Saturday, June 1, 2019

సమ భావం

June 1, 2019

భగవద్గీత, లో గీతాచార్యుడు , శ్రీకృష్ణభగవానుడు  తన భక్తుని యొక్క లక్షణాలు వివరిస్తూ,సుఖదుఃఖాలు , ఊష్ణ శీతలాలు ,జయాపజయాలు, లాభ నస్టాలు, శత్రు మిత్ర బేధాలు, మాన అవమానాలు, సంయోగ వియోగా లు. ఇలా మన జీవితంలో సంభవించే ఆటుపోట్లను సమ భావం తో చూడాలి, అన్నమాట!  అంటే కష్టమొస్తే కృంగి పోగూడ దు, సుఖం వస్తె పొంగి పో గూడ దు.! కానీ, భూమిపై పుట్టిన, ప్రతివాడూ, ఇవన్నిటి నీ కొద్దో గొప్పో తేడాతో అనుభవించ వలసినదే, కదా! మనిషి అన్నవాడు విధిగా ఈ సుఖాలలో బాటు కష్టాలు కూడా అనుభవించ వలసి ఉంటుంది. ఈ రెండింటినీ సమానంగా చూడటం అంటే, త్రాసు లో వేసి కొలవడం కాదు. వాటిని అంతగా పట్టించు కోవద్దు అని అర్థం,! అనగా వాటి ప్రభావం మనసు పై పడకుండా,, చూడాలి, నిజానికి కష్టాలు మనిషి తెలివికి, అత్మ విశ్వాసానికి, పరిణత కు ఒక పరీక్ష ! తట్టుకొని దైర్యంగా నిలబడితే, అది అతడి ఔన్నత్యానికి, వ్యక్తిత్వ వికాసానికి, జీవన్ముక్తి కి తోడ్పడుతుంది,, తద్వారా విజయపథ మునకు తొలి సోపానం అవుతుంది . కావున ఇబ్బందులకు వెరవకుండా, మనసును చిక్కబట్టుకొని ఓర్పు తో నేర్పుతో, ఆత్మీయుల సహకారం తో,, సద్గురువు  ద్వారాి జ్ఞాన విచారం తత్వ విచారణ చేయడంతో, కలిగిన వివేకము, విచక్షణా జ్ఞానం తో, అలా తమ జీవితంలో అనుకోకుండా కలిగే ఇబ్బందులను ఎదుర్కొ నాలి!, ఎవరూ కూడా, ఏరి కోరి కష్టాలను కోరుకోరు,! తరుచుగా రోడ్డు పై జరిగే ఆక్సిడెంట్ లను కావాలని తెచ్చు కొరు,!, అప్పులు, బీదరికం, మరణాలు, నిస్సహాయత, వృద్దాప్యం, రోగాలు, నొప్పులు,, అనాధ లా బ్రతకడం,, అవమానాలు,, నిరాదరణ లు, ఆత్మీయుల వియోగా లు,, ఆకస్మిక మరణం, నష్టం, ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులు,, ఇలా మన మనసును కలచివేసే  ఎన్నో సంఘటనలు, బ్రతుకు పై నిరాశను కలిగిస్తుంటాయి ,! ఇవన్నీ నిజంగా కావాలని కొరుకున్నవి కాదు కదా,! అవి , చీకటి వెలుగుల వలె, చెప్పా పెట్టకుండా వస్తుంటాయి, పోతుంటాయి, కూడా! ,, మరణాలు లేని కుటుంబం లేనట్టే, కష్టాలు లేని వారు కూడా పృథ్వి లో ఎక్కడా  ఉండరు, , ఉండబోరు! కష్ట సుఖాల మయమే  జీవితం, బంగారానికి సాన పెట్టినట్టుగా, కష్టాలు మనిషి కి  అసలు తానేమిటో,, తన గమ్యం ఎక్కడో , సర్వాంతర్యామి అయిన పరందాము నీ వైభవం ఎంత గొప్పదో తెలుస్తుంది, లోన దాగిన జ్ఞాననేత్రం అనే మూడవ కన్ను తో, తన అంతరంగం లో కొలువున్న అంతర్యామి దర్శించ గలుగుతాడు.! అయినా ఎవరి కష్టం వారికే గొప్ప! అంటే, సీత కష్టం సీతకు గొప్పది,! అలాగే పీత కష్టం పీత కు గొప్పది;! భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, వీరిలో ఎవరి కష్టం పెద్దది!? అంటే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే, వారికి ఉండే ప్రేమానురాగాలు మానసిక శక్తి,, సంకల్ప బలం, ఆధ్యాత్మికత పై అనురక్తి, మీద ఆధారపడి ఉంటుంది!. మనుషుల్లో తేడా వచ్చేదే దీనితో!! కష్టాలను, ఇష్టాలను, దేనితోనూ పోల్చలేము,! "నాకు ఇది ఇష్టం!, కనుక నీవు కూడా దీనిని ఇష్టపడు!" అనలేము,! అదే విధంగా, కష్టాలు కూడా అంతే,!, ఒక్కోసారి ఒకదాని వెనుక ఒకటి, ఊపిరి ఆడకుండా కష్టాల పరంపర వస్తూనే ఉంటాయి! మనిషిలో అత్మ బలం దైవ భక్తి తగ్గితే, చాలు,, కష్టాలు వాడిని వెదుక్కుంటూ వస్తాయి ! ఇదే  పరిస్తితి మనిషికి నిజమైన పరీక్ష,! కష్టాలు మనుషులకు కాక జంతువులకు వస్తాయా ?, చెట్లకు వస్తాయా ,? అంటే కష్టాలు కేవలం మనుషులకే వస్తాయి, ఎందుకంటే మనసు ఉంది కాబట్టి!! మహాకవి ఆత్రేయ గారు, మనసు పై మనసు పడే వారి గురించి ఎన్ని గీతాలు రాశారు, మనిషికి మనసే తీరని శిక్ష! దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష ! అంటూ!! సున్నిత మనస్కులు కొంద రుంటే, పాషాణ హృదయులు మరి కొంత మంది ఉంటారు. గమ్మత్తు అయిన విషయం ఏమిటంటే ఎవరి కష్టాన్ని, వారే ఇష్టం లేకున్నా ,ఉన్నా, విధిగా అనుభవించాలి .!, సంపదలను పంచుకోవచ్చు ,!దాచుకోవచ్చు ! కాని ఒకరి ఇబ్బందులను మరొకరు ఏ మాత్రం  తీసుకోలే రు కదా! అయ్యో ! పాపం !ఎంత కష్టం వచ్చింది !"అని సానుభూతి చూపించడం మనిషి కనీస ధర్మం!..  మానవత్వం ఉన్నందున సహకారం సహాయం, సానుభూతి , జీవితం పై ఆశ, తిరిగి బ్రతకాల నే కోరిక  చిగురింప జెయాలి !. ఈ ధర్మమే తన కు శ్రీరామరక్ష గా మారి, కష్టాలు కడగండ్ల నుండి రక్షిస్తుంది. నీవు ఇతరులకు ఏది ఇస్తా వో, దేవుడు కూడా నీకు అదే ఇస్తాడు కదా! అందుకే ఇవ్వడం నేర్చుకోవాలి , ప్రతిఫలాపేక్ష లేకుండా ! జీవితంలో పడే  కష్టాలను జ్ఞాపకం ఉంచుకున్నంతగా   , సుఖాలను గుర్తు పెట్టుకో ము కదా,! ఎందుకంటే సుఖాలు మన గొప్పదనం గా, కష్టాలు భగవంతుని నిర్దయగా భావిస్తూ ఉంటాము ! అంటే ఇదంతా కేవలం  మనసుతో పని, మనసు ఆడే, ఆడించే ఆట, అన్నమాట .!. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఒకసారి నెహ్రూ ,గాంధీ లాంటి ఇతర ప్రముఖులతో పెద్ద సమావేశం లో  దేశ సమస్య ల గురించి దీర్ఘంగా ఉపన్య సిస్తూ ఉన్నారు, !అప్పుడు ఒకరు చిన్న చీటీ తెచ్చి ఆయనకు  ఇచ్చారు,! అందులో అతని "తల్లి స్వర్గస్తు రాలైంది !"అని రాసి  ఉంది.! ఒక్క క్షణం నిశ్శబ్దంగా తల వంచుకొని నిలుచుండి పోయారు తర్వాత.  గుండె నిబ్బరం చేసుకుంటూ, పొంగి వచ్చే దుఖాన్ని ఆపుకుంటూ, తన ఉపన్యాసాన్ని అలాగే కొనసాగించాడు పటేల్.! అదే ధృఢ సంకల్పం,, నిజామ్ లాంటి మొండి రాజులను కూడా, తల వంచి, అఖండ స్వాతంత్ర్య భారత దేశంగా అవతరిం ప జేశాడు, అందుకే ఆయనను ఉక్కు మనిషి అంటారు, అదీ ఒక వ్యక్తి యొక్క విశాల భావాన్ని , వ్యక్తిత్వాన్ని,, జ్ఞాన పరి పక్వత ను సూచిస్తుంది ! మనం ఎంత భయపడి తే, కష్టాలు మనల్ని అంత వేగంగా తరుముతూ ఉంటాయి!. లేచి నిలబడి, "ఇంతే కదా! ఇంతకన్నా నీవు నన్నేం చేయగలవు ,?" అని ఎదిరిస్తే, కొండంత కష్టాలు తోక ముడుచుకొని వెనక్కు అడ్రస్ లేకుండా  పారిపోతాయి, అనగా మనకు అర్థం అయ్యేది ఏమంటే కష్టం అని అనుకోవడం, మన మానసిక దౌర్బ ల్యాన్ని సూచిస్తుంది, అంతే ! కొందరు, రోజూ, టీవీలో సీరియల్ చూస్తూ నాయిక పడే కష్టాలు చూడలేక వల వలా ఏడుస్తూ విలన్ లని తెగ తిడుతుంటారు;. అంటే తమ మనసును గట్టిగా పట్టుకోవడం లో ఓడి పోయారు అన్నమాట .. అలాంటివారు,, టీవీ సీరియల్ చూడలే కుండా ఉండలేరు! చూడకపోతే , పిచ్చివారు అవుతారు,! చూస్తే ఈ లోకం వదిలి, ఆ మిద్యా సీరియల్ ప్రపంచంలో పాత్రలతో బాటు తాము స్పందిస్తూ ఉంటారు,! అది అబద్దం అని వారికి తెలుసు,! అయినా ఆ టీవీ సీరియల్ లకు "దాసోహం" అనడం, వారి బేలతనాన్ని,, పరి పక్వత లేని వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది,!, అదే విధంగా నిజ జీవితంలో కూడా మనం పడుతున్న ఇబ్బందుల తో మనం ఇష్టపడి కష్ట పడటం లేదు. కదా ! జీవితంలో, అనుకోకుండా జరిగే ఆకస్మిక ఘటనలకు మనం బాద్యులం కానే కాదు.! అలా జరుగ వల్సి ఉంది, కనుక జరిగింది  ! కారణం లేనిది ఏది జరుగదు!. నీకు అనుభవించే యోగం ఉంటే కష్టమైన సుఖమైన ఎక్కడున్నా ప్రాప్తిస్తుంది.!. అంతే, ఎవరు జేసిన కర్మను వారు అనుభవించక ఎవరికైనా , ఎక్కడున్నా తప్పదు కదా !, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించేదరు  ,?" అన్నట్టుగా, శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి దేవుళ్ళకు తప్పని తిప్పలు, కష్టాలు,, అతి సామాన్యుల ము,, మనకు కూడా తప్పవు,! మహా మహా ఋషులు ,జ్ఞానులు, పండితులు,, కవులు, నాయకులు, రాజాధిరాజు లు కూడా కష్టాల కు అతీతులు కాదు,! కొందరు బుద్ధిమంతులు , యోగులు, మహానుభావులు ,ఈ కష్టాలను భగవంతుని ప్రసాదంగా భావిస్తారు,! రామదాసు గారు ఘోరమైన చెరసాల కష్టాల్లో కూడా , ఏ మాత్రం వెరవకుండా శ్రీరాముని మరవలేదు!, శ్రీరామచంద్రుని పాదాలు విడువలేదు,,! కష్ట సుఖాలను రెంటినీ రామాను గ్రహం గా భావించి, తరించాడు, అలాగే,, కుంతీ మాత అంటుంది కృష్ణయ్యతో, "కృష్ణా ! దయతో ,నాకు ఎల్లప్పుడూ కష్టాలు ఉండేలా అ నుగ్రహించు! అని కోరింది ; , ఎందుకంటే కష్టాల్లో నే నిన్ను గట్టిగా, నీ పాదాలు విడవకుండా శరణాగతి చేస్తూ భక్తితో  పట్టుకుంటాం!, త్రికరణ శుద్ధితో కొలుస్తాం,! ప్రహ్లాదుడు, గజేంద్రుడు, సీతా దేవి, పాండవులు ఇలా భక్తులందరూ కూడా  కష్టాల పరంపర ఎంత తీవ్రంగా ఉంటే అంత గా పరమాత్ముని శరణు కోరారు,, !అంటే బవబందాలకు దూరం అవుతూ భవ్యమైన, దివ్యమైన, అమృత తుల్యమైన, పరమ ఉత్కృష్టమైన మానవ జన్మను పావనం చేసే భగవన్నామ సంకీర్తన చేస్తూ పారందామున్  సన్నిధానానికి దగ్గర అయ్యారు ! అందుకే కష్టాల్లో మనం చేయాల్సింది ,,ఒకటి ;:: హరినామ స్మరణ,, రెండు,,!:: ఒక గీత ప్రక్కన ఎంత మరొక పెద్ద గీత గీస్తే, ఇది అంత చిన్నది అవుతున్నట్టుగా , నీకంటే ఘోరమైన, దుర్భరమైన, నానా వేదన లు పడుతున్న ఎంతో మంది విది వంచితులను పరికించి చూడు! క్షణం లో , నీబాధ మటుమాయం అవుతుంది.! మూడవది!::, ముఖ్య మైనది,!" కష్టం" అనేది నిజంగా ఎదుట ఒక పదార్థంగా  నిలబడి లేదు! అది ఒక భావన మాత్రమే ! దానికి రూపం గుణం లేదు ! అది వ్యక్తిలోని బలహీనత మాత్రమే !, నీ మనసు భయపడితే, నీకు కష్టంగా అనిపిస్తుంది,! ఆ , కష్టం ను ఇష్టంగా, సంతోషంగా, పరమాత్మ ప్రసాదంగా స్వీకరించు,!, లేదా, దానిని లక్ష్య పెట్టకు,! అంతా మన మంచికే అనుకో,!  భగవద్గీత ఉపడేశానుసారం", నీ మనసే నీకు మితృవు,! నీ మనసే నీకు శత్రువు,!"గమ్మత్తు అంతా అనుకోడం లో ఉంది,! భయపడితే త్రాడు పామై కష్ట పెడుతుంది .. అందుచేత భయం అనే దెయ్యాన్ని తరిమికొట్టే మనో నిబ్బరం, అత్మ స్థైర్యం, ఏర్పడేలా గుండెను దిటవు చేసుకో అలా కష్టం ను మనసు నుండి తొలగించే సేయి  !  నిజంగా కష్టం అంటే చావు,! మరణం,! దానిని మించిన కష్టం ఈ పృథివి లో ఎక్కడా, ఎవరికీ  ఉండదు ..! మరణానికి ఎందుకు భయపడాలి,! అంటే ,, "బందువులు ,, అస్తి డబ్బు, భార్యా పిల్లలతో భోగ భాగ్యాల కు నోచుకోకుండా, చచ్చి పోతున్నాను!" అని అనుకోకుండా ," అయ్యో! మంచి పనులు, సత్సంగం, పరోపకారం, హరి నామ స్మరణ, లు ఈ మానవజన్మ తోనే సాధ్యం కదా , గోవిందా! నాతో  ఆ పుణ్యకార్యాలు చేయించవా? , అనాథలకు, బీదలకు, దివ్యాంగులకు సేవ,, గంగా స్నానం, భగవద్గీత పారాయణం చేయడం, లాంటి, మానవ  మాధవ సేవలు, బ్రతికి ఉంటే ఇంకా తనివితీరా చేసుకునే వాళ్ళమే కదా నారాయణా !, స్వామీ ! నీ సేవలో, అర్చనలో, పూజన,, స్మరణలో భజన లో , అందరితో కలిసి పాల్గొంటూ సదా తరించే వారమే కదా, గోపాలా! , అయ్యో !, నా సద్గతి కి, సద్బుద్ధి కి, సద్భావన సంపదకు దూరం చేస్తున్నావా తండ్రీ ;! అని ఆర్తితో, ఆశతో ఆవేదనతో ఆరాటం తో ఉండగా దానికి ముగింపు పలికే  చావుకు  భయపడటం ఒక యోగి లక్షణం !మరణ ఆసన్న సమయంలో దానిని పరమాత్ముని ప్రసాదంగా భావించే మనిషి జన్మ సార్థకం, !ఉత్తమం,! పరమానంద కరం!, భక్తి ముక్తి ప్రదాయకం,! భవ భయ నివారణ కరం,! జన్మజన్మల కర్మబంద విమోచన కరం,! శ్రీహరి పా దకమలాల చెంత సమర్పింపబడిన , నా అంతరాళం లో నీకై  పూచిన హృదయ కుసుమం వేణు గాన లీలా, భక్తజన పరిపాలా,, లీలా మానుష వేష ధారి, మురారి, నటన సూత్ర ధారి ! శరణు ! హరీ, శరణు! పరమేశ్వరా శరణు !"! హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే,!హరే రామ హరే రామ రామ రామ హరే హరే  !! అంటూ భయాలను పారద్రోలి,  శ్రీకృష్ణుని చరణ కమలాల ముందు  మోకరిల్లి భక్తితో మన లను వేధించే  కష్టాలను సమర్పించి,ఆ సమస్యలను నుండి మనల్ని కాపాడే బరువు బాధ్యతలను రాధామాధవునికే  అప్పగి స్తే చాలు భారం, తగ్గుతుం ది ..!మానసిక శారీరికి, కష్టాలనుండి శాశ్వత విముక్తి నీ అనుగ్రహిస్తాడు నంద నంద నుడు, నవనీత చోరు డు , బృందావన విహారుడు,,!!! ఆ విధంగా అచ్యుతునికి, మన మనసును  కైంకర్యం చేస్తే , సమస్యల నివారణ ఉపాయాలను, తగిన సమయస్ఫూర్తి నీ, దైర్యాన్ని శ్రీకృష్ణుడు  తప్పకుండా అనుగ్రహిస్తాడు !," ఎంత విశ్వాస మో అంత ఫలితం!" భగవంతుని , నమ్మి చెడిన వారు లేరు ,!" అనుదినం, అనుక్షణం ఏది జరిగినా ,ఏది చేసినా శ్రీ కృష్ణా ! నీకు సమర్పయామి ! అంటూ అంతా ""శ్రీ కృష్ణ కృప  ""గా భావించడం , చేయవలసిన పనులు ఆపకుండా చేస్తూ పోతూ ఉండటం మన జీవితప్రధాన లక్ష్యం ;! కావాలి ; అందుచేత కష్టసుఖాలు సమానంగా చూడటం అంటే, "ఇది కష్టం ఇది సుఖం!" అనే భావన లేకుండా, చేస్తున్న పనిలో ఫలితం ఆశించకుండా, ,నిష్ఫలాపెక్ష తో చేస్తూ ఉంటే, మానవ జీవితం, మాధవుని కి అంకితం అవుతుంది,! మన జన్మ సార్థకం అవుతుంది ! అందుకే హరే కృష్ణ హరే కృష్ణ , అంటూ,, నిరంతరం దైవ ద్యానం లో ఉంటూ, మన జీవితాలను ఆనంద మయం గా చేసుకుందాం!  జై శ్రీకృష్ణా j జైజై శ్రీకృష్ణా ! స్వస్తి !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...