Wednesday, November 6, 2019

శరణు నియమాలు

Nov 23, 2015   
        మనం  భగవంతునికి శరణు వేడుకోడానికి    ఆరు నియమాలు ఉన్నాయి -
                        1- భగవంతుని శాసనం -మేరకు  మన పనులు -కర్మలు పరిమితం కావాలి  !--మనం ఆయన సేవకులం మాత్రమే --ఆయన మనకు ప్రభువు !-సేవకుని  విధి యజమాని ఆజ్ఞలను పాటించడమే !- కష్టం అయినా -సుఖం అయినా - భగవంతుని లీలగా -అనుగ్రహంగా -ప్రసాదంగా స్వీకరించడం చేయాలి  - ఒక ఎండిన ఆకు గాలి వీచడం వలన క్రింద పడినా -తనను తిరిగి చెట్టు కొమ్మ పైకి చేర్చ మని అడగదు - అలాగే భగవంతుని విధివిధానంలో ఎలా  జరిగినా సంతోషం -సంతృప్తి పొందాలి ! శరణు కోరడం అంటే ఇదే !
                         2--భగవంతుడు ఇచ్చిన దానితో మనం  త్రుప్తి పడాలి -అది  మన పూర్వ జన్మల కర్మల ఫలితంగా భావించాలి  --ఎంత ఇవ్వాలో-ఎప్పుడు -ఎలా ఇవ్వాలో అతడికి తెలుసు -మనకున్న సంపద -ఐశ్వర్యం -కేర్తి వినోదం -సుఖాలు భగవద్ అనుగ్రహాలు -అది గుర్తించ కుండా ఏ  కొంచెం కష్టం కలిగినా "-నాకే  ఈ కష్టం భగవంతుడు ఎందుకు కలిగించాలి ?"అని నిందిస్తూ ఉంటారు -జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు సంభవించినా  భగవంతున్ని తప్పు పట్టడం -మనం చేసే మరొక తప్పు 1 అతని ప్రేమ అందరికి సమానమే !అందరు అతని పిల్లలే -అందులో హెచ్చు తగ్గులు  ఏ కన్నతండ్రి అయినా  చూపిస్తాడా ! అలా భావించి పరమాత్ముని మనసారా  శరణు వేడాలి 1
                      3- మనలను అన్ని విపత్తులలో రక్షిస్తాడని -భగవంతుని పై నమ్మకం లేకపోవడం  -మన  యుక్తులే మనకు రక్షణ అనుకోవడం మన అజ్ఞానం !-పరిజ్ఞానం లేకపోవడం  దురదృష్టం  ! అతడు మనకు శాశ్వతంగా జన్మ జన్మలకు  తండ్రి! -ఈ సృష్టిలో సకల జీవరాసులను   సదా  సంరక్షిస్తుంటాడు -కోట్ల కొలది చీమలకు  ఆహారం అవసరం -- అందులో  వేల చీమలు ఆహారం లేకుండా చనిపోతూ  ఉండటం మనం గమనించామా !అలాగే ఏనుగులకు పెద్ద మొత్తంలో ఆహారం తింటాయి ప్రతి రోజు -వాటికి కూడా  భగవంతుడు  తగిన విధంగా సమకూరుస్తాడు -ఒక తండ్రి  తమ సంతానాన్ని ఎంతో  ప్రయాసపడి  వారికి కూడు -గుడ్డా -గూడు - సమకూర్చి పోషిస్తాడు-కదా !జగత్తును శాసించే వాడు -పాలించేవాడు  తన బిడ్డలను పోషించకుండా ఉంటాడా !అతని రక్షణలో మనం సురక్షితంగా ఉండగలమని  విశ్వాసం కలిగి ఉండటం కూడా  శరణాగతి అవుతుంది  
                       4- కన్నతండ్రి పట్ల కుమారునికి వినయ విధేయతలు ఉండాలి -అలా కాకుండా -"అతని తండ్రి అతన్ని పోషించాడు -అలాగే నన్ను మా తండ్రి పోషించాలి -"అని కృతజ్ఞతా  భావం లేకుండా ఉండటం -తప్పు కదా ! అలాగే  -జగద్రక్షకుడు - పోషణ కర్త -పరమాత్మునికి మనం కృతజ్ఞత చూపక పోవడం  కూడా  అజ్ఞానం -అవివేకం -అపరాధం అవుతుంది 1  కర్త -కర్మ క్రియ అన్నీ నీవే స్వామీ 1అన్న  భావంతో శరణు కోరాలి 1
                       5-మన  సంపద బంధువులు వనరులు -అన్నీ మనకు భగవంతుడు అనుగ్రహించినవే -మనం జన్మించడానికి ముందు ఉన్నాయి -చనిపోయిన తర్వాత కూడా  ఉంటాయి -అందువల్ల అన్నింటికీ నిజమైన యజమాని భగవంతుడు మాత్రమే- అందులో కొన్ని మనవి అనుకుంటే  తప్పు !-ఇతరుల ఇంటిలో జొరబడి  అతని అనుమతి లేకుండా -అతని దుస్తులు -ఆహారం- పడక వాడుకోవడం లాంటిద్  ఇవన్నీ మనవి అనుకోవడం 1అందుచేత  జగత్తులో ఉన్నప్రతీదీ  భగవంతుని వస్తువే అనుకోవడం -అలా భావించడం కూడా  శరణా గతి 1
                         6-మనం చసిన మంచి పనులకు మనం కర్తలమని గర్వించడం -కూడా  తప్పే !"-భగవంతుని దయవలన ఆ పని చక్కగా జరిగింది  -లేకపోతే నేను చేయగలిగే వాడిని కాదు !"-అని అనడంలో నిజమైన గొప్పదనం ఉంటుంది - అతడి  మనం ఒక పరికరాలం  మాత్రమే !- శివుని ఆజ్ఞలేనిదీ  చీమ అయినా కుట్టదు -అలాగే మనం చేసే  కర్మలు అతని ప్రేరణ వలన జరుగుతాయి అంతే కాని --"నేను చేశాను !- నా వల్లే ఇది జరిగింది! - నేను గొప్పవాడిని !"- - ఇలాంటి భావాలు  అహంకారాన్ని -అహం పెంచుతాయి -ఫలితంగా భగవంతుని దయకు -కరుణకు -దూరం అవుతాం -
                " అన్యధా  శరణం నాస్తి ! త్వమేవ  శరణం మమ ! తస్మాత్ కారుణ్య భావేన  రక్ష -రక్ష- పరమేశ్వర ! " అంటూ మన విధిని మనం సక్రమంగా  నిర్వహిస్తూ  ఫలితాన్ని ఆశించకుండా  పరమేశ్వరార్పణం గా  చేస్తూ నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ  సాగి పోవడమే  జన్మకు సార్థకత -ఇదే నిజమైన సిసలైన శరణాగతి !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...