Wednesday, November 6, 2019

"కానుక "

   Oct 1, 2016 Karimnagar
"ఇప్పుడు అనుకుంటే ఏం  లాభం ?--
 "చేతులు కాలాక ఆకులు' పట్టుకున్నట్లు 
వేళ్ళు వణికి -నీటీగ్లాస్ పట్టుకోలేనప్పుడు --
మోకాళ్ళలో నొప్పితో నడక భారం  అయినప్పుడు -
మెడలో - నడుములో నొప్పితో బాధ పడుతున్నప్పుడు  --
మతి మెరుపుతో -జ్ఞాపకాలు మరుగున పడుతున్నప్పుడు -
కళ్ళధ్ధాలు లేకుండా -అడుగుకూడా  వేయలేనప్పుడు --
తాతగారూ - పెధ్ధాయనా -అన్న పిలుపే తప్ప -
అసలు పేరు  ఎక్కడా వినపడనప్పుడు --
కన్నవాళ్ళు ఫోన్ చేస్తేకూడా  -వినే  ఓపిక లేనప్పుడు -
అయినవారి నుండి ఆదరణ ప్రేమ కరువైనపుడు 
చిత్త్త చాంచల్యం తో -దేవుని పై మనసు నిలవనపుడు - -
   అది చేయలేదని - ఇది చేస్తే బావుండేదని -
అలా ఎందుకు చేయలేక పోయానే -అని గాని -
ఎంత కుమిలితే మాత్రం  ఏం  లాభం --
అందుకే  దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టాలి -
వయసులో ఉన్నప్పుడే -మంచి పనులు చేయాలి -
పదిమంది చెప్పుకునేలా  వ్యక్తిత్వం ఏర్పడాలి -
ఎంజాయ్ చేయడం కాదు -సంతోషంగా బ్రతకాలి 
నవ్వుతు నవ్విస్తూ తృప్తిగా జీవించాలి -
మనిషిగా ఎదగాలి - ఇహపరాలు రెండు సాధించాలి 
నిజాయితీతో  -పరోపకారభావం తో మంచిని పంచాలి -
నలుగురికి ఆదర్శంగా-మార్గదర్శిగా మెదలాలి -
 "మనిషిగా "అందరిలో పరమాత్మ ను దర్శించాలి -
 ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకుండా -
మానవజన్మను సార్ధకం చేసుకోవాలి --
ఇన్నిఇఛ్చిన దైవానికి  -సమర్పించే" కానుక" ఇదే !
  

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...