Dec 13, 2019 Bangalore
బ్రహ్మానంద స్థితి అంటే?
భాగము,,2
____________
నిజానికి ఈ "అనందం" అనుభవం ఎవరికీ వారే శోధించి, సాధించి,అనుభవిస్తూ, ఆ పరమాత్మను దర్శించాల్సి ఉంటుంది!
అందరి గమ్యం ఒకటే,! నదులన్నీ సముద్రం లో చేరుతున్నట్టు గా , జీవాత్మ లు పరమాత్మలో కలిసి పోతూ ఉండాలి.. పరమాత్ముని స్వరూపం గా సూచించ బడే బ్రహ్మానందం అనే అనుభవాన్నీ పొందుతూ ఆ స్వరూపం లో ఐక్యం కావడమే,! అంటే అందులో చేరడమే,!!
కానీ , చేరే దారులు వేరు,! అవలంభించే విధానాలు వేరు, !గురువులు సూచించే మార్గదర్శనం వేరు ,!
కొందరు మానవ సేవయే మాధవసేవ అంటూ ప్రతివారి లోనూ పరమాత్మ ను దర్శిస్తూ ఉంటారు,
మరి కొందరు,,మూగ జీవాల ఆదరణ లో, గోవుల సంరక్షణ లో పొందే బ్రహ్మానందం పరమాత్మ అనుభవంగా అనందిస్తు వుంటారు,,
పేదవారిని, అనాథలను, వృద్దుల ను,, అన్యాయం అకృత్యాల బారిన పడిన స్త్రీలను , ఇలా ఎన్నో రకాల దురవస్తలు ,, బాధలు అనుభవించే వారిలో కొంతమందికి అయినా, ప్రేమ ఆదరణ వసతి చూపి సమాజం లో ఈ పరమాత్మ భావనను పెంపొందించే విధంగా ,,మానవత్వాన్ని చాటుతూ, ఇతరులకు ఆదర్శంగా తమ జీవితాన్ని బ్రహ్మానంద భరితంగా సాగించే పుణ్యాత్ములు కూడా పరమ భక్తులే,! పరమాత్మకు ఇష్టులే!!
పుణ్యం పాపం, కష్టం సుఖం, కలిమి లేములు, ఈతి బాధలు, సంసార గందరగోళ వ్యవహారాలు,, ఇవన్నీ ఆ అనుభవ పరమానంద స్వరూపం గా దీపిం చే బ్రహ్మానంద వైభ వం ఆస్వాదించడానికి ప్రతిబంధకాలు గా ఉంటున్నాయి,,!
పాపం తో బాటు పుణ్యాలు కూడా తిరిగి జన్మ పొందడానికి హేతువులు అవుతున్నాయి,!
కానీ పరమాత్మ స్వరూపం అనుభవం జ్ఞానము, తో, జీవునికి జన్మరాహిత్యం సిద్ధిస్తుంది!
, ఈ ప్రకృతిలో, సకల చరాచర సృష్టిలో, సర్వ ప్రాణులలో పరమాత్ముని దివ్య మంగళ స్వరూప దర్శనం అనునిత్యం మనకు అనుక్షణము గోచరిస్తు నే ఉంటుంది.. ప్రతిరోజూ నింగిలో దర్శించే
సూర్యోదయ, సూర్యాస్తమ య శోభ వర్ణణాతీతం,!!
క్షణ క్షణానికి వింత వింత చిత్ర విచిత్ర రంగులతో కాంతులతో ప్రకాశిస్తూ సదా మన హృదయాలకు మధురానుభూతి తో బ్రహ్మానందం కలిగించే ఈ పరమాత్మ సృష్టి వైచిత్రం అద్భుతం ,,అమోఘం!! అనుభవైక వేద్యం కూడా!!
జగద్గురువు లు,,అది శంకరులు ఎన్నో భక్తి ముక్తి శక్తి దాయకమగు గ్రంథాలలో బాటు,,"" శివానంద లహరి, సౌందర్య లహరి"" లాంటి అద్భుత పరమానంద కావ్యాల రచనలు చేసి, **బ్రహ్మానందం"" అంటే జగన్మాత, పర దేవత, జగజ్జనని, జగదేక సౌందర్యాన్ని ప్రత్యక్ష అనుభవం అంతరంగం లో దర్శిస్తూ ఉండడమే"" అంటూ భగవద్ తత్వాన్ని వివరించారు.
భక్తుడు పరమాత్మను తన హృదయాంతరాలం లో నిక్షేపించి , అనవరతం పొందే అనుభూతి యే బ్రహ్మానందం!!
రమణ మహర్షి,, రామ కృష్ణ పరమ హంస, స్వామి వివేకానంద లాంటి సద్గురువులు,, సత్పురుషులు శ్రమించి ,తపించి సాధించి , దీర్ఘ కాల తపస్సుతో పరమాత్మానుభవం పొందారు,!
బ్రహ్మానందం పొందే స్థితిలో భక్తుని మనస్తత్వం ఎంత మార్ధవంగా, పరవశత్వం తో, భగవంతుని పై ఆర్ద్రత తో ఆరాట పడుతుం దొ, మనం చెప్పలేం !! ఆరాధనలు, ఆర్తి, ఆనంద తరంగాలు గుండెల్లో నుండి ఏరు లా, పొంగి పోర్లుతుంటా యో మాటల్లో చెప్పలేం,!!
అలాంటి అద్భుత అద్వితీయ మధురానుభవం కలగాలంటే,, పూర్వజన్మ సుకృతం లేదా గురుదేవుల అనుగ్రహం బలం వల్లనే సాధ్యం అవుతుంది!!
భగవంతుని అరా దించాలంటే,, భక్తుని శరణాగతి భావన ఇలా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది
దివ్యంగా, ప్రకాశవంతం గా అనుపమాన సౌందర్యం తో ,,ఎదురుగా అగుపించే దేవతామూర్తి లో దైవాన్ని దర్శిస్తూ ఉంటే,, ఒళ్ళు పులకించాలి,!! శరీరం, ఒడ లు జలదరిస్తూ,, గగుర్పాటు చెందాలి!!, ,,,
,రెండు చేతులూ జోడించి, అంజలి ఘటించి, శిరస్సు ను, నమ్రతా భావంతో, ""నేను అనే అహాన్ని,"" దేహం నుండి తొలగించి,, దైవం ముందు వంచాలి ,!
,,,కంఠం పూడుకొనీ పోతూ ఉండగా, గొంతులోంచి గద్గద స్వరంతో మాటలు తడబడుతూ,, దైవ సాక్షాత్కార భావనతో, ఏం మాట్లాడాలో తెలీకుండా ఉండాలి కంఠం రుద్దమవ్వాలి,!
, రెండు కళ్ళ నుండి ,ఆనంద బాష్పాలు రాలూస్తు, పరమాత్మ సందర్శనా చిత్తంతో తాదాత్మ్యం చెందాలి.
ఇలా ఒక క్షణం ,ఒక దినం, ఒక మాసం,, ఒక సంవత్సరం కాకుండా, నిత్యం, ఆ పరమాత్ముని పాద ద్వయ కమలాల ధ్యానం అనే అమృతాన్ని ఆస్వాదిస్తూ మనసును బ్రహ్మానంద స్థితిలో ఉంచాలి, ఓ పరమాత్మా ! పరందా మా! నా జీవితాన్ని అలాంటి భావ సంపదతో నిత్యం ప్రకాశించే మహా భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి అంటూ ఆ దేవాది దేవుని దీనంగా వేడుకోవాలి !!
ఇదే మనిషికి నిజమైన జన్మ సార్థకత, ను ఇస్తుంది !! ఆత్మను పరమాత్మతో మమేకం చేసే అద్భుత అనుభవ చరమావస్త,, అది!!
భక్తుడు మాత్రమే చేరుకునే, అద్భుతమైన పరమానంద పరమ పద సోపానం,!! అదే పరమాత్ముని సన్నిధానం!!
ఇది ఉంటే జీవితంలో, ఇంకేది అవసరం లే దు కదా !! ఈ సాధనా ప్రక్రియ నిరంతర అరాధన తో ప్రారంభిస్తూ పొందే బ్రహ్మానందంతో పరమాత్ముని కి వశుడౌతాడు జీవుడు..! అలా,
భక్తుడి కి వశమై ఆతడు తలంచిన రూపంలో కరుణిం చే మధుర సన్నివేశం, కడు కమనీయం, బహు రమణీయం అనిపించే బ్రహ్మానంద స్థితి !! ఇలా మనసును ఆనంద డోలికల్లో ఉర్రూతలూగిం చే పరమాత్ముని కృప, అనంతము ,అద్భుతం, అమోఘం, !!
సామాన్య మానవుడు కూడా బ్రహ్మాండ నాయకునీ తన అకుంఠిత భక్తి తత్పరత , ధృఢ సంకల్పంతో మెప్పించి ,,తన వద్ద కే స్వామిని రప్పించుకు నే అద్భుత దృశ్య కావ్యం బ్రహ్మానందం!!అందులో తాదాత్మ్యం అపూర్వం!
ఎందరో భక్తులు తమ జీవితాన్ని అనందం తో దైవారాధన కు అంకితం చేసారు .ఈ దైవారాధన లో
కొందరు వాల్మీకి, వేద వ్యాస మహర్షులు లాంటి వారు ,కావ్యాలు రచి స్తే, కొందరు త్యాగరాజు వంటి సంగీత కళా కోవిదులు స్వంతంగా సంగీతం స్వరపరచిన కీర్తనలు రచించి సుమధురంగా వివిధ రాగాలలో ఆలపించి, పరమాత్మను మెప్పించారు!;
భక్త రామదాసు తన నిరతి శయ భక్తి పారవశ్యంతో ఒక శిలా మూర్తి లో భగవంతుడు ఉన్నాడని విశ్వసించి, బ్రహ్మానంద భరితంగా అతడికి భద్రాద్రి లో చక్కని రామాలయం కూడా నిర్మించాడు,,
నామదేవుడు పండరి క్షేత్రంలో పాండురంగ ని పరమ భక్తుడు, ""విఠల్ విఠల్ విఠల్ ""అంటూ స్మరిస్తూ భజిస్తూ , సేవిస్తూ ఆ దేవదేవుని స్వరూప వైభవాన్ని అంతటా దర్శిస్తూ ఉండేవాడు,!
ఒకసారి, ఒక కుక్క అతడి ముందు ఉన్న రొట్టె ముక్కను కరచుకొని పారిపోతూ ఉంటే, ""స్వామీ !స్వామీ,! నా వద్ద మంచి నెయ్యి కూడా ఉంది, దీనితో మీరు రొట్టె తింటే మధురంగా వుంటుంది, ఈ నెయ్యిని గ్రహించండి, ప్రభూ !!"" అంటూ కుక్క వెంట ,నేతి గిన్నెను తీసుకొని దానికి ఇవ్వడానికి పరుగెత్తాడు. ..
ఇలా ఉంటుంది భక్తుని లో ఉండే భక్తి కి ,, పరాకాష్ట, పరిస్థితి !!
అవదులు లేని భక్తి సామ్రాజ్యం ఈ బ్రహ్మానంద అనుభవం,!!
మనిషి జ్ఞానం, దేహం, ఇంద్రియాల బలం , శక్తి ఇవన్నీ అందరిలో నూ ఉన్నా అవి పరిమితాలు ,!! వాట ని పరిణతి కి మించి ఎట్టి పరిస్థితిలో నూ, ఎక్కువగా వాడలేం,!!
కానీ ఈ పరమాత్ముని గురించి భక్తుడు పడే అనందామృత దివ్యానుభవం మాత్రం ఎల్లలు లేనిది,! అది అనంతము ,,అపురూపం అనుపమాన మూ ,,!
మానవ దేహం ఒక దివ్య క్షేత్రం,! అతడి మనసే అందులో ఆ దేహం లో ఒక పవిత్ర తీర్థం,!! అందుచేత చూసే కన్నుల్లో, భావించే మనసులో కొలువై ఉంటాడు భగవంతుడు.!.
కులం, మతం, దేశం, ప్రాంతం, వర్గం, వంశం తో సంబంధం లేకుండా ,,కేవలం భావ సంపద తోనే అంతటి బ్రహ్మాండ నాయకుని, విశ్వాత్మ ను, కళ్ళ ఎదుట నిలబడి ఉండేలా,, కట్ట గలిగె శక్తి సామర్థ్యాలు , ఈ జీవాత్మ కు ఉన్నాయి,!
*""యద్భావం తద్భవతి,!"" అన్నట్టుగా, భావంతో బాహ్యంలో దర్శించే చిత్తశుద్ది ఉన్న ప్రతీ మనిషికి, ఈ బ్రహ్మానంద పరమ అనుభవ ఉత్కృష్ట స్థితి ప్రాప్తిస్తుంది !!
""బ్రహ్మానందం" అనేది భక్తుని స్వంత ఆర్జిత దివ్యానుభవం!!,ఎంత సాధన చేస్తే, అంత మహోన్నతంగా పరమాత్మ సాక్షాత్కార వైభవం భక్తుని ఆనందింప జేస్తూ ఉంటుంది,!
Friday, December 13, 2019
బ్రహ్మానంద స్థితి అంటే? భాగము,,2
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment