Saturday, September 7, 2019

తత్వమసి

Dallas , Sept 5, 2019
"తత్వమసి, "అహం బ్ర హ్మో స్మి "" అనగా ఆ తత్వాన్ని నేను, సోహం అంటే కూడా అదే అర్థం, నేనే నీవు, నీవే నేను, నేను నీవై, నీవు నేనై ఉన్నాను, నీకు, నాకు భేదం లేదు, అన్నది చక్కని అద్వైత సిద్ధాంతం, !! కాస్త తీరికగా ఒపికతో, మనం అత్మ పరిశీలన చేస్తే, ఈ రెండింటి సారూప్యత గోచరిస్తుంది, ఈ రెండూ ఏమిటీ, ,,?అంటే, అందులో ఒకటి, నేను, !!రెండవది ఎదుట అగుపించే ప్రపంచం!, అది వస్తువు కావచ్చు, లేదా ఏ ప్రాణి అయినా కావచ్చును,!!!, ఈ తత్వమసి , అనే వేదాంత రహస్యం అన్వయిం చు కోవాలంటే,, , నేను మొదటి వ్యక్తి , మరియు   ,సాక్షాత్తూ తిరుమల వేంకటేశ్వర స్వామినే  రెండవ వ్యక్తిగా ఎంచుకుందాం !,, తిరుమల వెళ్ళడం ఒక గొప్ప అదృష్టం,! అందులో స్వామి దర్శనం లభించ డం మహా భాగ్యం,!! శ్రీనివాసుని చూడకముందు ఎంత ఉత్సాహం, ఉబలాటం, ఆర్తి ఉందో, దర్శనం తర్వాత కూడా అదే సంతోషం, అదే స్పందన, అదే అనందం కళ్ళల్లో హృదయంలో , మనసులో, తనువులో జ్ఞాపకం చేస్తూ, కనీసం తిరుమల కొండల పై ఉన్నంతవరకు , తాదాత్మ్యం తో పరవశిస్తూ ఉంటే జన్మ ధన్యం అయ్యింది అనుకోవచ్చును ,,,,ఈ భావ సంపద ను భక్తి అనవచ్చును, ఈ రకంగా స్వామికి నాకూ ఉన్న సంబంధాన్ని, "నేనే ఆ స్వామి ""గా  అని కూడా భావించుకొన వచ్చును,, ఇంటికి వెళ్ళాక కూడా ,,నాకు తరుచుగా ఆ గోవిందుని ముఖ కమల వైభవం గుర్తు వస్తూ ఉంటే అప్పుడు, వేంకట రమణుని కృప నాపై అపారంగా ఉన్నట్టుగా అనుకోవచ్చును,!! ఈ రకంగా స్వామికి నాకూ విడదీయరాని ఒక  అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ," స్వామియే నేను!" గా తలుచుకుంటూ  నేను మహదానందం పొంద వచ్చును,, కూడా!;! ఎందుకంటే, లక్ష్మీ రమణుని చూస్తూ మనసారా, తనివారా, కనులారా, బుద్ది తీరా నేను కానీ దర్శించి  ఉంటే , వేంకటేశ్వర స్వామి వారి రూపము ,విగ్రహము, అలంకరణ, ఆభరణాలు పుష్ప మాలలు, తులసీ గజ మాలలు, చతుర్భుజాలతో శంఖ చక్ర గదా పద్మాల తో  విరాజిల్లే మంగళకర సుందర ఆకారం హృదయం లో నెలకొల్ప బడి అద్భుత అపరిమిత ఆనందాన్ని నాకు ఇస్తూ ఉంటుంది ,!;, అంటే "నేను బ్రహ్మ" పదార్థాన్ని అయినట్టే కదా,!, అయితే అది అలాగే నిలుపుకుంటే పరమార్థం, అవుతుంది !; లేదా షరా మామూలే ,,! ఇది,, ఒక దేవుని విషయంలోనే కాదు, అన్నింటికీ అన్వయించి చూ డ వచ్చను,,!  మనం ,దేనిని చూస్తూ ఆనందం లేదా దుఖం అనుభూతి పొందుతామో,,, మనకు తెలియకుండానే, మనం ఆ స్వరూపం లోకి" పరకాయ ప్రవేశం"" చేసినట్టే కదా,! లేకపోతే మనం  ఆ అనుభూతిని పొందలేము! గుడిలో, దేవతా విగ్రహాన్ని చూస్తే అంతగా అనందం అనిపించదు,, నన్ను నేను మరిచి పోయేంత గా ,సంతోషం పైకి పొంగి రాదు ! కానీ  కొడుకు ,భార్య, కూతురు లాంటి ఆత్మీయులను చూస్తే మొహం అద్భుతంగా సంతోషం తో వెలిగిపోతూ ఉంటుంది కదా,! ఎందుకంటే ఆ బంధువు గురించిన రూపం , మధురభావం ,గుణాలు మనలో స్పందనలు, పుట్టించి ఆ వ్యక్తితో  అనుబంధం కలిగిస్తాయి,!, అంటే మన హృదయంలో ఆ బంధువు పూర్ణరూపం ప్రేమతో నింపుకుంటాము ,! అనగా "నేనే ఆ బంధువు గా "" అయిపోయి నట్లే కదా,!!   , భక్త మీరాబాయి కి ఎక్కడ ఏది చూసినా, ఎవరిని చూసినా ఆమె ప్రియతమ గిరిధారి, నేలమేఘ శ్యామ సుందరుడు, శ్రీకృష్ణుడు ఆమెకు గోచరిస్తు నే ఉన్నాడు, ఎందుకంటే హృదయం అనే  ఆమె "ప్రేమ మందిరం " లో భక్తజన హృదయ విహారి, శ్రీహరి,, గోపాలకృష్ణయ్య మోహన మురళీ నాదం  వినిపిస్తూ  ఆమెని సమ్మోహన పరుస్తూ నే ఉంది, అక్కడ మీరాబాయి తన అస్తిత్వం కోల్పోయింది, తనువూ మనసూ గిరిధర్ గోపా లుని ముగ్ధ మనోహర రూపంలో లీనమై పోయాయి, అతడే నేను, కృష్ణుడే నాలో ఉన్నది, నా మదిలో ఎదలో హృదయం లో ఏ ఇతర విషయాల కు స్థానం లేదు అన్నది మీరా యొక్క అద్భుతమైన అనిర్వచనీయ మైన, అనుభవైక వేద్యమైన, మధుర భావన!!; అందుకే తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగా అంటారు,, కొందరు !!! ఇద్దరు ప్రేమికులు ఇష్టపడి ప్రేమలో పడతారు, అనుకుందాం,, ఇక  ఇప్పుడు వారు , తాము,ఎక్కడో దూరంగా ఉంటూ కూడా ఒకరి కోసం మరొకరు పరితపిస్తూ ఉంటారు, !అంటే " ఇద్దరు" అన్న బేధం లేకుండా, ఇద్దరూ ఒకటే అయ్యి, "నేనే నీవు, నీవే నేను !"అన్నట్టుగా ఉంటుంది,, , కదా !!
ఎవరైనా  ఒకరి గురించి ఏమిరా బాబూ ? అది అంత బాగా లేదు కదా,! మరి నీకు ఎలా నచ్చింది రా, ??అంటే  దానికి ,ఒకటే సూటి జవాబు,!", నీకే మో గాని, నాకు మాత్రం చాలా అందంగా కనిపిస్తోంది, సుమా ! ఒకసారి , నీవు నా కళ్ళు పెట్టుకొని చూడు !! అంటా డు అతడు !!,, ఒకే సినిమాను , ఒకేసారి , ఒకే చోట ,ఎందరో చూస్తారు అయినా కూడా, ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు, కదా !! కారణం "చూసే చూపు "ను బట్టి ఉంటుంది, బావుందా! లేదా !!అన్నది,,,,,, శివాలయం లో శివలిం గాన్ని, నిత్యం  చూస్తూ ఉంటాం !!ఇంతే కదా,! అన్ని లింగాలు ఇలానే ఉంటాయి కదా, అనుకుం టూ ఉంటాం కూడా!!, దాని పరమార్థం తెలియకుండా , తత్వ చింతన చేయకుండా, శివ మహాత్మ్యం గుర్తించకుండా, దండం దర్శనం తో వెళ్ళిపోతూ ఉంటారు, ; అందుకే శివ తత్వం తెలిసి, శివాలయ దర్శనం చెయ్యాలి అంటారు పెద్దలు. !! కానీ శివలింగ ము అనేది , బ్రహ్మ విష్ణు శివ స్వరూపం,, ! అర్ధ నారీ శ్వర తత్వ స్వరూపం! సృష్టి స్థితి లయ కారక రూపం!త్రిగుణాత్మ కం!   ,, బ్రహ్మాండ నాయకుని స్థూల రూపం నుండి ఆవిర్భవించిన, శివకరం శుభకరం స్వయంభువు రూపం,!  ఆదియు , అంతము కానరాని పరమేశ్వరుని  లీలా స్వరూప స్వయం ప్రకాశ ఆవిర్భ వ స్వరూపం  !! అన్న జ్ఞానం తో భావించకుండా పోతే, బయట ఉన్న బండ రాయికి ,,ఆలయంలో ఉన్న ఈ నల్ల రాయికి  ఏ మాత్రం వ్యత్యాసం లేకుండా పోతుంది కదా,,! అంటే అంతగా ఘోరమైన భావ దారిద్య్రం తో  బాధ పడుతూ ఉన్నాం అనుకోవచ్చు !!, రాధా కృష్ణుల అన్యోన్యత,సీతారాములు,, లక్ష్మీ నారాయణుల , గౌరీ శంకరుల అనురాగం , ఇవన్నీ  "తత్వమసి !"" అనబడే అద్వైత తత్వ సంబంధాన్ని ,వారి మధ్య సూచిస్తూ ఉంటుంది,! మానవుల మధ్య ఉండబడే,", బంధాలు అనుబంధాలు "  ఉన్న బంధువులతో ,,"నేనే నీవు! నీవే నేను!"" అంటూ ప్రేమలు, ప్రాణం ఇచ్చు కునేంత గా  పెంచుకొనవచ్చును  !!కానీ ఎవరికీ ,ఎప్పుడూ  ,,ఏమీ కానీ ఆ ఈశ్వరునితో , ఏ రూపము, గుణము, స్వభావము కానరాని, వేదాలకు కూడా ఆగోచ రము,అనిర్వచనీయం , నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన స్వరూపముతో  ,,ఎలా నా తత్వం తో ముడి వేసుకొని, నాలో దాన్ని ఆపాదించి  అర్థం చేసుకోవాలి , ??"అజ్ఞాని" నైన నేను, "జ్ఞాన స్వరూపుడు, సర్వజ్ఞుడు, సాక్షి భూతుడు !""గా విరాజిల్లే ఆ ఈశ్వర తత్వాన్ని "నేనే '"అనుకోడం ఎలా సంభవం అవుతుంది,??, అతి సామాన్యుడను  నేనెక్కడ త్రిలోక మాన్యుడు, సర్వాంతర్యామి పరమాత్ముడు ఎక్కడ?? భావించ తరమా ఈ వింత బందుత్వాన్ని ?? రామకృష్ణ పరమహంస, కంచి చంద్రశేఖర పరమాచార్య, రమణ మహర్షుల వంటి మహాత్ములు అంతరంగం లో పరమాత్మతో రమిస్తూ, అనునిత్యం బ్రహ్మానంద స్థితిలో ఒడ లెరుగ క తన్మయావస్తలో పరమేశ్వర సన్నిద్యం లో ఆ ఈశ్వర తత్వాన్ని ఉపాసించి తాము ఈశ్వర తత్వాలై ,, పరమేశ్వర ప్రతిబింబాలు గా ప్రకాశించారు !! అన్నమయ్య ,,త్యాగయ్య, పోతన, రామదాసు , తులసీ దాసూ లాంటి ఎందరో భక్తులు, దైవాన్ని గురించి కీర్తనలు రాస్తూ పాడుతూ, ధ్యానిస్తూ భావిస్తూ , "మేము రాముని వారము,! రాముని బంటు లము "రామ దాసుల ము  ,,,!""అంటూ రాముని పట్ల" దాసభక్తి ""నీ ప్రకటించుకొన్నారు,! ధ్యానము ,యోగము, జపము  కూడా c అదే భక్తిమార్గం సూచిస్తాయి కదా,,! భగవద్గీత సారాంశం కూడా, ఇదే !!" ఎవరు నన్ను సదా సంపూర్ణ విశ్వాసంతో సేవిస్తూ ఉంటారో  ,పూజిస్తుంటా రో , ఆ భక్తులు నాలోనే  ఉంటారు.. !!అని,,. ,  ""మన్మనా భవ మద్భక్తో, మద్యాజీ మామ్ నమ స్కురు,,,,!"" అంటూ శ్రీకృష్ణ భగవానుడు, భక్తులకు, శరణాగత వత్సలత అనుగ్రహిస్తాడు,,! అందుచేత పరమాత్మ ను ధ్యానిస్తూ శరణాగతి భావంతో, అత్మ సమర్పణ చేస్తూ , ""స్వామీ,! నేను నీ వాడను, !నీకై, నీ దర్శన భాగ్యం కొరకై, కీర్తిస్తూ, నామ జపం చేస్తూ, పరితపిస్తూ నిరీక్షిస్తూ ఉన్నాను తండ్రీ !!, నన్నెలుకో నారాయణా,,! పరమేశ్వరా !అంటూ అనుదినం దేవదేవుని మదిలో నిలిపి మొరబెట్టు కుందాము !! ఆర్తి తో, ఆర్ద్రత తో ,ఆరాధనా భావంతో, సత్సంగ, సేవా దృక్పథంతో  కరునించమని స్వామి గురించిన తత్వ చింతన చేస్తూ , తగిన స్ఫూర్తిని శక్తిని ప్రసాదించమని,,ప్రార్టిద్దాం,, హరే కృష్ణ హరే కృష్ణా స్వస్తి !!!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...