Sunday, September 1, 2019

కృష్ణ ప్రేమ

Aug 24, 2019  Austin
కృష్ణ ప్రేమ అంటే కృష్ణుని పై మనకున్న ప్రేమ,, అనుకుంటాం. కాదు, కృష్ణునికి మనపై ఉండే ప్రేమ,, మనం కృష్ణాలయం లో కృష్ణ విగ్రహాన్ని చూస్తుంటాం , ఆహా ఎంత అందంగా ఉంది అని ఒక్క క్షణం అనుకుంటాం, కృష్ణా లయం దాటి వెళ్ళాక  అది మరచి పోతాం, మళ్లీ కృష్ణజన్మాష్టమి లాంటి ఉత్సవం రోజున వందలాది బాల బాలికల ను ఒకే చోట అందమైన  రాధాకృష్ణ వేష ధారణ లో చూస్తేనే   తప్ప కృష్ణుడు మనకు మళ్లీ గుర్తుకు రాడు కదా ,,అంటే బజారు లో దొరికే కనిపించే సాధారణ వస్తువు ను చూ సిని  తర్వాత మరిచిపోయే సాధారణ దృశ్యం అది, , కాదుగదా, శ్రీకృష్ణ శక్తి చైతన్యం అనేది !! జీవితంలో మనకు ఇష్టం అయినవా రితో బంధాలు పెంచు కుంటాం,, అమ్మా నాన్నా, అన్నా చెల్లి, తమ్ముడు లాంటి వారిని, ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటూ , తరుచుగా కలుస్తూ, అవసరమైతే ఫోన్ లో మాట్లాడుతూ ఇలా ఒక సంబంధాన్ని కలుపుకొని ఆత్మీయుడు గా చేసుకొంటూ ఉంటాం,,!, సుఖ దుఃఖాలు, పండుగలు, పార్టీలు , సంతోష సందర్భాలలో ఆనందాన్ని అనుభవిస్తూ వారితో పంచుకుంటూ, అలా పెంచుకుంటూ , ఉన్నాం !! అదే అనుబంధాన్ని చివరి శ్వాస వరకూ ప్రాణానికి సమానంగా భావిస్తూ నిలబెట్టుకుంటూ  జీవితాన్ని గడుపుతూ ఉంటా ము,, మనం వారితో ఆప్యాయంగా ఉంటుంటే వారు కూడా అలాగే మనతో ఉంటున్నారు కదా , ! మరి,అలాంటి ప్రేమానుబంధం  మన కృష్ణయ్య తో ఎందుకు పంచుకోవడం  లేదు ?? అంటే కృష్ణుని ఒక కదలనివిగ్రహ స్వరూపంగా నే , కేవలం గుడికి మాత్రమే పరిమితం అయినవాడిగా భావిస్తున్నాం, కృష్ణయ్య తో బంధం  పెట్టుకోవడం ద్వారా    మనం కూడా కృష్ణుని ప్రేమకు పాత్రుల మౌతాము అనే సత్యాన్ని నమ్మడం లేదు ! అందుకే అలాంటి బంధుత్వం ఏది కూడా మనం కృష్ణుని తో పెట్టుకోవడం లేదు,, అంటే కృష్ణుని పై  మనం మనసు పడటం లేదు, అంటే పరిచయం లేని వారితో ఎలా కొత్తగా, ఆంటీ అంటకుండా ఉంటామో కృష్ణుని విషయం లో కూడా అదే చేస్తున్నాము,! ఈ కృష్ణుడు మనవాడు,! కావాల్సిన వాడు,! దగ్గరివాడు,! అయినవాడు! ఆత్మ బంధువు,! మన అన్ని అవసరాలు తీర్చే వాడు ,! ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండే వాడు,!! వీడు అందరివాడు,! నమ్మితే చాలు , ఏదైనా అడగకుండా ఇచ్చే వాడు!, అతడిని కొలిచిన తాతల కు తండ్రులకు కూడా కోరింది ఇచ్చాడు! అలాగే నీకు కూడా ఇస్తాడు, !ఇవ్వడానికి నీ ఇంటి ముందు, నీ వెంట, నీ తోనే రెడీ గా ఉంటున్నాడు,! ఎప్పుడు పిలుస్తావా, !ఎప్పుడు పరుగున వచ్చి నిన్ను తనవాడిగా చేసుకోవాలా! అని  నీ కోసం ఎదురుచూస్తూ,, నీవు పుట్టినరోజు  నుండి నీ వెంట పడుతూ, మద్య మద్య లో,, ఇలా ,ఇదిగో ,, ఇలా
కృష్ణ విగ్రహ రూపంలో, నీ ముందు నిలబడి తన దివ్య దర్శనం తో మనల్ని పావనం చేస్తు ఉన్నాడు, అది నీవు గ్రహించడం లేదు,, పదార్థాలను గ్రహిస్తూ ఉన్నావే గానీ, అందలి యదార్థం గ్రహించడం లేదు,, ఈ బాల కృష్ణ వేష ధారణ తో " నేను నిన్ను విడవకుండా ఉన్నాను,! నీతోనే ఉంటాను!  , నిన్ను మరవకుం డా,, నిన్ను విడవనీ  నీడలా వెంబడిస్తూ ఉన్నానని "" చెబుతున్నా  కూడా ,నీవు కృష్ణుని  విశ్వసించడం లేదు , నీ వాడుగా, నీ మేలు కోరే అత్మ బంధువుగా , శ్రేయోభిలాషి గా అంగీకరించడం లేదు,, అతడిని కేవలం అపద మొక్కుల వాడిగా, మాత్రమే గుర్తిస్తూ, సాక్షా త్ పరమాత్మ తో వ్యాపార సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటు ఉన్నావు, నాకు ఉద్యోగం ఇప్పిస్తే నీకు పది వేల రూపాయలు హుండీలో వేస్తాను అని బేరం ఆడుతుంటావు, అలా నిజంగానే జరిగితే ఆ సంతోషం లో అసలే మరిచి పోతావు, జరక్కపోతే ఈ దేవుడిని కాదని మరో దిక్కు వేదుక్కుంటావు ! నీలోని,, స్వార్థం, అహంభావం, అజ్ఞానం , గూడు కట్టుకుని , శ్రీకృష్ణ చైతన్య ప్రభావం తెలుసు కోనివ్వవు కదా ;! జీవితం లో తల్లీ, తండ్రి ,గురువు, భార్యా, భర్త, పిల్లలు, స్నేహితులు ,బందువులు , ఎందరో అపరిచితుల ను ,అభిమానులను నమ్ముతావు కానీ, పరమాత్ము డైన  శ్రీకృష్ణ పరందాముని మాత్రం నమ్మవు కదా,! ఎంత దౌర్భాగ్యం ఇలాంటి మనో వైచిత్రి కలగడం ?, ఏది జగతికి నీ ప్రగతికి మూ లమో,, ఏది నీ ఉనికికి, జీవనానికి, శక్తి, చైతన్యానికి , మనుగడకు,, పుట్టుకకు , చావుకు , ఆనందాలకు ఐశ్వర్యాల కు అధార మో ,, ఆ పర మ రహస్యాన్ని ,,సత్యాన్ని  మరచిపోయి  మిథ్యా జీవితంలో, ప్రాపంచిక వస్తువు ల భ్రమలో పడి,, ఏది సత్యమో ఏది నిత్యమో, తెలియక, నీ జీవిత పరమార్థాన్ని , మరచిపోతున్నా వు  కదా !, ""నేను చేయాల్సింది కృష్ణ చైతన్య సాధనం !, నాకు క్కావల్సింది కృష్ణ ప్రేమ!""అంతే !" "అనే భావ సంపదతో ఆర్తితో ,, ఆర్ద్రత తో ,నీ తల్లిని ,తండ్రిని ఎలా పిలుస్తావో , , ప్రేమిస్తావో ,,అదే ప్రేమతో కృష్ణుని పిలిచి చూడు,, ,-!ధ్యానించి చూడు,!, కొలిచి చూడు,,! తప్పక అతడు నిన్ను చూస్తాడు !, అతడి చూపు నీవైపు పడిందా , ఇక నీజన్మ ధన్యం అయినట్టే,,,! జన్మ జన్మల, భవ బంధా లు తొలగి "పరమానందం" అనే అద్భుత అమృత ధార నీపై వర్షిస్తుంది!,, అంటూ మన  సనాతన హైందవ ధర్మ శాస్త్రాలు, వేదాలు పురాణ ఇతిహాసాలు,చెబుతున్నాయి !, , బలి చక్రవర్తి వామనుడు మహావిష్ణు వు అని తెలిసి,, తనను వంచించే ఉద్దేశ్యం తో మూడు అడుగుల నేల అడిగాడు అని తెలిసి కూడా, జగన్నాథుని చేతిలో పరాభవానికి అయినా కూడా సిద్ధపడ్డాడు,, తన సర్వస్వాన్ని, దానం చేసి చివరకు తనను తానే సర్వాంతర్యామి అయిన శ్రీహరి కి సమర్పించు కుని,, అంతటి స్వామిని ,,తన ద్వారపాల కుని చేసుకొ న్న అపర భక్త శిఖామణి అయ్యాడు, ,!-"""తేరా తుజ్ కో అర్పన్, క్యా లాగే మేరా,!!"" అని మీరాబాయి  తన కృష్ణ భజన లో సూచించిన విధంగా భావించాలి, ఆమె వద్ద ఏముంది ఇవ్వడానికి ?కృష్ణప్రియ అయిన ఆమె వద్ద  ఒక్క కృష్ణ ప్రేమ  తప్ప,!" నాది అంటూ ఏమి మిగిలిఉంది నా వద్ద  ,, కృష్ణా, ? ఒక్క మనసు తప్ప ? అది కూడా నీదే !!అంతా నీవే! , ఇదంతా నీదే,!నీ సొత్తు ను, నేను! నీకు సంతోషంగా, కృతజ్ఞతా పూర్వకంగా  తిరిగి ఇవ్వడానికి  ,,నాకు నీపై ఈ కృష్ణ ప్రేమను కరుణ తో పంచు ! నీల మేఘ శ్యామ సుందరా! మీరా కే ప్రభూ !" అంటూ అంకితభావం తో  శరణాగతి చేసింది మీరా  !! భక్త ప్రహ్లాదు డు కూడా తన మనసు ని అంతా శ్రీహరి మయమే , చేశాడు !, ఇక ,ఏ బాధలు, తాపాలు అతడిని హరిభక్తి కి దూరం చేయలేదు,! అంతటా హరి దర్శనం చేశాడు, అంటే అత్మ సమర్పణ గావించు కున్నాడు!, అలాగే బాలుడైన భక్త ధ్రువుడు  శ్రీహరి ఉన్నాడని, తనను రక్షిస్తాడు అని, పరిపూర్ణంగా నమ్మాడు, అందుకు యోగ్యత సంపాదించడం కోసం, ప్రభువు పెట్టే పరీక్షా లో నెగ్గాడు, మనసు ,తనువూ అర్పించాడు, ప్రాణాలను ఫణంగా పెట్టాడు, చిన్నవాడైన కూడా భక్తి రసంలో పండి పోయాడు,, నాకు దైవం ఏది ఇచ్చాడో, దానితో తృప్తి పడుతూ, అదే  ఆనందిస్తూ, ఆదే స్వర్గం అనుకుంటూ ఉన్నానో, అవన్నీ అందరికీ  ఇచ్చాడు, ఇందరికి ఇన్ని  ఇచ్చిన దాత, దయాంత రంగుడు,  శ్రీవిభునీ మరచుట , తలచకుండ ఉండుట ,"స్వామిద్రోహం"" కాదా,? ఎవరి ఉప్పు తింటున్నామో అలాంటి యజమానిని విడిచి, అతడిని తలచుకో కుండా,, కృతగ్నులుగా బ్రతకడం కంటే దుర్దశ వేరే ఉంటుందా,,? అడగకుండానే అన్నీ ఇచ్చి, అవి అనుభవించడానికి బుద్ది, జ్ఞానం ,ఆయువు లను కూడా ఇచ్చిన కృష్ణుని ప్రేమను అర్థం చేసుకుంటూ, అనునిత్యం మననం చేస్తూ, జీవించడం,, మనిషిగా చేయాల్సిన ముఖ్య కర్తవ్యం కదా,,! ఇదే మన బ్రతుకు పరమార్థం ,,! చరితార్థం కూడా,!, అదే, జీవిత పరమానందం! , ఇదే బ్రహ్మానందం!, జన్మ సార్థకం చేసే శ్రీకృష్ణ ప్రేమానుబంధం !,, అందుచేత,, పరమ సౌఖ్యము, పరమానం ద భక్తి సామ్రాజ్యం లో , సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం దర్శిస్తూ, ఉండాలి.. సకల పాపహరణము, భుక్తి ముక్తి దాయకం, అయిన క్రిష్ణ ప్రేమను స్వంతం చేసు కోవాలి ! స్వామి పంచభూతాల స్వరూపం లో ఎల్ల వేళలా గోవిందుడు మనల్ని కనిపెడుతూ ఉన్నాడు కదా !!!వాయు రూపంలో ప్రాణాన్ని నిలబెడుతూ, ధరణి రూపంలో పసిడి పంటలను ఆహారాన్ని శక్తినీ అందిస్తూ ,, స్వచ్చమైన జలాల నందిస్తు మనలో చైతన్యాన్ని  కలిగిస్తూ , అగ్ని ద్వారా సూర్య కిరణాల ప్రభావం వల్ల మన అన్ని శరీరాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా జ్ఞానవంతం గా తీర్చి దిద్దు తూ,  అనంత అద్భుత నీల వర్ణ ఆకాశ రూపంలో , సర్వాంతర్యామి యై ,సర్వ జగత్తును సృష్టిని  ,ప్రకృతిని నియంత్రిస్తూ  పరిపాలిస్తూ ఉంటున్న  ఓ శ్రీకృష్ణా ! నీ లీలలు, నీ వైభవం గురించి మా బోటి  సామాన్యులకు వర్ణించ తరమా ?, నా అజ్ఞానాన్ని మన్నించు ,! అమాయకుడైన నన్ను , నీవాడి గా చేసుకో, స్వామీ! అతి దుర్లభము, అమోఘం, అద్వితీయం అయిన నీ అపార కృపామృత పాన భాగ్యాన్ని మాకు అందించి, మా జన్మ కృతార్థం గావిం చు ,! నారాయణా,! భక్త వత్సలా,! అచ్యుత!, అనంత !గోవిందా ,! గోపాలా! ముకుందా,!, రాధా రమణా,! యశోదా నందనా,! గోపీజన ప్రియా, !శరణు,, !, అంటూ అనుభవం గల పెద్దలు, పండితులు తండ్రులు, అమ్మమ్మ ,తాత మ్మలు, తాతయ్యలు , పండితులు మనకు చెప్పారు, భగవంతుని నమ్మి చెడిన వారు ఇంతకు ముందు లేరు! , ఇక ముందు ఉండబోరు,!, శ్రీకృష్ణా !యదు భూషణా! , ముకుందా!  గోవిందా! గోపాలా !!""అంటూ దివ్యమైన శ్రీకృష్ణ విగ్రహం ముందు మనం  నిలబడి  మనసారా, భావించి, చేతులు రెండు పైకి ఎత్తి ,, నోరారా  అతడి  నామాన్ని  ఉచ్చరిస్తే చాలు,, !అమ్మను పిలిస్తే , ఆమె,ఎలా ఉరుకులు పరుగులు పెడుతూ బిడ్డను దగ్గరికి తీసుకొంటూ ,,దుఖాన్ని పోగొడుతూ ఉందో,, అలా గోవిందుడు కూడా,"" నేను వస్తా ను ,! నీ యోగక్షేమాలు చూస్తాను, !నీ రక్షణ భారం నాది,, !నీవు నాలో ఉంటావు!"" అంటూ భగవద్గీత సాక్షిగా పరమాత్ముడు ప్రమాణం చేశాడు! , పరాత్పరుని నోట నుండి వచ్చిన ఈ "గీత !"వేద ప్రమాణ ము కదా ,! అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభదినం సందర్భంగా  "కృష్ణుని మనసారా నమ్ము దాము, అలా ఆ విధంగా క్రిష్ణ ప్రేమను పొందుదాం,! అనగా కృష్ణుడు భగవద్గీత ద్వారా  చెప్పిన మాటలు వింటూ అతడు చూపిన  బాటలో నడచు కుందా ము !! భగవద్ గీత గ్రంధాన్ని చదువుతూ మననం చేస్తూ , స్వామిని మనవాడు గా అనుబంధాన్ని పెనవేస్తూ, ఆత్మ సాక్షిగా   విశ్వసిస్తూ  ,జన్మను సార్థకం చేసుకుందాము ,! ఇందుకు మనకు కావాల్సిన స్ఫూర్తిని, అత్మ బలాన్నీ దృఢమైన సంకల్పాన్ని  ,అనుగ్రహించమని శ్రీకృష్ణుని కోరుకుందాం,! కృష్ణా, నీ" చరణ కమలాలు" అనే "బంగారు పంజరం" లో నా మనసును బంధిం చి, నిత్యం నీ భావంతో, నీ ధ్యానం తో చరించే రాజహంస గా మార్చి, నన్ను నీలో కలుపుకో! నాకు, ఈ జన్మలో, ఇంతకన్నా ఆనందం ఉండదు కదా, స్వామీ ! పరంధామా! పరాత్పరా, !అంటూ స్మరిస్తూ, కృష్ణ విగ్రహ రూపంలో ఉన్న పవిత్ర పావన భవ్య దివ్య కృష్ణ పాదాలను స్పర్శిస్తూ, మదిలో కృష్ణ ప్రేమతో  నిరంతరం ధ్యానిస్తూ  కృష్ణుని ప్రార్ధించుకుందాం,, హరే కృష్ణ హరే కృష్ణా!!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...