Wednesday, August 7, 2019

చిరంజీవి హనుమ!

Aug 2, 2019
Austin

""పరమశివుని అవతారం హనుమ,! శ్రీరామ నామతారక మహా మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ,ఉంటున్న శివుడు, తన ఇష్టదైవమైన శ్రీరాముడు ,,రామావతారం లో వనవాసం లోపడే కష్టాలను చూడలేక హనుమ రూపంలో సీతాన్వేషణ చేసి సహాయం చేస్తాడు! దానికి,, ప్రతిగా హనుమకు ఏమీ ఇవ్వలేనని తెలిసి శ్రీరాముడు అతడిని వాత్సల్యంతో, ఆలింగనం చేసుకుని చిరంజీవి గా వర్ధిల్ల జేస్తాడు!, ఆ రకంగా, పరోక్షంగా శివుడు హనుమ రూపంలో, భక్తజనుల కోరికలను తీరుస్తూ,, జనాలల్లో భక్తి భావాన్ని, హనుమద్దాస భక్తులను ఊరూరా, పెంచుతూ, వారికి సకల శుభాలను, ఆనందాన్ని, ఐశ్వర్య అభివృ ద్ది, ఆరోగ్యాన్ని  అనుగ్రహిస్తూ, నేటికీ,, శ్రీరామ  కవచం లా రక్షిస్తూ ఉన్నాడు!!,  తన ప్రభువు దైవం అయిన రాముడి నీ , అతడి ప్రాణానికి ప్రాణం అయిన సీతమ్మను రావణుడి దూరం చేసి దుఖింప జేయడం, శివునికి చాలా బాధాకరం అయ్యింది ! కానీ, అటు రావణుడు ఇటు రాముడు ఇద్దరూ తన భక్తులే,! కాని ధర్మం తప్పి, రాముని లాంటి తన శివభక్తుల కు మహా అపచారం,శివాపరాధం చేస్తున్న రావణాసురు నీ ఆగడాలు సహించ లేకపోయాడు, అతడి వద్దకు తానే హనుమ రూపంలో ,స్వయంగా వెళ్లి , నయాన భయాన చెప్పినా కూడా వినకపోతే, అతడి మూర్ఖత్వానికి కోపం వచ్చి,, లంకను తన రుద్ర నేత్రంతో కాల్చి భస్మం చేశాడు,, అయినా వాడికి బుద్ది రాలేదు, జ్ఞానం కలగలేదు..! అలాగే రాముడు కూడా తన స్వామి  శివయ్యభక్తుడు అయిన రావణుడి సంహారానికి, అతడి బంధు జనా లు,లంకా పురవాసుల చంపడానికి, ఇష్టపడక రావణుడి తో ,ఎన్నో సంధి ప్రయత్నాలు, రాయబారాలు, చేశాడు,! ఫలించలేదు! చివరకు విసిగి పోయి, రామేశ్వర శివలింగ ప్రతిష్ఠ చేసి, పూజించి, సదాశివుని కరుణకు పాత్రు డై, అతడి అనుగ్రహం తో ,అనగా హనుమ తోడు కాగా, శ్రీరాముడు రావణ సంహారం చేశాడు.!. ఇలా హరి అనగా శ్రీరాముడు, హరుడు అనగా హనుమంతుడు ఇద్దరూ, దుష్ట శిక్షణ కూ, శిష్ట రక్షణకు, నడుం కట్టి న వారే !!కలిసి ఒక్కటై, జన కళ్యాణం కొరకై ,, లోక హితం కోసం, అకాన్షించే వారే!! హరిహరులు వేరుగా కనిపించినా, వారు ఇరువురూ ఒకటే అని రామాయణ కావ్య రచన ద్వారా వాల్మి కి మహర్షి సూచిస్తూ ఉన్నాడు,! హనుమకు ఉన్న భక్తుల సంఖ్య అపరిమితం,! ఆయన దేవాలయాలు అసంఖ్యాకం !! అలా అన్ని దేశాల్లో విస్తరిస్తూ, హనుమత్ వైభవాన్ని , ప్రాభవాన్ని, శ్రీరామ నామ ప్రాచుర్యాన్ని , సనాతన హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంది,! అందుకే హరి హరుల బేధమేంచకుం డా, హనుమ లాంటి నిరుపమాన, అపురూప, అద్భుత అద్వితీయ, అమోఘమైన, దైవాన్ని త్రికరణ శుద్ధితో, కొలిచే భావ సంపదను, భక్తి తత్పరత ను, అనుగ్రహించ మని,, శ్రీరామ దూత ను, రామాయణ కావ్య మహా మాలా రత్నం, భక్త జన రక్ష దీక్షా దక్షుడైన , పవనసుత హనుమాన్ చరణ కమలాల ను శరణు కోరుకుందాం!", ప్రహ్లాద, నారద ,పరాశర ,పుండరీక, వ్యాసాంబరేశ, శుక, శౌనకాది మహా భక్త పుంగవులలో, అగ్రగణ్యుడు గా, పేరుగాంచిన హనుమ భక్తి గొప్పది కావడానికి కారణం, అతడి అంకిత భక్తి !" అహం బ్రహ్మో స్మి " అనినట్టుగా , రాముని, హనుమను వేరు చేయలేము, వేరుగా చూడలేము ,, రాముడే హనుమ, హనుమ యే రామయ్య !, హనుమ తన హృదయంలో శ్రీరామ చంద్రు నీఎల్లప్పుడూ , నిక్షిప్తం చేసుకుని, రామ వైభవం తో బ్రహ్మానంద భరితుడై , పోతుంటా డు, రామ సభలో, ఉన్న రామ పరివారానికి, తన వక్షస్థలాన్ని చీల్చి, తన హృదయంలో విరాజిల్లే సీతారాముల సురుచిరసుంద ర మంగళా కార స్వరూపాలను ,ప్రత్యక్షంగా చూపాడు  ! అంత గొప్ప రామభక్తి హనుమది  !! అలా, నిరంతరం, అతడు ,శ్రీరామ నామ గానం  చేస్తూ తన్మయత్వం తో తనను తాను మరచి, బాహ్య స్మృతులను విడచి, అంతరంగం లో వెలుగుతూ ఉన్న లక్ష్మణ సమేత సీతారామ చంద్రుల ను దర్శిస్తూ, వారి కళ్యాణ గుణ కీర్తనలను శ్లాఘిస్తూ కీర్తిస్తూ పరవశిస్తూ ఉంటాడు. !అంతే కాదు,! ఒడలు మరచి,, మనసును రాముని పై నిలిపి, రామ నామ గానం చేస్తూ,, అభినయిస్తు,  నృత్యం చేస్తూ,,కుడి చేతి తో తాంబూర మీటుతూ, ఎడం చేతితో చిరతలు మృోగిస్తూ తాళం వేస్తూ, భజన చేస్తూ లీనమై, సదా, రాముడే ప్రాణమై, వరలుతూ ఉంటాడు. ,! అందుకే, త్రేతాయుగం నుండి, ద్వాపర యుగం, తర్వాత, నేటి కలియుగం వరకూ ,ఎక్కడ రామ కథ జరిగినా, ఎవరు రామ భజన, కీర్తన, పురాణాి ది సత్కథల ప్రవచనాలు నిర్వహిస్తూ ఉన్నా, తాను ఉన్నానని,, ఉంటానని  హనుమ ప్రత్యక్షం అవు తూ ఉంటాడు !!, చంచల చిత్తానికి ప్రతిరూపం అయిన కోతి అవతారం లో, ,భక్త జనుల ముందు సాక్షాత్కరించి,, తన ఉనికిని, శ్రీరామభక్తి యందు తనకు గల అత్యంత అనురక్తి నీ, ఆసక్తిని, అవ్యాజమైన అనురాగాన్ని ఇప్పటికీ, ఎన్నో పౌరాణిక శ్రవణ సందర్భాలలో తనకు తానుగా ,ప్రకటితమై , ప్రత్యక్షంగా , పరోక్షంగా కూడా , మనకు తెలియజేస్తూ ఉన్నాడు.! అందుచేత హనుమ లాంటి నిజభక్తి నీ ,సాధించాలంటే ,,, రాముని సేవించే హనుమ వలె నిరంతరం జపిస్తూ, సేవిస్తూ, భావిస్తూ, తపిస్తూ, సాధన చేస్తూ, ఉండాలి ! , కోతి రూపంలో, కోతి జన్మ ధారణ తో,, కూడా దైవ సాక్షాత్కార భాగ్యం పొందవచ్చు నని హనుమ తన జీవన విధానం ద్వారా నిరూపించాడు కదా,! అంతకన్నా ఉత్తమము, ఉత్కృష్ట ము, దైవానుగ్రహ ఫలము గా ప్రస దిింపబడిన మనిషి జన్మ తో  శ్రీరాముని అనుగ్రహం సాధింపలేమా ? అన్న సవాలును భక్తి ప్రపత్తులతో,, దైవ ప్రార్థన తో సత్ సంకల్పం చేస్తూ ,, స్వీకరించి  సద్గురువు అయిన హనుమ చూపిన బాటలో నడచు కొందాం !!  అటువంటి స్ఫూర్తిని, బుద్ది బలాన్ని, అంకిత భావాన్ని అనుగ్రహించమనీ  ప్రార్టించు కొందాం !, హనుమ లాంటి ఇలవేలుపు ను, పర దైవాన్ని ,మనసారా నమ్మిన తర్వాత, ఇక ఎవరికీ , ఎప్పుడు , ఏ విషయంలో నూ ,అపజయం లేదు ! ఉండదు కూడా! జీవితంలో వెనుకడుగు ఉండదు,, !నిరాశ నిస్పృహ లు ఉండవు,,!, హనుమ జీవితం చూసి మనం నేర్చుకునేది ఒకటే,! కలియుగం లో హరినామ కీర్తన కంటే, సులభతరం,  సకల పాపహ రం, మోక్షదాయకం,, జన్మ సాఫల్య మంత్రం  అయినది మరొకటి లేదు అని తెలుసుకోవడం,!! దానిని ఆచరిస్తూ, అందరం పవిత్ర పావన హనుమ భక్తిని ఆలవరచు కొందాం,! హే, అంజనీ తనయా,! వాయుపుత్రా, !శ్రీ రామ బంటూ,!, భక్త వరదా,,! రామతారక నామ గుణ గాన కీర్తనా చార్యుడా,, శరణు,!! ;జ్ఞాన గుణ సాగరా,! మహావీరా,! శంకర వర ప్రసాది త కపి శ్రేష్టా!! కేసరీ నందన!! రామ చరిత లు వినడానికి, రామ కార్యములను చేయడానికి అత్యంత ఉత్సాహం చూపే మహానుభావా , శరణు,!! రామ కథా శ్రవణం చేస్తూ, కన్నుల వెంట ఆనందాష్రువులను రాల్చే ఆపద్భాంవుడా శరణు! శ్రీ శ్రీ రాజా రామచంద్ర భగవాన్ కి జై ! శ్రీరామ భక్త హనుమాన్ కి జై,! కొండగట్టు హనుమాన్ కి జై ! స్వస్తి ! హరే కృష్ణ హరే కృష్ణా !!!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...