Sunday, September 1, 2019

సాంబశివ పద్య నివాళి

జీవితమంతయున్ ఆధ్యాత్మిక చింతన వెళ్ళ బుచ్చి
పావన దివ్య వైభవ ప్రభల హరి భజన కీర్తన  మధురిమల
భావన లందున ఓలలాడి - తదీయ మానసము రామకథా
శ్రవణాదులందునన్ లగ్నము జేసితివెంత పుణ్య శీలివో!!
                       
ప్రేమను పంచితీవు కుమారుల కూతుళ్ళ యందుగాక
ప్రేమతో మురిపించితీవు ఇల్లాలిని బందుజనాల యందున్
ప్రేమతో భజించితీవు తాళము వేయుచు నాట్యమడంగన్
ప్రేమతో దేవదేవుడును ప్రేమతో నినుగోనే ప్రేమముర్తియై!!

నిత్యము గంగస్నానములన్ నమక చమకమ్ములన్
నిత్యము సాలగ్రామ అభిషేకములన్ విధిగ తీర్థగోష్టులన్ నిత్యము సోమవార ప్రదోషములన్ భాగవత పాఠములన్
నిత్యము భక్తి తత్పరతల మదిలో నిలిపితివెంతొ ధీరతన్

యవ్వనమందె అంకురించే గద గౌరీపతి భక్తి మార్గముల్
ఎవ్వని లెక్క జేయక మిక్కిలి మక్కువగా జగన్నాథు నిన్ నొవ్వక ఇంచుకన్ గంగ నీటితో కడుగుచు ఆలయమ్ములన్
ఎవ్వని లక్ష్యముంచి సేవలుజేసేనో ఆ సన్నిధి పెన్నిదే కదా!

భాగవతాది పురాణముల బాగుగ నిత్యము పఠన జేసిన
భాగవతోత్తమా మిక్కిలి భక్తితో భావన భజన చేయుచున్
రాగతాళముల రంజిల జేయుచు ముక్తి  మార్గమున్
బాగుగ నాగ భూషణుని నమ్మి భజింపగ ధన్యుడైతివే!!

సాంబశివుడన్న ప్రేమతో చేతులారంగ శివ పూజ జేయగన్
సాంబశివునికై చేసితివి ఉగ్ర జపాదుల నిష్ఠ తోడుతన్
సాంబశివు నమ్మి పఠిన్చితివి సాంబశివాష్టక స్తోత్రపాటముల్ సాంబశివ నామము సార్థక మాయే గదా సదా నిజంబుగన్!!

సహనము బూని కష్టపడి చదివితి వెంతో ప్రయాస కోర్చి 
సహనము తోడ పిల్లలకు చక్కని భవితను ఓర్చి కూర్చి
సహనము తోడ సాలగ్రామ పూజలు నిష్టతో చేసి చేసి
సహనము తోడపిల్లలకు చక్కగా పాఠము చెప్పి చెప్పి
సహనము శ్లాఘనీయము వందనమయ్య పురాణ పురుషా!

పేకాటనందునాసక్తితో పిల్లలతో నాక్ నాక్ నాడినావు!
క్రికెట్ మ్యాచుల యందు పిల్లాడిలా మురిసినావు!
పది మందిలో సందడిగ మాట సరసత జూపినావు!
కష్టములందు కడు నిబ్బరముతో పనులు నిర్వహించినావు!

సర్పంచ్ పదవిలో తనవారి నొల్లక పరులకు ఉద్యోగ మిచ్చినావు! 
తండ్రి వలె తమ్ముడు కమలాకరునికి ప్రేమను పంచినావు !
భక్తురాలగు తల్లి కిష్టమైనవి కూర్చి మాతృభక్తి నీవు జూపినావు!
భ్రాత్రు ప్రేమతో అన్నని మిక్కిలి సేవించి తరియించినావు!
తోబుట్టువుల మిగుల నాదరించి ప్రేమముర్తివై  వెలుగొందినావు!
మనవల మనవరాళ్ళ కోడళ్ళ ఆప్యాయత పొందినావు!  

ఎవ్వరు జెప్పిరి గంగస్నానాది శివలింగ పూజ చేయ
ఎవ్వరు బోధించిరి నిత్య శివాభిషేక విధము జరుప
ఎవ్వరు నుడువగ పద్యముల్ పాటలున్ ఎలుగెత్తి పాడ
ఎవ్వరు నిర్దేశింప ప్రదోష ఉపవాస కఠినదీక్షలు సలుప

ఎంతటి పుణ్యమో నీ సతికి భర్తకు జేసిన సేవవల్లయున్
ఎంతటి పుణ్యమో నీది అంతటి భక్తి కలిగిన భార్యగాగ!
ఎంతటి  ఓర్పు నేర్పు ఆమె భక్తియు ప్రేమానురాగముల్
ఇంతని చెప్పలేము ఆమెకె చెల్లును పతివ్రతేయనన్!

కొడుకులు బుద్ధిమంతులు దయాపరులు దీశాలుర
కొడుకుల గంటివి! సగర్వముగా తలఎత్తి ముదంబుగా
కొడుకులు నీకు జేసిన సేవలు మేలని తలలూపగా జనుల్ ఏ కొడుకులకైన ఆ సేవలు స్పూర్తిని కీర్తిని కలుగ జేయవే!

భక్తుడవన్న నీవే సాంబశివ!
మీ జన్మము ధన్యము సాంబశివ!
మీ వంశము వర్ధిలు గాక సాంబశివ!
శాంతి సౌఖ్యాలు తరియింప సాంబశివ!

పుణ్య పురుషుదవైతివి ధన్య చరిత
అన్యమెరుగక హరుని సేవలోనె జేరి
ధన్యత నొందితివి శివ భక్తుడని నుతింప
గణతికెక్కితివయ్య నీ జన్మ ధన్యమయ్య!  

2 comments:

RAMESHRAO said...

Real tributes from our multi intelligent great devotee bava .

Unknown said...

Excellent poetry bava you are great.we are proud to be the sons of such a great personality.I love you baapu

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...