Wednesday, November 6, 2019

"ఇప్పుడు అనుకొంటే ఏం లాభం !"

Dec 9, 2015           
                "ఇప్పుడు  అనుకొంటే ఏం  లాభం !"
  నిజానికి  గతం చాలా గొప్పది--  సమయం ఇంకా చాలా  గొప్పది - దానిపైనే మన భవిష్యత్తు ఆధార పడి  ఉంటుంది  -ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది -- అది తానే స్వయంగా  రాసుకుంటాడు -కాలం  క్రమంగా తెలీకుండా  గడిచి పోతోంది  -ఒక్కొక్క మధుర క్షణం -విలువైన కాలం -తిరిగి మనకు ఎత్తి పరిస్థితిలోను దొరకని అమృత ఘడియలు -మన ఆయువు -మెల్లిగా మన  చేయి జారిపోతోంది -
                     అందుచేత కాలం విలువ గుర్తించి -మనం జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించు కోవాలి -గడచిన మన గతం -మన పూర్వీకుల గతం  దృష్టిలో ఉంచుకొని -మనిషిలా బ్రతకాలి -దేవుడిచ్చిన మానవ జేవితాన్ని మేధస్సును - మన సక్రమ జీవన విధానానికి -చుట్టూ ఉన్నవారి శ్రేయస్సుకు - ధార్మిక ఆధ్యాత్మిక విషయాలకు  కేటాయిస్తూ  -ఇహం తో బాటు పరాన్ని కూడా గుర్తిస్తూ బ్రతకడం నేర్చుకోవాలి -
                             మనిషి కూడా  జంతువే -ఒక్క మేధస్సు విషయంలో  తప్ప! దానితో తనలో ఉన్న అహంకారం - అనవసర కోపం -అలసత్వం ---ద్వేషం -భగవంతుడు ప్రసాదించిన అందమైన ప్రకృతి -అనుబంధాలు -అనురాగాలు ప్రేమా -సానుభూతి అనబడే మానవ సంబంధ మైన నైతిక విలువలు గుర్తించకుండా  -యాంత్రికంగా -బాహ్య ఆడంబరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం  ఆత్మ శోధన లేకుండా నడుచుకోవడం -  మన చరిత్రను వక్రమార్గంలో రాసుకుంటూ ఉన్నామని  గుర్తు చేసు కోవాలి --
                       పెద్దతనం వచ్చాక " అయ్యో ! అలా చేయ లేక పోయామే ! అనవసరంగా  కాలాన్ని వ్యర్థం చేసుకున్నామే ! ఎంత పని జరిగింది ! ఇప్పుడు ఎం చేద్దాం ! ఎందుకు ఇలా చేశాం ! ఎం చేస్తే  అది బాగు పడుతుంది --" ! ఇలాంటి మనోవ్యధతో భవిష్యత్తులో బాధ పడకుండా చక్కగా  వర్తమానాన్ని సమర్థవంతంగా  మనతో బాటు మన అందరి శ్రేయస్సుకు ఉపయోగ పడేలా కృషి చేద్దాం  !
                        అట్టి స్పూర్తి నీ -పరిజ్ఞానాన్నీ -సమయాన్నీ -సంకల్పాన్నీ -బలాన్నీ  ప్రసాదించ మనీ భగవంతున్నికోరుకుందాం  !
                "  సర్వే జనాః  స్సుఖినో భవంతు ! సమస్త సన్మంగళాని -భవంతు ! సర్వే భద్రాణి పశ్యంతు !"
                                ఓం శాంతి 1 శాంతి ! శాంతి :;! 

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...