Wednesday, August 7, 2019

భగవద్గీత

Aug 7, 2019
Austin

"భగవద్గీత, "అంటే సాక్షాత్తూ భగవంతుడు,  శ్రీకృష్ణ భగవానుడు, స్వయంగా అర్జునునికి  బోధించిన ముక్తిమార్గము ,! దేవుడు  జీవునికి, తాను ఎలా బ్రతకితే, జన్మ సార్థకం అవుతుందో వివరించిన బహు చక్కని జీవన విధానాలు,, గీతా వాక్కు లు.."! గీత" అంటే మధురమైన గీతాలు,గోపాలకృష్ణ భగవానుని నోటి నుండి మనకోసం వెలువడిన అమృతాలు , అద్భుత శ్లోకాలు,! సకల జన మానవాళి అభ్యుదయానికి , అందించిన తరగని,పెన్నిధి! అమూల్యమైన కానుకలు,,! జన్మ సాఫల్య ము చేస్తున్న వరాలు.!కనుక సు"గీత"ను, నియమాలను సూచించే ఒక సరళరేఖ అనే,  విధంగా మనం అర్థం చేసుకున్నా కూడా, శ్రీకృష్ణుడు మానవులకు తాను ప్రసాదించిన ఉత్కృష్టమైన మానవజన్మ ఉద్ధరణ కోసం అందించిన ఒక విశేష ప్రణాళిక !! మనిషి మనుగడ, శరీర పోషణ కోసం ప్రకృతి సంపదలనుఅనుగ్రహించాడు కదా! అతడి, అత్మ పరిశీలనకు, అనుభవ యోగ్యంగా, భగవద్గీత ను ప్రసాదించాడు ! అంతేకాకుండా, బంధు జనాలను, జ్ఞానాన్ని, తగిన ఆయువును, శక్తినీ, ఎన్నో వసతులను ,మానవుడు ఇది కావాలని అడగకుండానే ,, అనుగ్రహిస్తూ నే, ఉన్నాడు.! వాటిని ,,అర్థవంతంగా అనుభవించడానికి అందించిన మార్గదర్శకాలు కూడా ఈ సుగీత ద్వారా అందించాడు.  !. భగవద్గతలోని 18 అధ్యాయాల సమ్మేళన సారాంశం , భగవంతునికి భక్తునికి ఉన్న అవినాభావ అనుబంధం  !", గీత" అంటే ఇది దాటకుండా ఉండాలి అన్న నియమం,! త్రేతాయుగం నాటి మాట, చూద్దాం ,! అరణ్యవాసం లో,"  బంగారు జింక "భ్రమ లో పడీన సీతాదేవి , అటు రాముని పంపించి  దూరం చేసుకొని, ఇటు లక్ష్మణ స్వామి, అది కేవలం "రాక్షస మాయ "అని ఎంత చెప్పినా వినకుండా, తూలనాడి,, అతడిని దూరం చేసి ,, ఒంటరిదైపోయి కూడా, చివరకు  ఆమె అత్మరక్షణ కోసం గీచిన" గీత""ను కూడా దాటి, భరింపరాని, సహింపరాని కష్టాలు, శోకం,, విరహం ,తాను పడు తూ ,రామలక్ష్మణులను కూడా  అనుభవింపజేస్తుంది ,! అంతేకాదు,  రాక్షస సంహా రానికి , లంకా వినాశనానికి గురి చేస్తుంది,! మంచి మాట అనగా "సుగీత "చెబితే వినకుంటే , పాటించకుండా నడిస్తే, ఇలా కష్టాల పాలౌతారు కదా ; ఇదంతా, " విధి విధానము "అని సరిపెట్టుకున్న కూడా,, జీవితంలో అనుకోని అడ్డంకులు, ఎన్ని సంభవించినా కూడా, కొల్పోని ఆత్మస్థైర్యం తో, ఓర్పు తో, నేర్పుతో,  ఆదర్శ జీవనం, గడపడానికి,, దైవానుగ్రహం పొందడానికి సూచనగా, హెచ్చరికగా, భగవంతుడు గీచిన గీత "భగవద్గీత "! దీనిని ఉపయోగిస్తూ,, మానవు డు , రాక్షస లక్షణాలు పొందకుండా, సత్వగుణ సంపదతో ,దైవానికి దగ్గర గా చేరుస్తూ ఉంటుంది .!, మనిషిగా బ్రతకాలంటే నియమం అంటే "గీత"అత్యవసరం !", గీత "అంటే హద్దు, ! హద్దుల్లో ఉండాలంటే, జైలు లో ఉన్నట్టు బాధ పడతారు . అంతా !" సత్యం ,ధర్మం, అహింస !""అనే విలువలు మానవుడు గా జీవించి పాటించాల్సిన అమూల్యమైన ధర్మాలు ,! అంటే హద్దులు,!" సత్యాన్ని" పాటిస్తూ హరిశ్చంద్రుడు , తాను అబద్దం ఆడకుండా ఉండేందుకు ఎన్ని పాట్లు పడ్డాడో మనకు తెలుసు ,,! ఒక మనిషి, ధర్మావతారుడు గా,చరించడానికి , శ్రీరామచంద్రుడు ఎన్ని అగచాట్లు  అనుభవించా డో మనకు తెలుసు !అందుకే ధర్మం ఎంత తెలిస్తే అంత ఇబ్బందులు, హద్దులు పెరుగుతూ వుంటాయి. !ఉదాహరణకు,, భోజనం చేయాలంటే ,,1,కూర్చుని తినాలి !,,2, దేవునికి ఆరగింపు చేసి మాత్రమే తినాలి ,,3,, భోజనం అయ్యేవరకు మాట్లాడకూడదు ,!4,. దైవ నామ స్మరణ చేస్తూ మాత్రమే తినాలి .!5. ఇంట్లో స్వయంగా హరి నామ స్మరణ చేస్తూ మాత్రమే వండిన ఆహారం తినాలి!6 , ఏదైనా ఇతరులకు పెట్టకుండా ఒక్కరే కూర్చుం డి తినరాదు,!7, మాంసాహార పదార్థాలు తినరాదు,,!8, తాను, అనగా జీవుడు తింటూ ఉన్నాట్టు కాకుండా, లోనున్న అత్మారామునికి , తినిపిస్తూ ఉన్నట్టు గా భావిస్తూ తినాలి ,,! ఇలాంటి నిష్టా, నియమాలతో భుజించే సాత్విక ఆహారం తో దైవా నుగ్రహం పొందడం భక్తి ప్రపత్తులు పెంచుకోవడం  ఉత్తమం !! ఇవన్నీ మామూలుగా అనిపిం చే ధర్మాలే ! కాని ఆచరణ లో పెట్టడం అంత సులువైన విషయం కాదు!, అలాగే తలిదండ్రుల ను ప్రేమించడం, పెద్దలను గౌరవించడం, కొడుకుగా, తండ్రిగా, భర్తగా, భార్యగా జీవితంలో బాధ్యతగా ఆచరించాల్సిన ధర్మాలు ఎన్నో ఉన్నాయి, !ఇవన్నీ మనిషి జీవితాన్ని హద్దుల్లో , పెడతాయి,,! కాని పొందే ఫలితం మాత్రం అధికం! అంటే ధార్మిక, ఆధ్యాత్మిక, మానవత్వ, నైతిక విలువలు పెరుగుతాయి,!" సత్యము, శివము, సుందరము అయిన నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ ను తెలుసుకొన వచ్చును,,! దేనికైనా హద్దు ఉంటుంది, !ఉండక తప్పదు, కూడా ! నగరాలలో కారు గీత దాటితే చాలు,! వేలల్లో డబ్బుల జుర్మాన విధించడం చూస్తాం!, కొన్ని రూల్స్, పాటిస్తూ ఇతరులకు ఇబ్బంది కలుగకుండా సభ్యత గా మె దలాల్సి ఉంటుంది.!.,our freedom ends,where the nose of others begins.!" అన్నట్లుగా పరిధిలో ఉన్నంతవర కే మన స్వాతంత్ర్యం ఉంటుంది  . !మాట్లాడాలన్నా, తినాల న్నా, త్రాగడానికి, పడుకోడానికి,, పొట్టకూటి కోసం,, మనుగడ కోసం, ఉద్యోగం, వ్యవసాయం, వ్యవహారం, ఎవరితో నైనా సంబంధాలు పెట్టుకోవడం వంటి   ఏ పనీ చేయాలన్న , సత్ఫలితాలు రావాలన్నా,హద్దులు లేదా నియమాలు, గీతలు ఉంటాయి,! ఈర్ష్యా ద్వేషాలు, కోప తాపాలు, పంతాలు పట్టింపుల కు పట్టూ విడుపు లు ఉంటాయి, !అంటే శృతి మించకుండా, ఇతరులను బాధ పెట్టకుండా హద్దుల్లో ఉండాలి మనిషి. ! భగవంతుడు తన సృష్టిలో అన్నిటికీ నియమాలు , ప్రత్యేకతలు హద్దులు ఏర్పాటు చేశాడు,! కాని మనిషి మనసుకు మాత్రం హద్దులు లేవు, అందుకే , సద్వినియోగం కోసమే ,ఈ గీత ఉపదేశం చేశాడు ! దానికి దేశ కాల పరిస్తితినీ, కూడా అనుసంధానం చేశాడు, !, వేగంగా ప్రవహిస్తున్న నదులకు, ఉవ్వెత్తున పొం గుతూ, భూమి పైకి నిరంతరం పొంగుతూ వచ్చే అనంత సాగరాల కెరటా లు దాటకుండా సముద్రతీర ప్రాంతా లు సరిహద్దులు గా ఉంటున్నాయి..!, హిమాలయ పర్వత సానువుల్లో కరిగే, పెరిగే మంచు కొండల నుండి జాలువారే జీవ నదుల కు హద్దులు , ఇరువైపులా సహజంగా నే ఉన్నాయి! , కానీ ,సముద్రాల్లోనీ బడబాగ్ని కి , భూకంపాల కు,, ప్రచండంగా వీచే గాలుల కు,, అకాల వర్షాల, తుఫానుల వైపరీత్యాల కు, ఇలాంటి ప్రకృతి శక్తులు హద్దులు దాటితే ఎంత ఉపద్రవాలు , ప్రళయాలు వస్తాయో, మనం ఊహించలేం కదా !..అలాగే మానవుడు అణు శాస్త్ర విజ్ఞానం పేరుతో దుర్వినియోగం చేసే మేధస్సు తో కూడా ప్రపంచ వినాశనం కలుగుతుంది,,! పరమాత్మ తన సృష్టిలోనీ, ప్రాణికి , ప్రతీ చెట్టూ పుట్టా, కొండా కొనలకు, అన్నింటికీ విది విధానాలు విధించాడు,! ఎండాకాలం , చలికాలం వానాకాలం ,, రాత్రీ పగలూ, ఋతువులు ఒక క్రమశిక్షణా యుత మార్గంలో వస్తుంటాయి,! అలాగే మనిషి ప్రవర్తనకు కూడా గీతా బోధన ద్వారా పాటించవలసిన  నియమాలను తెలియజేశాడు! , ఈ నియమాలు ఋజు ప్రవర్తనతో, పాటించాలి. న్యాయం ధర్మం, మానవత్వం, దైవత్వం, పెద్దలు, పండితులు, తలిదండ్రులు, గురువులు, సాధువుల పట్ల గౌరవ భావన, స్నేహితులు బంధువుల పట్ల ఆదరాభిమానాలతో బాటు దైవారాధన గురుపూజ లాంటి ఉన్నత భావాన్ని అలవరచు కోవాలని సూచించాడు భగవానుడు,,;! యిటువంటి నైతిక , సాంఘిక, ఆధ్యాత్మిక విలువలు కేవలం మనిషికి సకల ప్రాణుల ఆదరణ వలన కలిగే ప్రేమ వలన మాత్రమే సాధ్యం అవుతుంది. !"మానవ సేవయే మాధవ సేవగా, సర్వ ప్రాణుల అదరణయే పరమాత్ముని సేవ "గా భావించాలని గీతాచార్యుడు ఉపదేశించాడు ,,, ఆదేశించాడు కూడా! పరమాత్ముడు అనంత గుణ సంపన్నుడు,; అతడిని పరిమితమైన  భావన పూజ, అర్చన సేవ లతో భావించలేము కదా! హద్దులు, ఎల్లలు లేకుండా, అపరిమితంగా, అనంతంగా, అపురూపంగా, అద్భుతంగా, నిరుపమా నంగా, నిరాపెక్ష భక్తి తో  అత్మ సమర్పణ, భావంతో అతడి కింకరుని వలె దాసాను దాసుని వలె , ఆరాధన చేస్తూ ఉండాలి.! అది అవ్యాజమైన ప్రేమానురాగాలతో , అర్ద్రతతో , ఆరాధనా భావంతో కూడి ఉండాలి,,! పరిమితమైన శక్తితో, జ్ఞానంతో, విశ్వాత్మ రూపు ని, భగవానుని కొలవాలంటే కుదరదు !,అతడిపై అపరిమిత మైన  పరిపూర్ణ విశ్వాసం, ప్రేమ, నిరంతర సాధన, నిష్కళంక మైన హృదయం తో సాధ్యం !   అలాంటి యోగ నిష్టతో ఎందరో భక్తులు, పరందాముని కృపకు పాత్రులు అయ్యారు అని మన భాగవతం సూచిస్తోంది,;",, గీత" లో శ్రీకృష్ణ భగవానుడు తరుచుగా చెబుతూ ఉండే హెచ్చరిక లాంటి వాక్యం,! "నేను ఉన్నాను!, నన్ను పూజించు!, నన్ను నీ హృదయం లో నిలుపుకో,; వేరే ఇతర ధ్యాస మానుకొని, సర్వదా నన్నే దైవంగా భావించి, ఆరాధిస్తే నీ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను!, నీ రక్షణ భారం, బాధ్యత నాదే!"" అంటూ ప్రబొదిస్తాడు,.  సృష్టిలోని సకల జీవ రాశుల తో బాటు మనిషికి కూడా జననం ,మరణం, జీవన విధానం, బంధు బల గం, తలిదండ్రులు సంతానం, ఆహారం, వసతులు అన్నీ భగవానుడు అనుగ్రహించిన వే కదా,! తాను కోరి తన వెంట తెచ్చుకున్నది,  భూమిపై ఏది లేదు, కదా! అంతా అతడి సొమ్మే, కదా I,, ఇవ్వబడిన ఈ ఉపాధి, మన" శరీరం" కూడా భగవద్ ప్రసాద మే, కదా! అందుకే "నీది" అనేది ఏది లేదు, కదా ! మరి ఎందుకు ఈ దైన్యం, ఈ నిస్పృహ, ఆవేదన,;? అహంకార, మమకారాల తో చేజేతులా అమృతతుల్యమైన జీవితాన్ని నరకప్రాయం చేసుకోకుండా, భగవానుడు నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు!, జీవితం పరమాత్ముని కృపగా భావించు, అంతే,! అంటున్నాడు,, ఇన్నీ చేసి, నీ తప్పు ఒప్పులు, అపరాధాలు, అన్నీ క్షమిం చే బాధ్యత కూడా తానే తీసుకునే ఇంత గొప్ప ఆత్మీయులు, ఇంత మంచి ఆత్మ బంధువులు ,ఆ పరమాత్మ కు మించిన ఆప్తులు, దయమృత సాగరులు ఎవరుంటారు చెప్పండి !??" కర్త, కర్మ, క్రియ!" అతడే అన్న కృతనిశ్చయంతో, జరిగింది, జరుగుతోంది, జరుగ బోయేది అతడి లీలా విలాసమే అనే భాగవత సంప్రదాయం తో,, చక్కని భావ సంపదతో,, కర్తృత్వ భావన లేకుండా, పరమాత్మ పై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉందాం! .శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో సూచించిన విధంగా , నడచు కుంటూ, మన జీవన విధానాలను "సద్గతి"పొందే దారిలో మలచు కుందాం!, గతజన్మ కర్మ ఫలాలను, కష్టమైనా సుఖమైనా , ఇష్టమైన, కాకున్నా కూడా అవి పరమాత్ముని ప్రసాదంగా భావించుదాం,! దైవాన్ని నమ్మి చెడినవాడు ధరణి పై లేడు,! కాని ఒక్కటి మాత్రం నిజం !"పరందాముని అండ లేనిదే, కృప కోరకుండా మనం చేసే పను ల్లో విజయాన్ని , సంతృప్తిని పొందలేము !"అన్నది నిర్వివాదాంశం కదా ! అందుకే ,అతడి సేవలో మనసును నిలిపే అత్మబలాన్ని , అతడిపై అవ్యాజమైన ప్రేమానురాగాలను మనకు అనుగ్రహించ మని, మనసారా ప్రార్థించుదాం,,! హే జగదీశ్వర,! అల్పులము !అఙ్ఞానులము! అవివేకుల ము !అమాయకులం , పాపులం అని తెలిసి కూడా , మాకు కామధేనువు, కల్పతరువు లాంటి , భగవద్గీత గ్రంధాన్ని,  దయతో మాకు అనుగ్రహిం చావు! చాలు,! కృతార్తులం మేము! అందుకు మేము నీకు కృతజ్ఞులం , తండ్రీ !వాసుదేవా,! అనంతా!, గోవిందా! గోపాలా,!, నిన్ను మరవకుండా ,నీ చరణ కమలాలు విడవకుండా, నిన్ను సేవించి, తరిం చే మహా భాగ్యాన్ని నీ భక్తులకు, నీపై అనురక్తులకు కరుణించు,! హే కరుణా లొలా,! శ్రిత జన పాలా !భక్తజన హృదయ మందారా,! మాధవా !మధుసూదనా ,! నీవు చూపిన గీతా మార్గములో నడిపించే భారం నీదే తండ్రీ! నారాయణా! జగన్నాథ,! శరణు !శరణు! శరణు! స్వస్తి !హరే కృష్ణ !హరే కృష్ణా!!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...