Tuesday, June 11, 2019

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు

శ్రీ వేంకటేశ్వర స్వామీ !"అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ""అన్న బిరుదు నీకే తగు నయ్యా, ఏడుకొండల  స్వామి ! ఎందుకంటే ఆ దర్పము, ఆ రాజసము, ఆ వైభవము, ఆ ఆశ్రిత జనపరిపాలనా దక్షత,,ఖండాంతరాలకు పాకుతున్న  మహోన్నతమైన, ఆ వర ప్రదాయ కత్వ హస్త వైభవం,, ఆ శరణాగత అభయ హస్త తత్వం, ఇదంతా కనీసం ఊహించుట కై నా, మా బోటి వారికి సామాన్య విషయమా ,? నారాయణా ! నీ అమేయ అప్రమేయ అద్వితీయ అమోఘ ,దివ్య ప్రభావం అలా అలా ప్రశాంతంగా , లోక కళ్యాణ కరంగా, సకల జనుల ఉద్ధరణ కు, వ్యాపిస్తూ, సకల ప్రాణికోటికి శ్రీరామరక్ష గా, నీ గోవింద నామం నిలుస్తోంది!", వినా వెంకటేశం, అనాథ అనాథ, సదా వెంకటేశం స్మరామి, స్మరామి!  ""వేంకటాచల సంస్థానం, బ్రహ్మాండే నాస్తి కించన,!, వేంకటేశ సమో దేవో, న భూతో న భవిష్య తి!""" అంటూ అనుదినం నీ సన్నిధిలో చేరి, నీ అపురూప దర్శనం చేసి, నీ నివేదిత లడ్డూ ప్రసాదం, తో మేము నిరంతరం దన్యులం అవుతున్నాం ,! భక్తజన హృదయ మందారా!,మధుసూదనా ,,! పద్మావతి మనో నాయకా,!రాధా మనోహరా! నీ కు అపారమైన భక్తితో , నిత్యం మంగళహారతి పా డుతూ , నిన్ను మెప్పించి,, నీ భక్తిలో తన్మయం తో, జీవించి, చివరకు నీ లో నే  లీనమై న పరమ వైష్ణవ భక్తురాలు, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం లో తృప్తిగా నీ ప్రసాదాన్ని ఆరగించి, ఎంతో ఆనందంతో, ప్రశాంతంగా నిన్ను తలచుకుంటూ మేము ఇంటికి తిరిగి వెల్తు ఉంటాము  ! ఇలా భక్తజన సందోహం రోజు రోజుకూ పెరుగుతూ నీ కీర్తి ప్రఖ్యాతుల ను దశ దిశల్లో ప్రసరింప జేస్తు ఉన్నాయి.! మహరాజ మాన పూజీ తులైన మహారాజ శ్రీ బిరుదాంకి త లక్ష్మి రమణా,!" నీ పరమ అద్భుతమైన దివ్య మహిమలను నుతించుటకు ,నిరంతరం నీ పడక పానుపు గా ఉండి సేవిస్తున్న ఆ  వేయి పడగల ఆదిశేషుడు గానీ,, బ్రహ్మ మానస పుత్రుడు, నారాయణ నామ గాన పరవశుడై న నారదాది మహర్షులకు గానీ, బ్రహ్మాది దేవతలకు గానీ పోగడ తరం కాదుగదా,!! ఒక్క నీ అనుంగు మిత్రుడు, ఆరాధ్య దైవం అయిన ఆ పరమేశ్వరుడు  తప్ప, నీ గురించి నీ ఆదిమధ్యాంత రహిత స్వరూపతత్వ విచారణ చేయడం మరెవ్వరికీ సాధ్యం కాదు కదా, స్వామీ!" శ్రీనివాసా,!ఆపదమొక్కుల వాడవని, అనాథ రక్షకుడ వని, వడ్డీ కాసులవాడవనీ, శరణాగత వత్సలుడవని,, అబ్బో ! ఎన్ని బిరుదులు నీకు !! నీకున్న  నీ సహస్రనామాల కంటే ఎక్కువగా నీ భక్తులు ప్రేమతో పీలుస్తూ ఇచ్చే నామాలే ఎక్కువగా ఉంటున్నాయి, ! వారు నిన్ను ఎంత పొగిడితే అంతగా వారిపై కరుణ చూపిస్తూ ఇంకా పొంగి పో తూ , కోరిన వరాలు ఇస్తావట , వారి ఇంట ఇలవేలుపు గా అవతరిస్తా వట !! ఏమీ దయ తండ్రీ నీది,, సముద్రాల కు సకల భువనాల కు హద్దు ఉంటుందేమో కాని, కేశవా, నీ దయామృతానికి హద్దులు ఉండవు కదా,, శేషాద్రి నిలయగోవిందా ! మొక్కులు, కోట్లలో  ఇస్తున్నారు, ఎన్ని ఇచ్చినా నీవిచ్చిన ఈ మానవ జీవిత సౌభాగ్యానికి వెలకట్ట గలమా,? ఈశ్వరా,! ఇదంతా నీదే,,! నన్ను  కూడా  నేవాడిగా చేసుకో పరంధామా ,!పరాత్పరా,! శ్రీనివాస ప్రభో !తిరుమల వాసా!, శ్రీ వేంకటేశా,! ప్రభూ !నీవే గాని, ఇలా భక్తుల నిలువు దోపిడీ చేయకుండా ఉంటే, పాపం, మా వద్ద ఉన్న  కోట్లాది డబ్బును, కిలోల కొలది వెండి బంగారాలను ఎక్కడా దాచుకునే వీలు ఉండేది? చెప్పు !! నీవు మాపై కనికరించి  అందిస్తున్న దయా హస్తం, అభయ హస్తం ధర్మమా అని, నీ భక్తులు గా చెలామణి అవుతున్న మేము ఇలా  నిర్భయంగా, నిశ్చింతగా, ప్రశాంతంగా, పన్నుల బారిన పడకుండా, దొంగల కన్ను కప్పుతూ, చక్కగా జీవనాన్ని గడిపే స్వర్ణ అవకాశాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. కదా ,, తండ్రీ , ! నేవే కాని అలా చేయకుండా పోతే, మేము ఈ డబ్బుల వ్యామోహంలో పడి, పిచ్చి వాళ్ళం అవుతూ, నీ దయ కు నోచుకునే వాళ్ళం కాదు కదా  అనంత శయనా !అలా పోగేసిన ధనం, ధాన్యం, పసిడి మూట ల వ్యయం, చక్కని ధార్మిక, ఆధ్యాత్మిక, సాంఘిక, సాంకేతిక, విద్యా, వైద్య, వేద శాస్త్ర బోధనల,, గోశాల, ,వృద్దశ్రమాల  సంరక్షణ , దేవాలయ పునర్నిర్మాణ పనుల లో, నిరంతర అన్నదాన కార్యక్రమం లో ఉపయోగపడటం మాకు పరమానాందాన్ని నీపై అపారమైన భక్తి శ్రద్ధల ను కలిగిస్తూ ఉంటున్నాయి , ఇది వాస్తవం , నమ్మ శక్యం కానిపచ్చి నిజం !ఇలా నిన్ను శరణు అన్నవారి కి ఉచితంగా ఉదారంగా ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక ఉద్యమం లా  వినియోగిస్తూ నిర్వహిస్తున్న ఓ కలియగదైవ మా !నీకు శతకోటి ప్రణామాలు,,! స్వామీ ! మాకు నీవు చూపించే వి నాలుగు హస్తాలు , !కాని మరి నాలుగు హస్తాలు కూడా మాకు కనపడకుండా దాస్తున్నవ ట , కదా !నీ సోదరి, నారాయణి, అష్ట భు జి గా అంటే ఎనిమిది చేతులతో, సాక్షాత్తూ అపర కాత్యాయని మాతగా దర్శనం ఇస్తూ జగతిని తన చల్లని చూపులతో కాపాడుతూ అన్నకు తగిన సోదరి వలె, భాసిస్తూ ఉంది, కదా ! అసలు, స్వామీ నీ పూర్వ రూపం సాక్షాత్తు నీ సహోదరి దుర్గాదేవి గా చెబుతారు, ! దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ,, శరణాగత వత్సలత తో, అభయ హస్తం తో , మీ భక్తుల ను సదా బ్రోచి రక్షించే ,అపార కరుణా సముద్రు లు మీ అన్నా చెల్లెలు.. !!ప్రత్యక్ష నిజ పరబ్రహ్మ రూపాలు మీరు !. మీ ఇద్దరికి  మాత్రమే ఆ వర ప్రదాత లనే బిరుదు చెల్లింది కదా!! శ్రీహరీ! శ్రీమద్రామా నుజులు, అపర శ్రీవైష్ణవ భక్తుడు,, సాక్షాత్తు శ్రీమన్నాాయణు నీ  దివ్య అవతార మూర్తి, గా పరిగణింప బడు తూ, ఉంటూ ఉండగా ఆయన  మహిమా ప్రభావం, వల్ల, నారాయణి  ఉగ్ర  అష్ఠభుజ మూర్తి రూపం కాస్తా పరమ శాంత స్వరూపంతో, బిచక్కని చిరుమందహాసం తో ,, వేంకటేశ్వర స్వామి వై,వజ్రమకుట కిరీట దారివై  నారాయణుడి చతుర్భుజ సాలగ్రామ శిలా రూపం గా మారి, శ్రీ వైష్ణవ భక్తుల పాలిట కొంగు బంగారంగా, తిరుమల గిరివాసుని గా దర్శనం ఇస్తున్నావు! కాలక్రమేణా .. నీ గర్భగుడి మా పాలిట ఆనందనిలయంగా అవతరించింది  కదా !, ఆ మహా సాద్వికి తోడబుట్టిన అన్నగారి వి నీవు! అంతేకాదు,,, వక్షస్థలం లో భార్యా రత్నం అయిన లక్ష్మీ దేవిని ధరించిన నీ కు ఏమి తక్కువ , ?స్వామీ, నారాయణా,! చక్రం ఆయుధంగా  ధరించి, నిన్ను శరణు కోరే భక్తుల కష్టాలను తొలగిస్తు న్నావు,! గోవిందా,! శంఖ నాదం తో నీపై భక్తి శ్రద్ధలతో నిన్ను సేవించుకునే జ్ఞానాన్ని పెంపొందిస్తు న్నావు,! గోపాలా,!నందనందన ,! గదా దరుడివై భక్తులలో నీపై అచంచల విశ్వాసం, గురి, అంకిత భావాన్ని కలి గీస్తూ ఉన్నావు!, శ్రీదేవి భూదేవి సహిత శ్రీని వాసా ,! నం ధకం అనే ఖడ్గ ప్రసారం తో భక్తుల సంఖ్యను అంచెలంచెలుగా పెంచుతూ, ఆధునికత లో ఆధ్యాత్మికత ను రంగరిస్తు నీతో అనుబంధాన్ని భక్తులలో అనురాగాన్ని ఇనుమడింప జేస్తున్నావు, కదా ! భక్తవత్సల, !పురాణ పురుషా,,! నవనీత చోరగోవిందా,! నాల్గవ ది అయిన , శారంగ మును వామ హస్తంలో, బాణాన్ని కుడి హస్తం లో పట్టుకొని, నీ చల్లని కరుణా మృత వీక్షణాలు అనే మృదువైన ఆశీర్వచన కిరణాలను సకల భువనాల లో ఉండే ప్రాణికోటి పై కురిపిస్తూ, నీ జగన్మోహ నాకార విశ్వరూపాన్ని ప్రకటిస్తున్నాయి గదా! తండ్రీ,,! అరుణారుణ రంజిత సుకుమారమైన నీ అరచేతుల్లో  విరాజిల్లే పద్మం యొక్క కాంతులు మరియు సుగంధ పరిమళాలు,భక్తుల హృదయాలలో నిన్ను చూడాలి , నీ సుందర మందహాసం దర్శించాలి అన్న భావ సంపద ను , తపనను, నీపై ఆరాధన ను నానాటికీ ద్విగుణకృతం చేస్తోంది, కదా ! స్వామీ ! నీవు !ఏం మాయ చేస్తున్నావో , విష్ణు మాయను ప్రదర్శిస్తూ ఉంటున్నావో గానీ, ఎన్ని సార్లు నీ కొండపై కి వచ్చినా తృప్తి ఉండటం లేదు, మెట్ల ద్వారా కాలినడకన వస్తూ, పొర్లు దండాలు పెడుతూ, తల నీలాలు ఇస్తూ, చంటి పిల్లలతో,24 గంటల పైగా నీ దర్శనం కోసం నిరీక్షిస్తూ క్యు లో నిలబ డుతూ, నీ దివ్య మైన మంగళ కర రూపాన్ని ఎన్ని సార్లు దర్శించినా మాకు తనివి తీరడం లేదు కదా లక్ష్మీ వల్లభ ,!! ఇదేం వింత అనుభవం, యశోదా కృష్ణా ,!, ఇది నాలోని భక్తి శ్రద్ధల లోపమా,? లేదా జగన్నాథ !,నీకు నా మీద గల కృపలో లోపమా ? ఏది కూడా  నాకు తెలియ రావడం లేదు !గరుడాద్రి వాసా!, శేషాద్రి నిలయగోవిందా,,! అనంత శయన, !గోపీ మనోహర,! యశోదా కిషోరా, !మాకు నీ గురించిన అసలు పరిచయం నీ పరమ భక్తుడు, నీ లీలా వినోద ములందు అనురక్తుడు అయిన నీ సంకీర్తనా చార్యుడు గా ప్రసిద్ది పొంది, వేల సంఖ్యలో భక్తి జ్ఞాన వైరాగ్య భావనా తరంగాలతో నిన్నే కాకుండా సకల వైష్ణవ భక్త లోకాన్ని భక్తి పారవశ్యం లో ఒలలాడిస్తున్న తాళ్ళపాక అన్నమాచార్యుల అద్భుత అపురూప ఆనందకర కీర్తనలతో నేవేమితో, మేము ఏమిటో, ఈ ప్రపంచంలో నీవు నాతో ఆడుకుంటున్న  జీవితం అనబడే ఈ నాటక రంగం ఏమిటో కొద్దిగా తెలుస్తోంది,,,అన్నమాచార్య నుతా ! అతడు  నీ కీర్తి పతాకాలను ఎగురవేస్తూ, పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా, ఇంటింటి ఇలవేలుపు గా, నీ ఖ్యాతిని మరింతగా ఇనుమడింప జేశాడు గదా , శ్రీ మన్నారాయణా ,! నిన్ను శ్రీకృష్ణుని అవతారం మూర్తిగా, దివి నుండి భువికి దిగివచ్చిన అలమేలు మంగ పతిగా, అందమైన పదాలతో, శృంగార రస రమ్య భావంతో అన్నమయ్య చెబితేనే , మాకు నీపై భక్తి పారవశ్యం పొంగుతూ తెలుస్తూ ఉంటుంది, ! గోవిందా !ఇంతగా అన్నమయ్య కీర్తనలు నీ భక్త లోకానికి, నీపై ఎనలేని  భక్తిని ,ప్రేమానురాగాలను కలిగించడానికి అసలు కారణం, ఆయన రూపంలో స్వామీ , నేవే అవతరించి  మాకోసం, మాలో భక్తి విశ్వాసాలు పెంచడానికి , మా జన్మ తరించడానికి , వచ్చావు కదా ! ఆ పాటల మాధుర్యం తో,మంత్రము గ్దు లను చేస్తున్న నీపై, నీవే అద్భుత సంకీర్తనలను మాకు అందించావేమో ,,! ఏమీ కీర్తనలు అవి, ?ఏమా భావ సంపద,? వైకుంఠము లో ఉంటూ ఎదుట లక్ష్మీ నారాయణుల దివ్య లీలలను, ఆట పాటల ను, భక్తుల మనభావాల ను అమ్మవారి అలుక, కోపతాపాల లో దర్శించి , తీర్చి, సముదాయించి , వారిని బుజ్జగించే శ్రీకృష్ణ పరమాత్మ లీలా వినోదాలు, వైరాగ్య భావంతో, శ్రీహరి నీ నుతించని జన్మ దండగ అంటూ, ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేశారు మీరు..!,, అంతయూ నీవే హరి పుండరకాక్ష ! "లాంటి అద్భుత, అపురూపమైన సుమధుర కీర్తనలను అనుభవిస్తూ , ప్రతీ పదంతో రమిస్తూ, భావిస్తూ ," ఒక్క సంకీర్త నే చాలు,, ఒద్దికై , మము రక్షింపగా,! !""అంటూ ఆర్ద్రత తో, అనురాగ రంజిత ముగా రచించి ,ఆబాలగోపాాన్ని అలరించి ఆనందింప జేస్తూ , తనసంకీర్తనల వైభవాన్ని అందించిన ఆ మహనీయుని కి, తెలుగు జాతి యావత్తూ శాశ్వతంగా రుణపడి ఉంటుంది !, అలా నీపై, వేంకటేశా , నీకు సమర్పయామి అని సంబోధిస్తూ ప్రతి పాటలో ,ఆత్మార్పణ భావంతో శరణాగతి చేస్తూ , తానొక్కడే కాకుండా, యావత్ శ్రీకృష్ణ భక్తలోకాన్ని తన సంకీర్తనా మాధుర్యం తో, తరింప జీస్తున్న నీ ప్రియభక్త శిఖామణి అయిన  అన్నమయ్యకు  శిరసా వచ సా మనసా కెలుమొడ్చి కృతజ్ఞతా పూర్వక ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాము,  కల్యాణి,, మద్యమావ తి , లాంటి ఎన్నో రాగాల్లో , పాడుతూ స్వామి మహిమను ఆత్మలో అనుభవిస్తూ ఆనందిస్తూ తన్మయత్వం పొందుతున్నాము . ఒక్క తెలుగులో నే కాకుండా, సంస్కృతం లో కూడా తనకున్న పట్టూ, అసాధారణ ప్రజ్ఞా ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ  కీర్తనలను రచించడం , నీపై తనకున్న అవ్యాజమైన ప్రేమను ఊహించడం కూడా. అసాధ్యం! నీ మహిమ ను మానవ మేధస్సుు కు వర్ణించుట మా బోటి సామాన్యుల తర మా , ?.,గోవిందా ! అన్నిటికంటే ముఖ్యంగా, వేంక టా చల వాసా, నీవు కొలువై ఉంటున్న  ఆ ఏడుకొండల మహత్తు ను ఏమని చెప్పను? అనుదినం, అనునిత్యం, అనుక్షణం నీకై విరహ వేదన అనుభవిస్తూ వున్న గోపికల వలె, నిత్యం నీ దర్శన భాగ్యం కోసం తహతహ లాడు తూ వస్తున్నాం ! దేశం మారు మూల నుండి, భక్తజనాలు తండోపతండాలుగా ఎండ, వాన చలి లక్ష్య పెట్టకుండా, వృద్ధాప్యాన్ని లెక్క పెట్టక, బాలింతలు, దీర్ఘ రోగులు, దివ్యాంగులు, పిల్లలు యువత, పెద్దవారు వారిలో ఉంటున్నారు.. ఈ యాత్ర అనుభవం ఎలా ఉందంటే,, సకుటుంబ సమేతంగా తమ ఆత్మ బంధువు గురించిన పెండ్లి కి, పిలవని పేరంటం గా, అత్మార్తులై, వెళ్తున్నట్టు గా ఉంది.. ఎంతో తిప్పలు పడుతూ వస్తుఉండడం, శ్రీనివాసా , గోవిందా ! అదంతా నీ దివ్యక్షేత్ర మహిమా ప్రభావం కాదా?, తిరుమల యాత్రికుల లో నిన్ను చూడాలన్న  కుతూహలం, ఉత్సాహం ,ఆర్తి ,ఆరాటం అందరిలో  కనబడుతాయి .! దేశ విదేశాల్లోని మారుమూల ప్రాంతాల్లో నీ ఆలయాలు స్థాపించి, దర్శిస్తూ కూడా,,తృప్తి చెందకుండా నీ సన్నిధి యే తమ పెన్నిదిగా తలచి తరిస్తున్నవారు కోకొల్లలు..! నీ కొండపై కి వస్తున్న భక్త కోటిలో, ఏ ఒక్క భక్తునికి కూడా అనారోగ్యం కారణంగా,, బాధ పడటం ఉండదు, !నిన్ను అంత రద్దిలో, త్రోపులాటలో, కొన్ని సెకండ్ ల కాలంలో మాత్రమే, చూడ గలిగినా, ఆకాశంలో తళుక్కుమని మెరిసే నక్షత్రం లా అగుపించే నీ నగుమోము, ఆ గజమాలల్లో ఆ స్వర్ణ ఆభరణ కాంతుల వెలుగుల్లో దేదీప్యమానంగా మెరిసే శంఖ చక్ర గదా ఖడ్గ ధారివై ప్రకాశించే నీసురుచి ర సుందర లావణ్య దివ్య రూప వైభవం, ఇదంతా ఆ కొద్ది క్షణాల్లోనే తనివా రా మనసారా, కనులారా కాంచగలిగేమా ,? వేంకటేశా! అయినా అనితర సాధ్యమైన, అపురూపమైన, నీ దివ్య మంగళ కరమైన విగ్రహాన్ని చూశాము అన్న ఏదో సంతృప్తి, అనందం, ప్రశాంతత హృదయంలో నిండి  అనిర్వచనీయ మైన ప్రేమను నీతో అనుబంధాన్ని ," గోవిందుని  ఇంకా చూడాలి,!" మరోసారి తప్పకుండా కుటుంబ సమేతంగా రావాలి, !మనసులో కదిలే కోరికల మొక్కు లను  తీర్చుకోవాలి !""అన్న ధృఢ సంకల్పంతో ఇంటికి తిరిగి వస్తుంటా ము! గోవిందా,! మాకు ప్రశాంతమైన, మనసుకు  ఎంతో ఆహ్లాదకరంగా ఉంటున్న నీ ఆనంద నిలయ సన్నిధి, వైభవం ఎప్పుడూ కళ్ళకు కట్టినట్టుగా హృదయ ఫలకం పై చిత్రించబడి , దానిపై నీ శిలా మూర్తిని ప్రతిష్టించి ఉంటుంది,! వెంగమాంబ అన్నదాన ప్రసాదం తింటూ ఉంటే మాకు కొత్త శక్తిని, చైతన్యాన్ని, నీ పై భక్తి భావ తరంగాలను రెట్టింపు చేస్తూ ఉంటుంది..! కోట్లాది భక్తులను ఇలా బలమైన అయస్కాంత శక్తి క్షేత్రం లో చిక్కుకొని, ఆకర్షింప బడి, తిరిగి రాకుండా అతుక్కు పో యే గుండు సూ దుల వలె, నీ చల్లని చూపుల లో మా మనస్సు తనువూ బంధింప బడి పోతున్నాయి, స్వామీ ,! వేంకటేశ్వరా,! అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా!,ఆదిమద్యాంత రహిత, దేవాది దేవా!, దివ్య ప్రభావ,,! స్వామీ! జీవితంలో ఎవరూ ఎన్నడూ  మరిచిపోలే నీది, నీ బ్రహ్మోత్సవ వైభవం ,!! నీ మహత్తు ఆ ఏడుకొండలపై, ఉందా ? పవిత్ర పుష్కరిణీ జలాల్లో, ఆకాశగంగ,, పాపవినా శిని ధారాపాతంగా కురిసే అమృత వాహినిలో,, ఉందా ?? నిత్య కళ్యాణం, పచ్చ తోరణం లా అందంగా భా సించే నీ కమనీయ రమణీయ మనోహర సాలగ్రామ శిలా రూపంలో ఉందా !??నిత్యాన్నదాన క్షేత్రం లో ఉందా?, లేక, నీ మేను నుండి వెలువడే ఆ కరుణా మృత పూరిత , పరిమళ భరిత, సుగంధ సుమధుర సువాసనా నిలయంగా వీస్తున్న  ఈ చల్లని శీ తలవాయువులలో ఉందా,? రాత్రి పగలు అనకుండా , నీ దర్శనం కోసం పడిగాపులు పడుతూ,  ఖర్చులు, శ్రమా ఆయాసం, అలసట భరిస్తూ , గంటల తరబ డి భక్తులు ఎక్కుతూ గోవిందా అంటూ కీర్తిస్తూ వస్తున్న ఆ  మెట్ల దారిలో  ఉందా ? ఎవరికీ ఈ దివ్య రహస్యం తెలియ దు,,! ఒక్కటి మాత్రం నిజం ! కాని నీ వున్నావు . !ప్రత్యక్ష సాక్షిగా మా చర్యలను గమనిస్తూ , మాలో అంతర్యామిగా, నిన్ను ఉంటున్నావు! మా చుట్టూ, సర్వాంతర్యామి గా ఎదుట కర్మ సాక్షి, ప్రత్యక్ష సూర్యనారాయణ మూర్తి గా, దివ్య ఔషధాల అమృత ప్రకాశంతో చల్లని వెన్నెల కాంతుల వెదజల్లే చంద్రుని గా అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నాము,, భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశము ల పంచభూతాలలో నీ ప్రతాపాన్ని, పరమ కారున్యాన్ని  నీ దయగా,, అనంతమైన నీ ప్రేమగా నిరంతరం మేము అందుకుంటు, నీ సన్నిధిలో ఉంటున్నం త ఆనందంగా, జీవిస్తూ ఉన్నాము!.. పరమ పురుషా,! శతకోటి మన్మథ దివ్య ప్రకాశా,,! నీ నామం మాకు శ్రీరామ రక్ష ,! నీ భావం మాకు ఎనలేని సంపద, !నీ క్షేత్రం మాకు ఆనంద నిలయం!, నీవు లేకుండా మేము లేము, !నీ తలంపే మా బ్రతుకులకు మనుగడ,,! ఆపద్భాం ధవా ,!అనాధరక్షకా ,! నిరంతరం మా అయోమయ అంధకార బందుర సంసార జీవితంలో , దిక్కు తోచ కుండా  బ్రతికే మాకు , స్వామీ, నీవే దిక్కు!, నీ పాదాలే గతి,! నీ స్మరణ యే స్మృతి ధృతి, గా భావించే, తలచే, స్ఫూర్తిని అనుగ్రహించు తండ్రీ! భక్తవత్సల!, దీన శరణ్య,! అచ్యుతా! అనంత! మాధవా !ముకుందా,! నారసింహ, శరణు !గోవిందా శరణు,! రాధా రమణా, శరణు,!,బృందావన సంచారా , శరణు,,! మధురా కృష్ణా, గురువాయూర్ కృష్ణా, ఉడుపి కృష్ణా, తిరుమల గిరి వాసా కృష్ణా,, గోవిందరాజ కృష్ణా శరణు ,! హరే కృష్ణ హరే కృష్ణా !, స్వస్తి !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...