Aug 31, 2019 Austin
"త్రికరణ శుద్ధి ""గా దైవాన్ని పూజిస్తే గానీ, దైవానుగ్రహం లభించదు అంటారు,! అంటే మనసా, వాచా ,కర్మణా, దైవా న్నీ, మనం, అత్మ సమర్పణ భావంతో అర్చించాలి అని. అర్థం !! ఇది మాటతో,, అన్నంత సులభం కాదు, ఆ రకమైన పూజా విధానం, అంకిత ఆరాధనా భావం!!,, నిజానికి భక్తులంతా కష్టపడిన వారే,!!తమకున్నదంత , నైవేద్యంగా స్వామికి సమర్పించిన వారే!!, కవులు, గాయకులు, తత్వ వేత్తలు, మహాత్ములు, మునులు, పరమ భాగవత అగ్రేసరులు అంతా పంచేంద్రియాలు నియంత్రించి, భౌతిక సుఖాలను త్యజించి, పరమాత్మ సాయుజ్యాన్ని పొందిన వారే !! రామాయణ ,భారత ఇతిహాసాలు పురాణాలు, చూస్తే దైవాన్ని, ధర్మాన్ని నమ్మి, అష్టకష్టాలు పడి, పురాణ పురుషులు అయ్యారు , భక్తులు అనబడేవారు !;, శ్రీరాముడు, దుర్భరమైన అరణ్యవాసం , రావణ యుద్దం లో , సీతను పోగొట్టుకొని, ఆమెతో బాటు, మనః శాంతిని, కోల్పోయాడు !! తీరని అపవాదును, మనోవేదన ను, దుఖాన్ని, అనేక కష్టాలను ఇష్టాలుగా భరించాడు,! చివరకు అతడికి మిగిలింది ఏమిటి ? ధర్మం తప్ప ? దీని కోసం, భూజాత ను భూమాత ఒడిలోకి పంపి, తాను అవతార సమాప్తి చేశాడు!, ధర్మం అంటేనే కట్టుబాట్లు, హద్దులు,, పాప పుణ్యాలు, కష్ట సుఖాలు!! భర్తగా, కుమారుడి గా, తండ్రీ, తాత గా, స్నేహితుడు, పౌరుడు గా ధర్మాలు, బాధ్యతలు బరువులు నిర్వహిస్తూ, సర్వ మానవ సౌభ్రాతృత్వం భావనతో దైవానికి దగ్గర కావడం, ఎవరికైనా, అత్యంత క్లిష్టమైన జీవన విధానం!!, పాండవుల కష్టాలు శోచనీయం, సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు వారి చెంతన ఉన్నా, నానా అగచాట్లు పడ్డారు,! అరణ్యవాసం, యుద్దం, బందుజనాల మారణ కాండలో తర్వాత, వారు పొందింది కేవలం ధర్మ మూర్తులు అన్న బిరుదు, మాత్రమే! కానీ, వారి జీవన విధానము అనుసరణీయం, ఆచరణ యోగ్యం కూడా !!,, రాముడు అయోధ్యను విడిచి వనవాసం వెళ్లే సమయం లో "జాబాలి" అనే ఋషి ప్రశ్నిస్తాడు,, రాముని !!! ఎందుకు, ఈ ధర్మం, త్యాగం, వాగ్దానాలు,,?? ప్రజలకు సుపరిపాలన అందకుండా దూరం చేస్తున్న నీ వనవాస దీక్ష పరమార్థం ఏమిటి ?"" అని సూటిగా నేరుగా రాముని అడుగుతాడు!,, దానికి శ్రీరామ చంద్రుడు చెప్పిన సమాధానం , తో,, మానవ జీవన పరమార్థం తెలుస్తూ ఉంటోంది ,,!! మనిషిగా జన్మించిన వాడికి ధర్మం, న్యాయం సత్యం, మార్గాన నడుస్తూ , సాత్విక తత్వ చింతన, చేయవల్సిన అవసరం ఉంది!, లేదా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తే, జంతువుల వలె, కామ క్రోధ మధ మాత్సర్యాల మాయలో పడి, హింసా ప్రవృత్తి మాయలో పడి పోయె అవకాశం ఉంటుంది!, ముఖ్యంగా ఒక ఉత్తమమైన రఘుకుల వంశ వారసుడిగా, రాజుగా ధర్మాన్ని ఆచరిస్తూ", యధా రాజా తథా ప్రజా,!"" అన్నట్టుగా ,,సత్య వాక్య పాలన చేస్తూ , జనులను ధర్మ మార్గాన నడిపించాల్సిన అవసరం ఉంది అంటాడు!! .దర్మావ తారుడు ,మానవుడు గా పుట్టి , సత్య ధర్మ అహింసా మార్గంలో చరించడానికి ఎంత కష్ట పడాల్సి ఉంటుందో, భగవంతుడు స్వయంగా రాముని రూపం లో అవతరించి ఆచరించి చూపాడు, !!ఇవి "తూ, చా" తప్పకుండా ఆచరించి, మానవజాతి కి ఆదర్శంగా,, అపురూపం గా నిలిచిన వాడు భరతుడు ఒక ఉదాహరణ గా సూచించ వచ్చును !!, ఎన్ని సుఖాలు, సౌఖ్యాలు ,సంపదలు ఉన్నా, కూడా,, ఇంకా, ఇంకా కావాలని అనుకునే దురాశ స్వభావం తో జీవించే వాడిగా కాకుండా, తన కున్న రాజ్యం, సుఖ అధికార వైభవాలనూ కాదని,, తన అన్న రామయ్య చూపిన ధర్మ మార్గంలో, సామాన్యుడిగా జీవించే ప్రయత్నం చేశాడు భరతుడు !!,14 వత్సరాలు, నార బట్టలు ధరించి, నేలపై పడుకుంటూ, కంద మూలాలు తింటూ, చన్నీటి స్నానం, ఏక భుక్తం, తో, నిరంతర రామ నామ జపం, తపం, గానం, తో,నిజమైన భక్తి జ్ఞాన వైరాగ్య భావనలు మూర్తీభవించిన సన్యాసి లా జీవించాడు.! రాముడు వనవాస దీక్షను పితృ వాక్య పరిపాలన కోసం చేస్తే, భరతుడు నిష్కామ ప్రవృత్తి తో, నిష్ఫలా పెక్షతో, తాను నమ్మిన దైవం రాముడు, ఒక అన్నయ్య గా మాత్రమే కాకుండా ఒక దైవం లా భావించి,, అంత కటో రమైన , కటినమైన నిర్ణయంతీసుకున్నాడు , రాముని సన్నిధిలో ఉన్న లక్ష్మణుని కంటే మిక్కిలి ప్రేమతో, తాను అయోధ్య లో ఉండి కూడా అరణ్యం లో ఉన్న రామయ్యను తన హృదయంలో బంధించి , రామ ప్రేమ తో రాణించాడు,!! రాముని పై గల భక్తి, ప్రేమ అనురాగం తో అపారమైన విశ్వాసం పెంచుకున్నాడు భరతుడు !!, , ఏ రాముని తమకు దూరం చేశాడ నీ,, అయోధ్యా వాసులు భరతుని ద్వేషించారో, అదే రామ చింతన ,భజన, అనుసరణ, భక్తి ప్రపత్తులతో, నగరానికి అవల, చిన్న కుటీరం లో అతి సామాన్యుని వలె, సాధారణ జీవితం గడిపే భరతుని జీవన విధానం వలన,, వారికి భరతుని పై గౌరవాన్ని , నమ్మకాన్ని ఇనుమడింప జేసింది.! భరతుడు ఒక జీవాత్మ అయితే రాముడు పరమాత్మ,! రెండింటి అనుసంధానం కేవలం, భక్తుడు భగవంతుని పట్ల, త్రికరణ శుద్ధిగా చూపే ధర్మం,!! దైవాన్ని మెప్పించాలంటే "నావి అనుకునే వన్ని, అన్నీ వ దలుకోవాలి! , కేవలం "రాముడే నావాడు అనుకోవాలి,,"అంతే !!14 ఏళ్ల వనవాసం తర్వాత రామ దర్శనం లభించక పోతే, ప్రాయోపవేశం చేసెందుకూ కూడా సిద్ధ పడ్డాడు, భరతుడు !!ఇన్ని చేశాక, ఇక ఎందుకు రాడు రాముడు ? భరతుని త్రికరణ శుద్ధి భక్తి తత్వం పరమాత్ముని మెప్పించింది.!. ఈ విధంగా, మనిషిగా పుట్టి , ధర్మ మార్గంలో, చరిస్తూ ,పెద్దవారు సూచించిన సనాతన,వైదిక ఆధ్యాత్మిక జీవన విధానం ద్వారా , దైవాన్ని చేరినవారు ఎందరో మహానుభావులు ఉన్నారు!!, కాలాను గుణంగా, ప్రాంతాన్ని, అనుసరించి ధర్మాలు మారుతుంటాయి! అయినాకూడా,,, ఏది మారినా, మారనివి మానవత్వపు విలువలు, మాత్రమే !! అవి నిలుపుకుంటే చాలు, ఏ దేశమేగినా, ఎక్కడ నివసించిన, దైవ కృపకు పాత్రుడు అవుతున్నాడు మనిషి..!"" మాతృదేవోభవ,! పితృదేవోభవ,! ఆచార్య దేవో భవ,!, అతిథి దేవో భవ,! అహింసా పరమో ధర్మ, !!""అనబడే ఇలాంటి పరమ పావన, నిత్య సత్య, దివ్య జీవన సూత్రాలను అనుసరించి , ఆచరిస్తూ, ఈ హైందవ సంప్రదాయ సంస్కృతిని రాబోయే తరానికి తరగని వారసత్వ సంపదగా అందిస్తూ మానవత్వాన్ని నిలుపుకుందాం ,! అదర్షముతో , ఐకమత్యం, తో మానవసే వ లో మాధవుని తత్వాన్ని దర్శించడం , పరమాత్ముని కృపగా , అనుగ్రహం గా భావించి తరించుదాము ,!! హరే కృష్ణ ,హరే కృష్ణా !! స్వస్తి !"
Sunday, September 1, 2019
త్రికరణ శుద్ధి
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment