Friday, June 7, 2019

దైవం ఇచ్చిన ప్రసాదం

సహజంగా మనం అనుకుంటూ ఉంటాం, ఈ సంపద, విద్య, ఐశ్వర్యము, ఆరోగ్యము, సంతానం, అస్తి, భార్యా భర్త లు, టాల్ దండ్రులు, ఇలా మనకు సంతోషం కలిగిస్తూ ఉన్న వన్ని, మన గొప్పతనం వల్ల సంపాదించిన అని !! కాని అది వాస్తవం కాదు. అనుభవానికి దైవం కరుణించిన ప్రసాదాలు మాత్రమే! గత జన్మ లో, తాను అనుకోని , ఇప్పుడు తెచ్చుకొన్నవి కాదు కదా అదంతా! జన్నతో బాటు అవి కూడా  నీకు ఇవ్వబడ్డవి,! భగవద్ ప్రసాదంగా అనుగ్రహించ బడ్డాయి!, దీనికి మన ప్రతిభ, తెలివి తేటలు, శక్తి సామర్థ్యాలు ఏ మాత్రం కారణం కావు, అవి ఉపకరణాలు మాత్రమే ,, ఎందుకంటే, నష్టాలు కష్టాలను మాత్రం దైవం చిన్న చూపు చూసిందం టూ, అందులో నీ అపరాధం లేదంటూ , దేవుని పైకి త్రోసేస్తూ ఉంటారు.! నిజానికి , మన జీవితంలో ఇలాంటి ప్రతీ సుఖ దుఃఖాలు, లాభనష్టాలు కలిగించే సంఘటన ల కు  మూలకారణాలు మూడు ఉంటాయి.! అందులో మొదటిది, జీవుని గతజన్మ కర్మఫలం, !అది నష్టం అయినా లాభం అయినా ఎవరికైనా కూడా  కుడువక తప్పదు కదా!, ఈ జన్మ, ఈ భూమి, ఈ బందు బలగం లభించడానికి కారణం గతజన్మ కర్మఫలం! ఇక.  రెండవది వారసత్వం,!, వ్యక్తి తాను జన్మించిన కుటుంబ సంస్కారం సంప్రదాయాలతో బాటు, అస్తి ఐశ్వర్యాలతో బాటు, పూర్వీకుల మంచి చెడూ పాప పుణ్యాల కు కూడా వారసుడిగా బాధ్యత వహిస్తూ, విధిగా,ప్రాప్తం అనుభవించ వలసి ఉంటుంది..!,సంతాన లోపం, అనువంశిక దీర్ఘ వ్యాధులు, రూపం ,గుణం, పోలికలు, స్వభావాలు ,, కోప తాపాలు, అదృష్ట దురదృష్ట అనుభవాలు, ఇలా ఎన్నో సంస్కారాలను రక్త సంబంధాలను , జనన, మరణ, అనుభూతుల ను , పండగ ఉత్సవాలను విధిగా పంచుకోవాలి ..! పుట్టింది ఒంటరిగా అయినా , సమిష్టి కుటుంబ వ్యవస్థలో, వ్యక్తి జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యలు అందరితో, కుటుంబ సభ్యులతో ,విధిగా అనుభవిస్తూ,, పాటించ వలసి ఉంటుంది.! ఇక మూడవద అతిి,ముఖ్యమైనది. దైవ కృప.! ఇదే పూర్వజన్మ కృత సుకృత సంచిత పుణ్య ఫలం!,,దైవానుగ్రహం,! దీనితో వ్యక్తికి తాను పెరుగుతున్న సమాజంలో పలు బాధ్యతలు నిర్వహిస్తూ జీవితంలో చేయాల్సింది   స్పురించాలంటే దైవానుగ్రహం అవసరం,! జన్మ ఎత్తడం  అది కర్మఫలం అనుకుంటే, . ఆ జన్మ సార్థకం కావాలంటే , జన్మ సాఫల్యం పొందాలంటే, జీవుని కి దైవబలం కావాలి,! పుట్టడం, చావడం,కర్మబందాల  చట్రం లో తిరగడం అంటే,, "పునరపి జననం, పునరపి మరణం!""అనుకుంటే   "భజ గోవిందం ""అనే పరమానందం లభించాలంటే మాత్రం, జీవుడు శరణాగతి చేయక తప్పదు,! అది మామూలు సంస్కారం తో జోడించ లేము కదా !! అందుకు, యోగ్యత కావాలి! సాధన చేయాలి, !సత్సం గం  ఉండాలి,! అలా జీవుడు తన జన్మ ఉద్దరింప బడటానికి కావాల్సిన "భావ సంపద "యే దైవ కృప..! "ఏ జన్మ పుణ్యమో, కదా, అతడు గొప్పవాడు అయ్యాడు,! పట్టిందల్లా బంగారం అవుతోంది,! అందరూ అతడిని అదృష్టవంతుడు!!" అంటూ సంఘం లో ఆ వ్యక్తికి ఒక ప్రత్యేకత ను ఆపాదిస్తూ ఉంటారు ,! అదే భగవంతుని దయ,! "చేసుకున్నవారికి చేసుకున్నంత !"అన్నట్టుగా, దైవభక్తి తో. తృప్తి అనందం ప్రశాంతత పొందుతూ, పరోపకార భావన లో, సర్వ జనావళికి సంక్షేమ ము కోసం పరితపిస్తూ , భూత దయతో ఫలాపేక్ష లేకుండా, స్తిత ప్రజ్ఞత తో మానవ శక్తి నుండి  దైవిక శక్తిగా అంచెలంచెలుగా వారు క్ ఎదుగుతారు !, భక్తులు, కవులు , జ్ఞానులు, నాయకులు, వీర సైనికులు, సంఘ సంస్కర్తలు,, పండితులు, గొప్ప ప్రవచన కర్తలు , అన్నదాతలు,ఇలా కొందరు మహానుభావులు, తమకంటూ ఒక గొప్పచరిత్ర ను సృష్టిస్తారు,!, ఈ విధంగా వ్యక్తి వికాసానికి తోడ్పడే, గతజన్మ సంస్కారం, వారసత్వ సంస్కారం, దైవ ప్రసా దిిత సంస్కారం, ఇవన్నీ కలిసి, అతడి అభ్యున్నతికి, ఆదర్శ జీవితానికి కారణం అవుతున్నాయి ,! అందరిలో, అన్ని జీవుల్లో, కనిపించే పచ్చని చెట్టులో, పుట్టలో ,గుట్టలో, ఉదయించే సూర్యుడిని, నింగిలో చల్లని వెన్నెల కాంతుల లో వెలిగే చంద్రుణ్ణి,,, ఆవు, కుక్క పిల్లి, ఎలుక వంటి మూగ జీవాల్లో, చీమ, ఈగ వంటి అల్ప ప్రాణులలో ఒకే, దైవాన్ని దర్శించడం సామాన్యులకు  సాధ్యమా, అది వారి పూర్వజన్మ సంస్కారం కాకపోతే !?? మరి కొందరు ధన్యులు , పలు యాత్రా క్షేత్రాల్లో తిరుగుతూ, జన్మ ధన్యం చేస్తూ ఉంటారు., చార్థాం, అమర్ నాథ్, శబరిమల లాంటి అటవీ ప్రాంత పర్వత శ్రేణుల లో వ్యయ ప్రయాసలకు ఓర్చి, దర్శనానికి పాదయాత్ర చేస్తూ వచ్చే పోయే భక్త జనావళికి ఉచితంగా నిత్యాన్నదానం చేస్తూ   , దాన్ని దైవారాధన గా భావిస్తూ, సేవిస్తూ తరించడం అంత సామాన్య మా ? అందరికీ సాధ్యమా? అభాగ్యులకు, అనాథలకు, వయో వృద్దులకు,అనాధాశ్రమాలలో  , కన్నవారి ఆప్యాయత ఆదరణ అనురాగాలు నోచుకోకుండా, "నా "అనే దిక్కు లేకుండా," ఎందుకు ఈ బ్రతుకు "?అనుకుంటూ, నైరాశ్యంలో బ్రతుకు ఈడుస్తున్న వారికి అండగా నిలిచి, ఆశ్రయం, అన్నపానీయాలు తో బాటు, ఆదరణ అందిస్తూ "నేనున్నాను!" అని భరోసా, ఇస్తూ, మనో దైర్యం, బ్రతుకు పై తీపి, జీవితఆశను కలిగించే మహానుభావుల సేవ, గుడిలో లింగార్చన కంటే గొప్పది కాదా,? స్వయంగా, స్వంత ఖర్చులతో, గోశాల లను నిర్మించి గోమాత ల సేవలో, పోషణలో రక్షణ లో సనాతన ధర్మ పరిరక్షణలో తమ ఆస్తిని, అస్తిత్వాన్ని,, మాధవసేవ గా అంకితం చేస్తున్న మహా పురుషుల సాంగత్యం, సహవాసం దొరకడం అంత సులభమా!?" నారాయణ సేవా సంస్థ !"" లాంటి అద్భుత ధార్మిక సంస్థ లను నెలకొల్పి, లక్షల్లో విరాళాలు సేకరించి , కేంద్రాలు స్థాపించి, వాటిని ఉచితంగా వికలాంగుల సంక్షేమం కోసమే కేటాయించి, ఉద్యమిస్తు న్న భక్తి రత్నాలకు ఉన్న భావ సంస్కార సంపద సామాన్యమైన దా ? అలాగే , మన  దేశ సరిహద్దుల్లో ఉంటూ  తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి, అనుక్షణం మృత్యు దేవత ఒడిలో ఉంటూ, ఆత్మస్థైర్యం తో, అచంచల దేశ భక్తితో, శత్రు సంహార దీక్షతో,మంచు కొండల్లో అప్రమత్తంగా సంచరిస్తున్న మనవీర జవానుల గుండె బలం, త్యాగదనం, ఊహించడ మైనా  సామాన్య విషయమా ?  కుంటి, గ్రుడ్డి, మూగ ,అవిటి జీవితాలలో కొత్త జీవనాన్ని, అశా కిరణాలను,, దైవం పై తరగని విశ్వాసాన్ని అందిస్తూ, దివ్యాన్గుల అభ్యున్నతికి కంకణం కట్టి, ప్రోత్సహిస్తూ వస్తున్న తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న సేవా సంస్థల వంటివి, దేశంలో స్వచ్ఛందంగా , అనేకం చేబడుతూ, సత్యం ధర్మం, సేవా భావం, పరోపకార తత్వం, దీన జన ఉద్ధరణ, మూగ ప్రాణుల సంరక్షణ లాంటి మహోన్నతమైన మానవత్వ విలువలకు జీవం పోస్తూ, సామాజిక కార్యక్రమాలు చేబట్టడం, దానికి తగిన స్ఫూర్తిని, శక్తి సామర్థ్యాలను , భావ సంపదను అనుగ్రహించ బడటం డం అంతా భగవద్ అనుగ్రహం, ! దై వేెచ్చ !!అతడి కరుణామృత వర్ష ధార లో తడుస్తూ , స్వామి అపార కరుణా వీక్షణాల చూపుల్లో తరిస్తు , అలాంటి సత్సంగ సేవా కార్యక్రమాల్లో సదా పాల్గొనే సదవకాశాన్ని మహా భాగ్యాన్ని , , మనస్ఫూర్తిగా కోరుకుందాం,! శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు కదా! మహాత్ములు తలపెట్టే , యజ్ఞాలు యాగాలు, మహ క్రతువులు, దేవాలయ నిర్మాణాలు,, దైవబలం లేకుండా ,నిర్వహించడం సామాన్యులకు  సాధ్యమా,?, తంజావూరు, రామేశ్వరం, శ్రీరంగం లాంటి సనాతన దేవాలయ నిర్మాణాల వైభవం , ఆ శిల్పకళా చాతుర్యం , అంకిత భావం, దైవం పై వారికున్న అచంచల విశ్వాసం, అసాధారణ ప్రజ్ఞా ప్రతిభా పాటవాలు, ఊహించడం, వర్ణించడం, మనకు  సాధ్యమయ్యే పనేనా ? ఇంకా ఇలా , మన పరమ పావన భారత ధరిత్రి పై ప్రవహించే  గంగా కృష్ణా లాంటి పుణ్య నదీ నదాలు, పరమేశ్వర కైలాస నివాస స్థలంగా ప్రసిద్ది పొందిన కైలాస శిఖర మహోన్నత వైభావాలు, కలియుగ దైవంగా కీర్టింప బడుతున్న కొండల రాయని, అపర వైకుంఠ ధామం గా విలసిల్లుతున్న తిరుమల గిరి ప్రాభవా లు, ఇలా మన చుట్టూ ఉన్న ఎన్నో సృష్టి రహస్యాలు, మానవ మేధస్సుకు అతీతంగా ఉంటూ,, సర్వాంతర్యామి అయిన "పరమాత్ముని సన్నిధానం ఈ సమస్త ప్రపంచం"ఒక గొప్ప అపురూప అపూర్వ అద్భుత అద్వితీయ కళా ఖండం అనుకుంటూ, ఈ విధంగా, ఆయన కరుణకు పాత్రులయ్యే పుణ్యాత్ముల కు సాష్టాంగ ప్రణామాలు భక్తితో సమర్పించు కొందాం,,! తద్వారా భగవంతుని అనంత గుణ సంపన్నుని,, సృష్టి కళా చతురత కు, శతకోటి ప్రణామాలు సమర్పిం చుదాము  ,,  సకల జగత్తును తేజోవంతం జేస్తూ, ప్రాణికోటికి శాశ్వత ఆనందాన్ని, తరగని పెన్నిధి గా నిరంతరం అనుగ్రహిస్తు న్న  ఆ పరమేశ్వరుని కృపకు ధన్యవాదాలు సమర్పించు కొందాం,! ఇలాంటి భావ సంపద తో పరమాత్ముని సేవించే అవకాశాన్ని  పదే పదే కోరుకుందాం,! హరే కృష్ణ హరే కృష్ణా ! స్వస్తి !"""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...