Nov 27, 2019 Karimnagar
""శ్రీరామచంద్ర , !!సద్గుణ సాంద్రా,! కారుణ్య సాంద్ర,,!, సకల గుణాభి రామా, ప్రభో !
ఈ హనుమ ,నీ దాసుడు,, నీకు నమ్మినబంటు,,!
ఇహము నిమ్ము శ్రీరామా !
పరము నిమ్ము రఘురామ !
ఒకే ఒక వరాన్ని కరుణతో నాకు ప్రసాదించు , రఘుకుల సోమా!
నీ పాద పద్మాలను, నా మనస్సు ఆకర్షించ నీయి తండ్రీ,,!
ఎక్కడ నీ ""శ్రీరామచరిత" అనే సంత కనబడితే ,,లేదా వినబడితే ,,అక్కడికి నా జీవన యాత్ర సాగ నీ, సీతా రామా !!
సాకేత్ రామా, !నిరంతరం నేను నీ నామమే పలుకుతాను,!
నీ శౌర్య ప్రతాపాల గురించి అనుక్షణం ఏమరక వింటూ ఉంటాను ,!
పావన నామా , !రామా!
నిన్ను తలచు కోవడం లో ఉన్న అందం , మరెక్కడా అగుపించ దు కదా! కౌసల్యా రామా,!
అమర గణాలు, ముని శ్రేష్ఠుులు నిన్ను తలుస్తారు! నిన్నే దైవంగా కొలుస్తూ ఉంటారు,! నీ దయాగుణాలే స్ఫూర్తిగా తీసుకుంటారు ,!
ఈ జగతిలో నిన్ను మించిన దైవం ఎవరున్నారు?? అయోధ్య రామా ,,!
మన భారత దేశంలో ఎన్ని జాతులు ,ఎన్ని విభిన్న రీతులు ఉన్నా , కళ్యాణ రామా,!! వారంతా ముక్తకంఠంతో అనందం తో నీకు నీరాజనం పడుతూ ఉంటారు కదా రామయ్యా!!
నీవు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడివి,!! షోడశ కళా ప్రపూర్ణ ప్రకాశ కుడివి,, కదా ,,! పట్టాభి రామా,,!
అంతటి నీ విశ్వరూపం లో కేవలం ఒక చిన్న ముత్యం అంతటి నీ మహనీయ రూపాన్ని చేగొని,, సకల భువనాలు తిరిగి ,,నీ సౌందర్య ప్రతాప లావణ్య గుణ గణాలను చాటి చెప్పి వ స్తాను , దశరథ రామా ,,!!
అలా భూమి చుట్టూ నేను తిరుగుతూ ఉండగా, ఎవరైనా ,ఎక్కడైనా నీ గుణగణాలను పొగుడుతూ ఉండగా చూసినపుడు,, నేను ఆనందం పట్టలేక మేరు పర్వతమంత ఎత్తుగా పెరుగుతూ ఉంటాను
జానకీ రామా ,,!!
అలా భూమండలం అంతా వ్యాపించే నీ లీలలు, నీ పుణ్య పురాణ కథలు వైభవాలను నేను నీటిని పీల్చుకునే మేఘం వలె వాటిని సంగ్రహించి, మరల నీటిని వదిలే మేఘం వలె , నేను తిరిగి తిరిగి అలసట ఆయాసం లేకుండా అంతటా ,, శ్రీరామ భక్తులందరితో కల్పవృక్షం లాంటి రామాయణ కావ్య గానం చేయిస్తూ ఉంటాను ,,!
రామ రామ జయ రాజా రామా ,,!!
ఆ నింగిలో మెరిసే సూర్య చంద్రులు కానీ, తలుక్ తళుక్కున మెరిసే తారా గణం, నక్షత్ర సముదాయం గానీ, నీ నవ్య దివ్య ముగ్ద మోహన సుకుమార సుందర సురుచిర లావణ్య వైభవ ప్రకాశ కిరణాల ముందు సాటిరావు కదా ,!! శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా,,! కాలాత్మక పరమేశ్వర రామా,,! శేష తల్ప సుఖ నిద్రిత రామా,! బ్రహ్మాది అమర ప్రార్తిత రామా !!
, అంతా రామ మయం !ఈ జగ మంతా రామ మయం !,
హే రామ్ !!నాకున్న పని ఒకటే !! శ్రీరామ భక్తులకు రక్షణ ఇవ్వడం!! , రామ కథను వింటూ ,ప్రోత్సహించడం !! ధర్మాన్ని రక్షించడం !, రామనామ గానం చేయడం!! అంతే .
శ్రీరామా సుగుణ ధా మా ,!
నీ పాద పద్మాలు అనబడే బంగారు పంజరంలో మానస రాజహంస లాంటి నా మనసు అనే చిలకను ఆ పంజరం లో బందీ ని చెయ్యి ,,! దయ యించి కనికరించి ఈ ఒక్క వరాన్ని అనుగ్రహించ వా,!! తారకనామా ,! జగదభి రామా !త్రిభువన జన నయనాభి రామా,!!, భూమి సుతా కామా ,! కోమల నీల సరోజ శ్యామా,! రఘువరా !, రామ ప్రభో !!పాహిమాం,, రక్ష మాం , శుభ కర శ్రీ రామా !!
నమో నమః !!
హరే కృష్ణ హరే కృష్ణా !!
Thursday, November 28, 2019
అంతా రామ మయం
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment