Tuesday, July 23, 2019

ప్రమాదం

Jul 19, 2019 Dallas
భగవంతుని సృష్టిలో అనుక్షణం, అనునిత్యం, మార్పులు, చేర్పులు జరుగుతూ ఉండటం మనం నిత్యం గమనిస్తూ ఉన్నాము.. అందులో, కొన్ని మనకు ప్ర మోదంగాను ,మరి కొన్ని ప్రమాదంగా ను ఉంటాయి,! మనం సహించ గలిగె,ఎండా ,వానా, సమ శీత లాలు, ఆహ్లాదంగా, ఆమోదం గా ఉంటాయి, కదా !; మోతాదు మించితే లేదా మోతాదు తగ్గితే మాత్రం, ప్రమాదం గా భావిస్తాము ..అధిక వర్షాలు, పెను తుఫాను లు, జల ప్రళయాలు, సుడిగుండాలు, భూకంపాలు, అగ్నిపర్వత ప్రకంపనాలు, ప్రకృతి బీభత్సా లు ,ఇవన్నీ మానవ శరీరం తట్టుకోలేదు. అవి  ప్రమాదాలు గా ఉంటాయి. ఇవన్నీ భగవద్ లీలలు,! ఎవరూ ఆపలేరు,! మార్చలేరు!, కనీసం వాటి మోతాదు, పర్యవసానం కూడా ఊహించ లేరు ! ఇటీవల, కాలిఫోర్నియా లో నీఅడవిలో కార్చిచ్చు లో, వేల గృహాలు, జనాలు ఏకంగా తుడిచి పెట్టుకు పోయినా ఇలాంటి వి ఎన్నో దేశంలో, రాష్ట్రం లో జరిగినా, మనకు చీమైనా కుట్ట దు!!, పేపర్లో వార్త విని," ఓహో, !అలాగా!"" అనుకుంటాము ! కారణం స్వార్తమై!!,ఏదైనా తనదాక వస్తేనే ప్రాణభయం అంటే ఏమిటో తెలుస్తుంది, కదా!; ప్రమాదాలు రెండు రకాలు, అనుకోవచ్చు !; ఒకటి మానసికం,! రెండు  శారీరిక ము...!! మొదట దేహం పై మనకున్న అభిమానం చూద్దాం !!శరీరం గాయ పడటం,, ఆక్సిడెంట్ అయ్యి, ప్రాణం పోవడం  ఘోరంగా గాయపడి, ప్రాణం తో బయటపడి, హాస్పిటల్ పాలు కావడం ,,! ఇవన్నీ శరీరానికి ఇంటా బయటా అందరికీ తరుచూ జరిగే  ప్రమాదాలు!! ఇలా, చిన్నవి లేదా పెద్దవి,ప్రమాదాల కు గురికాని వారు,  ఎవరూ ఉండరు !. అనుకోకుండా ఆపద  వస్తె దానిని  "ప్రమాదం!"" అంటారు. మూడేళ్ల క్రితం , నాకు రోడ్డు పై , పోలీస్ స్టేషన్ ముందే ,ఒక బైక్ వాలా వేగంగా వచ్చి రాసుకుంటూ పోయాడు, క్రింద పడ్డాను, ఫలితంగా కుడి మోచేతి ఎముక విరగడం, సర్జరీ కావడం, ఒక రాడ్ పడటం, రెండేళ్ల తర్వాత ఆ రాడ్ తీసేయడానికి మళ్లీ సర్జరీ, మళ్లీ ఖర్చు, హాస్పిటల్ దర్శనం, ఇలా ఒక కోర్సు జరిగింది;, కారణం, తెలియదు !; పాపం !ఆ ఏక్సిడెంట్ చేసినవాడు నాకు శత్రువు కాదు,! అస్తి బంగారం భూమి పేచీలు మాకు లేవు,! అలాగే, వారం క్రితం ఇంటి ముందు నీళ్ళ సంప్ పై మూత తొలగి, అందులో కి నేను పూర్తిగా జారడం, ఆ మూత కొన భాగం కుడి చెంప పై బలంగా దిగడం, గాయం కావడంతో, నా మొహం, ఎవరూపోల్చుకొలేని విధంగా రూపు మారడం,, ఇవన్నీ కొన్ని సెకండ్ల లో జరిగాయి,; రోడ్డు పై జరిగిన ప్రమాదం, ఇంట్లో జరిగిన ప్రమాదం రెండూ ప్రాణ గండా లే,! ఎవరూ కాదనలేరు ;!! కాని,, ఎవరు కారణం, !ఎందుకు జరిగాయి, !అదృష్టం బాగుండి, ఫ్రాక్చర్ కాలేదు,! తల ,వేన్ను ఎముక విరగలేదు అనుకుంటాము !,, పైగా అజాగ్రత్తగా ఉండొద్దు, అంటారు,! కానీ,,అది మన చేతుల్లో ఉందా,,? బావుంటే, నేను తెలివిగా తప్పించు కున్నాను, అంటాము, ;!! లేదా దేవుని దయ తప్పింది అనుకుంటాము,!,, ఇలా ఎప్పుడూ ,ఏం జరిగేది మన చేతుల్లో లేదు, కదా! బజారుకు వెళ్ళిన వాడు, ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడో లేదో అని అనుమానించే అవస్త ఉన్న ప్రస్తుత వ్యవస్థ మనది,!! కొన్ని రోజులు మందులు వాడితే తగ్గే జబ్బు శరీరానిి ది,, ! ""నేను ఉంటే సీతమ్మను పోనిస్తానా,!"" అన్నట్టుగా, జరిగే ప్రమాదాలను ఎవరూ, చివరకు దేవుడు కూడా తప్పించ లేరు, !ఎందుకంటే, జరగవలసినది జరిగి తీరుతుంది , ఇష్టమున్నా లేకున్నా, అనుకున్నా అనుకోక పోయినా ! చేయాల్సింది ఒక్కటే, అంతా మన మంచికే అని భావించాలి మనం  !!ఎవరికైనా, తమ కర్మ ఫలితం విధిగా అనుభవించక తప్పదు.! అయితే, అందరికీ, ఇక్కడ ఒక ధర్మ సందేహం తప్పకుండా  కలుగుతోంది,; మరి "దేవుణ్ణి ఎందుకు తలచుకోవాలి అని ?"" జరిగేది జరగక తప్పనప్పుడు "ఎందుకయ్యా ! నిన్ను పూజించడం,! """అంటే దేవుడు చెప్పే జవాబు ఏమిటి? అంటే,....  సమాధానం, మన గీతాచార్యుడు, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పనే చెప్పాడు , !""అనన్యా చింతయం తోమాం, యే జనాః పర్యు పాసతే, తేశాం నిత్యాభి యుక్తానాం, యోగ క్షేమం వహామ్యహం!"" అనగా ఎవరైతే ఇతర చింతనలు మాని, నన్ను మాత్రమే ఉపాసిస్తా రో, వారి "యోగక్షేమాల బాధ్యత నేను వహిస్తాను, !""అని ప్రమాణ పూర్వకంగా భగవానుడు ,తన భక్తులకు ఇచ్చిన వాగ్దానం అది! ఆ విధంగా, దైవారాధన తో, దేవుడు ఉన్నాడన్న నమ్మకం తో ఉంటే,, ఎంత పాపాత్ముల నైనా, రానున్న పెద్ద ప్రమాదం, ప్రాణ గండం నుండి వారిని, తప్పించి, వాటిని స్వల్ప ప్రమాదంగా మారుస్తాడు. అలా, దైవాన్ని మరవకుండా, తలచేవారికి  ప్రమాదాలు ప్రసాదం గా మారుతాయి.!, దైవాన్ని ఎంతగా విశ్వసిస్తే ఫలితం అంత మధురంగా ఉంటుంది మరి.! ,  ప్రమాదం అసలే జరక్కుండా చూడవచ్చుగా,? అని కూడా మనం అనుకోవచ్చు! పరమాత్మ వద్ద దానికి కూడా ఘాటైన, దీటైన జవాబు ఉంది ! రాముడైనా, కృష్ణుడైనా, సుఖమైనా, కష్టమైనా భూమిపై పుట్టాక ఎంతటి వారికైనా, గత జన్మ కర్మ ఫలం, కుడువక తప్పదు,! అయితే ప్రమాదం చిన్నగా మార్చడానికి కారణం,, దైవ భక్తుడు కావడం, వాడు ఈ జన్మలో ఇంకా అనుభవించ వలసిన వి కొన్ని మిగిలి ఉన్నాయి అని సూచన, చేయడం !! అంతే కాదు, ఆ ప్రమాదం తప్పించిన వాడు,  ఇలా ప్రమోద ము ఇప్పించిన వాడు ఎవరో, ఇప్పటికైనా తెలుసు కొలేక పోతే, ఆ మాత్రం గుర్తింపు, కృతజ్ఞతా భావం లేకపోతే,, అటువంటి మూర్ఖుడికి,  దేవుడు చేసే హెచ్చరిక అది,,!;"" వాడికి ,కాస్తా మీరైనా చెప్పండి రా, బుద్దిగా ఉండమని !!"అంటూ పదిమందిలో వేసిన శిక్ష తో, చేసిన తప్పులు క్షమిస్తూ  దయతో బోధించే భగవద్గీత సారాంశం అది.!! ఇక మనం , రెండవ ది, అత్యంతమై న ముఖ్య అంశం ,,మానసిక బాధితుల వద్దకు వెళ్దాం,! మనకు తెలుసు, శరీరానికి వచ్చే వ్యాధులు, రుగ్మతలు,బాధలు తగిన చికిత్స తో  తగ్గించు కోవచ్చును, అని,,!కాని, మనస్సుకు తగిలే గాయం నుండి తట్టుకోవడం మాత్రం, అంత సులభమైన విషయం కాదు అని.! "" మనసు విరిగేనేని మరి అతక నేర్చునా,విశ్వదాభిరామ వినురవేమ!!"అన్నట్లుగా ,,చితి లోని కాష్టం చిచ్చు,ఎలా శవాన్ని సాంతం వరకూ కాలుస్తూ ఉంటుందో, అలాగే, చింత అనే చిచ్చు కూడా ,,బ్రతికి ఉన్న శరీరాన్ని చచ్చే వరకూ కాలుస్తూ ఉంటుందట,,! అందుకే, మహాకవి ఆత్రేయ గారు అన్నారు, మనిషికి మనసే తీరని శిక్ష! అని ,, ఎందుకంటే, మనసుకు ఉన్న పరిధుల ను మించి, ఆలోచిస్తూ, చింతిస్తూ కూడా, తనలో ఈర్ష్యా ద్వేషాలు, కసి పగ, బద్ద శతృత్వాలు పెంచుకొని, మనిషి తన బంగారం లాంటి  బ్రతుకు నరకం చేసుకోవడం చూసి," వీడు, నేను ఇచ్చిన ఉత్కృష్టమైన మానవజన్మ ను వృథా చేసుకుంటూ ఉన్నాడు కదా,!"" అని, దేవుడు కూడా, వాడి అహంకారాన్ని క్షమించ లేక, "పోరా ! ఇక నీ ఖర్మ !"" అంటూ, కోతి లాంటి అదుపు తప్పిన మనసు ను మనిషికి ఇచ్చాడట, దేవుడు ! అందుకే బీపీ ,సుగర్ వ్యాధి, గుండె జబ్బులూ, రక్తపు పోటు, లాంటి ఎన్నో వ్యాధులు కేవలం మనో వ్యాధితో ప్రారంభం అయినవే!,మనిషి, తన ఉనికి కి, మనుగడకు, సుఖ శాంతులు , భోగ భాగ్యాల కు దాత అయిన దైవాన్ని మరచి, అజ్ఞానం, అశాంతి, అవిద్య,అమాయకత్వం తో, కోరి తెచ్చు కుంటున్న మానసిక బాధలు, మానసిక రోగాలు ,! వీటితో బలిసిపోతున్నాయి హాస్పిటల్స్, బక్క చిక్కి పోతున్నాయి నైతిక విలువలు, మానవతా దృక్పథం !! ఈ మానసిక ప్రమాదాలకు  బాధ్యుడు, దేవుడు కానే కాదు, కేవలం మనిషి స్వయంకృతాపరాధం మాత్రమే కదా,,! అందుకే, మనకున్న విజ్ఞతతో , ప్రజ్ఞా పాటవాల తో తరుచూ మనకు సంభవించే ప్రమాదాలను ,ప్రమో దాలుగా మార్చుకునే దైవభావ సంపద ను, ఫలితాలకు తట్టుకునే  అత్మ స్థైర్యాన్ని, మనో నిగ్రహాన్ని దైవభక్తి నీ,అనుగ్రహించమని పరమాత్ముని కోరుకుందాం,! నారాయణా, !పరమేశ్వరా,! జగన్నాథ,! దేవాది దేవా !! మేము తెలిసీ తెలియక చేసిన పాపాలు ,అపరాధాలు క్షమించు, తండ్రీ,! దీన జన శరణ్య,! భక్తజన మం దారా,! నిరంతరం నిన్ను  మరవకుండ నీ పాద పద్మాల ను  స్మరించి, పూజించి ,తరించే మహా భాగ్యాన్ని అనుగ్రహించు! స్వామీ, శరణు,! అంతర్యామి,, శరణు,! అచ్యుతా, అనంత, గోవిందా శరణు ! స్వస్తి ! హరే కృష్ణ హరే కృష్ణా !!!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...