Nov 22, 2019 Karimnagar
పురాణం మహేశ్వర శర్మ గారు నిన్నటి రోజున మస్త్య పురాణ ప్రవచనం సందర్భంగా హరి హరుల మద్య భేదాన్ని ఇన్ని పురాణాలు వింటున్నా ఇంకా పాటిస్తూ ఉండటం చూస్తుంటే బాధాకరం గా ఉందని అన్నారు
వారు ఒకసారి బృందావనం లో వివిధ దేవాలయాలు తిరిగి చూస్తూ దర్శిస్తూ ఉండగా, ఒక శివాలయం లో ఒక అద్భుత దృశ్యాన్ని చూశామని చెప్పారు,
కొందరు కృష్ణ భక్తులు శివలింగానికి చుట్టూ కూర్చొని ప్రాణ వట్టాన్ని తమ చేతులతో అత్యంత సున్నితంగా మృదువుగా ఒత్తుతూ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అంటూ ఉచ్చరిస్తు ఉన్నారట,
శివ లింగం హరుడు అయితే, లింగానికి చుట్టూ అవరించిన భాగం ప్రాణ వట్టం హరి అని ఆ భక్తుల భావన
ఇలా హరునిలో హరి నీ, హరి లో హరున్నీ దర్శించ డం సామాన్య విషయం కాదు, తమ ఆరాధ్య దైవాన్ని ఈ విధంగా ఏ దేవతా మూర్తిని చూసినా కూడా దానిలో దర్శించ గలిగె భావ సంపద ఉండడం చిత్త ప్రవృత్తి నీ సూచిస్తోంది,
జ్ఞానం పండింది,, ఒక కాయ తనకు తానుగా పండి, మధురమైన తియ్యదనం తో ,చెట్టు నుండి విడివడి , సంపూర్ణ పరిపక్వ దశలో స్వతంత్రంగా శోభిస్తు , చక్కని పోషక పదార్థంగా ఉత్తమ ఆహారంగా, పరమాత్మ నివేదన కు యోగ్యంగా , ఉపకరిస్తూ ఉన్నట్టుగా, భక్తుడు దృఢమైన,అచంచలమైన దైవభక్తి నీ తన ఇష్టదైవం పై ప్రసరిస్తూ ఉంటాడు,
నాకు కృష్ణుడే ఇష్టం, కృష్ణా కృష్ణా కృష్ణా అంటూ నిరంతరం స్మరిస్తూ పూజిస్తూ చిత్రిస్తూ కృష్ణ
ప్రతీ ఒక్కరి లో కృష్ణ భగవాన్ నీ దర్శించ గలిగితే ఇక అంతకన్నా భాగ్యం మరేముంటుంది ?
చూసే చూపుల్లో ఉంటుంది అన్నట్టుగా పూవు లో ఆకులో చెట్టులో నింగిలో నేలలో, గుట్టలో పుట్టలో శ్రీకృష్ణ పరమాత్మ ను భావించిన భక్త మీరాబాయి అంతరంగం లో కృష్ణయ్యను ప్రతిష్టించు కొని , అనుక్షణం కృష్ణ నామ రూప భావ గాన మాధుర్యం తో పరవశిస్తూ తాదాత్మ్యం పొందుతూ కృష్ణయ్యతో మమేకం అయ్యి జీవిస్తూ తరించింది,
తనకోసం తన కుటుంబం కోసం పడే యాతన ప్రయాసలు కష్టంగా తోస్తూ, దైవారాధన కోసం పడే శ్రమను ఇష్టంగా, పరమ సౌఖ్యంగా భావించే వారు ధన్యులు
అందులో, తాము చేసే ప్రతీ పని లో, తాగుతున్నా తింటున్నా, లేస్తున్నా , పడు కుంటూ ఉన్నా, ఏ పనీ చేస్తున్నా మరవకుం డా కృష్ణ నామ జపం చేస్తూ ఉన్నవారు మహా భాగ్యవంతులు , పుణ్యాత్ములు, దైవానికి క్రమక్రమంగా చేరువగా అవుతూ ఉంటారు,
అలాంటి యోగ్యత ను అనుగ్రహించు మని దేవదేవుని , భక్తవత్సలు నీ , కరుణా సాగరుని ,,, నందనందను నీ , గోపాలకృష్ణ భగవానుని అర్ద్రత తో ఆర్తితో కోరుకుందాం,
హరే కృష్ణ హరే కృష్ణా
Sunday, November 24, 2019
హరి హరులు
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment