Tuesday, November 26, 2019

వేణు నాదం

Nov 26, 2019 Hyderabad
రాధా మనోహరుడు,,శ్రీకృష్ణుడు వేణు నాదం లో నిపుణుడు.! దానికి గోపికలు  ముగ్దులు అవుతున్నారు , వారికే కాదు, ఆ వేణుగానం విన్న ప్రతీ జీవికి మధుర మనోహరంగా ఉంటుంది!!
ఆ విధంగా శ్రీకృష్ణుడు మురళీ గా నం చేస్తూ,, తన సఖులతో గోవులను అరణ్యమునకు తోలుకొని పోవు దృశ్యం చూడగలుగు కన్నులకు నిజమైన "సంసిద్ది ""ప్రాప్తిస్తుంది!!
అలా బాహ్యంతరం లో ఆ కమనీయ, రమణీయ దృశ్యాన్ని నిరంతరం స్మరిస్తూ ,,ధ్యాన నిమగ్ను లై ఉన్నట్టి వారు ఉత్తమ సమాధి స్థితిని పొందుతారు.. కూడా!!
""సమాధి "అనగా ఒక నిర్దిష్ట వస్తువుపై సమస్త ఇంద్రియ కార్యాలను కేంద్రీకరించ డం,, కదా!!
శ్రీకృష్ణ భగవానుని లీలలన్నీ, ధ్యాన మరియు సమాధుల పరమ లక్ష్యమౌతూ ఉంటోంది,!
ఆ విధంగా నిరంతరం శ్రీ కృష్ణ చైతన్యంలో నిమగ్నులై ఉండు వాడు యోగులందరిలో శ్రేష్ఠుడు అవుతున్నాడు!!.
అతని చేతిలోని వేణువు అదృష్టాన్ని ఊహించలేము కదా, మనం,!!
, గోపికలకు మాత్రమే స్వంతమైన శ్రీకృష్ణుని అధరామృతాన్ని ఆస్వాదించడం  కోసం,, ఆ వేణువు ఎన్ని పుణ్యకర్మలు చేసిందో కదా ??
శ్రీకృష్ణుని వేణు నాదము వింటూ నెమళ్ళు పిచ్చెక్కి పోతూ విహరిస్తూ కృష్ణ దర్శన భాగ్యం కోసం తిరుగుతూ ఉన్నాయి,,
గోవర్ధన్ పర్వతం పై,, ఉంటూ   లోయ లలో  కూడా ఉంటున్న, సకల జంతువులు ,,వృక్షాలు, మొక్కలు కూడా నర్తిస్తూ ఉంటున్న నెమళ్ళ ను చూస్తూ నిశ్చేష్టులై శ్రీకృష్ణుని వేణు నాదాన్ని శ్రద్ధగా ఆలకిస్తు ఉన్నాయి,,
గోపికలు ,, నిజానికి పల్లె పడుచులు అయినా శ్రవణం ద్వారా వేదశాస్త్రాల లో చెప్పబడిన అత్యున్నత సత్యాలను గ్రహిస్తూ ఉంటారు,,!! అది మన వైదిక సంస్కృతి ప్రభావం,!!
"కృష్ణ వేణు నాదం "వింటూ గోవులు సైతం పరవశిస్తూ ఉంటాయి, అవి తమ పొడవాటి చెవులను నిక్కపొడుచుకొని వింటూ కన్నుల నుండి నీరు స్రవిస్తూ  ఉండగా తదేకంగా కృష్ణయ్య ను చూస్తూ ఉంటూ,, పరమాత్ము ని దర్శన భాగ్యం కొరకై జీవుడు ఎలా రోదించా లో మనకు సూచిస్తూ  ఉన్నాయి.
ఇదే సమాధి స్థితిలో పక్షులన్నీ కొమ్మలపై,, రెమ్మలపై నిశ్చలంగా కూర్చుండి నల్లనయ్య ను చూస్తూ అతడి వేణు గానానికి స్తబ్దులై సర్వమూ మరచి, వేణు గానం లో లీనమై ఆలకిస్తూ ఉన్నట్టు ఆగుపిస్తూ ఉన్నాయి,!!
అవి సాధారణ పక్షులు కావనీ, ఏ మహర్షు లో,, మహా భక్తు లో, విద్వాంసు లో అయి ఉంటారు, అలాంటి వారే , అనితరసాధ్యం అయిన ఆ వేద విజ్ఞానం పట్ల ఆసక్తి చూపుతుంటారు, కదా!
,,, సహజంగా ,శరద్ ఋతువులో ఎండ తీవ్రంగా ఉంటుంది. కానీ కన్నయ్య వేణు నాదం తో , గోల్లపిల్ల ల పై దయ ఉంచి, ఆకాశంలో మేఘాలు దట్టంగా ఆవరించి ,,వారికి అలసట కలగకుండా గొడుగుల్లా ఉంటున్నాయి.!!
వేణు గానం చేస్తూ ఉంటున్న శ్రీకృష్ణుడు,, సకల చరాచర జీవులతో సన్నిహిత మైత్రిని కలిగి బృందావనం లో సంచరిస్తూ ఉండగా, అందలి ప్రతీ వస్తువు అద్భుతంగా అగుపిస్తు ఉంది.!!
చరములైన జీవులన్నీ తమ పనులన్నీ నిలిపి వేస్తూ ఉన్నాయి, ఇక ఆచరము కైన చెట్టూ ,పుట్టా ,కొండా, కొనలన్ని పారవశ్యం తో  తో చలించి పోతూ ఉన్నాయి,,!
బృందావన తీరాన్ని ఒరిసి, ప్రచండ వేగంతో వెళ్లే యమునా నది మాత,, ఈ నల్లనయ్య వేణు నాద స్వర మాధుర్యాన్ని గ్రోలుతూ ,,తన్మయంగా సొలుతు ,తూలుతూ, తన దూకుడు వేగాన్ని తగ్గించి, చప్పుడు కాకుండా, వింటూ మెల్లిగా ప్రవహిస్తూ ఉంది,!!
నింగిలో ని  దేవతా గణం,, నందనందనుని వేణు గానానికి అనుగుణంగా రాగ తాళ భావ స్వర యుక్తంగా, వివశులై , ఆనందంతో నాట్యం చేస్తూ ఉండి పోయారు ,!!
ఇక శ్రీకృష్ణుడే తమ ప్రాణంగా ఊపిరిగా జీవన చైతన్యంగా భావించే గోప గోపాల కుల మనస్తితి చెప్పవశమా .??
ఎక్కడివారు అక్కడే చైతన్యాన్ని కోల్పోయి , పిల్లన గ్రోవి మాధుర్యంతో రాతిబొమ్మల వలె , మంత్రముగ్ధుల వుతూ ఉన్నారు!
,చంటి పిల్లలకు  పాలిచ్చే తల్లులు కూడా మైమరచి వేణు గానం వింటూ ఉంటే, ఆకలితో ఉండి కూడా,
చనుబాలు కుడిచే పాపలు  పాలు త్రాగడం  మాని అలాగే ఆలకిస్థు తల్లి పొత్తి ల్లలో చూస్తూ ఉండి పో తున్నారు!!
అలాగే అవు లు గడ్డి మేయడం మానేస్తే, ఆ ఆవుల వద్ద పాలు త్రాగుతున్న లేగ దూడలు కూడా పాలు త్రాగడం మానేసి, వేణు గానం వినిపించే దిశలో మోర సారించి చూస్తూ ఉన్నాయి,!!
నాగుపాములు , పుట్టలో నుండి బయటకు వచ్చి ఎత్తిన పడగను కదపకుండా మంత్రం వేసినట్టుగా వేణుగానం లో లీనమై పోతున్నాయి,!!
గోపికలు తమ భర్తలకు అన్నం వడ్డిస్తూ ,,వేణు నాదం వినబడగానే చకితులై వడ్డన మానేసి ఇంటి గుమ్మానికి ఆనుకొని వింటూ చిత్తరువుల వలె నిలబడి పోయారు.
గోపాలకులు అయితే , బొమ్మల్లా నిలబడి ఎక్కడివారు అక్కడే చేష్టలుడిగి పోతున్నారు!
,,  యశోదా నందనుడు ఊదే వేణు నాదం లో నుండి, సంగీత సప్త స్వరాలు, సుమధుర ధ్వనులు వెలువడుతు ఉంటాయి, !రాగం తాళం భావం సాహిత్యం ఇవన్నీ, సంగీత పిపాసకులకు,విద్వాంసుల కు మాత్రమే అవగాహన ఉంటుంది.
కానీ బృందావనం లో అలాంటి విద్వత్తు , స్వర జ్ఞానం ఉన్నవారు లేరు, అయినా  సర్వప్రాణికోటి నీ,, తన స్వరమాధుర్యం తో  పరవశింప జేసే  సమ్మోహన శక్తి ,,ఆ వేణు నాదం లో నిబిడి  ఉంది,!
అపర గోలోక దేవతా స్వ రూపిణీ , శ్రీకృష్ణ భగవానుని అనురాగ ఆరాధ్య దేవత, అతడి ప్రాణం అయిన రాధాదేవి యే ,,,శ్రీకృష్ణుని ఉచ్వాస నిశ్వాస రూపంలో, సాగుతూ ఉంటుంది,,
ఆమె తన శక్తి చైతన్యానికి ప్రతీక గా, అతడి నోటినుండి  ,, అతడి పెదవులను సున్నితంగా ఆనుకొని యున్న వేణువు రంధ్రం గుండా లోనికి. వెళ్లే వాయు వై ,సప్త రంధ్రాల నుండి వెలువ డే సప్త స్వరాల మేళవింపు గా బయటకు వస్తూ, వీనుల విందుగా , మృదు మధురంగా, మనోహరంగా , విశ్వంలో వినిపిస్తూ ఉంది,,
, రాధ యే మాధవుడు,! మాధవుడే రాధాదేవి ""గా అవినాభావ సంబంధం తో, అద్వైత ప్రేమామృత స్వరూపం తో విరాజిల్లే  అనురాగ ఆదర్శ దంపతులు, రాధాకృష్ణులు!!""
""వేణువు "అంటే శ్రీకృష్ణుడు ""వేణునాదం"" అంటే రాధాదేవి. ప్రేమామృతం, !!
వేణు గాన లోలుడు, వేణు గాన విశార దుడు, వంశీ లోలుడు, మురళీ మనోహరుడు,, మురళీ మోహనుడు,, వంశీ ధరుడు,, ఇలాంటి ఎన్నో వేణువు గురించిన బిరుదులు గల ఓ గోపాల కృష్ణా !,
బృందావనం లో నీవు ఇప్పటికీ రాత్రివేళ ల్లో రాధాదేవి తో సంచరిస్తూ, ప్రకృతిని  భువన మోహనంగా ,పులకింపజేస్తూ  వేణుగానం చేస్తూ పరవశిస్తూ ఉంటావు , కదా !
ప్రభూ !!, అలాంటి నీ సురుచిర సుందర జగన్మోహన ఆకారాన్ని , సౌందర్య లావణ్య స్వరూపాన్ని, రాధా సహిత వేణుగానం చేస్తున్న గోపాలకృష్ణ భగవానుని మూర్తిని, భావిస్తూ , స్మరిస్తూ, తరించే భావ సంపద ను మాకు  దయ యుంచి అనుగ్రహించవా,గోవిందా!!  మాధవా ,శరణు! గోపాలా శరణు,! గోపీజనవత్సలా, వేణు గాన విలోలా, శరణు !.
స్వస్తి .!
హరే కృష్ణ హరే కృష్ణా !!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...