Friday, November 15, 2019

చిలిపి కృష్ణా

Nov 13, 2019 Karimnagar
ఎంత మోసగాడివయ్యా కృష్ణ మూరితి,, నీవు ఎందుకయ్యా వచ్చావు కృష్ణ మూరితీ ,, అని గోపికలు అడిగితే ,, కొంటె కృష్ణుడు , గుమ్మ పాలు తాగి పోను వచ్చి నాను,, గోపెమ్మలతో ఆడుకో ను వచ్చినాను ! అంటూ నల్లనయ్య  ఇచ్చే చిలిపి  జవాబు ఎంత రసవత్తరంగా సాగుతుంది
,, కృష్ణా!!, నీవు ఎంత గడుసు వాడివి కాకపోతే, నిన్ను ఏ మాత్రం స్మరించినా విడవకుండా గట్టిగా పట్టుకుంటావ్   ,!, గోవిందా, !ఎప్పుడైనా,, ఎక్కడైనా నీ పంత మే నెగ్గించు కుంటావ్ కదా, కన్నా !! కృష్ణా! యదు నందనా !మధుసూదనా ! ఈ సరసాలు , సరదాలు, వినోదాలు, బృందావన విహారాలు, రాసలీల వైభవాల పాత్ర పోషణ నంద యశోద ల ప్రాంగణం లోనే కదా !!
దీనికి పూర్తిగా భిన్నం,, నీ వ్యవహారం, నీ రాజకీయం, దుష్ట సంహారం శిష్ట రక్షణ సంకల్పం. ! ఎన్ని పాత్రలు చిత్రంగా నాటకీయంగా పోషించి ""నేను మహావిష్ణువును !"అని ప్రకటించినా తెలుసుకోలేని మూర్ఖ శిఖామణు ల అజ్ఞానం , చూస్తే మాకు ఆశ్చర్యం గా తోస్తుంది సుమా శ్రీధరా ! మురళీ ధరా ! రాధా రమణా !!
ఆనాడు ,అర్జునుడు,""నేను యుద్దం చేయను బావా, , ఈ నెత్తురు కూడు మాకు అక్కర లేదు, మొర్రో ! అంటూ మొత్తుకున్నా కూడా ,, పట్టు బట్టి అతడి కి, గీతోపదేశం చేసి,, కర్తవ్యాన్ని ఉపదేశించి,,, ఒప్పించి , పని , ఫలితం ,భారం ,బాధ్యతా  ,, అన్నీ  నెత్తి మీద వేసుకొని అతడితో  ఘోర భారత సమరాన్ని చేయించి,,18 అక్షౌహిణుల సైన్యం తో బాటు వేలాది,ఏనుగులు ,గుర్రాలు, మొదలగు మూగ ప్రాణుల ను కూడా బలి చేయించావు కదా గోపాలా ,!! ఇంత చేసి,,
చివరకు పాండవులకు నీవు కట్టబెట్టింది ఏమిటీ చెప్పు ముకుందా ?? అదే నెత్తురు కూడే కదా స్వామీ ,,!
కానీ ఒక్కటి మాత్రం నిజం,పార్థ సారథి,!!
,,, ఒక అబలను నిండు సభలో  వివస్త్రను చేయ బూనడం  ఏ సమాజం లో అయినా, ఏ యుగం లో కానీ , ఎలాంటి సంకట పరిస్తితి లో నైనా  ఏ ధర్మ శాస్త్రం , మానవత్వం సమ్మతించదు ,,కదా ! అందువలన కృష్ణా !, నీవు చేసింది న్యాయం ,,ధర్మం ,!
నందనందనా !, నీవు గానీ సమయానికి  ఆమెను రక్షించ కుండా పోతే, ఎంత దారుణం జరిగేది, మాధవా! ఒక్క భీమునికి మాత్రమే కోపంవచ్చి , దౌర్జన్యం చేసే దుర్యోధన దుశ్శాస నుల వదిస్తానని ప్రతిన చేశాడు రోషంతో,,! కానీ, సభలో జరిగే ఘోరాన్ని చోద్యం గా చూస్తున్న ఆ మిగతా వీరులకు ఎందుకు కోపం రాలేదో ?? నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు, నంద కిషో రా !
,,జగన్నాటక సూత్రధారి వి,! నటనా గ్రేసర చక్రవర్తి వి,, అగ్రహా నుగ్రహ సమర్తుడివి!!
ఎంత దయామయుడ వయ్యా నారాయణా,!
ఎలా సహిస్తూ ఉన్నవయ్యా,, ఈ మనుషులు చేసే ఈ  అరాచకాలు ,,అమానుష కృత్యాలు??
అయినా , ప్రతీ అకృత్యం అణచడానికి  స్వయంగా రావాలా ?? నీ కను సన్నల తో విశ్వాన్ని నియంత్రిస్తూ ఉంటావు,,
ఈ మానవాధ ములు సాగించే అధర్మాలను ఆపడానికి పంచభూతాలు చాలవా పురాణ పురుషా !!  తుఫాను భీభత్సం, అగ్ని కంపం, జల గుండాలు విద్యుత్ ప్రకంపనలు ,, వర్షాలు, హిమ పా తాలు , ఇవన్నీ నీవు మా దుర్యోధన దుశ్శాసన దుష్కృత్యాలను నిరోధించడానికి మాకు నీవు  విధించే  శిక్షలే కదా ,!!
""బొమ్మను చేసి, ప్రాణము పోసీ ఆడేవు, నీకిది వేడు కా ! గారడి చేసి, గుండెను కోసి, నవ్వేవు !
,,,", నీవేమి టో, నేనేమిటో కొంచం కొంచం గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం , గోపీ వల్లభా !, రాధా మనోహర,,!
ఏమిటయ్యా ఈ లీల ?
పుట్టించేది నీవే, చంపేది, చంపించే ది నీవే ,! ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను,
పాపం !
పాపం ,, ఉప్పు తిన్న పాపానికి, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్ట లేక,, దుష్ట చతుష్టయం  పక్షం వహించి పోరాడిన, భీష్మ ద్రోణ కర్ణ శ ల్యా ది మహా వీరులు ,మహాత్ములు కూడా నీ క్రోధాగ్ని జ్వాలలో మసియై పోయారు గదా ముకుందా,,.!!
శరణం అంటే రక్షణ, కాదు అంటే శిక్షణ అనబడే నీ అసిధారా వ్రతం వలె నిరుపమాన ము , అయినది కదా!!,
ధర్మాన్ని రక్షించడానికి   ""ఎంత బలవంతుల నైనా ఎదిరించాలి ""అనే అద్భుత సూత్రాన్ని మాకు అందించావు కేశవా,!!
""అన్యాయం చేసిన వారితో జత కలిసిన వారు కూడా దండనానికి బాద్యులే ""అన్న నైతికత ను ప్రకటించా వు, అచ్యు తా ,,
దీనికి భిన్నంగా నీ బాల్య లీలలు , ఉన్నాయి!! సుమధురంగా ,సుమనోహరంగ  , చిత్ర విచిత్ర సమ్మోహన కరంగా గోపీ గోపా లుర తో రమణీయంగా, కమనీయంగా వినోదించావు గదా,, కన్నయ్యా,!
""నన్ను కన్నయ్యా నన్ను కనవయ్యా,, సుస్థిర ముగ నిను నమ్మితి నయ్యా !"" అంటూ లాలించి, చను బాలు ఇచ్చి, పెంచి పోషించిన యశోద మాతను కరుణించావు,! శరణాగతి చేసి సర్వము అర్పించిన గోపికల కు రాసలీల రసజ్ఞత ను అందించా వుగదా , రాధా మాధవ!!
""నీవే నేను, నేనే నీవు"" గా భావించి న, నీప్రేమ సామ్రాజ్య పట్ట పు రాణి అద్వైతామృత వర్షిణి , అపర దేవతా సామ్రాజ్ఞి, రాధా దేవి అనురాగ అనుబంధం తో బృందావన సంచారి యై, వేణుగానం తో ప్రకృతిని, సకల ప్రాణి కోటిని జగన్మోహన ముగా పారవశ్యం లో పులకరింప జేశావు గదా కృష్ణా ! అంతులేని ఆనందాంభుదిలో ఒలలాడించావు గదా దీన శరణ్య,!!
ఏమని పోగడే ము నీ విశ్వ రూప విన్యాసాలు,?? తండ్రీ!! ఒకచోట శృంగారము, ఒక చోట గంభీర ము, ఒకచోట రాక్షస సంహారం, ఒకచోట భక్త జన సంరక్షణ, ఒక చోట విశ్వ రూపము,,!!
లీలా మానుష వేష దారీ,,! మురారీ,,! మునిజన హృదయ విహారి,! నీ  మధుర చరితను
ఇంతని వర్ణించలేము,! ఎంతగా కూడా పోగడలేము,! జనార్దనా,! జగన్నాథ,! జగదీశ్వర ,, !రవ్వంత నైనా ఊహించలేని నీ సుందర సుకుమార రూప లావణ్య వైభవ దివ్య మంగళ కృష్ణ లీలలను అనుభవించి, ఆస్వాదించి ,,అనందించి ఆరాధించే ,సదవకాశాన్ని యోగ్యతను , శక్తిని స్ఫూర్తిని , అర్ద్రతను, అవకాశాన్ని   దయతో మాకు అనుగ్రహించు ప్రభో.! కారుణ్య సిం దొ,,! దీనబందొ,, శరణు !నవనీత చోరా, శరణు,! దేవకీ సుతా, శరణు,! వాసుదేవ తనయా శరణు !
గోపాలకృష్ణ శరణు! గీతాచార్యు డా , శరణు!!
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...