Dallas, July 18, 2019
""ఎక్కడ ఉన్నాడురా నీ శ్రీ హరి? అంటూ కోపంతో, అసహనం తో, తనని గద్దించి అడిగిన తండ్రి హిరణ్యకశిపుని చూస్తే, కొడుకు ప్రహ్లాదునికి ఏ మాత్రం భయం బాధ, కలగలేదు,! సరికదా, కన్నతండ్రీ తీరుపై జాలి, దయ కలిగింది,! అలా, దైవాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినవారికి అంత టా, పరమాత్ముడు గోచరిస్తు నే ఉంటాడు,! వారి, అంతరంగం లో పరందాముడు కొలువై నిత్య సంతోషి లా అనుగ్రహిస్తూ ఉంటాడు,! అంతర్యామిగా ఇంద్రియాలను నిగ్రహంతో అణచివేసి, బుద్దిని మనసును, సర్వాంతర్యామి పై కేంద్రీకరించి, దేహాన్ని ప్రకాశింప జేస్తూ, తానే అతడై, అతడే తానై, భక్తుడు, సచ్చిదానంద ఘన స్వరూపంతో , పరమాత్మ వైభవం తో సర్వ ప్రాణికోటికి శ్రీరామరక్ష నిలుస్తూ ఉంటాడు,! అలాంటి యోగులకు, స్థిత ప్రజఞత కల వారికీ భయం ఉంటుందా,? ఉండదు కదా? "ఎక్కడ ఉన్నాడు?" అనడం కాకుండా," దేవుడు ఎక్కడ లేడు?" అనుకోవాలి, !!ఏ ఆధారం తో ఈ అండ, పిండ, బ్రహ్మాండాలు ఒక పద్దతిలో, ఒక క్రమశిక్షణ తో, నియమిత దూరంలో, నియమిత వేగంతో, నియమిత కక్ష్యలో, ఒకదానికి మరొకటి అంటకుండా స్వేచ్చగా భ్రమిస్తూ, దానిపై ఉంటున్న సమస్త జీవకోటినీ సంరక్షిస్తూ ఉంటోంది ???ఎన్ని నక్షత్రా లో అన్ని సూర్య బింబాలు కదా;, కొన్ని వేల కోట్ల సూర్య కుటుంబాలు,, నక్షత్రాల సముదాయాలు , గాలక్సీ లు,, ఇన్నింటిని ఏకంగా కలుపుతూ , ఆపకుండా ఆగకుండా , యుగాల తరబడి, ఈ అనంత విశ్వంలో,తింపుతున్న ఆ నటన సూత్రధారి ఎవరు? ఈ భూమి తన చుట్టూ కాకుండా, సూర్యుని చుట్టూ ఆగకుండా తిరుగుతూ ఉంటే, దానిని అంటుకొని ఉంటున్న, సప్త సముద్రాల లోని ఒక చుక్క నీరు కూడా కింద పడకుండా చూసేది ఎవరు! పొంగే సముద్రాల, ఉవ్వెత్తున ఎగసి పడే అలలను అణచి, ప్రశాంతంగా ఉంచే దెవరు!?? పగలు" తో జీవన చర్యలను ఉద్ధరిస్తు, రాత్రి "తో జీవకోటికి విశ్రాంతి వ్యవస్తను కల్పిస్తూ, జగతిపై సర్వ ప్రాణికోటినీ నియంత్రిస్తూ ఉన్నదెవరు? రంగు రంగుల పూవులు,హృదయాన్ని పులకింపజే సే తైలవర్ణ చిత్రాలు అనిపించే ప్రకృతి శోభను, మనసు పులకింపజేసే, సూర్యోదయ, సూర్యాస్తమయ రమణీయ దృశ్యాలు అనుదినం, అనునిత్యం ,అనుక్షణం చిత్రిస్తున్నది ఎవరు? సకల ప్రాణుల శరీరాల్లో అంతర్యామిగా ఉంటు, వాటికి అనగా, జీవులకుి శక్తి చైతన్యా లు కలిగిస్తున్నది ఎవరు ?? అలాంటి అద్భుత అలౌకిక అమోఘ అనంత గుణ సంపన్నుడైన, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ దేవాది దేవుడు, దివ్య ప్రభావుడు అనబడే దేవుని వైభవం ఊహించ తరమా,? అతడి లీలలు వర్ణించ వశమా? తనలోన కొలువై ఉన్న దేవుడిని గుర్తించగలిగే శక్తి కేవలం ఒక్క మనిషికే ఉంది, !!దేహాన్ని దేవాలయంగా భావించే భావ సంపద మనిషికే ఉంది!, దేవుడిని స్వయం ప్రతిభతో, సాధనతో, సాక్షాత్కరింప జేసుకునే ప్రజ్ఞ కూడా అతడికే ఉంది,! దేవుడు స్వయంగా మన ఎదుటి కి రాడు,,! రప్పించుకునే శక్తి గానీ, వస్తె దర్శించే యోగ్యత కాని మనకు ఉండాలి కదా,,?? కాని ,""అయ్యో! దైవాన్ని నేను ప్రత్యక్షంగా చూడలేకపోయాను కదా!"" అని బాధ పడే అవసరం ఏ మాత్రం లేదు, లేదు.!! అంతటా నిండి ఉన్న సర్వాంతర్యామి నీ చూడాలనే ఆపేక్ష, ఆర్ద్రత,ఉండాలి గానీ, చూడగలిగిన కళ్ళు జ్ఞాననేత్రం ,,ఉంటే, స్వామిని, ఏ రూపంలో, నైనా, ఎక్కడైనా దర్శించ వచ్చును! ఆపదలో, ప్రమాదం లో,, నీకు సహాయం ,అందించే స్నేహితుడి లో, అత్మ బంధువులలో,, నీకు జన్మ ఇచ్చిన తలిదండ్రుల లో, నీ ఇంటికి అతిథి గా వచ్చిన అపరిచితులు, అనాథలు, అభ్యాగతులు, బిచ్చ గాళ్లు, దీనులు, వృద్దులు, వికలాంగులు, దిక్కు లేని వారు, ఆకలి కోసం అలమటించే మూగ జీవులు, పశువులు, పక్షుల లో భగవంతుని విశ్వ ప్రేమను, నిన్ను సదా పలుకరించి,పరామర్శించే దేవుడిని భావించ వచ్చును !, ఇవన్నీ భగవద్ స్వరూపంగా భావిస్తూ, సేవించడం అది నేరుగా దేవుడికి చేస్తున్న పూజ యే అవుతుంది, కదా ;ప్రతిఫలం ఆశించకుండా, మనం చేసే ఉపకారం లేదా సహాయం, ఆదరణ, వస్త్ర ధన ,అన్నదానంతో , నిత్యం మనం చేస్తున్న దేవతా విగ్రహాల పూజ కంటే వేయి రెట్ల ఫలాలను ఇస్తుంది, అనడం లో సందేహం లేదు,. చార్ ధాం, అమర్నాథ్, శబరిమల లాంటి పుణ్యక్షే త్రాల ను సందర్శిం చే యాత్రికులకు, అడుగడుగునా అందిస్తూ, ఇలా స్వచ్ఛందంగానిత్య అన్నదాన సత్రా లు నిర్వహిస్తూ , వారిలో దైవాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తూ , సేవిస్తూ, పునీ తులౌతున్నవారు ధన్యులు,! పుణ్యాత్ములు,,! కన్న తల్లి,, అమ్మ ప్రేమలో దైవం ప్రతిబింబిస్తూ ఉంటుంది కదా,! ఏ మాత్రం స్వార్థం లేని నిష్కళంక మైన అమృత మయి ఆమె!, తన సంతానం పొందే ఆనందమే ,తన ఆనందంగా తృప్తి పడే త్యాగమూర్తి అమ్మ,! అనగా,నిస్వార్థమైన ప్రేమలో దేవుడు ఉన్నాడు,! ఉంటాడు ;! ఇలా ప్రేమతో, చూస్తూ, ఆదరిస్తూ, ఆప్యాయంగా తినిపిస్తూ పిలుస్తూ, అనురాగాలు చూపుల్లో కురిపిస్తూ , తోటి వారిని చిరునవ్వుతో, ఆదరిం చే ప్రతీ మనిషి లో దేవుడు ఉన్నాడు,!, చల్లగా వీచే గాలిలొ, వేడిమి వెలుతురు, ఆరోగ్యము, ఆనందము, శక్తి చైతన్యా లను అనుగ్రహించే అగ్నిలో, సూర్య భగవాను నీ అరుణ కిరణాల ప్రభావం లో, దేవుడు ఉన్నాడు,,! విశ్రాంతిని, నిద్ర అనే దివ్య ఔషధాన్ని, శాంతిని, కాంతిని అందిస్తున్న చంద్ర కాంతిలో ఉన్నాడు దేవుడు!!!,. బంగారు, సిరుల పసిడి పంటలు పండిస్తూ, ప్రకృతి సౌందర్యాలను నిత్య నూత్న యవ్వన పరిమళ భరితమైన శోభతో, సర్వ ప్రాణుల మనుగడకు ఆధార భూతమై, వెలుగొందే ఈ ధరణి మాత లో ఉన్నాడు దేవుడు,!! అండ పిండ బ్రహ్మాండాలు కలిపి సుతారంగా విశ్వంలోఆడించే ,ఆ వినీల సువిశాల నీలాకాశం లో, ఉన్నాడు దేవుడు. నిత్య నూత్న వర్ణ ప్రభలతో సర్వాంతర్యామి యై, నిర్గుణ నిరాకార సచ్చిదానంద మూర్తిగా, విశ్వం అంతటా నిండి ఉన్నాడు మన దేవుడు.;! వంటకు వినియోగించే పొయ్యి మంటలో,, చెట్ల మందుల్లో, వివిధ పండ్ల మధుర రసాల్లో , క్రతువుల్లో, యాగాల్లో,!యజ్ఞభగవానుని హోమ జ్వాల లో, వేద మూర్తులు మంత్ర పఠనం లో, రంగు రంగుల పూవుల ల్లో, ఆకుపచ్చని తివాచీలు తలపించే మైదానాల్లో, వెండి కొండల వలే ప్రకాశించు హిమగిరి సానువుల్లో, లతల్లో, కొండల్లో, సెలయేరు లలో, గంగా యమునా కృష్ణా గోదావరి నదీ జలాల్లో, నీలి మేఘాలలో, గాలి కెరటాల లో, ఓమ్ కార నాదం లో, గురు కృపా కరుణా కటాక్షాల లో,, పసిపిల్లల బోసి నవ్వుల లో,, కన్నెపిల్లల బాలా త్రిపురసుందరి వైభవం లో, దైవారాధన ధ్యానంలో, అంతరంగం లో, అత్మ సాక్షాత్కారం లో, ఇలా అడుగడుగునా, అణువణువునా దేవుడు ఉన్నాడు. 100% నమ్మిన వారికి అంతటా ఉన్నాడు, ధ్యానంలో ,భావం లో, అర్చన లో, ఆరాధనలో, సేవనం లో, ఆత్మలో హృదయం లో, మనసులో, మాటలో, పాటలో, పల్లవిలో,, భక్తిలో, జ్ఞానంలో, వైరాగ్యం లో,, స్మృతి, శృతి, పురాణ , ఇతిహాసాల్లో, భగవద్గీత సారాంశం లో, తీర్థ క్షేత్రాలలో, ప్రతీ ఇంటిలో, స్థలం లో, చెట్టులో, పుట్టలో, ఎక్కడ ఉన్నాడని భావిస్తే అక్కడ ఉన్నాడు దేవుడు,! అతడు లేని చోటు లేదు,! మనిషిలోని మద మాత్సర్యము, లాంటి అరిషడ్వర్గాలు పూర్తిగా తొలగిస్తే నే తప్ప, దేవునికి హృదయం లో నిలుపు కొనలేము కదా,!అరిషడ్వర్గాలు ఉంటేనే, దేవుడు జ్ఞాపకం వస్తాడు, ఏ దిక్కూ మొక్కు తీర్చలే నీ కష్టాల్లో నే మనిషికి ,, దేవుడు గుర్తు కు వస్తూ ఉంటాడు కదా ! దేవుడి కృప కావాలంటే దేవుడే కరునించా లి,! అతడు అనంతుడు,! మనకున్న సాధారణ ప్రజ్ఞ చే మనం అతడిని పట్టుకొలేము!, దైవ కృప తో , నిరంతర సాధన, తపన లతో మాత్రమే దైవా నుగ్రహం పొందగలం,! మానవ సేవలో అనిర్వచనీయమైన అద్భుతమైన , అమోఘమైన, పరమానంద కరమైన, దైవానుభూ తిని ఆస్వాదిస్తూ, భూత దయను అందిస్తూ,, సర్వత్రా, సర్వ ప్రాణులలో, వాటి పాలన లాలన సేవనం లో దైవాన్ని దర్షిద్దాం, అఖండ మైన,అప్రమేయమైన , అమేయమైన, దైవానుగ్రహం పొందుదాం, పరమేశ్వరా,! అంతటా నిన్ను సందర్శించే భావ సంపదను అనుగ్రహించు తండ్రీ; నీ కారుణ్య కటాక్ష వీక్షణాల వైభవం తో మా ఈ మానవజన్మ తరిం చే మహా భాగ్యాన్ని అనుగ్రహించు! హే జగన్నాథ! హే కరుణా సింధూ,! దీన జన బంధో,! శరణు,!, ఆపద్భాంద వా , శరణు,! శరణా గత వత్స లా శరణు!
Tuesday, July 23, 2019
ఎక్కడ ఉన్నాడు?"
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment