Friday, September 20, 2019

అమ్మ కోసం

Dallas, Sept 18, 2019

కోర్టు లో జడ్జి గారు అడుగుతూ ఉన్నారు ముద్దాయిని,
"" నీవు కారును రెడ్ సిగ్నల్ ఉండగా నడిపా వా,, సిగ్నల్ వద్ద ??
, ముద్దాయి నడి వయసు స్త్రీ,,
"అవును,! "అంది ,
"సరే, !అలా డ్రైవ్ చేయడం తప్పు అని తెలుసా,,?"
"" తెలుసు,,! తల వంచుకుని అంది, నేరం అంగీకరిస్తూ,!
"తెలిసి ఎందుకు తప్పు చేశావు,,?
మౌనంగా ఉండి పోయింది, ఆమె.!
"ఈ నేరం తో నీకు పెద్ద మొత్తం జుర్మానా పడుతుంది, తెలుసా,,?"
ఆమె వెక్కి వెక్కి ఏడ వడం చూశాడు,
"నీవేమైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు,.!""
, ఆమె దీనంగా జడ్జి వంక చూస్తూ,, అంది
" నాకు ముగ్గురు చిన్నపిల్లలు, ఉన్నారు.! స్కూల్ కి వెళ్తున్నారు,!, "ఇంటి కిరాయ, పిల్లల పోషణ, కోసం నేను జాబ్ చేస్తుంటాను,!"__
"మరి ,నీ భర్త,,?
"లేడు,,!"
"ఓ,,, ! ఏం జాబ్ చేస్తున్నావు ?"
" నేను హోటల్ లో , పనిచేస్తూ,  ఉంటాను,! ఆర్డర్ పై తిండి ప్యాకెట్లు ఇంటికి, లేదా ఆఫీస్ లకు కూడా వెళ్ళి ఇస్తుంటా ను,!",
,, ,, ఓ, నీవు చాలా శ్రమ పడుతున్నావు ,,
, పిల్లల కోసం ,!"
డబ్బు ఖర్చులకి సరి పోతుందా,?
సరి పోదు, ! అందుకే మిగిలిన సమయంలో , పిజ్జా లు ఇవ్వడానికి  వెళ్తుంటాను,, సెలవు రోజుల్లో,,! ఇలా పనులన్నీ తొందరగా చేస్తూ
,, , అటు స్కూల్ కు వెళ్లి పిల్లలను తీసుకుని రావడం లో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఆ తొందరలో, రెడ్ సిగ్నల్ దాటి తప్పు చేశాను ,!"" అంటూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది,
ఎందుకో జడ్జి కి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. !
రెండు నిముషాలు నిశబ్దంగా ఉండి పోయాడు ఏమీ మాట్లాడకుండా,,!!!
"అమ్మా,! నీ బాధ నాకు అర్థం అయ్యింది!,, మా తల్లి కూడా ఇలాగే , నా చిన్నతనం లో ,అక్కడా ఇక్కడా , చేస్తూ, చాలక పోతే ,హోటల్ లో కూడా పనిచేస్తూ  చాలీచాలని సంపాదన తో, కడుపు కట్టుకొని, మమ్మల్ని, తాను ఎంతో కష్టపడుతూ  పెంచింది , ! నీవు నాకు ,మా అమ్మ పడిన కష్టం  జ్ఞాపకం తెచ్చావు,,!,
,, తల్లీ,! నిన్ను మా అమ్మ గా భావిస్తూ, నీకు తగిలే జూర్మానా మొత్తం, కొడుకుగా  నేనే చెల్లిస్తా ను ! ఇలా చేస్తే, నేను మా అమ్మ అత్మ కు  తృప్తి కలిగించిన వాడినౌతాను ! ఆ తృప్తి నాకు మిగలనివ్వు!  సరేనా,,!"" అని అంటున్న  జడ్జి గారి వంక , ఆమె ఆనంద భాష్పాల తో చూస్తూ, దీవిస్తునట్టుగా రెండు చేతులు ఎత్తి, , కృతజ్ఞతా భావంతో అవే చేతులు జోడించి,, కళ్ళు తుడుచుకుంటూ, గద్గద కంఠంతో,"" చాలా థాంక్స్, అండి !"" అంటూ వెళ్ళిపోయింది,!
, అలా వెళ్తున్న ఆమె కు , జడ్జి గారు,  చేతులు జోడించి నమస్కారం చేస్తూ,, 
, "అమ్మా, ! నీకు  ఎన్ని సార్లు ప్రణామాలు చేసినా ఎంత సేవ చేసినా కూడా, ఏ రకంగా కూడా,, నీ ఋణం తీరేది కాదమ్మా,,! నీ ప్రేమకు వెల కట్టలే ము,, అమ్మా ! నీ పాదాలకు దండం పెట్టుకోవడం తప్ప !!""అంటూ తలవంచి, నమ్రతగా నిలుచున్నాడు ,, నిండు న్యాయ స్థానం లో,,!!,,,
,,!అమ్మ గురించి, జడ్జి గారు ఇచ్చిన తీర్పుపై, స్పందిస్తూ, కోర్టు లో ఉన్న వారందరూ, కూడా, తీర్పును స్ఫూర్తిగా భావిస్తూ నిలబడ్డారు, ,,,
కన్నతల్లి కోసం, తాము చేయాల్సిన విధిని, సంకల్పిస్తూ ,,!!!,,,,,,
ఈ న్యాయ సమ్మతమైన తీర్పు తో,,
""ధర్మదేవత సంతృప్తిని, సంతోషాన్ని పొందింది!",అన్నట్టుగా, దూరం నుండి గంటా నాదం వినిపించింది..!

ఆలోచన

Dallas, Sept 17, 2019

"కాదేదీ కవిత కనర్హం!"" అన్నాడు ఒక మహాకవి ,!__ అంటే మనం చూసే ప్రతీ వ్యక్తీ, వస్తువు కొంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది అని అర్థం, ! కవితా ధోరణి లో చూస్తే, అది అందంగా అగుపిస్తెనే ,దృష్టి దానిపై పెట్టవచ్చు ను ,, అంటే మనసును ఆకర్షించే విధంగా ఆ విషయం ఉంటుంది,  !!ఈ రోజుల్లో కనిపించే వ్యాపార ప్రకటన ల వలే, చూస్తే చాలు, కొనాలని ఉంటుంది, అయితే తప్పు "ప్రకటనది" కాదు, మనలో కలిగే అలోచనదే తప్పు,,! అందుచేత, ప్రకృతి లోని వస్తువు,వ్యక్తుల  అందాలను, ఆనందంతో ఆస్వాదించే హృదయం లేకపోవడం ఒక రకంగా దురదృష్టం,!,5 నిముషాలు సూర్యాస్తమయం, లేదా సూర్యోదయం చూస్తూ, ప్రకృతి కాంత సోయగాల లో , పరమాత్మ వైభవానికి, దానిని చూస్తూ పులకిం చే మనసును, సమయాన్ని, అవకాశాన్ని కల్పించి న పరందామునికి కృతజ్ఞతగా నమస్కరించ లేకపోతే తప్పు మనదే అవుతుంది కదా !!, ,
కానీ అనుభవించే అవకాశం ఇచ్చినా కూడా, ఉపయోగించుకొలేకపోతే అది  మన మూర్ఖత్వమే అవుతుంది,,!
ఎవరూ మనల్ని గమనించడం లేదంటే, మనిషి ప్రకృతి , ప్రవర్తన మరో విధంగా ఉంటుంది,! తాను ఒంటరిగా ఇంట్లో ఉన్నా, బయట ఎవరూ చూడలేని స్థలం ఉన్నా కుదురుగా ఉండలేడు. ,
,,,,, ఏ పనీ లేకుండా ప్రశాంతంగా ఉండడం  ఎవరికైనా చాలా కష్టం !, ఎందుకంటే తనకి ఇష్టమైనవి విడిచి, అలవాటు లేని పరిస్తితి నీ భరించడం దుర్భరంగా, భయంగా, ఎదో పోగొట్టుకున్న విధంగా ఉంటుంది, కదా ! ఆ స్థితిలో మనసు కు నిలకడ ఉండదు,, తన వారి మీద, లేదా తాను చేయాల్సిన పనుల మీద ఆరాటం కోరిక, దిగులు తో, తప్పనిసరిగా ఆ ఏకాంతాన్ని దూరం చేసుకొనే ప్రయత్నం చేస్తాడు,! అయితే ఫోన్ లేదా టాబ్ పై గూగుల్ లో ఇష్టమైన వి చూస్తూ, చాటింగ్ చేస్తూ, పాటలు వింటూ కాలక్షేపం చేస్తుంటాడు,!" పుష్పక విమానం "సినిమాలో కమల్ హాసన్ పాత్ర వలె.. ట్రైన్ చప్పుడు లేకుండా నిద్ర పట్టనట్టు, అలవాటు పడ్డ ప్రాణం, రుచి మరిగిన దానికై కొట్టుకుంటుంది,!,,

అందుకే మనిషి తీరు, అతడు పెరిగిన సమాజం తీరుపై ఆధారపడి ఉంటుంది..
,, ఒక్కటి మాత్రం నిజం,! ఒంటరితనాన్ని భరించలేక పోవడం, పిరికితనం తో సమానం !! మనస్సు కు, శాంతిని, శరీరానికి కాంతిని ఇచ్చే, ధ్యాన యోగ సాధనా శక్తిని ఇచ్చే ప్రశాంత వాతావరణానికి , దూరంగా పారిపోవాలని అనుకోడం, కేవలం తనలో వివేక జ్ఞానం లోపించడం వల్ల నే కలుగుతుంది,!,,,

పైన, జ్ఞానజ్యోతి వలె, దివ్యంగా  ప్రకాశిస్తూ, తన దినచర్యల ను గమనిస్తూ, తన ఆయువు లో ఒక రోజు భాగాన్ని తగ్గిస్తూ ఉంటున్న  "కర్మ సాక్షి " ఆ సూర్యభగవానుని కళ్ళు కప్పలేని , పరిపక్వత కానరాని అనిశ్చిత మనిస్తితి లో ఉంటున్నాడు ఈ రోజుల్లో సగటు మనిషి..!!
తనలోన ఉంటూ తన దినచర్యలను నియంత్రిస్తూ,, గత జన్మ  కర్మానుసారంగా విధిగా , వివిధ రకాల పనులను  చేయిస్తున్న అత్మ సాక్షిని గురించి కూడా ఆలోచిం చే సాహసం చేయడు. ఎందుకంటే "అహం "అడ్డు వస్తుంది,
,, ఆ విధంగా అంతర్లీనంగా, అంతర్వాహిని గా అంతటా ఉన్న దైవ బలాన్ని గుర్తించకుండా , ఏ కార్యమైనా తన నిర్వాకం, తన ప్రజ్ఞ ప్రతిభ పాటవాల వల్ల మాత్రమే జరుగుతూ ఉన్నాయని  భ్రమిస్తూ" అత్మ సాక్షి " ప్రాభవాన్ని గురించి ఆలోచిం చే దుస్సాహసం చేయ డం లేదు,,,,
,,, అనుదినం ప్రాణుల చర్యలను పర్యవేక్షిస్తూ, తదనుగుణంగా ఉపయోగించే శక్తినీ, ప్రజ్ఞను,, అనుభవించే ఆయువును, సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్న కర్మ సాక్షిని, ఏ రోజు నా మరవకుండ తలచేవారిని, "ఏకాంతం" బాధించదు,,! అలాగే  తాను చేస్తున్న పని లో మంచి చెడులను, పాప పుణ్యాలను బేరీజు వేస్తూ, సాక్షిగా చూస్తూ, జీవన జ్యోతి లా వెలుగుతున్న అంతరాత్మ, ను ,ఆత్మ సాక్షినీ ,అంతరంగాన్ని చిత్తశుద్ది తో భావించేవారు మాత్రం  ఒంటరితనాన్ని ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు. !
,, అంతేకాదు, అలాంటి భగవద్ తత్వ విచారణ చేస్తూ జీవితాన్ని ఒక జ్ఞాన యజ్ఞం గా చింతిస్తూ ఉండేవారికి, చుట్టూ వందలమంది మధ్యలో పలు సమస్యలతో ఉన్నా, భయపడరు,! బాధపడ రు,! చీకాకు పడరు,,! ఎందుకంటే అంతమంది లో ఉంటున్నా వారు సచ్చిదానంద స్వరూపులై, అంతరంగం లో ఆత్మానందాన్ని అనుభవిస్తూ, పరమాత్మ వైభవం లో రమిస్తూ బ్రహ్మానంద భరితులై ఉంటారు,! ప్రాపంచిక విషయాల లో, పరమాత్మ వైభవాన్ని దర్శిస్తూ వుంటారు వారు.. ఈ ఆధ్యాత్మిక అనుభవం ,పరమానందం నిరంతర సాధన, దైవారాధన  వలన, మనో నిబ్బరం తో మాత్రమే ప్రాప్తిస్తుంది., కదా!!
,,,, బురదలో  అంటకుండా నడవడం కష్టమే,! నీటిలో తడవకుండా మునగడం కష్టమే,! కష్టాల కడలిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, పరమాత్మ పై మనసు నిలపడం కూడా కష్టమే,,!
,,,,అంతేకాదు,!,ఏకాగ్రత తో శ్రీహరిని ద్యానించ డం కష్టం!, దైవ ధ్యానం తో ఆలయ ప్రదక్షణ లు చేయ డం కష్టం ! పది నిముషాలు , నిష్టగా, దైవాన్ని చిత్తశుద్ది తో పూజించ డం కష్టం!; అంకితభావం తో అర్చన చేయలేము ,!, అంతటా, అందరిలో దైవాన్ని దర్శించే జ్ఞానాన్ని పొందలేము,!, లోన ఉన్న ఉన్న అంతరాత్మ ను గుర్తించలేము,!, పైన, చుట్టూ, అంతటా నిండి ఉన్న సర్వాంతర్యామి తత్వాన్ని అర్థం చేసుకోలేము,,!, రాగయుక్తంగా శ్రీకృష్ణ లీలలు గానం చేయలేము,! గోపాల కృష్ణ భగ వా నుని  ముగ్ధమోహన రూపాన్ని కనులారా ఏ విగ్రహం లో భావి స్తూ, హృదయంలో సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేము! ,, కావున, ఓ
భగవంతుడా , !అనంత గుణ సంపన్నుడ వైన నీ అద్భుత కథలను చిత్రించలేము,! కవితలల్లి నిన్ను కీర్తించలేము, కూడా,! నిన్ను ఏ రకంగా కూడా మెప్పించలేని అసమర్తులం మేము !  కేశవా,! ముకుందా, !అచ్యుత! అనంత,,! భగవన్,,!,,,, కానీ మాకు చేతన య్యేది ఒక్కటే స్వామీ,! అది,
" నారాయణా !"అంటూ చేతులెత్తి మ్రొక్క డం !! "గోవిందా "అంటూ రెండు చేతులతో తాళం వేస్తూ, ఆడుతూ, మధురంగా పాడుతూ, మేము నీ భజన చేయగలం;,! స్వామీ,! కావున మా దీనస్థితిని గమనించి, మాపై కనికరించి,, దయ ఉంచి మాకు ఆ పాటి జ్ఞానాన్ని, నీ నామ గానం తో, భజించి తరించే మహద్భాగ్యం ప్రసాదించు తండ్రీ,! నీ కడగంటి కంటి చూపు, మా పై పడితే చాలు, అదే పదివేలు! పరమేశ్వరా,! పరందామా , !పరమాత్మా,! శరణు,! హరే క్రిష్ణ హరే కృష్ణా ,!! స్వస్తి!

భగవద్గీత

Dallas, Sept 19, 2019

"భగవద్గీత "  అంటేనే అది కేవలం వృద్దుల కు, సన్యాసులకు, హరిద్వార్, హృశికే శ్ లాంటి ఆశ్రమాలలో, లేదా యాత్రా స్థలాల్లో,దేవాలయాల కు మాత్రమే  పరిమితం కాదు ,!పండితులచే పఠన చేయబడే "సద్గ్రంథం" అని మాత్రమే అని పరిగణించడం ఏ మాత్రం సబబు కాదు,! మనిషిగా పుట్టాక, దైవ ప్రసాదితము, అపురూపం ,, అమూల్యం, ఉత్కృష్ట ము  అయిన మానవ జన్మను సార్థకం లేదా చరితార్థం చేసుకోడానికి వినియోగించే దివ్య గ్రంథం "భగవద్గీత!!"
,,, నిజానికి  అర్జునుడు పుట్టుకతో మనిషి,, లోపాలు, బలహీనత లు ఉండడం సహజం! ప్రకృతి ధర్మం గత జన్మ కర్మ పరిపాకం !; అతడు, తన అన్నదమ్ముల తో బాటు ధౌమ్యుడు అనే గురువు వద్ద గురుకులాశ్రమం లో శుశ్రూష చేస్తూ, సకల విద్యలలో రాణించాడు!
, విలువిద్యలో మాత్రం ద్రోణాచార్యుని ఆశ్రయించి, సవ్యసాచి గా పేరుగాంచాడు,!
అయితే ఇవన్నీ, నేడు స్కూళ్ళలో, కళాశాలలో నేర్చే వృత్తి విద్యల వంటివి,! విజ్ఞాన, సాంఘిక, రాజకీయ శాస్త్రాలు నేర్చుకోవడం వంటిది! ఇవన్నీ నేర్చాడు అర్జునుడు ,,అప్పటి దర్మానుసారంగా !!,, అనుమానం లేదు,,! నేటి విద్యాలయాలలో వేమన సుమతి, భర్తృహరి లాంటి నీతి పుస్తకాల బోధన లేనట్టే,, ఉన్నా అవి  ఒంటబట్టని అర్జును నీ వలే, నేటి విద్యార్థికి కూడా, అందుబాటులో
,  నైతిక విలువలు లేవు,! జ్ఞాన కర్మ భక్తి విషాద యోగాలు లేవు,!
, మనిషి సుఖ జీవనానికి శాంతికి, భంగం కలిగించే దుష్టశక్తులను ఎదురించే సామదాన బే ద దండ ఉపాయాలు లేవు,!
, ,, అందుకే తన ముందే , కళ్ళ ఎదుటే, ఎవరి కో జరుగుతుంటే చూస్తూ, ఏమీ పట్టనట్టు గా వెళ్లి పోయేవాడు, "మహాపాపి ", అవుతున్నాడు ,,! అన్యాయం చేస్తున్నవారు ఎంత పాపాత్ము లో ,,అంతే పాపం, ప్రేక్షక పాత్ర నిర్వహించే వారికి కూడా ప్రాప్తిస్తుంది కదా,,!!
, ,,,అలాంటిది తమకే ఘోరంగా సహించ రాని, భరించలేని అన్యాయం జరుగుతుంటే, అందరూ "అయ్యో! పాపం "అంటూ జాలి పడుతూ ఉంటే, తప్పించుకు తిరగడం మంచిపనేనా,?? భావ్యమా? నిజానికి ఒకరు తన పరిస్తితి పై సానుభూతి చూపడం లేదా జాలి పడటం కంటే మించిన దౌర్భాగ్యం ,మనిషి జీవితంలో మరొకటి ఉండదు కదా,,
ఇదిగో, ఇలాంటి దురవస్థ లో పాండవులు ఉన్నారు ఇప్పుడు,,,
, "కంసుడు, పూతన" లాంటి ఘోర రాక్షసులను ఎందరినో సునాయాసంగా, తన బాల్యం లోనే హతమార్చిన గోవిందుని కి,, ఈ మానవాధములు, ఆ "దుష్ట చతుష్టయం"" ఒక లెక్కా,? చెప్పండి !!"
,,,""అన్యాయం ఎవరికి జరిగిందో, వారే దానిని నిర్జించాలి,! సొమ్ము ఎక్కడ పోయిందో అక్కడే వెదకాలి! అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించు కోవాలి,! దమ్ము లేనివాడు, పిరికితనం తో పారి పోవచ్చు , గాక !!, తనకన్నా బలవంతునితో  పోరాడవలసి వస్తే, దేవేంద్రుడు చేసే మొదటి పని యుద్ధరంగం నుండి పారిపోవడం,,! మహావిష్ణువుకు పాహిమాం రక్షమాం! ప్రభో! అంటూ శరణాగతి చేయడం"కదా,,!,,,,,,
ఇప్పుడు ఆ ఇంద్రుని కొడుకు , అర్జునుడు కూడా చేస్తున్న పని అదే. !
,,, దుష్ట శక్తులను అలానే విడిచి పెడితే, అవి ఇంకా ప్రళయ తాండవం చేస్తూ, మారణ కాండను సృష్టిస్తాయి, విధాత, శ్రీకృష్ణుడు, భూమిపై అవతరించిన ఉద్దేశ్యం ఆ పాపాత్ముల పని పట్టడానికి మాత్రమే, కదా,!
, "గీత "ఉపదేశం వింటూ, "ధర్మం ,న్యాయం, నీతి""లాంటి సూక్తులు వల్లిస్తూ,  ఒక కాషాయ వస్త్రం కప్పుకొని, సమస్యలకు దూరంగా వెళ్ళి పోవడం లాంటి "మనో దుర్బలత"ను మన భగవద్గీత నేర్పడం లేదు. అని ముందుగా మనం తెలుసుకోవాలి,,!!
, ఏ వ్యక్తికి పిరికితనం వద్దు!;, బేల తనం అసలే పనికిరాదు;, మొహమాటం, నిర్లిప్తత, అలక్ష్యం, భయం, ఇలాంటివి పనికిరావు; సమస్యలకు , భయపడుతూ, చావలెక, బ్రతకలేక,రోజూ ఘోరంగా నరకయాతన, మనో వేదన పడేవారు, సమాజాన్ని పాడుచేస్తారు , స్వామి వివేకానందుడు చెప్పింది ఇదే,, మహాకవి శ్రీ శ్రీ చెప్పింది ఇదే! ఉత్తేజం ఉత్సాహం, సంకల్పం లేని యువకులు , చావుకు సిద్దంగా ఉంటున్న ,చేతగాని ముసలివా రి తో సమానం! అన్నారు,,
,," శ్రమ పడుతూ, బాగు పడాలి,! అదే కృషి తో పదిమందికి ఉపయోగపడుతూ, వారిని బాగుచేయ్యాలి,!
,, తాము సంతోషంగా బ్రతకాలి,! ఇతరుల సంతోషానికి సహకరించాలి,!
శ్రీకృష్ణుడు సూటిగా ప్రశ్నించాడు,,
, ఓ అర్జునా,! నీకు మా చెల్లెలు సుభద్రను ఇచ్చింది, పాశుపత దివ్యస్త్రాలను ఇప్పించింది,, ఆపదల అవమానాల నుండి రక్షించింది, నీలో ఇంత దిగజారుడు తనం, చూడటానికి కాదు, సుమా!
, ఐదు ఊళ్లు చాలా?,, సన్యాసి వై మళ్లీ అదే అడవిలో కి  పోతావా,? మళ్లీ భిక్షా పాత్ర పడతావా?? నీవు
పుట్టింది క్షత్రియ వంశము, లో,,! కానీ, చూపేది జంతు ధర్మం,,! ఇది పనికిరాదు,!
లే ! లేచి నిర్భయంగా నిలబ డి వీరోచితంగా పోరాటం, చెయ్యి ! నేను ఉన్నాను,, కదా ! నీవు ఊరక ఉన్నా, నేను చూస్తూ ఉండను !వీరి అంతు చూస్తా ను,!!" అంటూ కదన రంగం లో భుజం తట్టి ఉత్సాహపరిచింది కేవలం అనాడు అర్జునుని మాత్రమే కాదు,,! ఆ బోధ, రాబోయే యుగాలకు, తరాలకు చూపించే తక్షణ కర్తవ్యం,!!
, ""దేవుడిచ్చిన ఈ శరీరంలో ప్రవహించే రక్తంలో, అంతర్వాహిని గా జ్ఞాన సరస్వతి దేవి ఉందని గ్రహిం చాలి ! అది అత్మ బోధ చేస్తూ, మనిషికి మూడవ నేత్రంగా పనిచేస్తూ,ఎప్పటికప్పుడు చేయాల్సిన పని, దైర్యం, కర్తవ్య నిష్ట, ధృఢ సంకల్పాన్ని చిత్తశుద్ది నీ, ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుంది,!
అందుచేత, విజయమో, వీర స్వర్గ మో తేల్చుకో, వాలి!
పోరాడితే పోయేదేమీ ఉండదు, భయం తప్ప,!
ఏడవకు!, నీ వారిని ఏడ్పించకు!,, కన్నీరు అపజయాన్ని ,,జంతు ధర్మాన్ని,, సూచిస్తే, అతడి మనో,దైర్యం, జయాన్ని , శుభాన్ని, జీవిత పరమార్థాన్ని సూచిస్తాయి,!
", ప్రాణం ఉన్న శవంగా ఉంటావా, వీరునిగా చక్కని కీర్తి తో చిరంజీవి గా పేరు తెచ్చుకుంటా వా ?? తేల్చుకో,!!
జీవితంలో పిరికితనం తో బ్రతికే వాడు, చచ్చిన వాడితో సమానం,!
జంతువు కూ, మనిషికి తేడా జ్ఞానం,!
ఆ జ్ఞానంతో "చిరునవ్వే ఆయుధం "గా, ఫలితం ఆశించకుండా, కర్తవ్య నిర్వహణ లో ప్రాణత్యాగం అయినా చేసే ధృఢ చిత్తంతో యుద్దం చెయ్యి,!,,
అని పరమాత్ముడు అనాడు చేసిన ఉద్బోధ నేడూ, మనకూ పనికి వచ్చేదే,!
నిర్వీర్యం, నిస్తేజం, నిర్లిప్తత,, ఇవి మనిషికి శోభిం చే లక్షణాలు కావు,! అత్మ విశ్వాసం, పట్టుదల,, దైవం పై నమ్మకం, మనిషి మనుగడకు సుఖ జీవనానికి కీలకం!!
,,""శ్రేయోంసి బహు విఘ్నా నీ!"", అన్నట్టుగా, ఎవరైనా ,మంచి పని చేయాలంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది,! అదే చెడు పనులు చేయడం, తలచుకొడం చాలా సులువు,!
, అందుకే , అర్జునా!"ఏది మంచి ?ఏది చెడు ?"అని చెప్పినా తెలుసుకోలేని సంకట స్థితిలో నీవు నన్ను ఆశ్రయించా వని నాకు  తెలుసు,"! అందుకే నీ హితం కోరుతూ, యుద్దం చేయ మంటున్నాను,,!""
,అంటూ పలికిన భగవానుని వాక్యాలు , , మానవాళికి, సదా సర్వ కాలాల్లో శిరోధార్యం,! అనుసరణీయం,! ఆచరణీయం!, పరమ పద సోపానం, గీతామృతం !
ప్రపంచం లో,ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు లేని వారుండరు!, వెనకడుగు వేయకుండా, వీరుడవై నిలిచి జయాన్ని పొంద డమా,?? భీరుడ వై, జీవన సంగ్రామం లో దైర్యం కోల్పోయి వెనుదిరిగి పారిపోవడమా ?? ,, ఆ నిర్ణయం మన విజ్ఞతకే వదిలేశాడు శ్రీకృష్ణపరందాము డు,!
అర్జునుడు భారత సంగ్రామం లో గెలిచింది శ్రీకృష్ణుని తన ముందు నిలుపుకొని,! ప్రస్తుతం, ఈ  ,అదే శ్రీకృష్ణుని మన మనసులో ధ్యానిస్తూ, అంతరంగం లో నిలుపుకొని ఎదుట సవాలు చేస్తూ ఉన్న సంసార సంగ్రామం లో గెలిచి చూపించాలి ;!!, అతడు అనుగ్రహించే అద్భుతమైన ఆత్మవిశ్వాసం తో ఆత్మానందం తో,, సదా రక్షకుడు గా కాపాడుతూ ఉంటాడన్న పరిపూర్ణమైన ధృఢ చిత్తం తో, నిర్భయంగా, నిశ్చింతగా, నిరా పే క్ష భావంతో సుఖవంతమైన, ఆనందమయ మైన జీవితాన్ని గడ పాలి !!
సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణాల ను నిరంతరం స్మరిస్తూ, అతడు ప్రసాదించిన అమరము, అద్భుతం, అపురూపం, అమోఘం, అద్వితీయం,, బ్రహ్మానంద కరము, పరమ పావనం, భుక్తి ముక్తి దాయకం, సకల పాప శాప తాప శమనం, అత్యంత మధురం, కడు రమణీయం కమనీయం,,మహనీయమ్, మనోహరం, గా వర్దిల్లుతూ, మన బ్రతుకుల ను ఉద్ధరించే భగవద్గీత సారాన్ని ,సారాంశాన్ని పరమార్థాన్ని అర్థం చేసుకు నే ప్రయత్నం చేద్దాం!, అలాంటి సద్భావన, సత్సాంగత్యం, సనాతన సదాచార సంప్రదాయాన్ని అనుసరించి ఆచరిస్తూ, రాబోయే తరానికి మార్గదర్శకులు గా ఉందాం!, గీతాచార్యు డు  నిర్దేశించిన సన్మార్గం లో పయనిస్తూ, ఆ భావన లో, అదే స్మరణ లో జీవిస్తూ తరించు దాము!
హరే క్రిష్ణ హరే కృష్ణా !
స్వస్తి !""

సాంబశివ

Sept 12, 2019 Dallas

సాంబశివ రావు గారు  పేరులోనే కాదు, తన తీరు లోను, బ్రతుకు తెరువు లోను తనదంటూ ఒక ప్రత్యేకమైన  వ్యక్తిత్వంతో నిరంతరం  సాంబశివ  ధ్యానం, నామం  జపించి ధన్యులైనారు.

లక్షెట్టిపేట  గ్రామంలో అందరి చేత  మంచి పేరు తెచ్చుకున్న  ఉదార స్వభావి, కష్ట జీవి, నిత్య సంతోషి !

వీరు  మహా సాహసి! ధైర్యం, గుండె నిబ్బరం, ఆత్మ విశ్వాసం మెండుగా గల వ్యక్తీ!.
నిండు గంగను ఒంటరిగా, అడ్డంగా ఈదుకుంటూ వెళ్ళిన  మొండి ఘటం!

తన గ్రామం కొత్తూరు లో జరుగుతున్న ఒక హత్య ను ఒంటరిగా ఆపడానికి యత్నించిన  పరోపకారి.

బావిలో పడిన ఎద్దును  ఒంటరిగా తానె లాగడానికి ప్రయత్నించిన భూత దయాళువు!

భక్తి అతని సొమ్ము. అనుకరణ చేత గాని, అభ్యాసం చేత గాని  అలవడని భక్తీ తత్వం, ఆ సాంబశివుని అనుగ్రహం వల్ల  అలవోకగా ఈ సాంబశివున్ని  వరించి అలరించింది.

శిథిలావస్తలో ఉన్న శివాలయాన్ని, తానే అనునిత్యం గంగ నీటితో శుద్ది చేస్తూ, శుభ్రంగా ఉంచి, జీర్ణోద్ధారణ  గావించి, ఇదేండ్లు శ్రమించి పునః ప్రతిష్ట  చేసి, అందరిని కూడా గట్టుకుని  ఆలయ ధ్వజారోహణం గావించి, అంకిత భావం, అకుంటత దీక్షతో   జీర్ణాలయాన్ని బాగు చేసి ఉద్ధరించిన  మహోన్నత వ్యక్తీ  ప్రయత్న ఫలితమే   ఈనాడు ప్రజాదరణ పొంది వెలుగొందుచున్న  సాంబశివ  ఆలయం!

తన సరస సంభాషణలతో, చమత్కారాలతో, తోటి వారందరినీ, పిల్లలను, పెద్దలను నవ్వుతు, నవ్వింప జేస్తూ తన జీవితంలో మోదమే కాని, ఖేదానికి  తావివ్వకుండా  గడిపిన నిత్య సంతోషి.

గీతా విద్యాలయంలో అంత  వృద్ధాప్యంలో కుడా పిల్లలకు పాఠాలు  చెప్పడంలో మనసా, వాచా,కర్మణా సఫలీకృతుడైన అలుపెరుగని ఉత్తమ  ఉపాధ్యాయుడు.

మారుమూల కుగ్రామంలో గ్రామాధికారిగా పనిచేసి  దేవాలయం వెళ్లి, శుభ్రం చేసి, భజనలు చేసి, ఒక గదిలో వండుకుని, ఆ  గ్రామస్తుల సమస్యలు తీర్చి, మన్ననలు  పొందిన కృషీవలుడు.

చెక్కు చెదరని,  మొక్కవోని మనస్తత్వంతో, నిశ్చల చిత్తంతో,రెండు పూటలా సంద్యావందన గాయత్రీ జపం తో,మడీ,ఆచారంతో,అనుష్టానము, ఆధ్యాత్మిక చింతనతో పురాణ గ్రంధ పటనంతో, అత్యంత నియమ నిష్టలతో,శ్రద్ధా భక్తులతో,ఈశ్వరుణ్ణి ధ్యానించి, పూజించి,సేవించి,తరించి అతనిలో ఐక్యమైన  వందనీయుడు, పుణ్య జీవి,పరమ భక్తుడు.

తన తల్లి, సోదరి వలే సదాచారత, భజనలు, హరి నామ సంకీర్తనం, శ్రీ మద్భాగవత పద్యాలు,గజేంద్ర మోక్షం, రుక్మిణి కల్యాణం,అంబ రీశో పాఖ్యానం  ఈశ్వర అష్టకాలు ఆధ్యాయాలు అనునిత్యం ఎవరు విన్నా, వినకున్నా, దైవ  ప్రార్థనలో లీనమై పాడుకుని చదువుకుని తన జన్మ నిరంతర దైవధ్యానంతో , భక్తీ తత్పరతతో  ధన్యం చేసుకున్న ధన్య జీవి.

నోటివెంట దుర్భాషలు లేకుండా ఇతరులను నిందించడం ఎప్పుడూ తెలియని ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే నిష్కపటి.

ప్రతి సోమ వారం రోజున ఉపవాసం, గంగా స్నానం, సాలగ్రామ పూజ,  నమక చమకాలతో  ఆభిషేకం, నివేదన, భజన, దేవాలయ సందర్శనం,రాత్రి  గుడిలో కెళ్ళి  తాళాలతో, తబలాతో, నలుగురిని కూడ గట్టుకుని గొంతెత్తి పంచమ స్వరంలో  పద్యాలు, భజన పాటలు, చదవడం, వినిపించడం జీవిత కాల దినచర్య కలిగిన క్రమశిక్షణ కలిగిన ఈశ్వర భక్తుడు.

మధ్యాహ్న భోజన సమయంలో పీఠ మీద కూర్చునే ముందు, వడి వడి గా వెళ్ళి, సుదీర్ఘ  దైవ పూజ తర్వాత పూజగది నుండి వచ్చి పెట్టే తులసీ దళ సహిత సాలగ్రామ తీర్థం తీసుకున్న అనుభూతి ఎప్పటికీ సజీవం. 🙏

కష్టమైనా సుఖమైనా, లాభమైనా , నష్టమైనా, దగ్గరి వారు కానీ, ఇతరులు కానీ, ఎవరైనా బాధపెట్టే మాట అనినా,, కూడా, ఏదీ మనసులో ఏ మాత్రం,అత్మక్షోభ లాంటిది పెట్టుకోకుండా జీవించడం ఆయనకే చెల్లింది, పగ కోపం ద్వేషం, అసూయ,, డంబం, అహం, దురాశ, లోభత్వం తో డబ్బు దాస్తు ఉండడం, అనే దుర్గుణాలు లేశం కూడా దగ్గరకు రానీయకుండా  కేవలం భక్తి మార్గంలో జీవనం సాగించ డం, సాంబశివ రావు గారి భోళా శంకర తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది,!,

శాలిగ్రామ పూజ, ఎంత నిష్టగా,,ప్రేమగా,శ్రద్ధతో చేసేవా డో,, అక్షరాలా,అదే విధంగా తల్లిని గౌరవించాడు, మనసా వాచా కర్మణా తల్లిని , దైవంగా భావించి సేవించాడు.. ఉపవాసం రోజున తల్లి సూర్యా బాయికి అరటిపండ్లు, కానీ, చాయ్ కానీ, ఆమె తినగలిగింది ఏదైనా బజారు కు ప్రత్యేకంగా వెళ్లి తెచ్చి ఇవ్వడం, ఇంకా నాకు గుర్తు,, పండుగరోజు లలో ఆమెకు రామాయణ, భాగవత గ్రంధాలు చదివి వినిపించడం గుర్తు..,,!

కోపంతో ఎవరు ఎన్ని మాటలు అనినా, మనసులో పెట్టుకొన కుండా,, సోదర భావంతో,ప్రేమతో, మరునాడు తానే వెళ్ళిఇంటి కి వెళ్లి, కనబడి వచ్చేయడం కూడా నాకు గుర్తు.

చేతి రాత అయోమయంగా కనిపించినా, చేతల్లో మాత్రం, తోచిన ఉపకార మే తప్ప,, అపకారం ఎరుగని దయార్ద్ర హృదయుడు,,!

. బలహీనత లు లేని మనిషి ఉండడు, కదా,,! దేవుడంటే పిచ్చి ప్రేమ, !!ఆ ప్రేమకోసం, ఎంత కష్టమైనా ఇష్టంగా పడ్డాడు,,! అందులో ఒకటి కటిక ఉపవాస దీక్ష ,,!, అది తాను నమ్మిన సిద్ధాంతం ,! సోమవారం ప్రదోషం , లాంటి ది.. !!అలా తల్లితో బాటు వరుసగా  ఉపవాసాలు చేస్తూ ఉండడం,,.!!. ఆ నమ్మకమే తన ఆరోగ్యం దెబ్బ తీసింది,! భక్తి జ్ఞాన వైరాగ్యా లలో తల్లికి తగిన కొడుకు అనిపించు కొన్నాడు... ఆయన!

అయినా , అది కూడా ఒకందుకు మంచిదే అయ్యింది,,! ఎందుకంటే
1.తన ప్రారబ్ద కర్మను, తనతో మోసుకు పోకుండా, కర్మ శేషం లేకుండా, ఇక్కడే అనుభవించడం
2.అనారోగ్యం తో ఉన్న 5 ఏళ్లూ కూడా ,కొడుకులు కోడళ్ళు భార్యా, అందరూ ప్రేమతో సేవి స్తూ, ఇతరులకు స్ఫూర్తి దాయకంగా ఉంటూ,, కొడుకులంటే ఇలా ఉండాలి అని గుర్తింపు రావడం
3,, పరమ భాగవతు డు, ఉత్తముడు అయిన తండ్రి కి , కష్టాలలో,ఏ మాత్రం బాధ కలుగకుండా సేవించుకున్న పుణ్యం, ఆయన  కొడుకుల కుటుంబాలకు శ్రీరామరక్ష లా , సాంబశివ నిలయం లాంటి ధర్మ కవచం, సదా, కాపాడుతూ ఉండడం!
ఇవి అందరికీ తెలిసిన నిజాలు.! అవి, ""ధర్మో రక్షతి రక్షితః !""అన్న వేద వాక్యాన్ని రుజువు చేస్తున్నాయి,,!! ,

వారి జీవనవిధానం నుండి నేర్చుకొని ఆచరింప దగినవి,  అందరిపై ప్రేమ,,అచంచ లమైన. దైవభక్తి, నిరాడంబర జీవనం, , కపటం లేని నవ్వు,, ఆనందంగా, ప్రశాంతంగా , అందరితో మంచిగా తృప్తిగా భక్తితో గడిపిన జీవితం, అందరికీ స్ఫూర్తి దాయకం.

అతడు,దేవుడు చేసిన ఒక  బొమ్మ అయినా, తనను పుట్టించిన దేవుడి నీ, మరవకుండ,, విడవకుండా కొలుస్తూ, బ్రతిినన్నాళ్ళు  దేవుడికి దగ్గరగా ఉండి, , స్మరిస్తూ జపిస్తూ చివరకు , అదే దేవుడికి ఎంతో దగ్గర గా అవుతూ ఆయన పరమ ధామం చేరుకోవడం, ఆయన లాంటి పుణ్యాత్ముల మహా భాగ్యం,!! ఆ కోవలో కొనసాగే వారి బ్రతుకు పుణ్యప్రదం,! జన్మ సార్థకం అవుతుంది కూడా,,!!
హరే కృష్ణ హరే కృష్ణా!!

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...