Nov 25, 2019 Hyderabad
సత్సంగ ము ఎంత గొప్ప విషయ మో అనుభవం ద్వారా తెలుస్తుంది,
అందరూ వెళ్తారు ఆలయానికి , ఏదో ఒక టీ నివేదిస్తారు, ఎవరికీ వారే ఏదో నోటికి వచ్చింది చదివే స్తారు, లేదా పూజారితో అర్చన లాంటిది చేయిస్తారు,
ఇలా ఎంతో మంది భక్తులు ఎంతో ఆరాటంతో , భక్తి శ్రద్ధలతో , దైవాన్ని సేవించు కోవాలన్న ఆపెక్షతో దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు,
కానీ వారు తాము దేవుని సన్నిధిలో ఎంత సేద తీరాలో అంతగా తృప్తి దొరకడం లేదు,
అందుకే వారు, ఎవరూ దొరికితే వారితో ఏదో మాట్లాడుతూ వెళ్ళి వస్తూ ఉంటారు
, నిజమైన ఆనందం తృప్తి ,కలగాలంటే తనలో ఉన్న భక్తిభావాలు , దేవుని సన్నిధిలో వెలిబుచ్చాలి, కానీ ఏమీ మాట్లాడని దేవునితో మన ఆవేదన ఆరాటం మనో భీష్టాలు ఎలా చెప్పు కునేది ?
భిన్నమైన తత్వాలతో అక్కడ తారసపడే భక్తుల మనో భావాలు ఏకీకృతం కావాలంటే నామ జపం ఒక్కటే పరిష్కారం అవుతుంది,
పదిమంది కలిసి చేసే హరి నామ సంకీర్తన లో అద్భుతమైన బలం, శక్తి మహత్తు,, ప్రభావం ఉంటాయి,
ఎన్ని పూజలు నిర్వహించినా , దానిలో భాగం పంచుకొలే నప్పుడు అనందం కలగదు
పూజారి చెప్పే మంత్రాలలో సారం , అర్థం కానప్పుడు అనుభవానికి రానప్పుడు , చేసే సేవలో అసంతృప్తి ఉంటుంది కదా
అందుకే సత్సంగం విలువ అమోఘం,
శ్రీ రామ్ జయరామ్ జయ జయ రామ్,, అంటూ సామూహికంగా చేసే భజన ఒక అరగంట సేపు అయినా అందులో పొందే ఆనందం అనిర్వచనీయం అమోఘం, అనుభవైక వేద్యం
జగద్గురువు లు శంకరాచార్యులు భజ గోవిందం ద్వారా అందించిన అమృత వాణి అమరం అద్వితీయం ,
స త్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం,, నిర్మోహత్వే జీవన్ముక్తి , అంటూ భక్తి రసామృత ప్రవాహం లో ఒక్కొక్కరు ఒక్కొక్క నీటి బిందువులా కలిసి పాడుతూ ఒక ప్రవాహం లా సాగుతూ ఉంటే , భజన వింటూ చూసే వారికి, భజన చేసేవారికి భగవద్ సాక్షాత్కారం లభిస్తూ , అమితానందాన్ని పొందుతూ ఉంటారు.
ఇలా దైవం పై గల మనకున్న ప్రేమను భక్తిని ఎదుటివారికి ఇచ్చి పుచ్చు కొనే సాంగత్యం సహవాసం,తో కనిపించని దైవాన్ని ఎదుటి వ్యక్తి లో దర్శిస్తూ ఉంటాం,
ఇదే పది మంది , తో అయితే పది రెట్లు, వంద మంది తో భజన చేస్తూ ఉంటారు వంద రెట్లు దైవం పై అనురక్తి, భజన బృందం పై ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది
ఇదే సత్సంగం రోజూ భగవద్గీత శ్లోకాలు వాటి సారాంశం చెప్పుకోవడం గానీ, గోవిందా , శంకరా పాండురంగ అంటూ తబలా, చిరతలు హార్మోనియం , డో లక్ లాంటి వాద్య పరికరాల ను ఉపయోగిస్తూ ఉత్సాహంగా ఉద్వేగంతో హుషారుగా , కీర్తనలు పాడుకోవడం గానీ చేస్తూ ఉంటే కలిగే తన్మయత్వం తాదాత్మ్యం అపూర్వం అనంతం,
పిలిచినా పలుకని దైవాన్ని , నీతో పాటు హరీ హరీ అంటూ భజన చేసే వారి లో దర్శించు కొన వచ్చును
దేవుడు అంటే అర్థం అమితానందం అద్భుతమైన ప్రశాంతత, అది సత్సంగం లో కానవస్తూ ఉంటుంది,. పదిమందిలో పరమాత్ముడు ఉంటాడు అనేది సత్యం, ఆ ఆనందం ప్రశాంతత సత్సంగం, సజ్జన సాంగత్యం, లోనే ఉంటుంది,
దీనికి చక్కని ఉదాహరణకు టీటీడీ వారు రోజూ నిర్వహిస్తున్న నాద నీరాజనం, అఖండ హరి నామ సంకీర్తన ఉద్యమం లా ఏడుకొండల వాని సన్నిధానం లో భక్తుల భక్తి పారవశ్యం పరవళ్ళు తొక్కుతు ఆనంద నిలయం గా ప్రభవిస్తు అలరారుతూ ఉంది,
నాకు భజన చెప్పడంలో , హరి కీర్తన చేయడం, భాగవత పద్యాలు పాడటం లో , భక్తి గీతాలు శ్రావ్యంగా చదవడం లో పొందే అనందం కన్నా, ఆలయంలో భక్త సమూహం లో వారిచే భగవన్నామ సంకీర్తన అనిపించడం లో అనుభవించే పరమానందం అమోఘం, మరవలెని మధురా నందం కలుగుతు ఉంటుంది.
అలాంటి సత్సంగం తో వస్తువు పై మోహం తగ్గుతుంది, పరమాత్మ పై ప్రేమ పెరుగుతూ ఉంటుంది
దుర్వ్యాసనాలు దూరం అవుతూ ఉంటాయి, బందువులు భార్యా పిల్లలతో ఉండే అనుబంధం క్రమంగా దైవం వైపు మళ్లు తూ, వస్తు ప్రపంచం పై నిర్మొహత్వం కలుగుతుంది,
ఈ సజ్జన సాంగత్యం జీవన్ ముక్తికి అద్భుతమైన సోపానం అవుతుంది కూడా,
జీవించాలంటే ఏ ఒక్కర కూ ఒంటరిగా వీలుకాదు, ఇతరుల ప్రమేయం, సాయం లేకుండా బ్రతక లేము,
కానీ దైవారాధన మాత్రం ఎవరికీ వారు సాధించాల్సిందే ,,, స్వప్రయత్నం తో త్రోవ చేసుకుంటూ పోవాల్సిందే,, అడుగడుగునా
దైవాన్ని ప్రార్ధిస్తూ శరణాగతి చేయాల్సిందే,
తప్పులు అపరాధాలూ ,నిస్సహాయత,, అజ్ఞానము , అన్నీ పరమాత్ముని కి తెలియజేస్తూ,, నిష్కల్మష హృదయంతో స్వామి ముందు సాగిలపడి అత్మ సమర్పణ చేసుకోవాల్సిందే ,,
అన్యధా శరణం నాస్తి,, త్వమేవ శరణం మమ,, అంటూ జపమో తపమో, నామ కీర్తన మో, ఏదో ఒక సాధనా మార్గంలో పరందాము ని సన్నిధిలో నిరంతరం నిశ్చల నిర్మల చిత్త వృత్తితో ప్రార్థించాల్సిందే ,,,
నలువురితో కలిసి నారాయణా అనడం లో ఎంత లాభం ఉంటోంది, దైవాన్ని చేరడానికి భజన ఎంత సులువైన సులభమైన సుతారమైన సున్నితమైన సుందరమైన సువిశాలమైన సుమనోహరమైన సన్మార్గం!
ఆహా నయాపైసా ఖర్చు చేసే అవసరం లేదు, ఏ పుణ్య క్షేత్రాలు ప్రయాస పడుతూ దర్శించే అవసరం అంతకంటే లేదు, పరికరాలు ,ప్రయత్నాలూ అభ్యాసాలు,, దేశ కాల పరిస్తితి తో ప్రమేయం లేకుండా , ఎక్కడ పడితే అక్కడ,, సమయం సందర్భం లేకుండా రామా కృష్ణా శంకరా అంటూ పాడుకుంటూ అంతరంగంలో జీవాత్మను పరమాత్మ తో అనుసంధా నం చేస్తూ భక్తి రసామృత ధారల ను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ తరించ వచ్చును ,
ఆనం దొ బ్రహ్మ అన్నట్లుగా. మనసును శ్రీహరి నామ సంకీర్తన చేయడం వల్ల కలిగే ఆనందానుభూతి తో సందించ గలిగితే అంతకంటే సుకృతం మరేమీ ఉండదు కదా
ఆ స్ఫూర్తిని అదృష్టాన్ని అనుగ్రహించమని దేవదేవుని కోరుకుందాం ,
తద్వారా ఉత్కృష్టమైన మానవజన్మ ను సార్థకం చేసుకుందాం.
హరే కృష్ణ హరే కృష్ణా ,,
Tuesday, November 26, 2019
సత్సంగము
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment