Aug 25, 2019 Austin
ఈ సృష్టిలో ఉన్న అండ పిండ బ్రహ్మాండాలు అన్నీ ,సకల జగత్తు అంతా తన విష్ణు మాయ తో అవరింపబడి ఉంది అని, దానిని తొలగించడం కేవలం తన కృపను పొందడం ద్వార మాత్రమే. అనీ. గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా,మానవాళికి అందించిన మహత్తర సందేశం మాయ అనే విషయం. అది అభే ద్యము , అగోచ రము, అనిర్వచీయమైనది అనీ, ఎంతటి జ్ఞానులైనా, తపోధనులు, సిద్దులు, పండితులు, సురాసుర కిన్నర కింపురుష యక్ష గంధర్వ, యోగులు, ఎవ్వరి తో కూడా జయింపబడని మహా బలమైన అమోఘమైన శక్తి అనీ, చెప్పాడు. యజ్ఞ యాగాది క్రతువులు, తపస్సులు, ఎంతటి శాస్త్ర విజ్ఞానము, భక్తి ప్రపత్తులతో కూడా తన ఈ మాయ ను అతిక్రమించి ముందుకు పోలేవని కూడా చెప్పాడు, కేవలం తన యందు భక్తునికి ఉండవలసిన పరిపూర్ణ శరణాగతి ద్వారా మాత్రమే కోట్ల మందిలో ఏ ఒక్క డో మత్పరాయనుడై తన విష్ణు మాయ ను తెలుకొన గలడు అన్న ఆ మాయా రహస్యాన్ని కూడా అందించాడు ."" నా మాయ త్రిగునాత్మక మైనది.! అలౌకిమైన ది.!అధిగమించటానికి సాధ్యము కానిది , !కేవలము నన్ను భజించు వారు మాత్రమే ఈ మాయను అధిగమించి , సంసార సముద్రము నుండి బయట పడగల రు,. ఈ మాయలో చిక్కుట వలన, విపరీత జ్ఞానమునకు లోనైన వారును , అసుర ప్రవృత్తి గలవారును ,,నరాధములు , మూడులు, దుష్కర్మలు ఆచరిం చేవారు ,,నన్ను తలచలేరు!, నా మాయను తెలుసు కొనలేరు,! నా ఈ "యోగ మాయ ""యందు నేను అందరికీ కనపడ ను ,,!!వారు దుర్యోధనాదుల వలె నన్ను అతి సామాన్యుని గా భావి స్తారు"" అంటాడు శ్రీకృష్ణుడు, భగవద్గీత లోని జ్ఞాన విజ్ఞాన యోగం లో,,!!! సకల ప్రాణుల దేహాలు పంచ భూతాల నిర్మితాలే కదా, !సకల జగత్తు , ప్రకృతి,పంచభూతాల నిలయమై ఉంది, కదా ! ఈ జగత్తు అంతా విష్ణు మాయా నిర్మితమైన బ్రహ్మపదార్థం! కనిపించేది పదార్థం, , కానీ,దానిని తరిచి చూస్తే అర్థం అయ్యే తత్వ జ్ఞానం యదార్థ పరమాత్మ స్వరూపం !!, దానిని పరబ్రహ్మ స్వరూపం గా గుర్తించిన జ్ఞానికి ,,జగత్తు సత్యం గా నిత్యంగా సుందరంగా తోస్తు ఉంటుంది .! భూమి కి ఉన్న ఆకర్షణ శక్తి ఒక మాయ, !అది సూర్యుని చుట్టూ భ్రమించడం మాయ,! దానితో ఋతువులు, కాలాలు, పంటలు, నిరంతరం ధరణి భ్రమణం తో బాటు ప్రాణులలో జనన మరణాలు ,చేర్పులు మార్పులు, కలగడం మాయ,! ఏ ఆధారమూ లేకుండా నవగ్రహాలను నియమిత దూరం లో నియమిత కక్ష్యలో నియమిత వేగం తో తన చుట్టూ తింపుతు, తానూ ఈ విశాల విశ్వంలో తిరగడం మాయ, !!ఇలా ఎన్నో నక్షత్రాలు ,,ఒక్కొక్క సూర్యుని వలె, గ్రహాలతో సహా భ్రమిస్తూ ఉంటున్న ఆ రహస్యం అద్భుతమైన, ని గూడమైన విష్ణుమాయా జాలం ! యుగాల తరబడి తమ గతి తప్పకుండా విశ్వంలో అవి సంచరించడం మాయ, సూర్యుడు మండుతున్న ఒక పెద్ద అగ్ని గోళం లా విను వీధిలో చరించడం మాయ, చంద్రుడి చల్లని దివ్యత్వాన్ని అనుగ్రహిస్తూ తిరగడం మాయ,,, మూడు పాళ్ళు సముద్రం , ఒక పాలు భూమి ఉంటే సముద్రం లోని ఒక్క నీటి చుక్క గానీ ఒక ప్రాణి గానీ కూడా జారిపోకుండా ధరణి నీ అంటి పెట్టకొని ఉంచే మహాశక్తి మాయ..! ఒంటరిగా సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే, చావు భయం కలిగిస్తూ , ఉవ్వెత్తున దెయ్యం లా ఎగసిపడే అలలు మాయ !!, వాయు గుండాలు మాయ! ప్రాణ వాయువు గా ప్రాణం నిలబెడుతూ సంచరించే శ్వాసింప బడే ఈ గాలి , ఎపుడు ఆగుతుందో , ప్రాణం పోతుందో ,తెలియక పోవడం మాయ,! అగ్ని మాయ,! భూకంపాలు, అగ్ని పర్వతాలు మాయ !! ప్రాణి లో ఉండి వేడిమిని ఉత్తేజాన్ని, కలిగిస్తూ, దేహానికి జీర్ణ శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తున్న ఉష్ణం ఎప్పుడూ తగ్గి, శరీరం చల్లబడి పోతు ఉంటుందో తెలియ నీ చిత్రమైన అవస్త మాయ ! చావు, పుట్టుకలు మాయ ! స్మశానం లో కి వస్తూ, పోతూ, తాము మాత్రం చావుకు అతీతులు అనుకునే మనిషి తత్వం మాయ ! ఇన్నేండ్ల జీవితంలో ఒక్క తప్పు కూడా చేశానని, కనీసం దేవుని ముందు క్షమాపణ చెప్పని వింత జంతువు అనిపించే మనిషి తీరు మాయ !! సత్యం చెప్పకుండా, ధర్మం ఆచరించ క, , అహింస చేయకుండా జ్ఞానుల మని చెప్పుకు తిరిగే మనుజుల చిత్రమైన చిత్త వైఖరి మాయ !!పంచభూతాలకు లోబడి, మనలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనబడే మాయా ప్రభావాలు, ఎప్పుడూ, ఏ పరిస్థితుల కారణంగా బయట పడి మనిషిని రాక్షసుని గా మారుస్తా యో ఎవరికి తెలియ నీ దురవస్థ మాయ !! నాద బ్రహ్మ త్యాగరాజు గారు, ఒక సంకీర్తన పాడుతూ ఆవేదనతో , దైవ దర్శన ఉత్సుకత తో, ఆర్తితో, అర్డ్రతతో ఏడుకొండల స్వామిని దీనంగా వేడుకుంటా డు,,,""తెర తీయగ రాదా,! నాలోని, మత్సరమనే తెర తీయగరాదా !!"""అంటూ , తిరుమల వేంకటేశ్వర స్వామి ముందు అద్భుత ముగ భక్తితో,మధుర గానం చేస్తారు..వెంటనే అతడికి, స్వామికి మద్య పూజారులు ఉంచిన తెర తొలగి పోతుంది, ఇదే "మాయ "అనే తెర !!అది మనలో భ్రమను , సంభ్రమం,విభ్రమా న్ని కలిగిస్తూ ఉంటుంది,,! మాయాబజార్ అనే సినిమాలో చూస్తాం ,ఘటోత్కచుడు ప్రయోగించిన రాక్షస, పిశాచ మాయలు,!! మహాభారతం లో, మయ బ్రహ్మ చే నిర్మింపబడిన ఇంద్ర జాల మహేంద్ర జాల"" మాయా ""మయసభ భవనం, దుర్యోధన సార్వభౌమునీ,,, ఘోరపరాభవం చేసి, అది భారత యుద్దానికి ఎలా మూల కారణం అయ్యింది, మనకు తెలుసు,!! కేవలం మానవ మాత్రులే కాకుండా, జగన్మోహిని రూపంలో , ఆ విష్ణు మాయ, బలి చక్రవర్తిని, అతడి రాక్షస బృందాన్ని అయోమయం లో పడవేసి, అందుబాటు లో ఉన్న అమృతాన్ని త్రాగ డానికి నోచుకోకుండా చేయడం, మాత్రమే కాక అంతటి ,పరమేశ్వరుడు ,,భోళా శంకరుడు అదే జగన్మా య కు వశీకరణం తో సమ్మోహితుడు కావడం కూడా "విష్ణుమాయ"" ఎంత బలవత్తర మైన, దుర్భేద్యమైన శక్తి యో తెలుస్తోంది!! పరమవిష్ణు భక్త శిఖమణి, నిరంతర నారాయణ నామ గాన పర తంత్రుడు, మహా భక్తుడు, త్రిలోక సంచారి అయిన నారదుడు కూడా విష్ణు మాయకు లోబడినాడు,!! మాయ అంటే అది విష్ణు భక్తులకు అందమైనది గానూ , విష్ణు ద్వేశులకు అతి భయంకరమైనది గా నూ కనబడు తున్న కాల స్వరూపం!!, రావణుడు, మారీచా ది దుష్ట స్వభావుల కు అరి భయంకరుడు గా శ్రీరాముడు గోచరిస్తు ఉంటే, ముని జన భక్త బృందాలకు రామ పరివారానికి, అత్యంత సుందర రూపం తో సమ్మోహన పరచాడు,!!" శ్రీకృష్ణ లీలలు" అన్నీ అతడి మాయా ప్రభావాలు, ! అందుకే, శ్రీ కృష్ణ తత్వం అర్థం చేసుకుంటూ ఆరాధించ డమే కానీ, ఆచరించ దగినది కాదు,, ఎందుకంటే అవి అనితర సాధ్యం , కేవలం శ్రీకృష్ణునికి మాత్రమే సాధ్యం ,, అతడు లీలా మానుష విగ్రహుడు ,అంత చిన్న బాల కృష్ణుని చేతిలో , హతమైన ఎందరో రాక్షసులను చూస్తే తెలుస్తోంది, కృష్ణా లీలల, కృష్ణ మాయల ఆంతర్యం! కృష్ణ తత్వ మ్ అందరికీ అంత సులభంగా బోధపడదు, శ్రీకృష్ణుని మురళీ గానం, మామూలు పిల్లన గ్రోవి వాద్యం కాదు.. కృష్ణు డు వేణువు ను ఊడుతున్నప్పుడు , అతడి,ఉచ్వాస నిశ్వాసాల్లో యోగ మాయ ప్రభావం ఉంది, అందుకే, ఆ మోహన వంశీ నాదం వింటుంటే సకల జగత్తు, ప్రకృతి, బృందావనం,, లేళ్ళు, పశువులు, గోవులు లేగ దూడలు, గోపాలు రు, గోపికలు, యమునానది, నెమళ్ళు , పక్షులు, మృగాలు అన్నీ సమ్మోహింపబడి నాయి, అంత శక్తవంతమైన ది, కృష్ణ మాయ, అందువలన నే మురళీ గానం మధురాతి మధుర మైనదీ,, రాసలీల కేళీ విలాసం లో శృంగార రస మయ భరితం గా కనిపించే ఆ రాదా మాధవుల, గోపీ జన బృందానికి అలౌకిక అపురూప, గోలోక పరదేవత రాధాదేవి,, రస కళా ప్రపూర్ణ దైవం నీలమేఘ శ్యాము ల తత్వమసి దృశ్య కావ్యం ! అందుకే కృష్ణ లీలలు భక్తి ముక్తి దాయకం,, కానీ,కృష్ణ మాయలు మాత్రం అగమ్య గోచరం,,!,,భీష్మ పితామహుడు వంటి పరమ భాగవత భక్త శ్రేష్ఠులు మాత్రమే విష్ణుమాయ ను అతిక్రమించి, శ్రీకృష్ణుని సందర్శన భాగ్యాన్ని పొందారు,! సైంధవ వధ కోసం, అస్తమించే సూర్యుని కి అడ్డంగా ఉన్నది కృష్ణుని చే ప్రయోగిం పబడిన మాయ ,, సుదర్శన చక్రం!, ద్రౌపది వస్త్రాపహరణం సందర్భం లో , ఆమె చేసిన శరణాగతి వలన, ఆమెను కాపాడిన అద్వితీయ శక్తి కూడా విష్ణు మాయ యే..! నిజానికి కృష్ణునికి కన్నతల్లి దేవకి గానీ, కన్న తండ్రి వసుదేవుడు కాదు, కృష్ణుడు స్వయంభువు,,, సాక్షాత్తూ మహావిష్ణువు స్వయంగా, దివి నుండి భువికి దిగివచ్చిన షోడశ కళా పూర్ణు డు,! భ్రమతో, యోగ మాయ ప్రభావం తో దేవకీ వసుదేవుల కృష్ణుడు తమ కన్న కుమారుడు అని భావిస్తున్నారు,, తనగర్భంలో ఉన్నది విష్ణు మాయ తో ఉంచబడిన ఒక వాయు రూపం అనీ, విష్ణువు కాదనీ, ఆ మాయ, ఆమెకు మాతృత్వ మాధుర్యం అందిస్తూ ఉందనీ, ఆమెకు తెలియదు, !ఎలాంటి ప్రసూతి నొప్పులు పడే అవసరం లేకుండా, తనకు తానే దేవకీ వసుదేవుల ముందు, చతుర్భుజం తో, శంఖ చక్ర గదా పద్మాల తో నేరుగా ప్రత్యక్ష మయ్యాడు శ్రీ మహా విష్ణువు!, తనను రేపల్లె లోని నంద యశోద లకు అప్పగించమని , కూడా ఆదేశించాడు, విష్ణు మాయ ప్రభావం తో జైలు నుండి ఏ ఆటంకము లేకుండా వెళ్లి, పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించే యమునా నదిని దాటడం, యశోద ప్రక్కన శిశువు గా అవతరించిన యోగమాయ ను తిరిగి మధుర కు తేవడం, అంతవరకు ఇక్కడ మధురలో, అక్కడ రేపల్లె లోని వారంతా విష్ణు మాయా ప్రభావం తో నిద్రిస్తూ ఉండడం , అంతా శ్రీహరి సంకల్పమే!,, ఈ విధంగా ఆ యోగమాయ శ్రీకృష్ణుని సోదరి యై,, జగన్మాత పరమేశ్వరుని ఇల్లాలై, జగదంబ, నారాయణి గా కూడా పిలువ బడుతోంది, ఆడ శిశు రూపంలో ఉన్న యోగ మాయ ను హతమార్చ బోయిన కంసునికి హెచ్చరిక చేస్తు, యోగమాయ అంతర్ధానం అవుతుంది,!, ఇది పౌరాణిక గాథ అనుకుంటే,, మానవుడు నిత్య జీవితంలో అనుభవించే మాయా ప్రభావాలు కడు విచిత్రం, గా అనూహ్యం గా తోస్తూ ఉంటాయి. .. ఏక్సిడెంట్ లలో, అకాల వర్షాలతో,, పెను తుఫాను లు అగ్ని ప్రమాదాలు, అతివృష్టి, అనావృష్టి, కార్చిచ్చు లు, అణు బాంబుల యుద్దాలు, మారణా యుధాల ప్రయోగాలు , కారణంగా, ఇలా ఎన్నో అకాల మరణాలు ప్రపంచ మంతటా జరుగుతూ ఉండటం చూస్తున్నాం , ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయమే ఈ మాయా జాలం కదా.. ఉన్నది లేనట్టుగా,, లేనిది ఉన్నట్లు గా అనిపించడం మాయా ప్రభావం, మా చిన్నతనం లో గారడీ వాళ్ళు,, తమ అద్భుత ఇంద్ర జాల ప్రదర్శన తో తేళ్లు, పాములు, ఉంగరాలు, ఇలా ఎన్నో రకాల వస్తువుల ను తమ నేర్పుతో , విద్యా కౌశలం తో ,,అప్పటికప్పు డు సృష్టించి చూపుతూ వెంటనే మాయం చేస్తూ ఉంటే విస్మయం చెందే, వాళ్ళం మేము.. ఇప్పటికి,, అన్ని దేశాలలో, అదే సంస్కృతిని పలు చోట్ల చూస్తు నే ఉన్నాం, !ప్రతివారి గతం,, కలలు, సంఘటన లు అంతా ఒక మాయ,!! అవన్నీ తరుచూ జ్ఞాపకం వస్తు ఉంటాయి, కానీ యదార్థం కాదు, !!భవిష్యత్తు కూడా ఒక మాయ !, ఏం జరుగుతుందో , అసలు జరుగుతుందో లేదో, ఎక్కడ , ఎలా, ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ, ఎంతటి వారికైనా అంతుబట్టని యోగ మాయ,,,,! చెడు అలవాట్లకు, లోనైన వారికి, ఇతరులకు హాని కలిగిం చే వారికి, తామస గుణ స్వభావుల కు ,,దుర్మార్గులకు ఈ మాయ అనుక్షణం భయం రూపంలో బెదర గొడుతూ ఉంటే, సన్మార్గంలో, సద్భక్తి తో , సద్భావన తో ప్రవర్తించే సత్వ గుణ సంపన్నులకు అనందం రూపంలో అవిర్భవిస్తు ఉంటుంది, జీవితం లో ఆసక్తి ఉన్న వాటిని పోగొట్టుకొని వైరాగ్యం తో విలపించే విరక్తు లకు,," జగమే మాయ, బ్రతుకే మాయ, "అనిపిస్తుంది,, ఆ వైరాగ్య భావన, గృహస్తుల లో భగవంతున భావనకు బీజం వేస్తుంది.. కృష్ణుని రూప గుణ వైభావాలు తెలియకున్నా, సంసార మనే" మాయా" జగత్తు నుండి,, నా ఇల్లాలు, నా కుమారులు అంటూ ,"జీవిత కాలం అంతా అల్లాడిన సంతాప తప్త హృదయుల కు, ఆ జగన్మా య నుండి విముక్తి పొం దే తరుణోపాయం తెలియజేస్తుంది,,! అందుకే ,ఘోరము, తీవ్ర మూ,, అనితర సాధ్యము అయిన ఈ మాయ నుండి బయట పడాలంటే ,శ్రీకృష్ణుని చరణ కమలాలు ఆశ్రయించాలి! ,, వేరే దారి లేదు, !పరమ హంసలు, మహాత్ములు, నాద బ్రహ్మ లు,, పౌరాణిక గ్రంథ కర్తలు, యోగులు, ఎందరో భక్తులు , అంతా ,దేవాది దేవుని, శ్రీకృష్ణ భగవానుని , త్రికరణ శుద్ధిగా కొలిచి, భక్తి పారవశ్యంతో పరంధాముని మంగళకర మైన సుందర దివ్య రూప సందర్శనా భాగ్యాన్ని కనులారా చూసి, మనసారా భావించి , తనివారా ఆ శ్రీకృష్ణభక్తి ర సామృత ధారల లో తడిచి మురిసి పోతూ , తమ జన్మలు చరితార్థం చేసుకున్నారు! , వారు ఆ విధంగా మాయాతీతులు కావడానికి కారణం , సర్వస్వం శ్రీ కృష్ణ అర్పణము అనే పరమేశ్వర అంకిత శరణాగత భావ నయే !!""నాది, నేను "" అనే అహంకార , మమకార విసర్జన తో భక్తులు పరమాత్మకు దగ్గర, అవుతున్నారు,, !కలిమి లేములు, కష్ట సుఖాలు కావడి కుండల వలె, ఒకటి తర్వాత ఒకటి ప్రాప్తిస్తు ఉంటాయి. ఏది శాశ్వతం కాదు, కావడి ఒక కొయ్య అనీ, కుండలు మట్టి అనీ, అలాగే అందంగా కనిపించే, ఆనందం అనిపించే ఈ పాంచ భౌతిక శరీరం కూడా మట్టిలో కావాల్సిందే, అనీ, భగవంతుని భజన యే కృష్ణ మాయ ను అధిగమించి, కృష్ణ చైతన్యానికి ఉత్తమ జీవన విధానమని గ్రహించాలి. బొందిలో ప్రాణం ఉన్నప్పు డే, నిస్సారమైన సంసారం లో సారం నింపే దైవభక్తి తో, పరమాత్మ ను పట్టుకొని, ఆశా మోహాల కు దాసులం కాకుండా, హరి దాసులై, ఉండాలి. భక్తి, జ్ఞాన ,వైరాగ్యం అనే ఈ మూడు దివ్య శక్తుల తో, మనలో ఉండే గతజన్మ కర్మ అనుభవాలు అనే త్రాళ్లను తెంచి వేయాలి, అది మాయమోహ జనిత ప్రపంచాన్ని మదిలో సృష్టించి పీడించే మనసు నీ ,, శ్రీకృష్ణ చైతన్యం వైపు మళ్ళించడం ద్వారా మాత్రమే , మాయ ను గెలవడం సాధ్యం అవుతుంది. !గజేంద్రుడు పాపము, పుణ్యము, జ్ఞానము ,,దైవము తెలియ నీ మూగ జంతువు,. కానీ అకస్మాత్తుగా మొసలి వలన దాపురించి న అపద , తొలగించు కోవడం తన వల్ల, కావడం లేదని తెలిసీ,, ఈ దురవస్తను కలిగించిన వాడు , దీనిని తొలగించే వాడు వొకడు ఉన్నాడని నమ్మి ,శరణు వే డి, ఆ మాయావి నుండి విముక్తి పొందింది, అలాగే ధ్రువుడు, ప్రహ్లాదుడు కూడా భక్తి అనే నావను ఎక్కి, భవసాగరం అనే మాయను దాటి పరమాత్ముని పరమ ధామం లో చేరారు ,, కావున మన చుట్టూ అజ్ఞానం అనబడే కారు చీకటి వలె ముసిరి,, కాటు వేయడానికి ఎదురు చూస్తున్న మాయా రూప కాల సర్ప ఘోర ప్రభావం నుండి విముక్తి కోసం, శ్రీకృష్ణ నామ భజన, కృష్ణ రూప ధ్యాన, లీలా స్తోత్ర పఠన, పురాణ శ్రవణము, శ్రీకృష్ణ తత్వ చింతన, భాగవతుల చరిత ల మననం ద్వారా, నిత్యం పరమాత్ముని తో , మన జీవాత్మ ను అనుసంధానం చేస్తూ , అతని సన్నిధానం లో జీవితం గడుపుకుందాము ,,! అందుకు తగిన భావ సంపదను, స్ఫూర్తిని, ధృఢ సంకల్పాన్ని, చిత్తశుద్ది నీ అనుగ్రహించ మని, భక్తి భావన తో , ఆ ""రాధా మాధవుని ""వేడుకొందాం!. . హరే కృష్ణ హరే కృష్ణా! కృష్ణ కృష్ణ హరే హరే,,! హరే రామ హరే రామ, రామ రామ హరే హరే !! స్వస్తి !
Sunday, September 1, 2019
విష్ణు మాయ
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment