వివిధ పాత్రల పోషణా సామర్థ్యం వల్లనే !! మనిషికి ఉన్నది ఒకే మనసు,! కాని దాని అవతారాలు రోజుకు ఎన్నెన్నో, చెప్ప తరం కాదు,! ఏ పదార్థం పై ఇష్టపడుతూ ఉందో, దాని స్వరూపం ధరిస్తూ,దర్శిస్తూ, అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ఉంటుంది, మరొక రుచికరమైన, ఆసక్తికరం, నూతనం అయిన విషయం కనిపిస్తే అటువైపు పరుగు తీస్తూ, దానిని పొందేవరకు ఈ దేహాన్ని నానా యాతనల పాలు చేస్తూ ఉంటుంది, !ఇలా పిచ్చివా డి చేతిలో రాయిలా జీవుడు అనబడే మనసు విచ్చల విడిగా సంచరిస్తూ, త్రాడులేని బొంగరం లా, ధ్యేయం లేకుండా, గమ్యం తెలీకుండా, విలువైన మానవ జీవితాన్ని వ్యర్తం చేస్తుంది..! బుద్ది లో జ్ఞానం ఉంటుంది,,! నిజమే,; ఇది చెప్పినట్టు గా మనసు వింటే, మనిషి వ్యక్తిత్వం వికసిస్తుంది,,మహానుభావుడు అవుతాడు,, !లేదా చుక్కాని లేని నావలా, త్రాడు తెగిన గాలిపటం లా దిక్కు, దశ దిశ, కోల్పోయి సంకట పరిస్తితి నీ ఎదిరించే మానసిక శక్తిని కోల్పోతాడు,! అధోగతి పాలు అవుతాడు !  ఈ మనసుకి ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేస్తూ, ,సాంకేతిక పదార్థ పరిజ్ఞానం,,పెంచుకుంటూ దానికి దాసులై, ఆధ్యాత్మిక చింతనకు, మానవ జీవిత విలువలకు,, దూరమై, బ్రతుకులు భారంగా సాగిస్తూ ఉండటం చూస్తున్నాం, ఇంటింటా ఫోన్ లు ఉపయోగిస్తూ మర బొమ్మల్లా మారుతున్న పిల్లలను, నిత్యం చూస్తున్నాం, ఇలా నేటి యువత, భావి పౌరులు, పదార్థ జ్ఞానమే కాని, యదార్థ జ్ఞానం గ్రహించలేని మనసుకు, వారు  బానిసలు అవుతున్నారు ,! ఈ మనసు, యాంత్రికంగా కాకుండా,, ఏకాగ్రత తో ఒక అరగంటసేపు అయినా, భగవద్ ధ్యానం చేసేనా,,? ఆ భావ సంపదను చింతిస్తూ, నిత్య కృత్యాలలో,, జీవిత పరమార్థం కొరకు, వినియోగించేనా,,? డబ్బును, సంపదను, కుటుంబ సౌఖ్యాన్ని పెంచుకున్నట్లే, ఈ పరమార్థాన్ని కూడా పంచుకుంటూ పెంచుకునేనా ? అది ఈ మనసుకు అంటే మనిషికి సాధ్యం అయ్యే పనేనా?   !, ఓ దేవాదిిదేవా ! దీన బాంధవా! ఆర్త శరణ్యా !, ఈ మనసును, నీ మాయగా ప్రయోగించి, నన్ను అయోమయ స్థితిలో ఉంచకుండా, దయచేసి నీ పద సన్నిధిలో ,, నీ సేవలో,నా ఈ బేల మనస్సును ప్రశాంతంగా ఆనందంగా సంతృప్తిగా. ఉండేలా  నన్ను అనగా ఈ జీవుని అనుగ్రహించు ! నీ కరుణ లేనిదే, నా మనసు నిగ్రహింపబడ దు , నా జీవిత లక్ష్యం నెరవేరదు! , కావున నారాయణా,! పరమేశ్వరా,! నీపై బుద్దిని ప్రసరింప జేసే చిత్తశుద్ధిని, నిర్మలమైన మనసుని, నాకు ప్రసాదించు తండ్రీ,,! ఆపద్బాంధవా !, అనాధ రక్షకా! పాహిమాం  !ప్రభో ,! పరమేశ్వరా ,రక్షమాం ! శరణు !శరణు !శరణు ! హరే కృష్ణ హరే కృష్ణ ! స్వస్తి !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...