Monday, September 9, 2019

వార్ధక్యమ్

Dallas, Sept 8, 2019
"వార్ధక్యమ్" అంటే భయ పడేవారు  నిజంగా పిరికివారు !! ! వారి జీవన శైలి నీ, ఆరోగ్యము, అలవాట్లను, సభ్యత సంస్కారాలను చూసి యువకు లంతా వెనక నుండి , "ఒరేయ్ !చూడ రా ,! అంత పెద్ద మనిషి, మనకంటే ఎంతో హుషారుగా చకచకా నడుస్తూ ఉన్నాడు కదా అంటూ , ఆశ్చర్యంతో చూస్తూ తాము అలా బలంగా ఉత్సాహంగా నడవలే నందుకు సిగ్గు పడాలి ,,, మేము ముసలివారం  అయి పోయాం ! ""అనే విషయం సత్యమే అయినా , శరీరం సహకరించకుండా ఉన్నా , ఉత్సాహంగా ఉండాలంటే, మనసును గట్టి చేసుకోవాలి,! అందుకు దైవభక్తి నీ  , సంగీత, సాహిత్యాలు, సంఘసేవ , లాంటివి ఆధారం చేసు కోవడం ఉత్తమమైన విధి !! "చేతకాదు!""అన్న విషయం మరచి ,,పడుచువారి వలె హుషారుగా ఉం డే విధంగా  తమ జీవన శైలి గా మార్చుకోవాలి! ఎందుకంటే  , మనకు ఉన్న శక్తి అంతా ఈ మనస్సు తోనే కదా !  అందుకే , అద్భుతమైన, అమోఘమైన  శక్తిని , మనకు  ఇస్తున్న, మన మనస్సు కు  ,ఏ మాత్రం  ఆ "పెద్దత నాన్ని  "కట్టపెట్ట రాదు. !! అందరూ  భయపడేది, ఒక్క  "చావు" కే  అంటారు !; కాని అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, కదా ! పరీక్షిత్తు మహారాజు కు ,వలె" వారం రోజుల్లో మృత్యువు వస్తుంది !"అంటే జాగ్రత్త పడటం లో అర్ధం ఉంది,! కానీ, ఎప్పుడో వచ్చే చావుకు ఇప్పటినుండి రోజూ చస్తూ బ్రతుకుతూ ఉండడం, మూర్ఖంగా ఉంటుంది కూడా !, అది మర్యాదగా ఉండదు కదా ! అందుకే ,  శవ యాత్ర చేస్తూ, స్మశానం లో కాలి పోతున్నా శవాలను ,, హడల గొట్టే స్మశాన వాతావరణం చూసి గానీ, భయపడ కుండా, నిర్భయంగా తమ ఇంటికి వచ్చి హుషారుగా తమ దైనందిన కార్యక్రమాలలో పాల్గొంటారు !!, కారణం ఎవరో పోతారు గానీ, తాము అందుకు మినహాయింపు గా భావిస్తూ ఉంటారు!! అలా భయం అంటే ఏమిటో తెలియని వారు,కూడా భయపడేది ఈ మలిదశ గురించి,!! రోగాలు, నొప్పులు బాధలు, కన్నీళ్లు,, పరాదీనం. కావడం అన్నీ ఇప్పుడే ! అందుకే  ,ఈ  ముసలి తనం గురించి మాత్రం భయపడని వారు ఒక్కరూ ఉండరు.! పండు ముసలి వాళ్ళను దర్శిస్తే చాలు, ఒళ్ళు జల్లు మంటుంది కదా !!. మా అమ్మ అంటుందేది,," వృద్దాప్యం పండ్లు లేని పులివంటిది "" అనీ,!! పులి  , తాను నోటి తో ఒడిసి పట్టిన జీవాన్ని నిదానంగా నములుతూ తింటూ ఉంటుంది,!  పెద్ద తనము అంతే,!, చిత్రమైన విషయం ఏమిటంటే, చేతగాకుండ ఉంటూ పడుతున్న దేహబాధ  కంటే,, తమ కళ్ల ముందు తమ పిల్లలు పడే కష్టాలు గానీ, నష్టాలు గానీ, తమను పోషించలేక, వారు అనే సూటి పోటీ  మాటలు, దగ్గర ఉండి సేవ చేయలేక , వారు పడే ప్రయాస , చూడలేక పోవడం ,, తమకు హాస్పిటల్ ఖర్చులు పెట్టలేక , ఇలా తమకోసం వారు పడే ఇబ్బందులు చూడలే కా ,, వారి ఒదుగు బోదుగు సంసారం లో ,ఉండి లేని అర్టిక సమస్యల తో , గొడవలతో , ఇల్లు నరకం చేస్తుంటే కూడా ,,ఎక్కువగా బాధ పడుతూ ఉంటారు ,,!!,,,,,
,,,, నాకు తెలిసిన ఒక పెద్దాయన, పక్షవాతం తో 4 సంవత్సరాలు మంచాన పడివుంటే , వెన్నులో పుండు తో బహు బాధతో బ్రతికి ఉండగా చావును కళ్ళ చూశాడు .! చివరికి మాట కూడా పోయింది,! దయనీయమైన ఆ స్థితి లో, కొడుకులు ఒప్పికగా, ఇంట్లోనే తండ్రికీ చికిత్స చేస్తూ ప్రేమతో సేవించారు,! మరొక వృద్దుడు అదే పక్షవాతం తో నాలుగేళ్లు గా మంచాన పడి ఉంటూ, కొడుకులచే చూడబడుతు దిన మొక యుగం గా భారంగా, అంపశయ్య పై భీష్ముని లా ఇంకా  కాలం గడుపుతున్నాడు ,!,,, అందుకే ,"" సునాయాసేన మరణం,! వినా దైన్యే న జీవితం ! ""అని పెద్దలు చెబుతూ ఉంటారు, అంటే,,"" బ్రతిినన్నాళ్ళు, ఎవరి మోతాదు లేకుండా బ్రతుకుతూ,, ఎవరికీ భారం కాకుండా, బాధ పెట్టకుండా, మంచం లో పడకుండా సునాయాసంగా మరణించడం కావాలి !!, ఈ రెండు వరాలను అనుగ్రహించు పరమాత్మా !""అంటూ మనం , నిత్యం దైవాన్ని నమ్మి, భక్తి తో, కోరుకోవాలి ,,,, అంటారు విజ్ఞులు
,,,,, ఇలా చావలేక, బ్రతకలేక , డాక్టర్ లు కూడా చేతులెత్తేశాక ,,, దీర్ఘ రోగాలతో , వృద్దాప్యం లో  చూసే దిక్కు లేక, నా అన్న వారు లేక క్షోభ పడుతూ , నరకయాతన పడే వారి చావు కోసం ఎదురుచూసే వారు ఎందరో మనకు కనబడుతారు , కదా !, కానీ, ఏం చేద్దాం, ?? జననం గానీ, మరణం గానీ మన చేతుల్లో లేవు కదా! ఆ మాట కోస్తే, ఏదీ మన చేతుల్లో లేదు కూడా !,,,,,,
,, ఇలాంటి ప్రేమ గల కొడుకులకు నోచుకోని వృద్ధులైన తండ్రులు, తల్లులు అనాధా శ్రమాల పాలౌతు ఉన్నారు, కదా!!,,,,,,
,
భారతం లో యుద్దం ముగిశాక ధృతరాష్ట్రునికి  విదురుడు అంటాడు, ""చేతులారా కన్న కొడు కులను లేకుండా చేసుకున్నావు,; నీకు తద్దినం పెట్టే దిక్కు కూడా కరువైంది,! ఎన్ని రోజులు ఇలా దాయాదుల పంచన    అనాధగా పడి ఉంటావ య్యా !, నా సలహా విను,!ఇప్పుడైనా , "వానప్రస్తాశ్రమం "వెళ్లు,! కనీసం ఇప్పుడైనా శేష జీవితం హరి నామ స్మరణ చేస్తూ దూరంగా అడవిలో  గడుపు!, నీకు శాంతి లభిస్తుంది,, అనీ,!!
,,, , అందుకే వృద్దాప్యం లో పిల్లలకు దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు వారికి భారం కాకుండా, మాట పడకుండా, ఉండడం తలిదండ్రుల కు ఉత్తమ కర్తవ్యం  అవుతుంది ఈ రోజుల్లో !,,
, కూతుళ్ల కు, కొడుకులకు పెళ్లి అయ్యాక వాళ్ళను స్నేహితులు గా భావిస్తూ , స్వతంత్రంగా విడిచి పెట్టాలి, అలా, మనం ,వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చెయ్యాలి,!, పెద్ద వారు తమ కోసం ఆలోచిస్తూ , జీవించ డం ప్రారంభించాలి ,,,,,,
,, తాము తమ వృత్తిలో నేర్చిన  అనుభవాలను సమాజం లో,, అమలు చేస్తూ ఉండాలి  ,,!కనీసం ఇప్పుడైనా "ఇహం "విడిచి  "పరం "గురించి శ్రద్ధ చూపుతూ," రామా కృష్ణా" అంటూ  ఎవరూ వేలెత్తి చూపకుండా హుందాగా ,హాయిగా అనందంగా, ప్రశాంతంగా, శేష జీవితం గడపాలి,! నలుగురికి సహాయపడటం, ఆ నలుగురి తో  మాట్లాడటం, నాలుగు పుస్తకాలు చదవడం, నాలుగు ప్రదేశాలు తిరుగుతూ  జీవించడం అంటే ఏమిటీ,? ఎవరి కోసం ?ఎందు కోసం జీవించాలి  అన్న ప్రశ్నలకు సమాధానాలు తామే చెప్పగలగాలి,!!,
,, అందుకు భగవద్గీత లాంటి సద్గ్రందాలను ,, సర్వేపల్లి గారు రచించిన గీతా రహస్యం,రమణ మహర్షి గారి అత్మ బోధ , నేనంటే ఎవరూ ??  జగద్గురువు శంకరాచార్యులు ఉపదేశించిన భజగోవిందం నిర్వాణ షట్కమ్, లాంటి  ఆధ్యాత్మిక విషయాలను చదువుతూ, ఒక లైబ్రరీ ఇంట్లో ఏర్పాటు చెయ్యాలి, దైవ భజన దేవాలయ దర్శనం, వ్యాయామం, సాత్విక భోజనం, సత్సంగం, ఎటువెళ్ళినా జీవిత భాగస్వామి తో  వెళ్ళడం చేస్తూ ఉండాలి . అవసరం గా ఉంటేనే పిల్లలు , గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో  ఉన్నత భావాలతో , ఆదర్శమైన వ్యక్తిత్వంతో, నేటి తరానికి మార్గదర్శి లా తెలివిగా ,,నిరాడంబరంగా తోచింది చెబుతూ, ఇవ్వగలిగిన ది దానం చేస్తూ చేయగలిగిన సహాయం మాట లేదా చేత లేదా వస్తు ధన రూపంలో చేస్తూ పరోపకార బుద్ది తో ఇరుగూ పొరుగూ వారితో సఖ్యంగా, వారి అవసరాలకు సహకరిస్తూ బ్రతకడం ,మనిషి గా జన్మ సార్థకం అవుతుంది,,,,
,,, బీపీ లు సుగర్, లాంటి వ్యాధులు ఉన్నా మనసును నియంత్రిస్తూ, క్రమశిక్షణ చర్యల ను పాటిస్తూ, ఉన్న సమయాన్ని  సద్వినియోగం చేసుకోవాలి, !!""అయ్యో!  వయసులో ఉండగా, ఈ పనులు  చేయలేక పోయాం కదా , !!""అని బాధ వద్దు,,,! తృప్తి గా ఉండాలి,, ! అది తరగని మూల ధనం !!మంచి పని అంటూ ఏదైనా కనిపిస్తే, వెంటనే ఆలస్యం చేయకుండా చెయ్యాలి,,!! " చేద్దాం లే !""అన్న అలసత్వం  ,  మనిషికి నిజమైన బద్ద  శత్రువు కూడా,,,!",,
,, ,." నేను పెద్దవాడిని అయిపోయాను,! నాకు ఈ పని  చేత కాదు, !""అనే బలహీనత చేతల్లో గానీ, మాటల్లో గానీ రానీయ వద్దు,!   ముఖ్యంగా, పెద్ద తనం లో , తమ  నాలుకను పూర్తిగా  అదుపులో పెట్టుకోవాలి,!!""వస్తున్నాడురా బాబు,! ముసలాయన !! దొరికితే సుత్తి కొట్టి చంపేస్తాడు, బాబోయ్ !"" అంటూ మనల్ని చూస్తేనే జనం దూరంగా పారిపోయే దుస్తితి తెచ్చుకోవ ద్దు,,! తుది శ్వాస విడి చే సమయం లో "అయ్యో  !", మనం మానవత్వం గల ఒక మంచి వ్యక్తిని కోల్పో తున్నాం కదా !""అని కన్నీరు కారుస్తూ ఏడ్చే ఆత్మీయులను , అత్మ బంధువులను మనం బ్రతికి వుండగానే  మన చుట్టూ ఓపికతో, ప్రేమతో ,, స్నేహం చేస్తూ ఏర్పాటు చేసుకుందాం,!",.,,, జీవితం అంటే సంపద అస్తి, డబ్బు, బందు బలగం ఉండడం కాదు,, అందరితో ప్రేమ గా ఉంటూ గడిపే మధురానుభూతి యే జీవితం !!!,,,,," నమ్మకం, ఓపిక ""ఇవి రెండూ ఉంటే చాలు!,  జీవితంలో ,ఏదీ  అసాధ్యం అంటూ లేనే లేదు కదా !!"ఇలా  positive thinking తో  నవ్వుతూ  బ్రతుకు దాము, !అదే సిద్దాంతం తో  నలుగురినీ బ్రతికించు కుం దాము !!,,
,,, జీవించి ఉండగా ""అందరూ నా వారే!"అన్న తృప్తి తో  ఉంటూ,, పోయేటపుడు మాత్రం"" ఏదీ, నాది కాదు,,! ఇన్ని ఇచ్చిన ఆ  ఒక్క ఆ  దైవం తప్ప !"" భగవాన్ ! తండ్రీ ! నీకు కృతజ్ఞతలు స్వామీ ! నారాయణా !!"""అన్న భావ సంపదతో వృద్ధాప్యాన్ని ఆనందంగా, సంతృప్తి సంతోషంగా , చేసుకుందాం,,!", ,,
,,, అమూల్యమైన సమయాన్ని, ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సద్భావన, సత్సంగం, సచ్చరిత్ర తో సన్మార్గం లో పయనిస్తూ జన్మ సార్థకం చేసుకుందాం ! హరే కృష్ణ హరే కృష్ణా !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...