Thursday, June 6, 2019

మనసే తనకు ఆప్తుడు

మనిషికి నిజమైన ఆప్తుడు , తన బంధువు,, తలిదండ్రులు, భార్యా, భర్త,, సంతానం, స్నేహితులు కానే కారు.! తనలో ఉంటూ, తన మనుగడకు కారణం గా చరిస్తూ ఉంటున్న, తన మనసే తనకు ఆప్తుడు,! ఆత్మీయుడు,;! ఆత్మబంధువు కూడా!!, జననం నుండి మరణం వరకూ మనిషిని ఎటువంటి సుఖ దుఖ పరిస్తితి లో విడవకుండా , దేహాన్నిఅంటి పెట్టుకొని ఉండేది ఒక్క ఈ మనసే,..! దీనిని కంటితో చూడలేము,! చెవులతో వినలేము, !స్పర్శించడం లేము, !దాని ఉనికిని కనీసం ఊహించలేము .! కూడా! కాని ఈ శరీరం అనే ఇంటికి అది యజమాని,! మనసు ఆజ్ఞ లేకుండా ఏ పనీ మనిషి చేయలేడు! అలా చేస్తే పిచ్చివాడు అవుతాడు. అందువలన, మనసు లేని మనిషి ఉండడు,! అదే అతన్ని, తాను కనిపించకుండా, తెర వెనుక ఉంటూ, అన్నివేళలా బ్రతికించే, నడిపించే ,, లేచింది మొదలు పాడుకునే వరకు ఆగకుండా పనులు చేయించేది, లేదా విశ్రాంతి లేకుండా ఆలోచింప చేసేది, ఈ చిత్ర విచిత్ర రూప వేషధారి ,, ఈ మనసు అనే నటన సూత్రధారి. ! స్వర్గమైనా, నరకమైనా, భావించేది ఈ మనస్సే !!ఎదురుగా తీయని జిలేనిలు,, స్వీట్స్,, అందమైన దృశ్యాలు ఇలా ఎన్ని ఉన్నా మనసుకు నచ్చకపోతే అదంతా సున్నా ! "తాను మెచ్చింది రంభ! తాను మునిగింది గంగ ! " అన్నట్టుగా ఆనందంగా ఉంటే మనిషికి మనసే ఒక  మందిరం,! అందాల బృందావనం ! ఆ మనసే కష్టాల్లో ఉంటే  భయానకం కూడా,! సుఖం, కష్టం అని అనుకునేది మనసు !అందుకే గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో సారాంశం అంతా ఒక్క మాటలో చెప్పాడు, అర్జునా!"  నీకు ఇవ్వబడిన మనసు ఎంతో మహిమాన్విత మైనది,! నిత్యం నన్నే స్మరిస్తూ ఉంటే నీవు నా స్వరూపాన్ని పొందగలవు,! అంటే నీవే బ్రహ్మవు కాగలవు,!" అహం బ్ర హ్మో స్మి ! అవుతావు,! నీ మనో బుద్దుల ను నాయందే నిలిపితే నిస్సందేహముగా నన్నే పొందేదవు!. కాని ఈ మనసు అనేది అతి చంచలమైనది , దానిని ఆపుట నిగ్రహిం చుట దుష్కరమైన పని! కాస్సేపు ఊపిరి నీ ఆపవచ్చు ను,, కాని పది సెకండ్లు కూడా మనసును ఎటూ పరిగెత్త కుండా ఆపలేము, కాని అభ్యాసముతో నియంత్రించి, అయా విషయముల నుండి దృష్టిని మరల్చి, పరమాత్మ యందు చింతన చేయడం వలన పరబ్రహ్మ ప్రాప్తి రూపమైన బ్రహ్మానందం ను అనుభవించ వచ్చును. !"". మహాయోగులు, ఋషులు, మునులు అలా వేల సంవత్సరాలు తపస్సు తో అభ్యాసం చేసి, పరమ పదాన్ని పొందారు.!" అంటూ అర్జునుని వికలమైన మనసును కర్తవ్య నిర్వహణలో నడిపిం చి, దౌర్యాన్ని నింపి, యుద్దం చేయించి, విజయాన్ని ఇప్పించాడు. విద్యార్థులు విద్యార్జన లో మనసు నిలపడం ద్వారా,, ధ్యేయం వైపుకు ఉత్సాహంగా సాగుతారు.! యువకులు ఉద్యోగ వ్యాపార,వృత్తి, వ్యవహార, వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో మనస్సును నిలిపి అభివృద్ది పథంలో ప్రగతి సాధించడం చూస్తున్నాం,! అలాగే దేశ రక్షణ కోసం ప్రాణాలను బలిపెట్టి, శత్రువుల ను నిరోదిస్తు  అహోరాత్రులు, రక్తం గడ్డకట్టే  మంచుపర్వతాల్లో శ్రమిస్తున్న వీరజవానుల మనో నిబ్బరం కూడా చూస్తున్నాం!, కాని, నేటి సమాజంలో జరిగే అన్యాయాలు, అశ్లీ లాలు, అత్యాచారాలు , అరాచకాలు, లంచగొండి తనాలు, దౌర్జన్యాలు ఇవన్నీ వ్యక్తుల మనో దౌర్బల్యం, బుద్ది హీనత ను  ,సూచిస్తున్నాయి , రావణాసురుడు వంటి రాక్షసులు మనసుని నిగ్రహించ లేక ,బుద్దిని సక్రమ మార్గంలో నడపలేక పతనమై పోయారు!, మనః ప్రసన్నత, శాంత స్వభావం, భగవద్ చింతన, మనో నిగ్రహం, అంతః కరణ శుద్ది, ఇవన్నీ మానసిక తపస్సులు,! ఇది మనసు యొక్క నిజమైన స్వరూప ము అయితే ,మనసు యొక్క వికారమైన మరో స్వరూపము అహంకార మమకారాలు,! ఈర్ష్య, ద్వేషం, కోపం, కామం, లోభం, మద మాత్సర్యాలు, ఇవన్నీ మనస్సు బలహీనంగా ఉం టే, దాని నుండి పుట్టే, ఘోరమైన,ప్రమాదకరమైన , వినాశ కరమైన వికారాలు!!" నేనే బలవంతుడ ను,!ధనవంతుడ ను,! నాతో సమానమైన వాడు లేడు,! అనుకునే వివేక శూన్యులు, అజ్ఞాన మోహితులు, చిత్త భ్రమణమున కు లోనై, మోహ జాలమునందు చిక్కుకొని ,అసుర లక్షణములు గలవారు, క్రమంగా  ఘోర నరకములందు పడి పోతున్నారు,! అలాంటి వారు ఆశా పాశం లందు ఎల్లపుడూ బంధింప బడి ఉంటారు, !మనిషి కర్మలను చేయకుండా  ఎన్నడూ ఖాళీగా ఉండలే డు !, అది మంచి పనియా, చెడు పనీయా, అన్నది మనిషి మనసు పెట్టీ,గుర్తించాల్సిన విషయం.! అదే మానవత్వం! భూతదయ, ప్రేమ, కరుణ, జాలి,., దైవభక్తి, పరోపకార బుద్ది కలవారు మంచి మనస్సు తో, సత్వ గుణ సంపన్నులు అవుతారు,, పరమాత్మకు చేరువగా వెళ్తారు,,  ఈ శక్తివంత మైన మనస్సు తో, ఇంద్రియాలను వశపరచు కొని అనాసక్తి తో అదే ఇంద్రియాల ద్వారా కర్మలను ఆచరించు వాడే శ్రేష్ఠుడు!", అని శ్రీకృష్ణ భగవానుడు ఉద్బోధించా డు! .. శరీరం కంటే ఇంద్రియాలు,, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ది, బుద్ది కంటే ఆత్మ గొప్పది అన్న పరమ సత్యాన్ని  గుర్తిస్తూ, పరమాత్మ తత్త్వాన్ని మననం చేసుకుందాం,! మనసును నియంత్రించే శక్తి యుక్తులను, పరమాత్ముని అనుగ్రహం చేత మాత్రమే పొందవచ్చును,! అందుకే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని ప్రోక్తం అయిన భగవద్గీత ను  పారాయణం చేయడం వలన మాత్రమే మనిషి తన మనసును నిరంతర సాధనతో దైవఆరాధనతో   బ్రతుకును పండిం చుకుంటు, మానవజన్మ ధన్యం చేసుకొన వచ్చును,! జై శ్రీకృష్ణ,! అంటూ శ్రీకృష్ణునికి మనం చేసే పనుల ఫలితాన్ని,ప్రయోజనాలను కృష్ణార్పన చేస్తూ ,, భగవద్గీత శ్లోకాలను పఠిస్తూ,, భగవద్ తత్వాన్ని చింతిస్తూ, మన మనస్సును, హృదయం అనే కమలం లో ఉంచి శ్రీకృష్ణుని అరుణ చరణ కమలాల ముందు భక్తితో సమర్పించు కొందాం ,!" హరే కృష్ణ హరే కృష్ణా ""!  అంటూ హరినామ గానం చేస్తూ పరవశిస్తూ జీవితాన్ని పరందాము నీ  భావ సంపదతో  మనస్సు లో పరమానందాన్ని పొందుదాం ,! జై శ్రీ కృష్ణ! జైజై శ్రీకృష్ణ !! స్వస్తి !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...