Tuesday, July 23, 2019

తనివి తీరదు కదరా కృష్ణా,,!

జూన్ 29, 2019

శ్రీకృష్ణుడు రేపల్లె విడిచి మధురకు వెళ్ళిపోయాక  కృష్ణ విరహాన్ని భరించలేక యశోద మాతనందుల తో బాటు రేపల్లె పౌరులు,, వనితలు అలమం దలు, బృందావనం లో సంచరించే సమస్త ప్రాణులు మూగ జీవా లు ప్రకృతి యమునానది జలాలు శోకతప్త హృదయాలతో ఆవేదన లో మునిగి పోయింది,,, ఇక మధుర నుండి కృష్ణుడు రాడ నీ, తెలిసి,,, నందరాజు ఎంత ఊరడించినా కూడా యశోదా మాత కు దుఖం ఆగడం లేదు!,, పిచ్చి పట్టిన దానిలా ఇంటా బయటా, అటు ఇటూ తిరుగుతూ,, పాలకుండల చాటున గానీ  కన్నయ్య దాక్కుని ఉన్నాడా!, తనను ఆట పట్టిస్తున్నాడా !,, అంటూ వెతుకుతూ పోతోంది,,! కృష్ణా,!, చిన్ని కృష్ణా, ;నా బంగారు తండ్రీ,,! వజ్రాల మూట,,! బుజ్జి తండ్రీ,,! నేను నిన్ను ఇక కొట్టనులే, !ఆ గోపికలు ఎంత చాడీలు చెప్పినా, నేను వినను గాక వినను,!,కన్నతండ్రి;, నిన్ను రోటికి కట్టేసిన ఈ కటినాత్మురాల ను క్షమించు నాయనా! ఇందుకేనా నీకు నాపై కోపం వచ్చి వెళ్లి పోయావు,! నిన్ను దండించి న ,, ఈ పాపపు చేతులు ఇదిగో! ఇక్కడే,, ఇదే రోటి కి బాదుతూ, ఉన్న నా బాధను చూసి,, ఇకనైనా, రారా! నా ముద్దుల తనయా,! నీవు ఎంత అల్లరి చేసినా, ఎన్ని పాల కుండలు పగుల గొట్టి నా, ఎంత జున్ను, మీగడ, పెరుగు లను నీ తోటివారికి అందించినా, నీ అల్లరి బృందం జట్టు తో సహా, పిల్లి కుక్కా కోతులకు పెట్టినా ,,నేను నిన్ను ఏమీ అనను , సరేనా,! వింటున్నావా నా ఆర్తి ? కంటున్నావా నా దైన్య పరిస్తితి ?? మా కుల దైవమా,! నా ఇంటి దీపమా!, నా పంచ ప్రాణమా,,! క్రిష్ణా,! ఇదెక్కడి న్యాయము రా, నందనందన.? కడివెడు పాలల్లో చుక్క విషం పోసినట్టుగా, నిన్ను చూస్తూ,  పాలిస్తూ,, లాలిస్తూ, ఆడిస్తూ, ఆనందంగా, ఉంటున్న గొలోకంలో ఈ అనుకోని సుడి తుఫాను రావడం ఏమిటీ,? అకస్మాత్తుగా నీవు, పిలిస్తే పలక కుండా,మాకు అంద నంత దూరం పోవడం ఏమిటి,,? పెద్దవాడి వి అయ్యావు,రెక్కలొచ్చాయి వెళ్ళావు అవునా, మరి ఈ ముసలి ప్రాణాల మాటేమిటి ! మా గతి ఏమిటి ! మాకు దిక్కు ఎవ్వరు రా మధురా కృష్ణా! ఒక్కసారిగా ప్రాణం పోయినట్టు గా, ఇలా మమ్మల్ని జీవచ్చవం లా చేసి పోవడం నీకు మర్యాద అవుతుందా ? నీ, ముగ్ధమోహన రూపాన్ని చూడనీ కుండా, దూరం చేయడం, బ్రతుకు భారం చేయడం నీకు తగునా, తండ్రీ,?! అసలు నీవు లేకుండా మేము ఎలా ఉండగల మని నీవు అనుకున్నావు,?? నల్లనయ్య!,, నీ అల్లరి చేష్టలు, చిలిపి లీలలు,, నీ ముద్దుమోము, ఆ శిఖిపించము కస్తూరీ తిలకం, నీ కాలి చిరు అందియలు, నీ మొలత్రాడు కు ఉన్న ఘంటికలు సవ్వడులు, నీ చిరునవ్వులు, చెవుల కుండలాలు, పట్టు వస్త్రం, చేతిలో మురళీ, దివ్య మంగళ కర  సురుచిర సుందర రూప లావణ్య ములను ఎంత చూసినా తనివి తీరదు కదరా కృష్ణా,,!  బ్రహ్మ, రెప్పలు అడ్డం పెట్టాడు గానీ, కన్నా, నిన్ను చూసిన కళ్లే కళ్ళు కదరా నా కన్నా ! నీ చూపు మా పై పడుతూ ఉంటే,, ఆనందంతో,ఒళ్ళు పులకరించి పోతోంది కదా,,! అయ్యో,; నా మతి మండి పోనూ!,, నీకు ప్రాణం కంటే ఇష్టమైన గోశాలలో నిన్ను వెదకడం మరిచే పోయాను రా! నాన్నా,, !పదివేల కొలది ఆవులు, లేగ దూడల మందలో నిన్ను ఎలా వెదక నురా,? తండ్రీ,! ఇక నా చేత కాదురా బాబూ,! అలసిపోయాను రా చిన్నా,!, నిన్ను చూడకుండా గడచిన ఈ ఒక్కొక్క రోజూ, గడపడం , నిజంగా, నాకు ప్రాణాంతక మౌతోంది రా,, కన్నయ్యా,!! నా కడుపు కోత, తల్లీ ప్రేమ, నా ఆవేదన నీకు ఎలా అర్థం అయ్యేలా చెప్పనురా?, నా గారాల తనయా ! నీ కోసం యమునా నదీ తరంగాల్లా పొంగి పొర్లుతున్న కన్నీటి ధారలు కాలువ లై, ఇక ఏ మాత్రం తడి ఉండటం లేదు, ఏడ్చి ఏడ్చి, కళ్ళు ఎండిపోయాయి, నీ రాక కోసం చూస్తూ చూస్తూ , ఇక చేతకాక, కనురెప్పలు వాలి పోతున్నాయి రా , ఏం చేయను కృష్ణయ్యా! గతమంతా ఒక తీయని బంగారు స్వప్నం లా  తీస్తోంది రా కన్నా !! ఇంకా ఏడవాలి  ఏడ్చుటకు కళ్ళలో చుక్కైనా మిగ లి లేదు, కృష్ణా! అదిగో చూడు, బృందావనం లో నుండి , నిన్ను వెదుక్కుంటూ పరుగు పరుగున నెమళ్ళు గుంపులు గుంపులుగా వచ్చాయి"", మా కృష్ణుడు ఏడి,! మా శిఖి పించ మౌళి ఏడి ? నవ్వు రాజిల్లె డి మోము వాడు, ఆ నల్లని వాడు, పద్మ నయనమ్ముల వాడు, ఎక్కడమ్మా ? మాకు కనపడటం లేదు, ఎక్కడ దాచావు మా నల్లనయ్య ను,, ?అతడు లేకుండా, మేము జీవించి ఉండలేమని నీకు తెలుసు గదా , తల్లీ,! మాపై ఈ మాత్రం దయ లేదా,, కృష్ణుడు నీకు మాత్రమే ప్రాణమా, మాకు కాదా ! మేము ఆహారం నీరు ముట్టకుండా, ఇలా కృశించి పోవడం నీకు సంతోషంగా ఉందా, చెప్పు ,? ఇంత నిర్దయగా ఉండటం, యశోదా మాత కు తగునా,? అయినా , మా పిచ్చి గానీ ,నీవు ఆపితే మాత్రం, ఆ, వనమాలి,, ఆ భక్త జన హృదయ మందారు డు,, జగన్నాటక సూత్రధారి,,, లీలా మానుష వేషధారి, మురారి,, అచ్యుతు డు , అనంతుడు ,, దయా సముద్రుడు, దీన జన రక్షకుడు ,,ఏదో విధంగా మమ్మల్ని చూడకుండా, మా వద్దకు రాకుండా పోతాడా,!"" అంటూ, నీవు వెళ్ళిన మార్గంలో నే నిలబడి నీకోసం ఎదురుతెన్నులు చూస్తూ, కళ్ళ గుండా అశ్రు ధారలు రాలుస్తూ, అతి దీనంగా ,బేలగా ఉంటే నోరు లేని ఆ మూగ జీవాల మూగ వేదనా భరిత ఆవేదన ను నేను  చూడలేక పోతున్నాను రా కన్నా,! ఇందులో, ఎవరి బాధ గొప్పది చెప్పు ? నీకై తపించే , విలపించి, పరితపించే, ఎవరి తాపం విరహం, ప్రేమ ఆవేదన పెద్దది?  కాస్త మాపై కృపతోవచ్చి, మా పేద మనసును చూసి చెప్పరా! అయినా సచ్చిదానంద స్వరూ పుడివి,! నీకేం తెలుసు, దేవునికై జీవుడు పడే ఆవేదన ?? ఇది చూసి అయినా, శిఖిపించ మౌళి వెన్న మనసు కరగదా,, యశోదా నందనా !? కనీసం, ఒకే ఒకసారి వచ్చి మా దయనీయ దుస్తితి చూసి పోరా దా ,, నంద గోపాలా,,! నవనీత చోర,,! బృందావన సంచార,,! బాలకృష్ణ,; గోపీ మనోహర,,! వేణు గాన లోల,!, నీ మృదు మధుర వేణు నాదం వినకుండా ఎలా జీవించేది రా రాధా కృష్ణా ?? ఆ రోజున,యమునా నదిలో కాళీయునీ పడగల పై నీవు అందంగా ఆనందంగా, అద్భుతంగా, అపురూపం గా, నాట్యమా డుతు న్న నయనమనోహర సుందర దృశ్యం ఇంకా మాహృదయ ఫలకం పై చెక్కు చెదరకుండా ఉందిరా, కాళీయమర్దనా,!; ఇక్కడే ఆ దుష్ట రాక్షసి పూతన నీకు తన విషం చిమ్మే చనుబాలను ఇవ్వబోయిన ది కదా, మురళీ మనోహర ,,! ఇదిగో,! ఇక్కడే శకటం రూపంలో నీకు అపాయం తలబెట్టాలని వచ్చిన ఆ పాడు రాక్షసుడు హతమయ్యాడు కదరా , నానా,!! ఇదిగో ఇక్కడే మన రేపల్లె లోని గోపికలు కట్ట కట్టుకొని వచ్చి నీపై లేనిపోని చాడీలు నాకు చెప్పి ,,నీపై కోపం తెప్పించా రు కదా, విశ్వ రూపా !! అదిగో!, అక్కడే రెండు పెద్ద మద్దిచెట్లు మూలం తో సహా, కింద పడ్డాయి, వాటి సందుల్లో నీవు చిక్కి,, పున్నమి చంద్రునిలా మాకు కనిపించావు, గదా !, నేవుండగా తమ ఇళ్లకు వెళ్లకుండా, ఇక్కడే ఇదే మన ఇంట్లో పొద్దంతా గడిపిన గోపికలు, నీవు వెళ్లి పోయాక ఒక్క గోపిక కూడా , నాకోసం ఇటువేపు రావడం లేదు, చూశావా నంద బాలా, యదు కుల కిషో రా !! కనీసం, ఈ దౌర్భాగ్య యశోద బ్రతికి ఉందా, లేదా !అని కూడా చూడటం లేదు,,! అయినా నా అమాయకం గానీ,, వారి పరిస్తితి కూడా నాకంటే ఘోరంగా ఉం ది రా కన్నా ! నీకోసం బెంగతో చిక్కి శల్యం అయి పోయారు, పిచ్చి పిల్లలు !!నీ తోటి బాల్య స్నేహితులు,,వారు కూడా అదే దుస్తితి లో ఉన్నారు, రా నాన్నా !! నీవు ఎక్కడో మధురా నగరాన రాజువి !! యమునకు ఆవల తీరాన, మేము దూరాన ఇక్కడ కుగ్రామం లో సామాన్యుల ము , అఙ్ఞానులం ! మాకు   నీ గురించి నీ బాగోగుల గురించి మాకు వివరంగా చెప్పే నాథుడు లేడు, రా కన్నా ,, మా దీన గాథ లను నీకు చెప్పుకునే వీలు కూడా మాకు ఏ మాత్రం లేదు కృష్ణా ,!నీవు ఎలా ఉన్నావో?, ఏం చేస్తున్నావో,? ఏం తింటున్నాు వో? ఎన్ని కష్టాలు పడుతున్నా వో కదా కన్నయ్యా, అసలే మెత్తని హృదయం నీది, అందుకే తల్లీ మనసు నీకోసం ఆరాట పడుతోంది రా నవనీత హృదయా ! నటనా గ్రేసర చక్రవర్తి , గోవిందా !, గోకుల బాలక పరమానంద !!, చిన్ని కృష్ణా ! నా చే తితో ,వెన్నముద్ద నీకు తినిపించక ఎన్ని రోజులయ్యింది రా కన్నా,? నంద కిషోర  !నీ తండ్రి, నందరాజు,! పాపం ,అటు,, నిన్ను ఇక్కడికి తీసుకొని రాలేక,,, ఇటు, నిరంతరం నీకై విలపించి, కృంగి పోతున్న నన్ను చూడలేక ఎంత సతమత మౌతున్నా డో , కృష్ణయ్యా,,నీకు తెలిస్తే, క్షణమైనా జాగుచేయకుండ పరుగు పరుగున వచ్చే వాడివి కదరా,!, రేపల్లె బాలుడా,!, గోవత్స ప్రియుడా,,! మేము అనుభవించే, ఇలాంటి దురవస్థ సృష్టిలో ఎవరికీ రాకూడదు రా బుజ్జి తండ్రీ! ఇక ఇలా,, నీకై కృంగి కృశించి,, మేమంతా ఇలా ఘోరమైన నరకయాతన అనుభవించ వలసిందేనా ? మా బ్రతుకు ఇంతేనా,? మాకు దీని నుండి విముక్తిని ప్రసాదించ లేవా, కరుణా లోల,, శ్రిత జన పాలా ! , గోపాలా,! ఆ రోజున ,గోవర్ధన గిరి పర్వతాన్ని నీవు నీ కొనగోటి పై నిలబెట్టి, ఇంద్రుని కోపాగ్ని నుండి గోకులాన్ని రక్షించిన నీ అపార వాత్సల్యం మేము మరచి పొగల మా, గోవిందా ??, ఈ దుర్భర దుస్స హ దుఃఖ సముద్రంలో, మేము, నిర్దాక్షిణ్యంగా, ఇలా కొట్టుకు పోకుండా, మమ్మల్ని దయ తో, పాలించి, ఉద్ధరించే రక్షకుడవు నీవు మాత్రమే, తండ్రీ ! ఇకనైనా మాపై దయ రాదా, ఈ రేపల్లె వాసుల విరహ వేదనా పై,,?? కన్నా !కనికరించవా? , మా మొర ఇకనైనా  ఆలకించవా,? కృష్ణా , !ఒక్కసారి రావయ్యా,! నీ దర్శనంతో మా గోకులాన్ని ఈ దుర్భర దుస్తితి నుండి ఉద్దరించవా,! నీకై చూసి, చూసి ,చూసి కళ్లు కాయలు కాచి పోయాయి, రా బృందావన విహారి !! నీకై తపించి తపించి, మా ఒంట్లో ఉన్న సత్తా నీరు కారి పోతోంది,! శక్తి ఉదిగి పోతోంది ; ఏం చేయను ,! కన్నా ,?, అద్భుతం అపురూపం, ఆనందకర మైన నీ కృష్ణ లీలల ను అంతరాళం లో రమిష్టు సంతోషించాలో, లేక నీకై పరితపిస్తూ శేష జీవితం ముగించా లో , ఏది తెలియడం లేదు, మాధవా;,మధుసూదనా,,! కేశవా!, జనార్దనా;,, నిన్ను కనలేని ఈ కనులు ఎందుకు ??, నీ వంశీ నాదం వినలేని ఈ చెవులు ఉండి ఏం లాభం చెప్పు ??, నీ కస్తూరి సౌరభాలు ఘ్రానిం చ లేని శ్వాస నాళాలు, కొలిమి తిత్తులు కావా,!J జగన్నాథ !! నిన్ను తా కలేని ఈ చేతులు, మఱ్ఱి ఊడలు కావా ? కృష్ణా! కృష్ణా! కృష్ణా ! అంటూ నోరారా పిలవ లేని నోరు, చెట్టు తొర్ర కదా, నగదర కృష్ణా ! బిగియార ప్రేమతో,నిన్ను హృదయానికి హత్తు కొలేని ఈ శరీరం , శవం తో సమానం కాదా? ముకుందా! అందుకే, కృష్ణా , నీవు లేని మా, ఈ జీవితం  వృథా,!, శ్రీకృష్ణా! ఈ జన్మకు, నీవు అనుగ్రహించిన ఆ మధుర స్మృతులు, ఆ తీయని తలంపులు , మాకు చాలు, అని సరి పెట్టుకోవడం తప్ప, శ్రీనివాసా, మేము చేయ గలిగింది మరేముంది చెప్పు ?! వైకుంఠ వాసా,, వైష్ణవ భక్త హృదయ నివాసా ! కృష్ణా ; ; మాకు న్న నీ  జ్ఞాపకాలు, అదే పదివేలు అనుకోవాలా?,రాధామనోహరా ,!, గోవర్ధన ఉద్దారా,,! నీలమేఘ శ్యామా!,,, నీ చిన్ననాటి రూపం, మధురాతి మధురం! ముగ్ధ మనోహరం!"ఆహా ! ఏమా లావణ్యం ? ఏమా బాల కృష్ణ అపురూప సుందర రూపం ? పొగడ తరమా నీ లీలలు కృష్ణా !?? నీ, చేతిలో వెన్న ముద్ద, !శిఖ లో నెమలి పింఛం,,! మెడలో చెంగల్వ పూదండ,! మొలకు బంగారు మొలతాడు,! పట్టు దట్టి, !!చేతికి సందే తాయెత్తు లు!, కాళ్ళకు సరి మువ్వ గజ్జెలు,!! నవ రత్న మణి మయ ఖచిత భూషణములు,ముత్యాల సరము లు, స్వర్ణ మయ హారములు ధరించిన జగన్మోహనాకారా !!శ్రీకృష్ణా! యదు నందనా !! రాస లీల వినోద ! నీకు శుభ మంగళము,! నీ స్మరణ, నీ అర్చన, భావన, సేవనం, తో నిరంతరం పూజించి ,తరించే పరమ వైష్ణవ భక్తులకు జయమంగళం,! ఆచార్యులకు మంగళం ,! పరమ పురుషునికి , వేద వెద్యునికి, అద్యంత రహిత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కి, లక్ష్మీ రమనునికి జయమంగళం,! స్వస్తి !!హరే కృష్ణ ,హరే కృష్ణా ,,,,కృష్ణ కృష్ణా,,హరే హరే,,! హరే రామ హరే రామ, రామ రామ , హరే హరే !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...