Tuesday, July 23, 2019

దేవుడు అనే భావన

Jul 20, 2019 Dallas

మన భావన లో ఉంటాడు దేవుడు, అన్నది నూటికి నూరు పాళ్ళు నిజం ! సాలగ్రామ శిలా రూపంలో ఏడుకొండలపై వెలసిన వేంకటేశ్వరుని విగ్రహం కేవలం" రాతి శిల్పం" అని భావించి, దర్శించి, స్వామి గర్బ గుడి దాటాక మరచి పోయె వారు కొందరైతే, లక్ష్మీ వెంకటరమణ స్వామీ దివ్య మంగళ మూర్తి లావణ్య వైభవాన్ని, తమ గుండెల్లో నింపుకొని, అంతరంగం లో  ప్రతిష్టించి ఇంటా బయటా, ఎక్కడ ఉంటున్న, ఏమి చేస్తున్నా, మరవకుండ, విడవకుండా పట్టుకుంటూ, ఆరాధించే వారు మరి కొందరు !! దేనికైనా" దైవబలం" తోడు లేనిదే గడ్డి పోచ కూడా క దపలేరు కదా ! నిత్య జీవితంలో,దైవ దర్శనం పొందాలంటే ,పసి పిల్లల, బోసి నవ్వుల లో, చూడాలి,!,వారి అంతరంగం లో ఎంత పవిత్రంగా, సుకుమారంగా, పరమాత్మ తన పడక పానుపుగా చేసుకొని హాయిగా పరవశిస్తాడో కదా.. !! అలా అందంగా , ఆనందంగా ఉండే ప్రతీ పసిపాప, లో,, పకపక మని నవ్వే వారి పరమానంద భరిత దరహాసం లో , కొలువై ఉంటాడు సచ్చిదానంద మూర్తి బాల గోపాలకృష్ణ య్య ."!" అనన్యా చింతయం తో మామ్  యే జనాః పర్యుపాసతే ...!..!"అను గీతా శ్లోకం బోధించిన విధంగా, సత్యం శివం సుందరం, అయిన సచ్చిదానంద ఘన స్వరూపాలు ఈ బాల బాలికలు,, కాదా'"! అలాంటి  నిష్కల్మష హృదయాలతో చూసే ప్రతి చూపులో, భూతదయ,, కరుణా,, జాలి , అనురాగం పండించే పలుకుల్లో,చేతల్లో , ఉనికిలో దేవుడు నిత్యమూకొలువై నెలవై  ,ఉంటాడు!,  అందుకే నేమో ఎందరో, మునులకు, కవులకు , గాయకులకు , భక్తుల ఆరాధనకు కల్పతరువు అయ్యింది చిన్ని కృష్ణయ్య సురుచిర సుందర దివ్య మంగళ రూపం  !!   అది,,కల్లా కపటం ఎరుగని బాల్యం ,! బాల కృష్ణుని సు దర్శన సులలిత సుకుమార సుందర రూపం !!అంతటా, బాల బాలికల సుందర రూపాల్లో, బాల కృష్ణ వైభవాన్ని దర్శిస్తారు, తల్లులు!!, వారిని క్రిష్ణ వేషంలో అలంకరిస్తారు, త్రాగించినా తినిపించిన పిలిచినా , కోపించిన కూడా కన్నా ఇటు రారా, అలా చేయొద్దు రా కృష్ణమ్మా, బంగారు కొండా, వెన్న దొంగా అంటూ ముద్దారా లాలిస్తూ పాడే పాటల్లో ,,, తలపులలో ఆనందిస్తూ ఉంటారు తల్లులు, ఎందరో యశోద మాతలు !! నిజంగా కూడా అలా,లాలిస్తూ, "లాలి జో ,!"..అంటూ ఊపే ఉయ్యాల చల్లని వీవనా గాలులలో వారి బిడ్డల ప్రతిరూపం లా భాసిస్తూ, లాలి పాట లలో   పరవశిస్తాడు దేవుడు  !!అమ్మ అంతరం గం అంత గొప్పది. మరి !, అందుకే నేమో అమ్మ లాలిత్యం కోసం, ఏకంగా, దివి నుండి భువికి దిగి వచ్చాడు పరందాముడు ,,!, "యద్భావం తద్భవతి !" అని వేద వాక్యం, !ఎలా భావిస్తే అలా కనపడుతుంది ఈ ప్రపంచం,! చూసే చూపులలో,,  తలపులలో, పనులలో, పలుకుల లో ,, ఉంటాడు దేవుడు ! వాస్తవానికి,తల్లుల అమృతతుల్య హృదయాలకు మాత్రమే అంతర్యామి అవగతం అవుతాడు,! స్వామిని చూస్తుంటే మాతృ వాత్సల్యం పెల్లుబికి, ప్రేమ తో, వాత్సల్యం తో,పాలపొంగులా హృదయంలో కదలాలి !! అలా తమ, భావంలో ,బాహ్యంలో దైవారాధన చేస్తూ, దర్శిస్తూ  , అపర గోపికల వలె  , అంకితం అవుతూ, ఉండే స్త్రీ జాతి నిజంగా ధన్యులు!, పుణ్యు లు కూడా,! వారి వలె , తదేక ధ్యానం తో, దైవానికి, కైంకర్యం వనితలు, చేసినట్టుగా,, మరెవ రైనా చేయడం కష్ట సాధ్యం అయిన విషయం ! స్త్రీలు మాత్రమే  కృష్ణ దర్శన భాగ్యానికి  అర్హత కలవారు ,! అనగా"దైవ సన్నిధిలో ఉన్నప్పుడు," మేము పురుషుల ము !"అనే భావన విడనాడి,," శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే పురుషోత్తముడు !"జీవులంతా స్త్రీలే!!", అనుకుంటూ భక్తులు అంతా అపర గోపికా స్త్రీల వలె , శ్రీకృష్ణ సందర్శనా లాలస పిపాసతో, అర్ద్రతతో, ఆవేదనతో, ఆరాటపడే తత్వం తో అర్చించి, పూజించి, సేవిస్తూ, తరించాలని ,,  నా భావన,,,! హరే కృష్ణ హరే కృష్ణా,!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...