Dec 9, 2015
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జియ్యంగారిలాంటి ధార్మిక గురువు గారు నిజంగా ఒక మార్గ దర్శి ! తాను ఒక చక్కని ధార్మిక జీవనం కొనసాగిస్తూ -ఆ విధానాలను ఎప్పటికప్పుడు అందరకు తెలియ జేస్తూ- చేయవలసిన ధిఅవ కార్య క్రమాలను -స్తోత్రాలను - ప్రార్థనా శ్లోకాలను -వివరిస్తూ మన దేశం లోనే కాకుండా విదేశాల్లో కుడా పర్యటిస్తూ -విష్ణు సహస్ర నామావళి - లక్ష్మీ నారాయణుల -సీతారాముల కళ్యాణ కార్య క్రమాలను అక్కడి వారిచే నిర్వహింపచేస్తూ ఒక ఉద్యమంలా తెలుగు వారంధరిచే సమర్థవంతంగా చేయిస్తూ --మన హైందవ ధర్మాన్నీ అధ్యాత్మిక చింతనలను - నేటి ఆధునిక జీవితంలో మరచిపోతున్న మానవ విలువలను -దైవ భక్తినీ పెంపొందిస్తు - పరి రక్షిస్తూ - వారు చేస్తున్న నిరంతర జ్ఞాన యజ్ఞంలో -మనం పాలు పంచు కుందాం -! మనం ధార్మిక జీవనాన్ని వారు చూపిస్తున్న మార్గంలో కోనసాగించేందుకు కృషి చేద్దాం
ఇలాంటి మహానుభావాలు -విజ్ఞాన కోవిదులు -వైతాళికులు - ఇప్పుడు మనకు చాలా అవసరం - అడుగంటి పోతున్న నైతిక -మానవ ఆధ్యాత్మిక -హైందవ విలువలను కాపాడుకుందాం గత చరిత్ర వైభవాన్నినిల బెట్టు కుందాం - ప్రపంచం లో ఎక్కడా కనపడని మన దేశ సంస్కృతినీ -సంస్కారాన్నీ - నాగరికతను -ఆచార వ్యవహారాలను -మనం పాటిస్తూ రాబోయే తరానికి తరగని వారసత్వ సంపదగా అందిద్దాం !
జై శ్రీ మన్నారాయణ ! జై జై శ్రీ మన్నారాయణ !
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment