Sunday, December 8, 2019

అహం

Nov 29, 2019, Karimnagar
"అహం " అంటే నేను . ఇది  రెండు రూపా ల్లో ఉంటుంది.. ఒకటి భావం ఇది సదా మారుతూ ఉంటుంది , రెండవది స్వరూపం, ఇది శుద్ధ చైతన్యము , దీనినే అత్మ అంటారు..
గాఢనిద్రలో అంటే సుషుప్తి  అవస్థ లో అహం భావం ఉండదు, కానీ అహం ఉంటుంది!! అది లేక పోతే  జీవికి అది శాశ్వత నిద్ర అవుతుంది !!
ఈ అహం ఎప్పుడూ ఉంటుంది, ఈ చైతన్య స్వరూపానికి   , దేశ కాల పరిస్తితి లతో సంబంధం లేదు ! ఎందుకంటే
అది స్వయంగా చైతన్య ప్రకాశం,!
ఈ దేహం ,శరీరం, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు ,అజ్ఞానము ఇవన్నీ" నేను "కాదు!
నేను సద్రూప  చిద్రూప చైతన్యాన్ని!
""నేను చిక్కి పోయాను! అయ్యో !" అనుకున్నప్పుడు , మనకు నేను దేహాన్ని కాదని తెలుస్తోంది కదా !!
"నాకు కళ్ళు సరిగా కనపడటం లేద"ని అన్నపుడు" నీవు ,కళ్ళు"" వేరని తెలుస్తోంది కదా !!
""నాకు ఆయాసంగా ఉంది నడవలేక పోతున్నాను ప్రాణం పోతోంది !"" అన్నపుడు "నీవు ప్రాణానివి ""కూడా కాదు అని తెలుస్తోంది కదా!! ఇక మనలో ఉన్న
బుద్ది, మనసు ,చిత్తము అహంకారము కూడా"" నీవు కావు !""ఎందుకంటే నిద్ర లో అవి శూన్యం అవుతున్నాయి!!
""నీ మనసుకు ఏం తెలుసో అది నీకు తెలుసు,! నీ మనసుకు ఏదితెలియదో, ఆ తెలియద నే "అజ్ఞానం"కూడా నీకు తెలుసు !
కనుక నీవు మనసువి కావు! అఙ్ఞానివి కూడా కాదు !
అవన్నీ మిథ్యా రూపాలు!
వానిలో" నేను "అనేది లేనే లేదు !!కానీ "నాది "అనే అహంభావం మాత్రం ఉంది !!
సైకిల్ లో నీ వివిధ భాగాల సమూహం వలె ,,ఈ దేహం కూడా ఒక అసెంబ్లీ ఫిట్టింగ్,!!
రక్తం ,మాంసం ,ఎముకలు ఇలా ఎన్నో  కలిస్తే దేహం అవుతుంది,!
ఇది "నేను "అనేది ఉన్నంతవర కే ,,ఈ దేహం ఉంటుంది ,!
ఆ ""నేను ""పోతే అది శవంగా మారుతుంది, ఇక అది  కదలలేదు,! మాట్లాడలేదు!
ఇటువంటి స్థూల దేహం, నుండి, లో ఉన్న మనో బుద్ది అనబడే"" సూక్ష్మ శరీరం""  దూరం కావడం వల్ల దేహం  "శవం" "అవుతోంది!
  చావు అంటే ఇదే !!
ఈ విధంగా బయట పడిన సూక్ష్మ శరీరం మరొక ఉపాధిని ధరిస్తూ వుంటుంది !
ఎందుకంటే ,ఈ జీవుడు అనుభవించాల్సిన కర్మ అంటూ ఒకటి ఉంటుంది కనుక  !!
ఇవన్నీ చనిపోక ముందే తెలుసుకోవాల్సిన విషయాలు !
కన్ను, ముక్కు ,చెవి ,నోరు ఇందులో ఏది లేకున్నా నీవు ఉంటావు,!
అందుచేత ఆ ఇంద్రియాలు నీవు కాదు!
అవన్నీ జడాలు !! వాటికి స్వయం ప్రకాశం లేదు !
"అహం" అనే స్వరూపం మీద ఆధారపడి  అవి ప్రకాశిస్తూ ఉంటున్నాయి ,! అవి మిథ్యా బింబాలు !స్వప్రకాశం లేదు!
చైతన్యం అనేది  ఎప్పుడూ ఒకటే ఉంటుంది !అది అనేకం కాదు !
అనగా నీలో నాలో అన్నింటిలో అంతటా ఒకే చైతన్యం ఉంది!
ఈ చైతన్యమే ఆత్మ !
దీనినే "సత్తు "అంటారు అనగా సత్యము నిత్యము శాశ్వతము అయినది!!
ఈ ఆత్మను గురించిన జ్ఞానం తెలుకొడానికి  మరొక టి అంటూ వేరే ఉండదు,! ఆ జ్ఞానం అత్మలోనే ఉంటుంది !;
దానినే ""చిత్తు "అంటారు
ఆత్మ స్వరూపాన్ని "సత్" అనీ, ఆత్మ జ్ఞానాన్ని "చిత్" అనీ వ్యవహరిస్తూ ఉంటారు !
సత్ ,చిత్ , ఇవిరెండూ ఒకటే !
ఆ ఒకటి ఎవరూ ? "అంటే అది నేనే!
ఆ సద్రూపమే చిద్రూపం!! ఆ చిద్రూపమే ఈ ఆత్మ స్వరూపం  !!
జ్ఞానం బ్రహ్మ !! అహం బ్రహ్మ !
అహం బ్ర హ్మో స్మి!!
నేనే బ్రహ్మ ను!! జ్ఞాన స్వరూపాన్ని !
""తత్వ మసి ""అనగా నేను ఉన్నాను ! అని అర్థం కదా ! ఉన్నాను  అనడానికి ప్రమాణం స్వతః స్సిద్ద మైన మనర్ ఈ ఆత్మ జ్ఞాన మే !! ఇది నిరూపించుకోవడానికి వేరే ప్రమాణం అవసరం లేదు!
ఆత్మ స్వరూప జ్ఞానంతో పొందే స్వయం అనుభవం ఇది !
అద్వైతం అంటే " సత్, చిత్" రెండూ వేరు కానటువంటి ది ఈ ఆత్మ స్వరూపం !
ఇదం వృత్తి  ఎప్పుడూ మారుతూ ఉంటుంది కానీ అహం వృత్తి మాత్రం శాశ్వత చేతనత్వం కలిగి మారకుండా ఉంటుంది !!
నేను ఉన్నాను ,"సత్"!!
ఆ నేను ప్రకాశిస్తూ ఉంది ""చిత్""!
ప్రపంచం ఉంది ""సత్""!
ప్రపంచాన్ని తెలుసుకునే నేను ఉన్నాను ""చిత్!"
నిద్రలో ప్రపంచం లేదు,
అయినా నేను ఉన్నాను!!
అనగా ప్రపంచం మిథ్య
దానికి స్వయం ప్రకాశ త లేదు!!
నేను ఉంటే అది ఉంటుంది! మిథ్యా అంటే భ్రమ,!
కాబట్టి జగత్ మిథ్యా! బ్రహ్మ ఒక్క టే సత్యం ,!
జీవుడు వేరు ,,ఈశ్వరుడు వేరు కాదు!
ఇద్దరిలో ఉన్నది ఒకే చైతన్యం! ఇద్దరిలో
ఒకటే తేడా ,,!జీవునికి అజ్ఞానం పొర వల్ల తనను తాను తెలుసుకోలేక పోతున్నాడు
కానీ ఈశ్వరుడు ఈ  మాయను తన వశం చేసుకున్నాడు
అట్టి ఈశ్వర దర్శనము దుర్లభం ఎందుకంటే ఈశ్వ రుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు!. ఏ రూపంలో ఉంటాడో కూడా తెలియదు ,!
అందుచేత ఈశ్వరుడు తెలియాలంటే అతడిని గురించిన జ్ఞానం వుండాలి!
""అధాతో బ్రహ్మ జిజ్ఞాస ,!"" అంటే బ్రహ్మ ను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస మనకు ఉండాలి !!
భగవంతుడు ఉన్నాడు కనుక  భగవంతుని గురించిన జ్ఞానం కూడా మనకు ఉండాలి!! మనకు కావాల్సింది దేవుని
దర్శనం కాదు  ,అతడి,,జ్ఞానం!
""సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ !!"కాబట్టి ,
నీది అజ్ఞానం తో కూడిన ఉపాధి!
ఈశ్వరుడు మాయ తో కూడిన ఉపాధి !
ఇరువురిలో ఒకే చైతన్యం  ప్రకాశిస్తూ ఉంటుంది ! ఈ రకమైన ఆత్మ శోధన నే,
ఈ జ్ఞానా న్నే మనం ""ఆత్మ సాక్షాత్కారం"" అంటున్నాము !
భగవద్గీత లో భగవానుడు చెప్పింది ఇదే,!, అత్మ అనేది  " సత్యము నిత్యము శాశ్వతము !"", అయినటువంటి అత్మ లో , అజ్ఞానం తొలగాలంటే పరమాత్మ ను ప్రతిష్ఠిం చుకోవాలి ,! అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు ,! లేకుంటే, నీవూ జడమే,, ప్రపంచమూ కూడా నీకు ఒక జడ పదార్థం లా ఆగుపిస్తు ఉంటుంది,
నీలో ఉన్న ప్రకాశ మే చైతన్యమే ప్రపంచం లో కూడా ఉంది, అది పరమాత్ముని ప్రతిరూపాలు,
అలా, విశ్వమంత టా నిండి ఉన్న ఆ పరమాత్మ స్వరూప జ్ఞాన వైభవాన్ని, అత్మ జ్ఞానంతో అణువణువునా  దర్శించ గలవు ,!  రమణ మహర్షి లాంటి మహాత్ముల వలె , నిరంతర సాధనా ప్రక్రియ ద్వారా  దేహాన్ని మరచి ,ఎవరికీ వారే అనుభవ పూర్వకంగా పొందే అద్భుత అమోఘ అపురూప
అత్మ సాక్షాత్కార వైభవం ,, అద్వితీయం ,పరందాముని ఆనంద నిలయం , బ్రహ్మ పదార్థం , అదే కైలాసం! అదే వైకుంఠం ,! అదే పరమ పథం ,! పరమాత్ముని నిర్గుణ నిరాకార  సచ్చిదానంద  ఘన స్వరూపం ;
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...