Friday, December 13, 2019

బ్రహ్మానంద భరితం"" అంటే? భాగము,1

Dec 13, 2019 Bangalore
"బ్రహ్మానంద భరితం"" అంటే?
భాగము,,1
________________
ఈ అనంద స్థితి కేవలం "పరబ్రహ్మ స్వరూపం"" మాత్రమే !
అది ఇలా ఉంటుందని వర్ణించడం, ఇలా ఉంటుందని చెప్పడం కానీ,, కనీసం ఊహించడానికి కూడా వీలు కాని తురీయ అతీంద్రియ అవస్త , !!అది మానవాతీతమైన దైవ గుణ సంపద , ! ఆ పరమాద్భుత అవస్థను అనుభవం పొందడమే కానీ ,, అర్థం చేసుకోవడం దుర్లభం,!
"బ్రహ్మానందం ""అనేది అనుభవైక పరమానంద స్వరూపం ,,!! కేవలం
ఆత్మానుభూతి తో  మాత్రమే పొందే మహదానందం ,!! అది బ్రహ్మానంద స్థితి.!
సృష్టి బ్రహ్మం,! జగత్తు బ్రహ్మం, !విశ్వం బ్రహ్మం,! ప్రకృతి పంచభూతాలు, చరాచరాలు, సకల ప్రాణి కోటి అంతా బ్రహ్మ మయం,! అంటే పరమాత్మ స్వరూపం!
తాత్కాలిక సౌఖ్యాన్ని వస్తుసముధాయం తో పొందే సంతోషాన్ని "అనందం"  అనుకుంటే, అదే అనందం, పరమాత్ముని తో ముడి వేస్తే ,, మనకు కలిగేది ""బ్రహ్మానందం" ""అనవచ్చును
అర్జునుడు భగవద్గీత లో , శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం వల్ల కలిగే పరమానందం తో , మహా విష్ణువు విశ్వరూప వైభవాన్ని స్తుతిస్తూ ఉంటాడు!
""కవిం ,పురాణం ,,అనుశాసి తారం ,,"", అంటూ సర్వాంతర్యామి తత్వాన్ని దర్శిస్తాడు, కవి అంటే స్వీయ సృజన తో రచించే వాడు, పురాణ, అంటే సనాతనమైన అది పురుషుడు,, అనుశాస కుడు అంటే బ్రహ్మాండ ములను తన అధీనంలో లో ఉంచుకొని పాలించే పరమాత్ముడు అని అర్థం!!
ఆ  దివ్యమైన భావ సంపద యే "బ్రహ్మానందం""
,,,,భగవంతుడు   ఒక మహా కవి ,! అద్భుతము,, అనంతము, అపురూపం,, అమోఘం ,,అపూర్వం గా శోభిస్తు కోటి సూర్య చంద్రుల వెలుగుల్లో ప్రకాశిస్తూ ,,నక్షత్ర మండలాన్ని పాల పుంతలను  సృజించి, చిత్రంగా విశ్వంలో తింపుతూ ఉన్న ఆ మహానుభావుని విచిత్ర సృష్టి రచనా వైభవం  ఊహించ తరమా,??
""రవి గాంచని చోటును కవి గాంచును ""అన్నట్టుగా,
పరమాత్ముని, సృష్టి రచనా సౌందర్యం వల్ల జీవులలో కలిగే బ్రహ్మానందం  పొగడ తరమా?,, ఊహించ వశమా??
బమ్మెర పోతనామాత్యుడు ఉన్నది దక్షిణ భారతం లో!! , కానీ, ఉత్తర భారతం లో మధుర లో ఎప్పుడో జరిగిన శ్రీకృష్ణ లీలా వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు, కళ్ళతో చూసినట్టుగా బ్రహ్మానందం తో భాగవతం లో అంద్రికరించాడు !!
తులసీదాసు ఉన్నది ఉత్తర భారతం లో , !! కానీ,,దక్షిణ భారతం లో శ్రీరాముని దివ్య కావ్య గాథను,, అద్వితీయ ,అలౌకిక, ఆనంద నిలయం గా తులసి మానస రామాయణం అనే మధుర కావ్యాన్ని,, బ్రహ్మానందం తో రచించాడు !
ఆ ఇద్దరూ భక్తులే, సహజ పాండిత్యం ఉన్న కవులే,! భగవంతుని అనుగ్రహం పొందిన వారే!! ఒకరు,, తమ  అంతరంగం లో సీతా రాముల ను దర్శిస్తూ ఉంటే,, మరొకరు  లీలా మానుష వేషధారి శ్రీకృష్ణుని దర్శిస్తూ తరించారు !
హృదయం నిండా  ఆ విధంగా ,,పరమాత్మ భావన తమ హృదయంత రాళం లో నింపుకొని, ఆ అనుభవంతో పొందే ఆనందం బ్రహ్మానందాన్ని కలగ జేస్తుంది !!
అన్నమయ్య  కొన్నాళ్ళు  శృంగార పురుషుడుగా నే జీవిస్తూ  వచ్చాడు. , ఎప్పుడైతే చెన్నకేశవ స్వామి ని ఆలయంలో శ్రీకృష్ణ పరంధామున్ దివ్య సుందర మంగళ విగ్రహాన్ని  దర్శించా డో, అతడి మనస్తితి  పూర్తిగా మారిపోయింది,!
అతడి హృదయంలో స్వామి సాక్షాత్కారం లభించి, అంతటా అణువణువునా భగవంతుని దర్శించాడు..
ఇప్పుడు అతడి కి ఇల్లూ, కన్నవారు ,ఎవరూ గుర్తుకు రావడం లేదు !!సర్వం బ్రహ్మ మయం గా,, అంతా బ్రహ్మ పదార్థంగా గోచరిస్తు ఉంది!
బ్రహ్మానందం అంటే ఇది!
బ్రహ్మ అంటే పరమాత్మ ,! పరమాత్ముని తలచు కుంటు పొందే ఆనందమే ""బ్రహ్మానందం!!"
,, నాద బ్రహ్మగా నుతింప బడే శ్రీ త్యాగరాజ స్వామి, తన ఆరాధ్య దైవం అయిన శ్రీరామచంద్రుని విగ్రహాలు , తాను నిత్య పూజలు చేసేవి, ఒక్కసారిగా కనిపించక పోయేసరికి పిచ్చి వాడై, తిండి, నిద్రా ఊరూ తెలియకుండా పిచ్చి వాదై, తిరిగాడు!
అలా భగవంతుని నుండి దూరం అయిన భక్తుడు, ఆనంద సాగరం నుండి వేరు చేయబడి, నీటికి దూరం అయిన ఒక చేప పిల్లలా విల విల లాడి పోయాడు,
సీతా రాముల పూజా విగ్రహాలు దొరికాక ,ఆ మహానుభావుడు పొందిన బ్రహ్మానందం,వర్ణనాతీతం!!
భక్త ప్రహ్లాదుడు , తాను నిత్యం శ్రీహరి ధ్యానం, గానం, సేవనం, స్మరణం లో పొందే బ్రహ్మానందం , వల్ల ఆ శ్రీహరి తన సర్వప్యాప కత్వం  వైభవంతో విస్తరిస్తూ, చివరకు స్తంభం లో కూడా ఉంటూ, తన భక్తుని మాట నిజం చేశాడు,!,
పరమాత్ముడు నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపుడు!!, అతడికి ఒక ఆకారం అంటూ ఉండదు,! స్వభావం గురించి చెప్పలేము!, అంతటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కోటిసూర్య చంద్రుల ప్రకాశం తో విరాజిల్లే, స్వచ్చమైన  తేజో పుంజం,, స్థానంలో,
భక్తుడు ఏ రూపంలో సేవిస్తూ ఉంటాడో, ఆ రూపంలో భగవంతుడు , అవతరిస్తు అనుగ్రహిస్తూ ఉంటాడు!!
,. అపర రామభక్తుడు తులసీ దాసు, తన అంతరంగం లో రాముడు రమిస్తూ ఉంటుండగా, అతడు, బ్రహ్మానంద భరితుడై , మానస రామాయణం రచించాడు!
, భక్టపోతన కూడా, శ్రీరామచంద్రుని దర్శనం పొంది,, అదే విధ మైన బ్రహ్మానందం తో మహా భాగవతాన్ని  అంతులేని, అపురూప భక్తి సాగరం లా
తెలుగులో ఆంధ్రీక రించాడు,!
ఇలా ఏ భక్తుని, మహాత్ముని, ఋషి పుంగవుల గాథలు తరిచి చూసినా, ఏ పురాణ ఇతిహాసాలు వినినా,భగవంతునికి భక్తునికి మద్య విడదీయరాని, వారధి ఈ పరమానంద కరమైన దైవీఅవస్త!
, ఈ అద్భుత అనుభవ స్వరూప వైభవాన్ని అందుకోవాలంటే, నిరంతర సాధన అవసరం,! సత్సంగం అత్యవసరం,!పరమాత్ముని కి సంపూర్ణంగా ఆత్మార్పణ చేసుకుంటూ,, శరణాగతి చేయక తప్పదు,!
దైవానుగ్రహం , పెద్దల దీవ న,, గురుదేవుల అనుగ్రహం లేకుండా, ఎంత శ్రమించినా, గమ్యం చేరలే ము,, దైవ సాన్నిధ్యం అనుకోలేం!!
శ్రీకృష్ణ భగవానుని ప్రియ భక్తురాలు, మీరాబాయి, బాల్యం నుండి కృష్ణుని విడవకుండా, మరవకుండ క్షణమైనా ఉండలేక పోయింది!
ఒక విగ్రహంలో,, ఒక దేవతామూర్తి లో తన స్వామిని ,ప్రత్యక్షంగా , ఎదుట కనబడే ఇష్ట దైవంగా భావిస్తూ, దర్శిస్తూ ఉండడం , అంత సామాన్యమైన విషయం కాదు, కదా!!
ఒక కృష్ణ ప్రతిమ లో శ్రీకృష్ణ శక్తి చైతన్యాన్ని తన ప్రానేశ్వరుడు గా, ప్రాణానికి ప్రాణంగా చూడటం అన్యులకు అనితరసాధ్యం,! ఆ మీరాకు మాత్రమే ,,ఆ అదృష్టం ,భాగ్యం ,ఆ భావ సంపద ప్రాప్తించింది !
,, ఆ మూర్తి యే తన ప్రాణం, !తన జీవం!, తన ధ్యేయం,! భావం,! తన జీవన సర్వస్వంగా జీవించింది,!
శ్రీ కృష్ణ ధ్యాన చిత్తంతో చెదరని మనసుతో, బెదరని గుండె తో, కృష్ణుని ఆరాధిస్తూ , కృష్ణుని లో ఐక్యం అయ్యింది భక్త మీరా!
ఇదే ఆమె మానసికంగా  పొందిన బ్రహ్మానంద మనః స్థితి!, ఈ పరమానంద అవస్థలో ఉన్న  రుచి తెలిశాక, ఇక ఈ ప్రాపంచిక విషయాల పైకి మనసు, పొమ్మన్నా పోదు, ! ఆవన్నీ వ్యర్తంగా, హేయంగా, నిష్ప్రయోజనం గా తోస్తాయి,
అందుకే ,,పరమాత్ముని సన్నిధి యే, జీవు డు తన యొక్క నిజమైన  పెన్నిధి గా భావిస్తాడు!!
""దొరకునా ఇటువంటి సేవ"" అంటూ, ఆ అద్వైతామృత ఆనంద భావన తో తరిస్తాడు!!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...