Sunday, November 24, 2019

తులసీ దాస్

Nov 21, 2019 Karimnagar
తులసీ దాస్ గారు, శ్రీరామ చంద్రుని అపర భక్త శిఖామణి,,!! ఆయన తనదైన ప్రత్యేక శైలిలో "రామ చరిత మానసము""అనే  గ్రంథాన్ని రచించాడు,
ఒక భక్తుడు వారిని సమీపించి, అడిగాడు,
""స్వామీ,,! వాల్మీకి మహర్షి , ఆధ్యాత్మిక, ఆనంద, అద్భుత రామాయణం రచించి, శ్రీ రామ ప్రభువు చరితం జగద్విఖ్యాతం చేశాడు కదా, !!
,,మరి మీరు "" రామ చరిత మానస,"" అనే మరొక రామాయణ గ్రంథాన్ని రచించారు,,
,, మరి ,,ఈ రెండు రామాయణ గ్రంథాల లో ఏదైనా బేధం ఉందా,?? ఉంటే దయచేసి  నాకు చెప్పండి స్వామీ ,!!"" అంటూ తన సందేహానివృత్తి కోసం తులసీదాసు ను వినయంగా అడిగాడు ,
ఆయన అన్నాడు,, నవ్వుతూ,,
""నాయనా! వాల్మీకి మహర్షి రాసిన"" శ్రీ మద్రామాయణం ,"" అంటే అర్థం ""రామ, ఆయనం" అంటే ""రాముని ఇల్లు,"" అనగా"" శ్రీరామ మందిరం,""అన్నమాట!!
అందులో ప్రవేశిం చి,రామ దర్శనం చేయాలంటే,, కావాల్సిన యోగ్యత భక్తునికి  ఉండాలి కదా,!!
అందుకోసం, "నేను రామ చరిత మానస ""అనే గ్రంథాన్ని  రాశాను ,
దీని అర్థం "మానస సరోవరం""ఈ మానస సరోవరం అనే సరస్సు హిమాలయాలలో ఉండే అతి పవిత్రమైన జలాశయం, ఇందులో నిత్యం సకల దేవతలు స్నానమాచరిస్తే.  సకల పాపాలు దహింపబడి, మనసు శరీరం శుద్ది అవుతాయి,,
, ,, ఇంతటి పవిత్రమైన సరస్సులో మునక లిడి న వారి మనసు అనందం తో ప్రశాంత చిత్తంతో, చెదరని దైవభక్తి  మాధుర్యం తో తన్మయత్వం పొందుతూ ఉంటారు.!
""రామ చరిత మానస ""అనబడే మానస సరోవరం లో స్నానం చేయడం అంటే, నిరంతరం రామ నామాన్ని జపిస్తూ ఉండడమే ,!!
అది కూడా మనసా వాచా కర్మణా ,,,"రామ్ ,రామ్, రామ్"" అంటూ తదేక ధ్యాన చిత్తం తో పాడుతూ, భక్తి శ్రద్ధలతో ,రామ భజన చేస్తూ ఉంటే, మానసిక శారీరిక అనందం తో, రెండూ కూడా  పరిశుభ్రం అవుతాయి
, అప్పుడు ఆ రామ భక్తునికి  ఆ "రామాలయం"" లో ప్రవేశించి , వాల్మీకి మహర్షి విరచిత మైన రామాయణం  చదివే యోగ్యత సిద్దిస్తూ ఉంటుంది,
అంటూ నిరంతర రామ నామ గాన మాధుర్యాన్ని,, దాని ప్రభావాన్ని, అద్భుతాన్ని, తద్వారా రామ భక్తుడు పొందే  పరమానందాన్ని  వివరించాడు తులసీదాసు గారు.!!
దైవానుగ్రహము పొందాలంటే, వ్యక్తికి చిత్తశుద్ది అవసరం ,! జీవితంలో  ఎన్ని అవాంతరాలు ఎదురై నా, చలించని దృఢమైన చిత్తవృత్తి కలగాలంటే, శ్రీరామ చంద్రుని భక్తితో, శరణాగతి చేస్తూ, స్వామిపాదాల ను ఆశ్రయించాలి,!!
ఈ కలియుగం లో "హరి భజన"" కు మించిన యాగం ,యజ్ఞం , హోమజపాదు లు,, జీవిత పరమార్ధం లేవు,
ఏ పూజలు ,అర్చనలు, అభిషేకాలు కూడా అఖండ హరి నామ సంకీర్తన కు సాటిరావు,!!
ఉత్తర భారత దేశం లో తులసీదాసు గారు రచించిన" రామ చరిత మానస ""గ్రంథం ను అత్యంత భక్తి శ్రద్ధలతో అనుదినం సామూహికంగా, సభలలో ,సత్సంగం లో, పురాణాల్లో, ప్రతీ ఇంటిలో నూ గానం చేస్తూ పరవశిస్తూ, తరిస్తు  ఉంటారు,
అన్నింటికీ "మనసే ప్రధానం,"" పవిత్ర హృదయంతో మనం సమర్పించే   నీరు, తులసీ పత్రం, పుష్పాలను స్వామి ఆనందంగా స్వీకరిస్తాడు ,!
మానసిక ప్రశాంతత, కేవలం హరి భజన తో మాత్రమే సిద్ధిస్తుంది కదా,,!
మహాత్ముడు  తులసీదాసు గారి ""శరణాగతి ,, రామ భక్తి,, తాను నమ్మిన దైవం పై అనురక్తి ""అంత గొప్పవి ,!
అందుకే, నిత్య కృత్యాలలో ""శ్రీ రామ్ జయరామ్ జయ జయ రామ్ ""అంటూ  స్మరించి తరించు దాం!
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ !!
హరే కృష్ణ హరే కృష్ణా !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...