Friday, December 13, 2019

అనందం అంటే?

Dec 12, 2019 Bangalore
""అనందం అంటే?"
___________&_________
పదిమందిలో పరమేశ్వరుడు ఉంటాడని ప్రతీతి,, కదా! పరమాత్ముని ప్రశాంత మైన కోవెల వంటి ,,ఆలయం లో స్వామికి  నివేదించిన కొబ్బరి ముక్కలను , పులిహోర, తీపి పదార్థాలను  అక్కడున్న తోటి భక్తులకు ప్రసాదంగా  పంచుతూ, స్వీకరంచడం ఆనవాయితీ , లో అద్భుతమైన అనందం ఉంటుంది , ఎందుకంటే అది* భగవంతుని ప్రసాదం!""కనుక,,! అలాగే
తనలో ఉన్న దైవ ప్రసాది తమైన ఒక ప్రతిభ ను, నలుగురికి అందజేయడం లో ఉంది"" అనందం!"" దానిని పదిమందికి పంచడం వలన,,!!
నాట్యం ,గానం ,సాహిత్యం, నాద స్వర లాంటి లలిత కళల ను నేరుస్తూ, ప్రదర్శిస్తూ ,  పదిమందికి అనందాన్ని అందివ్వడం లో ఉంటుంది "అనందం!"
కళ అనేది పరమాత్మ స్వరూపం!, పరమాత్మ అందరివాడు, !కావున కళను అందరికీ పంచుతూ ఉండాలి!
అంద రికీ ఒక్కో రకమైన ప్రతిభ ఇస్తాడు దేవుడు, కానీ దాన్ని వినియోగించే అవకాశం అదృష్టం ఏ  కొందరి కో, లభిస్తూ ఉంటుంది.
ఆ అదృష్టాన్ని ఇతరుల కోసం ఉపయోగిస్తే, వారు కూడా ఆనందిస్తారు కదా!!
పండగలకు ఎన్నో రకాల తీపి పదార్థా లు చేసుకుంటూ, దాన్ని ఆలయంలో, నివేదన తో, ప్రక్క ఇంటివారికి, బీద వారికి,అనాధా శ్రమాలలో , వృద్ధాశ్రమం లో పంచుతూ ఉండడ మే " అనందం!""
నీకు దేవుడు ప్రేమతో ఇచ్చింది , అదే ప్రేమతో, దాన్ని ఇతరులకు పంచడ మే ""అనందం""
పుట్టినరోజు, పెళ్లిరోజు, లంటూ మన ఇళ్ళల్లో ఎన్నో సంబరాలు, ఎంతో ఖర్చు చేస్తూ, ఫంక్షన్ హాల్, హోటల్ లలో వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటాం కదా,!
అందులో కనీసం  ఒక పావలా వంతు అయినా బీదలకు ,అనాథలకు ఖర్చు పెడితే అందువల్ల మనకు కలిగే ""ఆనందం"" అద్భుతం ! నీకు ఆ శక్తి యుక్తులు, సంపద ఇచ్చింది ఆ  దేవుడే కదా!
ఇతరులకు వారి ""అవస రానికి ఇవ్వడం ""లో కలిగే  సంతృప్తి ,అనందం, హాయి మరే పని లోనూ ఉండదు కదా !
దీనినే "దానం" అని కూడా పిలుస్తారు, !ఈ రోజుల్లో డబ్బు లేనివారు అరుదు.!
కానీ ఆదరణ ,ప్రేమ, చల్లని మాట , వాత్స ల్యం కు నోచుకోని వారు చాలా మంది కనిపిస్తూ ఉంటారు,!!,
ఒక బిచ్చగాడు మన ఇంటి ముందు  తలుపు తడితే,,, తోచింది అతడికి ఇవ్వడం లో,అతడిలో పరమాత్ముడు కనిపిస్తాడు!;
కృష్ణా ర్పణం !, శివార్పణం,,! బ్రహ్మర్పణం! అంటూ  మనల నుండి దానం గ్రహించిన వారిలో దైవాన్ని దర్శిస్తూ , మనం  వారికి  చేతులు జోడించి నమస్కరిస్తు ఉండడం అద్భుతమైన మన హైందవ సంస్కృతి కి చక్క ని  నిదర్శనం!
ఒక కోటీశ్వరుల బిడ్డ అయినా తనఇంటి ముందు నిలబడి ఉన్న పేదవాని కి నమస్కారం  చేస్తూ అనందాన్ని పొందుతూ ఉండడం,ఎంత గొప్ప సంస్కారం??"
పెళ్ళిళ్ళలో ఆడపిల్ల వెంట అత్తవారింటికి ఆమె పుట్టింటి నుండి". సారె " అనే సాంప్రదాయాన్ని అనుసరించి ఇత్తడిబిందెలతో పలు పిండి వంటలు, తీపి పదార్థాలు పంపుతూ ఉండేవారు,
వాటిని బందు సహితంగా ఇరుగు పొరుగు వారు కూడా కలిసి తీసుకొని తింటు ఉండేవారు,
తమ వద్ద ఉన్నది ఏదైనా ఇతరులతో కలిసి పంచుకొడం వల్ల పరస్పర  ఐకమత్యం,ప్రేమానురాగాలు పెంచుకోవడం , వలన, అందరం ""ఆనందం" గా ఉంటాము !
ఇరుగు పొరుగు వారిని కూడా తమ కుటుంబ సభ్యులుగా , తమ వారిగా భావించే మన సనాతన అద్భుత భావ సంపద నే నిజమైన ""ఆనందం""గా అనుభవించే వారు, మనవారు,
నీకు ""ఎంత ఉన్నది! ""అన్నది ముఖ్యం కాదు కదా !!, ఆ ఉన్నదానిని ""కొంత మందితో నైనా,కలిసి పంచుకొంటూ, ఉండడం ""అనందం"  !!
అలా చేయడం వలన ""వారు పొందే సంతోష మే ,,నీ కు ""అనందం""! ""అనుకుంటూ  ఎంతగా ఆనందిస్తూ ఉన్నావన్నది  ముఖ్యం!!
పాశ్చాత్య సంప్రదాయం లో ""ఇచ్చేవాడు ""గొప్ప అయితే, మన హిందూ సంప్రదాయంలో" దానాన్ని ""గ్రహించేవాడు"" గొప్ప!! ఉన్నదాంట్లో కొంత ఇతరులకు ఇవ్వడం అనే నేర్వకుండ ఉంటే, రేపు, నీకు అదే దీన స్థితి దాపురించ వచ్చు !
అలా బిచ్చగాడు ఒక గురువు రూపంలో వచ్చి ,,ఈ సందేశాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడని తెలుసుకోవాలి. !!
,  నీవు ఇతరు లకు ఉదారంగా,నిష్ఫలాపెక్ష తో ఎంత ఇస్తుంటావో అంతకు ""రెట్టింపు"" నీకు పరమాత్ముడు తన దివ్య హస్తాలతో ఇస్తుంటాడు ,! ఎదో ఒక రకంగా
ఇప్పుడు అనుభవించే "కుటుంబ సుఖం, అస్తి, ఉద్యోగం, బంగళా కార్ల వైభవం ""వెనక, నీవు చేసుకున్న పుణ్యం , పూజలు , తెలుసో తెలియక చేసిన దానాలు, భూతదయ , పితృదేవతల దీవ న, వారి పుణ్య కార్యాల ""వలన,, మానసిక, శారీరిక ప్రశాంతత, ఆరోగ్యం, అభివృద్ది,, తలిదండ్రుల ఆశీస్సులు, దైవభక్తి, ఇవన్నీ నీకు ఆ సౌకర్యాల రూపంలో శ్రీరామ రక్షగా సంక్రమిస్తు, ఇప్పుడు నీకు అండగా ఉంటున్నాయి,!!
అదే విధంగా ,గత జన్మ పాపాలు ,శాపాలు, పితృదేవతల అగ్రహాలు, నీ వల్ల బాధపడిన వారి ఆక్రోశం , కూడా ఇవన్నీ ఇపుడు నిన్ను బాధ పెడుతూ మనస్తాపం కలిగిస్తూ ఉంటా యి,, కూడా!
అందువల్ల నీవు ఒక్కడవే సుఖ శాంతులతో ఉంటే చాలదు,!
ఎందరో  ఆదరణ ఆప్యాయత లు కరువై,, బ్రతుకు బరువై, గుండె చెరువై ,, నిరాశ, నిస్పృహ లతో బ్రతుకు ఈడుస్తున్న  దిక్కు లేని అనాథ లు నిర్బాగులు ఎంతో మందిని నిత్యం నీవు చూస్తున్నావు కదా !
అందుకు నీవు మనసా వాచా, కర్మణా ,,నీకున్న సుఖ శాంతులు వారికి కూడా ఉండాలని కోరాలి, !అదే వే డాలి కూడా !
సనాతన ధర్మ చెప్పేది ఇదే,!
"పరోపకా రార్థం  ఇదం శరీరం!""
""మానవ సేవయే మాధవ సేవ,,!""
నీ గృహం ఇతరులకు ఆతిథ్యం కొరకు ఉంది! అని గ్రహించాలి ,!
నీకున్న విజ్ఞానం , సంపద లు ఇతరులకు పంచడానికే !
నీకున్న, తిండీ, బట్టా, డబ్బూ, మంచిమాట, దైవ ప్రార్థన, భజన, పాండిత్యము, నీ కుటుంబము , బంధు జనం ,,, అంతా  పరమాత్ముని ప్రతిరూపాలుగా మెరుస్తూ ఉంటున్న ఈ సమాజం లోని వ్యక్తులకు తోచినంత, చేతనైనంత గా చెందా ల్సి ఉంటుంది అన్న పరమార్థం గ్రహిస్తే ,,ఆ సద్భావన యే నీకు, అద్భుతమైన శక్తిని, శాశ్వత"" ఆనందాన్ని "" సంతృప్తిని, జీవన్ముక్తి నీ ప్రసాదిస్తూ ఉంటుంది!!
  అది ,నీకు తరగని సంపద గా ఉంటూ చిరస్థాయిగా నీకు  సంప్రాప్తిస్తు ఉంటుంది! అలాంటి "అనందం" శాశ్వత సంపదగా  అనుగ్రహించ మని ఆ పరమాత్ముని కోరుకుందాం!"
స్వస్తి!"
"హరే కృష్ణ హరే కృష్ణా!!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...