Thursday, November 28, 2019

దైవ బంధం

Nov 28, 2019 Karimnagar
ఈ ప్రపంచం లో ఒకరినొకరు ప్రేమించు కోకుం డా ,ఎవరూ కనిపించరు, !
,,ఏదో ఒకదానిని ,,ఎవరో ఒకరిని మరొకరు విధిగా  ప్రేమిస్తూ ఉంటారు,!
కానీ భక్తుడైనటువంటి వాడు మాత్రం,, కేవలం భగవంతుణ్ణి మాత్రమే ప్రేమిస్తాడు,
ప్రతీ వాడి అంతరంగంలో  ప్రేమ దాగిఉంటుంది,! కానీ,దానిని మనకు ఇష్టమైన వారికి మాత్రమే పంచుతూ ఉంటాం,! అందరికీ పంచ ము !;
ఈ జగత్తులో మనకు ఇష్టమైన వాళ్ళు ,ప్రియమైన వాళ్ళు ఎవరూ ?? అంటే ఎవ్వరం కూడా  ఖచ్చితంగా చెప్పలేం, ! ఎందుకంటే,,
ఎవ్వరిని కలిసినా ,, ప్రేమించినా ,వారు ఎదో ఒకరోజు  మనల నుండి శాశ్వతంగా వెళ్లి పోవాల్సిందే , లేదా మనం అయినా పోవాల్సిందే!!
ఈ దేహాలు ఒకరోజు స్మశానంలో నిలిచి పోతాయి,!, దాని తో  ఇన్నాళ్లు  కాపురం చేసిన  ప్రాణాలు పైకి లేచిపో తాయి,!!
అందుచేత ,ఈ మధ్యలో ఇలా మనం ఏర్పరచుకున్న  ఈ ప్రేమలు,,సంబంధాలు తాత్కాలికం, మృగ్యం అవుతున్నాయి,
,,, అయినా  ఇదంతా చోద్యం లా చూస్తూ కూడా ,వీరితో ప్రేమలు పంచుకుంటూ పెంచుకుంటూ,, వారు దూరమైతే రోదిస్తూ, గుండె పగిలేలా ఏడుస్తూ, జబ్బులూ, రోగాలు తెచ్చుకుంటూ ,దుఖిస్తు ఉంటున్నాం,!! అలాంటి ప్రేమల వలన , క్రమంగా మన జీవితాల్లో ,
చివరకు ఒక అసంతృప్తి, వెలితి ని , శోకాన్ని మిగులుస్తు ఉంటున్నాయి  .
ఇలా ఎంత కాలం, ఎంత మందిని  ప్రేమిస్తూ, బాధపడ తూ ఉంటామో మనకు తెలియదు,!
అందుకే నిత్య సంబంధం,శాశ్వత సంబంధం మనతో ఉన్న ఆ  పరమేశ్వరుని తో నే పెట్టుకోవాలి , అతడిని మాత్రమే గుర్తిస్తూ  ప్రేమించాలి.!
.మిగతావన్ని అనిత్య సంబంధాలు!! ,,ఉంచాలనుకుంటే ఉంచవచ్చు!, లేదా తెంచు కోవచ్చు,,! దానితో పెద్దగా  బాధ పడాల్సిన అవసరం లేదు,!
కానీ ,,దైవంతో మాత్రం మనకు నిత్య సంబంధం ఉంది, ఇదే సత్యం ,! ఇదే నిత్యం!
ఇదే ప్రేమను శాశ్వతమైన భగవంతుని చరణాల ముందు సమర్పించ గలిగితే అది భక్తి అవుతుంది ,!
   ఈ భక్తి రెండు రకాలు !!
ఒకటి భావా త్మక భక్తి, రెండవది సాధనా భక్తి !!,  భావా త్మాక భక్తి ,భగవంతుని గురించిన జ్ఞానం తో  ముడివడి ఉంటూ ,మనసులో భక్తి భావం  ఏర్పడుతుంది,!
సృష్టిలో అంతటా నిండి ఉన్న పరమాత్మ గురించి అవగాహన ఉంటే, అర్థం చేసుకుంటే ,,మన ప్రేమను అటువైపు మళ్ళిస్తే ,,అది నిత్య సంబంధం గా భక్తి, భావ తరంగా లుగా మారి, ""దైవభక్తి ""అవుతోంది,!
ఇదీ, మన అంతరంగం లో ఆంతర్యం లో నే ఉంటుంది,,! బయటకు కనబడేది కాదు,!!
కానీ దానితో మానవత్వం దైవత్వం తో పరిమలిస్తు ప్రకాశిస్తూ  ఉంటుంది, !
భక్తి కలిగిన తర్వాత దానిని కార్య రూపంలో పెట్టకుండా, ఏ  భక్తు డూ ఉదాసీనంగా ఉండలే డు ,!ఇక భక్తి యొక్క రెండవ  రూపం ఇదే , క్రియా భక్తి,!; సాధనా భక్తి!;
సుగంధ భరిత మై పరిమళం కలిగిన ఒక పుష్పం , తన సౌరభాన్ని ఎలా పరిసరాలకు వెదజల్లుతూ ఉదారంగా అందిస్తూ ఉంటుం దో, అలాగే భక్తుడు కూడా,ఏదో ఒక సాధనా ప్రక్రియ ద్వారా ఇతరులకు అందజేస్తు , అంతటా అందరిలో భగవంతుని స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటాడు,,, ఎందుకంటే,
భగవంతుడు, ఎన్నో రూపాల్లో మన చుట్టూ  ఆవరించి ఉన్నాడు, చెట్టు పుట్టా కొండా కోనా నీరు గాలీ, నీలో నాలో ఉంటూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, అది తెలియాలంటే అతడిని ప్రేమించడం తెలియాలి, అదే భక్తి! అదే ప్రేమ! అదే జ్ఞానం!
జననం కాకముందే మనకు కావాల్సిన సకల ఆహార పదార్థాలు, బంధు జాలము , ప్రకృతి సంపదలు మనం అడగకుండానే పరమాత్ముడు  ,రెడీ చేసి పెట్టాడు , అంతటి అపార కరుణా సాగరు ని అనుగ్రహం వల్లే మనం బ్రతుకుతూ ఉన్నాం,,
ఇది గుర్తిస్తే కృతజ్ఞత,! గుర్తించకుండా అహంకా రిస్తే కృతగ్నత!! ద్రోహం! అవుతుంది,,,,
ఈ దేహంలో" రక్తం"" ఉండడం వల్లనే  తినే ఆహారం లోని పోషక పదార్థాలు  శరీరానికి  అందుతూ దానికి శక్తిని కాంతిని, ఆయువును, ఇస్తూ ఉన్నాయి,
ఇలా ప్రాణులకు జీవనాధారంగా ఉంటున్న , ఈ రక్తం ఎక్కడినుండి  వచ్చిందో  ఎవరి దయ వలన ప్రవహిస్తూ ఉందో, మనం గుర్తించాలి ,!
పీల్చే గాలిలొ, నడిచే నేలలో ,,త్రాగే నీటిలో అంతటా తానై ఉంటూ మన అవసరాలు తీరుస్తూ ఉంటున్న భగవంతుని తో నే  నిత్యం సంబంధం పెట్టుకోవాలి ! , మన ప్రేమను అతడితో నే పంచుకుంటూ పెంచుతూ పోతూ ఉండాలి.!
అనగా ఉదయం నుండి రాత్రి పడుకునే వరకూ ఏ పనీ చేస్తూ ఉన్నా, ఎటు వెళ్ళినా , త్రాగిన తింటున్నా పరమాత్మని మరవకుం డా స్మరిస్తూ గడపాలి,
మన బ్రతుకు నకు ఒక అర్థం ఏర్పడాలంటే  భగవంతుని ధ్యానిస్తూ కీర్తిస్తూ మన పనులు చేసుకుంటూ పోవాలి
అలాంటి భావ సంపద, సాధనా పటిమ ను దృడతరం చేస్తూ , భగవంతుని కి చేరువ గా ఉండే ప్రయత్నం చేద్దాం,.;"" సర్వం శ్రీకృష్ణా ర్పణ మస్తు!
స్వస్తి రస్తు, శాంతి రస్తు!
శుభమస్తు !
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...